వాడుకరి చర్చ:Dev/ క్రితం చర్చ 4

ఈ వారం సమైక్య కృషి

మార్చు

దేవ్ గారూ!నమస్తే. నేను వికీపీడియాలోకి వచ్చి మహా అయితే ఒక నెల, నెలన్నర అయి ఉండవచ్చు. కొన్ని కొన్ని పదజాలాలు, ఇంకా కొత్త. "మొలకలు" అంటే కొత్తగా మొదలు పెట్టి ఇంకా పూర్తిగాని వ్యాసాలా? దయచేసి వివరించగలరు, లేదా ఈవిషయం గురించి పూర్తి సమాచాం ఉన్న లింక్ తెలియచేయగలరు. వికిలొ వ్యాసాల నాణ్యత పెంచటానికి, వికీ, ఇంటర్-నెట్ లో ఓక ప్రమాణపూర్వకమయిన, నిర్దిష్ట సమాచారం ఇవ్వగలిగే ఒక "మూలం" గా రూపొందాలని నా ఆకాంక్ష. తెలుగునాట ఎవరయినా తమకు తెలియని విషయం మీద సమాచారంకొరకు వెదుకులాడుతుంటే, వికి ఒక ప్రధాన సమాచార మూలంకావాలి, లేదా ఎవరయినా ఒక విషయం మీద తర్జన భర్జన పడుతుంటే, ఒక వివాద పరిష్కార సాధనం కావాలి. ఈ విధంగా చేసే కృషిలో/ ప్రయత్నంలో నే చెయ్యవలసిన పని గురించి ఏ మాత్రం సంకోచించకుండా, పని అప్పగించండి,నాకు చాతనయినంతవరకు తప్పకుండా అటువంటి పని సాధ్యమయినంత త్వరగా పూర్తి చెయ్యగలను. ఇంకా కొత్త కావటంవలన నా అంతటనేను వ్యాసాలు వ్రాయటం/దిద్దటం మాత్రం ఉత్సాహంగా చేస్తున్నాను. సమైక్య క్రుషిలో కూడ పాలు పంచుకోవాలని నాకు చాలా ఉత్సాహం ఉన్నది.--SIVA 02:36, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఇప్పుడే(18 04 2008SIVA 03:55, 18 ఏప్రిల్ 2008 (UTC))వైజా సత్యగారు ఈవిష్యం మీద లింక్ పంపించారు. విషయం అర్థమయింది. మొలకల విషయంలో నా ఉద్దేశ్యం::Reply

  • మొలకలను 1 నుండి 250, 250 నుండి 500 ఇలా ఉత్సుకత చూపిన సభ్యులకు పంపిణీ చేసి, ఆ సభ్యులను ఆ మొలకల విషయంలో ఒక నిర్దిష్ట భవిస్య కార్యక్రమాన్ని ప్రదిపాదించవలసినదిగా కోరాలి
  • ఈ ప్రతిపాదనలను ఒక ప్రత్యేక పుట ను తయారు చేసి (మొలకల వర్గీకరణ వంటి పేరుతో)అందులో పొందుపరచాలి, మొలకలను తొలగించటం, ఆ విషయం మీద ఇప్పటీకే ఉన్న వ్యాసంతో విలీనం చెయ్యటం వంటి ప్రదిపాదనలను చెయ్యచ్చు.అలా ప్రతిపాదించేటప్పుడు, ఈ పనికి ప్రత్యేకించబడిన సభ్యులు, ఆ మొలక లింక్ ఆ పుటలో తప్పనిసరిగా ఇవ్వాలి.
  • ఇలా చెయ్యబడ్డ ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్య తీసుకోవటానికి ఇద్దరు ముగ్గురు సీనియర్ వికీ సభ్యులు కలసి వారానికి ఒకసారి నిర్ణయం ప్రకటీంచాలి.
  • అటువంటి నిర్ణయం, మొలకలను ఏర్పరిచిన సభ్యునికి తెలియచెయ్యాలి, ఒక మూడు రోజుల వ్యవధి తరువాత, సీనియర్ల కమెటీ చేసిన ప్రకటన ప్రకారం మొదట, ఆ మొలకల మీద బవిష్య కార్యక్రమం ప్రతిపాదించిన సభ్యుడు చర్య తీసుకోవాలి.
  • మొలకల పరిశీలన, సభ్యులకు పంపిణీ చేశేటప్పుడె ఏంత సమయంలో ఆ పని చెయ్యాలి (15-20 రోజులు)తెలియచెయ్యాలి. ఆ సమయంలో ఆ పని జరగక పోతే మరొక 7 రోజుల వ్యవది ఇవ్వాలి. ఆప్పటికి, ఆ పని జరగకపొతే, మరొక సభ్యునికి పంపిణీ చెయ్యాలి
  • దీనికి సాఫ్ట్వేర్ లొ ఈక్రింది అవకాశాలు ఉంటే అంతయినా ఉపకరిస్తుంది:
  • మొలక ఏర్పరిచిన సభ్యునికి, అతను లాగ్ ఇన్ అయిన ప్రతిసారి, అతను ఏర్పరిచిన మొలకలగురించి ఒక రెమైడరు అటోమాటిక్ గా రావడం
  • భవిష్య కార్యక్రమం ప్రత్యేక పుటలో వ్రాయగానే, ఆ మొలక ఏర్పరిచిన సభ్యునికి, ఆ ప్రతిపాదన అతను లాగ్ ఇన్ అయిన వెంటనే అటోమాటిక్ గా సందేశం వెళ్ళటం
  • మొలకలగురించి బాధ్యత అప్పగించబడిన సభ్యునికి, అతను ఇంకా భవిష్య కార్యక్రమం చెయ్యని మొలకల సంఖ్య, తదుపరి చర్య తీసుకొని మొలకల సంఖ్య సందేశంగా అతను లాగ్ ఇన్ అయిన వెంటనే రావటం.

