రిమ్మనపూడి

భారతదేశంలోని గ్రామం

రిమ్మనపూడి, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 157. ఎస్.టి,డి.కోడ్ = 08674.

రిమ్మనపూడి
—  రెవిన్యూ గ్రామం  —
రిమ్మనపూడి is located in Andhra Pradesh
రిమ్మనపూడి
రిమ్మనపూడి
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′20″N 80°59′24″E / 16.338842°N 80.989870°E / 16.338842; 80.989870
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ జువ్వపూడి బాబూరావు,
జనాభా (2011)
 - మొత్తం 1,080
 - పురుషులు 519
 - స్త్రీలు 561
 - గృహాల సంఖ్య 351
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరులపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలంసవరించు

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలుసవరించు

గుడివాడ, గుడ్లవల్లేరు, పెదపారుపూడి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు

పామర్రు, గుడ్లవల్లేరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 50 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

  1. జువ్వనపూడి వాణి విద్యాలయం.
  2. మండల పరిషతు ప్రాథమిక పాఠశాల, రిమ్మనపూడి.
  3. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, జె.పి.గూడెం.

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

అంగనవాడీ కేంద్రం, జె.పి.గూడెం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

అల్లాడి చెరువుసవరించు

గ్రామంలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు అభివృద్ధి పనులను, 2017,ఏప్రిల్-20న ప్రారంభించారు. అనంతరం 22 శ్రమశక్తి సంఘాలకు చెందిన 171 మంది ఉపాధి కూలీలు ఈ పనులలో పాల్గొని పనులు నిర్వహించారు. ఈ చెరువుకట్టలను జాతీయ గ్రామీణాభివృద్ధి నిధులతో పటిష్ఠపరచెదరు. [5]

గ్రామ పంచాయతీసవరించు

  1. , జె.పి.గూడెం , రిమ్మనపూడి గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.
  2. రిమ్మనపూడి గ్రామ పంచాయతీ, 1955,సెప్టెంబరు-12వ తెదీనాడు ఏర్పడింది. 2015,సెప్టెంబరు-12వ తేదీ నాడు వజ్రోత్సవం జరుపుకుంటున్నది. [3]
  3. 2013 జూలైలో రిమ్మనపూడి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జువ్వనపూడి బాబూరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం, 2016,మే-8వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి,చెరకు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

రిమ్మనపూడి గ్రామానికి శివారు గ్రామమయిన జె.పి.గూడెం నకు చెందిన శ్రీ జువ్వనపూడి మహేశ్, ఖరగ్‌పూర్ లోని ఐ.ఐ.టి లో బి.టెక్, ఎం.టెక్ విద్యలనభ్యసించినాడు. ఈయన తాజాగా విడుదలైన 2019 సివిల్సు పరీక్షా ఫలితాలలో 612 వ ర్యాంక్ సాధించినాడు. [6]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1,080 - పురుషుల సంఖ్య 519 - స్త్రీల సంఖ్య 561 - గృహాల సంఖ్య 351

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1181.[3] ఇందులో పురుషుల సంఖ్య 588, స్త్రీల సంఖ్య 593, గ్రామంలో నివాస గృహాలు 330 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Rimmanapudi". Retrieved 30 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా, 2014,జులై-31; 7వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-12; 24వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-9; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఏప్రిల్-21; 2వపేజీ .[6] ఈనాడు కృష్ణాజిల్లా;2020,ఆగస్టు-5,1వపేజీ.