స్వాగతం

మార్చు
రాచర్ల రమేష్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

రాచర్ల రమేష్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 12:09, 17 జూన్ 2020 (UTC)Reply

వ్యాసపుటలో వాడుకరి పేరు

మార్చు

వాడుకరి:రాచర్ల రమేష్ గారు,

మీరు వికీలో చురుకుగా రచనలు చేస్తున్న, వికీ నియమానుసారం వ్యాసాలలో వాడుకరులు తమ పేరు వ్రాయడం లేదా వాడుకరి సంతకం చెయ్యడం నిషేధం. ఇదిమీరు గమనించగలరు.వ్యాసంలలోని ఇది వికీ స్పూర్తికి విరుద్ధం,ఇది మీరు అర్థం చేసుకొఓటారనిభావిస్తున్నాను..అలాచేర్చిన తొలగించబడును.చర్చా పీజిలలో మీరు సంతకం చెయ్యవచ్చును. ఇక్కడ పద్ధతులు తెలియనప్పుడు వికీపీడియా:పాఠం చూడండి. అది ఇక్కడ ఎలా వ్రాయాలో నేర్పిస్తుంది.ప్రభాకర్ గౌడ్ నోముల 16:01, 17 జూన్ 2020 (UTC)Reply

అలాగే మీరు సృష్టిస్తున్న వ్యాసాలు ప్రశ్న, సమాధానం రూపంలో ఉంటున్నాయి. వ్యాసాలు ఎలా ఉండాలో ఒకసారి ఇదివరకే ఉన్న వ్యాసాలు చూడండి. - రవిచంద్ర (చర్చ) 16:24, 17 జూన్ 2020 (UTC)Reply

తప్పకుండా అండి నాకు తెలవదు ఖచ్చితంగా తెలుసుకుంటాను నియమ నిబంధనలు పాటిస్తాను రాచర్ల రమేష్ 16:27, 17 జూన్ 2020 (UTC)

విధ్వంసపు మార్పులు

మార్చు

మీ మార్పు రద్దు చేశాను. వికీపీడియా గురించి మరింతగా తెలుసుకొని మార్పులు చేయండి.-- అర్జున (చర్చ) 06:15, 18 జూన్ 2020 (UTC)Reply

అయ్యప్ప స్వామి పేరు మీద ఆల్రెడీ పేజీ ఉంది మీరు మరో కొత్త పేజీలు సృష్టించారు, వికీపీడియా నియమాలు ముందు చదవండి ఉన్న పేజీలు కొద్ది మార్పులతో చాలా పేజీలు సృష్టిస్తున్నారు, మీరు వందసార్లు రాసిన 1000 సార్లు రాసిన నియమానుసారం రాయకపోతే తొలగిస్తూనే ఉంటారు, మీ శ్రమ అంతా వృధా అవుతుంది, కావున తప్పకుండా నియమం ప్రకారం రాయాలి, కాబట్టి ఎలా రాయాలో తెలుసుకోవడానికి సూచనలు పాటించండి చదవండి తర్వాత రాయవచ్చు, కేవలం అయ్యప్ప మీదనే రాస్తున్నారు, అంతకుముందున్న పేజీలోనే మీరు రాసేది, రాయాలనుకున్నది విషయం అందులో లేకపోతే కొత్తగా రాయవచ్చు, వికీపీడియాలో రాసే వారికి సూచనలు ఇస్తారు తప్పులు చేస్తే సరి చేసుకుని ముందుకు వెళితే మరింత రాయగలుగుతారు మీరు, మీ ఖాతా ను తొలగించు అధికారులు కూడా ఉంటారని తెలుసుకోండి. వికీపీడియా నియమాలు ముందు చదవండి. --- ప్రభాకర్ గౌడ్ నోముల 16:22, 18 జూన్ 2020 (UTC)Reply