ఈ విధమయిన కార్యాచరణ మనం ఆచరించగలిగితే, మొలకల సంఖ్య గణనీయంగా తగ్గించి, వ్యాసాల సంఖ్యను పెంచవచ్చును. పరిశీలించి తెలియచెయ్యగలరు.--SIVA 03:55, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

మరొక ప్రతిపాదన

మార్చు

మొలకల జాబితా పర్శీలించిన మీదట, నాకు అనిపిస్తున్నది ఏమంటే, జాబితాలో ఎక్కువ భాగం "సామెతలు" మరియి "గ్రామాలు"

సామెతలుసామన్యంగా సామెత చూడగానే అర్థం స్పురిస్తుంది. చాలా కొద్ది సామెతలకు వివరణ ఇవ్వవలసి వస్తుంది. అటువంటి వివరణ అవసరమయిన కొద్ది సామెతలకు మొలక టాగ్ ఉంచి, మిగిలిన సామెతలకు మొలక టాగ్ తొలగించవచ్చు. ఎవరయినా సభ్యులు ఏదయినా మొలక టాగ్ లేని సామెత విస్తరించదలిస్తే మంచిదే. కాని, వివరణ అవసరమయిన సామెతల మీద ఎక్కువ కేద్రీకరణ జరిగితె బాగుంటుంది.

గ్రామాలుసామాన్యంగా, ఆ గ్రామాల్లో ఉన్నవారుగాని, ఇరుగు పొరుగు గ్రామంవారుకాని, వికీ సభ్యులయినప్పుడు, ఆ గ్రామ వ్యాసం విస్త్రణ జరుగుతుంది. మనం పుట్టిన గ్రామం, తండ్రిగారి/తల్లిగారి/అత్తవారి గ్రామం/చదువుకున్న గ్రామం/ఉద్యోగం చేసిన గ్రామం గురించి ప్రతి సభ్యుడూ వ్రాస్తే చాలా గ్రామాల వ్యాస విస్తరణ జరుగుతుంది.ఈ విషయం ప్రతి వారం పది రోజులకు, సభ్యులందరికీ రిమైండు చెయ్యటం,మొదటి పేజీలో ప్రత్యేక ప్రకటన కొంత ఉపకరించవచ్చు. గ్రామ వ్యాస విస్తరణ అంత సులభం కాదు. పైన చెప్పినట్లుగా, ఆ గ్రామానికి సంబధించిన వారు గనక వ్రాస్తే వ్యాసం సమతూకంగా వస్తుందని నా అభిప్రాయం. కనుక, గ్రామ వ్యాసాలకు "మొలక" స్తాయి తీసివేసి,అప్పుడప్పడూ సభ్యులకు సందేశాలు/ప్రకటనల ద్వార కావలిసిన పని జరిగేటట్లు వేయవచ్చు.