మీ వ్యాసాలు

మార్చు

రమేష్ గారూ మీరు రాసిన వ్యాసాలకు కొన్ని సమస్యలున్నై. గతంలో అజ్ఞాత రూపంలో మీరు చాలా వ్యాసాలు సృష్టించారు. అవి కాపీ పేస్టు కావడం చేత వాటిని తొలగించినా ఇప్పుడు మీ వాడుకరిపేరుతో వాటిలో కొన్నిటిని మళ్ళీ సృష్టించారు. దాన్ని స్పామింగు అంటారు. అలా చెయ్యకూడదు. అయితే, వికీలో మీరు సద్భావంతోను, సదుద్దేశం తోనూ రచనలు చేస్తున్నారని, వికీ నిబంబంధనలు నిజంగానే తెలియక ఆలా చేస్తున్నారనీ నేను భావిస్తున్నాను. అందుచేత, వికీకి సరిపడని వ్యాసాలను ఇకపై సృష్టించకుండా మీకు కొన్ని సూచనలు చెయ్యదలచాను. పరిశీలించండి:

  1. వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట).
  2. అయితే ఏ సైటు బడితే ఆ సైటును మూలంగా తీసుకోరాదు. స్థూలంగా కింది నియమాలు చూడండి..
    1. వ్యక్తుల స్వంత వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమాలు (ట్విట్టరు, బ్లాగులు, ఫేసుబుక్కు వంటి చోట్లు) మూలంగా పనికిరావు.
    2. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి సైట్లు మూలంగా పనికొస్తాయి.
  3. మన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, మన పరిశోధనలు వాటి ఫలితాలు వికీలో రాయకూడదు. వివిధ ప్రామాణిక ప్రచురణల్లో (గ్రంథాలు, పత్రికలు, వెబ్‌సైట్లు వగైరా) ఉన్న సమాచారాన్ని సేకరించి వికీపీడియా అనే చోట పెడుతున్నాం అనే సంగతిని గ్రహించండి.
  4. మూలం లేందే మనం రాసే సమాచారానికి వికీలో విలువ ఏమీ ఉండదు. సమాచారం ఇంకా వేరే చోట్ల కూడా ఉందా లేక ఈ వ్యక్తి స్వయంగా కల్పించి రాసినదా అనేది చదివేవాళ్ళు కూడా తెలుసుకోగలగాలి. అలా తెలుసుకునే అవకాశం రాసేవాళ్ళు ఇవ్వాలి. అయ్యప్ప స్వామి దేవుడేనని మీరు ఋజువు చెయ్యనక్కర్లేదు. కానీ అయ్యప్ప స్వామి చరితం రాసినపుడు ఆ చరితం మీరు స్వయంగా అల్లిన కథా.. లేక ఇంతకు ముందే ఏదైనా హిందూ గ్రంథంలో ఉందా అనేది పాఠకుడికి తెలియాలి.
    1. మీరు స్వంతంగా రాసిన కథైతే - వికీలో పనికిరాదు, తొలగించాలి.
    2. ఎక్కడో ఈసరికే రాసి ఉన్న కథైతే ఆ మూలాన్ని ఉదహరించాలి. మూలాలుగా ఏవి పనికొస్తాయో ఏవి పనికిరావో పైన చూసారు కదా!
  5. అయ్యప్ప స్వామి చరితం అని మొత్తం కథ అంతా రాయకూడదు. రాయాల్సింది ఆ కథ "గురించి". ఆ కథ ఏ హిందూ గ్రంథంలో ఉంది? మూల కథను ఎవరు రాసారు. ఎప్పుడు రాసారు? మూల కథకు అనువాదాలు, అనుసరణలు, ప్రక్షిప్తాలు వగైరాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి వివరాలు రాయాలి. ఈ కథ గురించి విశ్లేషణలు వివరణలు విమర్శలూ ఏమైనా ఉంటే వాటి గురించి రాయాలి. కథను తాయదలిస్తే క్లుప్తంగా రాయాలి. అయ్యప్ప స్తోత్రమాల అంటూ మొత్తం స్తోత్రం అంతా రాయకూడదు. ఆ స్తోత్రం "గురించి" రాయాలి.
  6. శైలి: వికీలో రాసే శైలి ఇతర వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అది మీరు రాస్తున్నట్లు రాయకూడదు. ("ఏం జరిగిందో చెబుతాను వినండి", "ఆ సంగతి మనందరికీ తెలిసినదే కదా" లాంటి శైలి వికీకి పనికిరాదు) వికీపీడియా:శైలి చూడండి

ఇప్పుడు మీరు రాసిన వ్యాసాలు పై నియమాల్లో కొన్నిటిని అతిక్రమించినట్లుగా గమనించాను. ఉదాహరణకు కిందివి చూడండి:

  1. శబరిమల_అయ్యప్ప_చరితం:
    1. మూలాల్లేవు
    2. ఆంధ్రభూమిలో వచ్చిన ఒక సీరియల్ లోని పాఠ్యాన్ని కాపీ చేసి ఇక్కడ పడేసారు. కళ్యాణీ సచ్చిదానందం అనే వారు రాసిన వ్యాసం అది. నిర్ద్వ్ంద్వంగా కాపీహక్కుల ఉల్లంఘన.
    3. కథంతా రాసారు
  2. శ్రీ_హరిహరపుత్ర_సహస్రనామస్తోత్ర_మాలా: మొత్తం స్తోత్రమంతా రాసారు.
  3. ధర్మశాస్త్ర_వారి_కల్యాణ_విశేషాలు_ధర్మశాస్త_మానవ_జన్మ_ఎత్తడానికి_ఎవరు_శాపం_పెట్టారు?: మూలాల్లేవు
  4. శబరిమలలో_శ్రీ_ధర్మశాస్త్ర_దేవాలయం_ఎప్పటి_నుండి_ఉన్నది?
    1. మూలాల్లేవు
    2. వ్యాసంలో సగ భాగం తెలుగు కిరణం అనే వెబ్‌సైటు నుండి కాపీ చేసారు. మూలాన్ని ఉదహరించలేదు. మిగతా సగానికి మూలమేంటో తెలియదు.

అందుచేత వివిధ కారణాల వల్ల ఈ పేజీలను తొలగించాలి. తక్షణమే తొలగించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మీరు ఏం చెబుతారో విన్న తరువాతనే ఏ చర్య తీసుకోవాలో నిర్ణయించాలని అనుకుంటున్నాను. మీ సమాధానం కోసం 20 వ తేదీ ఉదయం వరకూ చూస్తాను. పోతే..,

ఈ మూణ్ణాలుగు వ్యాసాల సంగతి అలా ఉంచండి. వికీ గురించి తెలుసుకోవడం ముఖ్యం. మీకు వికీ గురించి తగు అవగాహన కలిగేందుకు అవసరమైన సహాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఒకసారి మీకు అవగాహన కలిగాక, ఆ తరువాత మీరే సమగ్రమైన వ్యాసాలు రాసేందుకు సిద్ధమౌతారు. ఈ విషయమై నానుండి ఏ సాయం కావాలన్నా నిస్సంకోచంగా నా చర్చ పేజీలో అడగండి.__చదువరి (చర్చరచనలు) 16:52, 18 జూన్ 2020 (UTC)Reply

నమస్కారమండి

ముఖ్యంగా నాకు నియమ నిబంధనలు తెలవదు మీరు చెప్పే దాకా అయ్యప్ప స్వామి చరిత్ర ఆంధ్రభూమిలో వచ్చిందని సంగతి కూడా నాకు తెలియదు నాకు సొంతగా ఒక ఫేస్బుక్ పేజీ ఉంది ఈ జీవితం అయ్యప్ప కు అంకితం అనే పేరు మీదhttps://www.facebook.com/groups/448099165368663/?ref=share ఇందులో కొన్ని వేల మంది ఉంటారు ఇందులో చాలా సంవత్సరాల నుండి నేను వ్యాసాలు రాస్తూ ఉంటాను చాలామంది నన్ను వికీలో పెట్టమని అడగగా పెట్టాను ఇక ముందు పెట్టాను ఏమైనా ఉన్న మొదటగా మీకు పంపి దానిని ఏ మూలాల నుండి తీసుకోవాలి తదితర వివరాలు మిమ్మల్ని అడిగి పెడతాను దయచేసి క్షమించగలరు ఇప్పుడు పెట్టిన వ్యాసాల్లో ఏమైనా దిద్దుబాటు ఉన్నచో దయచేసి తెలుపగలరు ఇకముందు మీ పర్మిషన్ తీసుకుని మొదటగా నేను ప్రచురించిన వ్యాసం మీకు పంపి మీరు పరిశీలించాక వికీలో నేను పోస్ట్ చేస్తాను స్వామి శరణం రాచర్ల రమేష్ 02:38, 19 జూన్ 2020 (UTC)
రమేష్ గారూ, మీరు కొత్త సభ్యులు కనుక వికీ ఎలా పనిచేస్తుందో మీకు సభ్యులు వివరించారు. కొత్త సభ్యులు ఎవరైనా ఇలా పొరబడవచ్చు. వికీ ఇతర సామాజిక మాధ్యమాల్లాంటి సైటుకాదు. పైన చదువారి గారు రాసింది జాగ్రత్తగా చదవండి. ఇక్కడ మనం స్వంతంగా ఏది పడితే అది రాసేయలేము. ఎక్కడైనా ప్రచురించింది యధాతథంగా కాపీ చేయలేము. రాసే విషయాలకు ఆధారం లేదా మూలం చూపించాలి. ఎలాంటి మూలం చూపించాలనేది కూడా పైన తెలియజేశారు. మేము క్షమాపణలు కోరలేదు కానీ, వ్యాసాలు సృష్టించేముందు అసలు వికీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. అందులో అనుమానాలుంటే అడగండి. మేం నివృత్తి చేస్తాం. తర్వాత నా నిబంధనలకు లోబడి వ్యాసాలు రాయవచ్చు. అప్పటి దాకా దయచేసి నిరుత్సాహపడవద్దు.- రవిచంద్ర (చర్చ) 04:48, 19 జూన్ 2020 (UTC)Reply

రవిచంద్ర గారికి నమస్కారం తప్పకుండా సమయం తీసుకొని మీరు పంపించిన అన్ని బాగా చదివి అర్థం చేసుకుని పోస్టు చేస్తాను చాలా సంతోషం స్వామి మీరు రిప్లై ఇచ్చినందుకు స్వామి శరణం రాచర్ల రమేష్ 04:53, 19 జూన్ 2020 (UTC)

రమేష్ గారూ.. రవిచంద్ర గారు చెప్పిన సూచనలను స్వీకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక ప్రధానమైన సంగతి.. ఇక్కడ రాయడానికి ఎవరి అనుమతీ మీకు అక్కర్లేదు. ఇక్కడ ఉన్న వారందరం ఒకటే. అందరం మీలాగే రాయడానికి వచ్చినవారమే. ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అంటూ ఏమీ లేదు. మీరు రాసేది వికీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటే చాలు. మీరు రాసే వ్యాసాన్ని ముందు నాకు పంపడం, దానికి నా అనుమతి తీసుకోవడం.. ప్రశ్నే లేదు, ఈ పని చెయ్యాల్సిన అవసరమే లేదు. పైన నేను రాసిన నియమ నిబంధనలు మళ్ళీ చదవండి. మీ వ్యాసాలు వాటికి అనుగుణంగానే ఉన్నాయా అని మీకు మీరే ప్రశ్నేసుకోండి.
ఆ ప్రశ్న నేను వేసుకుంటే, మీ వ్యాసాలు ఈ నిబంధనలను అతిక్రమిస్తున్నాయని నాకు తోచింది. వాటిని సరిచెయ్యడం కష్టమని కూడా నాకు తోస్తోంది. అయితే, మీరు వాటిని సరిచేసేందుకు ముందుకొచ్చారు కాబట్టి ఇద్దరం కలిసి ఆ ప్రయత్నం చేద్దాం. ముందుగా - శబరిమల_అయ్యప్ప_చరితం తీసుకుందాం. దానికి సంబంధించి మీరు కింది పనులు చెయ్యండి:
  1. ఆ కథ ఎవరు రాసారు? ఏ గ్రంథంలో/పత్రికలో ప్రచురించారు? ఎప్పుడు ప్రచురించారు? ఎక్కడ (ఏ స్థలంలో) ప్రచురించారు? ఆ కథపై ప్రజల స్పందనలేమైనా ఉన్నాయా? వాటికి విమర్శనా గ్రంథాలు ఏమైనా వచ్చాయా? మొదలైన అంశాలను పరిశీలించండి. ఆ కథకు సంబంధించినవి ఏమైనా సరే.., సేకరించండి. ఈసరికే ఇవన్నీ మీ దగ్గర ఉండి ఉండవచ్చు. అన్నీ మీ వద్ద ఉండకపోవచ్చు కూడా. లేని వాటి కోసం వెతకండి. అన్నీ దొరక్కపోవచ్చు కూడా. దొరికినంతవరకు సేకరించండి. ఎక్కడ దొరికాయో ఆ ప్రచురణ వివరాలు కూడా సేకరించండి (అది దేవస్థానం వారి ప్రచురణ అయితే చాలా మంచిది). (ఇవన్నీ చెప్పడంలో నా ప్రధానమైన ఊహ ఏంటంటే - ఈ కథ మీరు కల్పించి రాసినది కాదు, ఎక్కడో ఉన్న కథనే మళ్ళీ రాసారు అని. ఆ మూలం ఏంటో తెలుసుకోవడం, సదరు మూలం యొక్క ప్రామాణికత వికీకి సరిపోతుందా లేదా అని తెలుసుకోవడం నా ఉద్దేశం)
  2. వ్యాసంలో ఉన్న కథను రెండు మూడు పేరాల్లోకి సంక్షిప్తీకరించండి.
  3. పైన మీరు సేకరించిన విషయాలను వ్యాసంలో చేర్చండి. ఆ విషయంలో నేను మీకు సాయపడతాను.
ఈ పనిని వీలైనంత త్వరగా చెయ్యాలి. తొందర పెడుతున్నానని అనుకోకండి. వ్యాసాన్ని ఇప్పుడున్న స్థితిలో ఉంచలేం కాబట్టి మనం త్వరపడాలి. అయితే ముందుగా, ఏమైనా సందేహాలున్నా అడగండి. వెనకాడకండి. __చదువరి (చర్చరచనలు) 05:40, 19 జూన్ 2020 (UTC)Reply
ఏం జరిగిందో నాకు తెలవదు గానీ.., వేరొక నిర్వాహకుడు ఆ పేజీలను తొలగించారు. ఏం పరవాలేదు. నిరుత్సాహపడకండి. మీరు సముచితమైన సమాచారంతో మళ్ళీ పేజీలను సృష్టించదలిస్తే నా చర్చపేజీలో గానీ వేరే ఏ నిర్వాహకుల చర్చ పేజీలోనైనా గానీ ప్రతిపాదించండి. __చదువరి (చర్చరచనలు) 18:40, 20 జూన్ 2020 (UTC)Reply
చదువరి గారూ, క్రాస్ వికీ స్పాము అని చెప్పి ఆ వ్యాసాలు తొలగించారండీ. - రవిచంద్ర (చర్చ) 18:44, 20 జూన్ 2020 (UTC)Reply
@రవిచంద్ర: ఓహో, సరేనండి! __చదువరి (చర్చరచనలు) 18:47, 20 జూన్ 2020 (UTC)Reply
చదువరి గారు, రవిచంద్ర గారు... ఈ వాడుకరి తను సృష్టించిన వ్యాసాలలోని సమాచారాన్ని తొలగించి ఖాళీ చేశారు. అందువల్ల ఆయా వ్యాసాలను తొలగించవలసి వచ్చింది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:07, 21 జూన్ 2020 (UTC)Reply
Pranayraj Vangari గారూ, సరేనండి. __చదువరి (చర్చరచనలు) 10:50, 21 జూన్ 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.