పైన చెప్పిన రెడు పనులవల్ల, మొలకలలో ఉన్న ఇతర విషయాలమీద దృష్టి కేద్రీకరింవచ్చు అని నా ఉద్దేశ్యం.--SIVA 04:57, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

మొలకల గురించి

మార్చు

మీరు వ్రాసిన వ్యాఖ్యననుసరించి, నేను కొన్ని అభిప్రయాలను వెలిబుచ్చాను. మొలకల ను తగ్గించె కృషిలో నేను నా వంతు పని చెయ్యగలను. ఇప్పటికె, కొన్ని మొలకల చర్చా పుటలలో కొన్ని వ్యాఖ్యలు వ్రాశాను. దయచేసి చూడగలరు. నేను చెయ్యవలసిన పని గురించి చెప్పగలరు, తగినంత సమయంలో పూర్తి చెయ్యగలను.

రంగారావుగారి వ్యాఖ్య

మార్చు

ధన్యవాదములు . నా ఉద్దేశ్యం, ఎవరూ కూడా ఆవతలి వారిని బాధ పెట్టే వ్యాఖ్యలు చెయ్యకూడదని. నలుగురూ కూడి చెయ్యవలసిన పని ఇది. చివరకు అందరికి అమోదయోగ్యమయినది నిలుస్తుంది. మార్పు చేసినవాళ్ళమీద దురుసుగా వ్యాఖ్యలు చెయ్యటం తగదు అన్న విషయం సభ్యుడి/ల కు తెలియాలి. నేనుకూడా అంత కటువుగా జవాబు వ్రాస్తే బాగుండదుకదా! అందుకనే నేను ఈ విషయం ఇతర సభ్యులకు తెలియచేసినది. కాసు బాబు గారు మధ్యవర్తిత్వం నాకు సమ్మతమే. ఈ సంఘటన పర్యవసానం మాత్రం, ఎవరినే కించపరచకుండా ఉండాలి.రచనలు చేసే సభ్యులు, ఇతర సభ్యులు చేసే మార్పులను గౌరవించగలగాలి, అవసరమయితే చర్చ చెయ్యాలి, వ్యాఖ్యలకు చోటు ఉండకూడదు అని నా అభిప్రాయమం --SIVA 19:47, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

అధికారి హోదాకై నేను చేసిన విజ్ఞప్తికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:24, 20 మార్చి 2008 (UTC)Reply

స్వాగతం

మార్చు

దేవా గారు మీరు ఏ స్వాగతం మూస వాడతారు? నేను User:Sai2020/Welcome వాడేవాన్ని. కాని నా సంతకంలో సమయం ప్రస్తుత సమయం రావట్లేదు.. సాయీ(చర్చ) 14:11, 25 మార్చి 2008 (UTC)Reply

కృతజ్ఞతలు దేవా గారు సాయీ(చర్చ) 08:37, 26 మార్చి 2008 (UTC)Reply

మరికొన్ని వేదికలు

మార్చు

దేవా! సభ్యులు:Ahmadnisar పేజీలో ఇస్లాంకు సంబంధించినవి, ఉర్దూ భాషకు సంబంధించినవి అనేక వ్యాసాల జాబితా ఉంది. వీటి ఆధారంగా రెండు మూసలు చేయగలవా? ఒకటి {{ఇస్లాం}} రెండు {{ఉర్దూ}} అన్ని పేజీలలోనూ అడుగున ఈ మూస ఉంచవచ్చును {{రామాయణం}} మూస లాగా --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:05, 25 మార్చి 2008 (UTC)Reply

వ్యాసాల పేర్ల అచ్చు తప్పులు

మార్చు
  • దేవాగారూ నమస్తే, నేను వ్రాస్తున్న వ్యాసాల పేర్లలో కొన్ని అచ్చు తప్పులు దొర్లాయి, అవి కొంచెం సరిచేయగలరా,

1. 'ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి' ఉండాలి కానీ 'ఖ్యాజా మొయినుద్దీన్ చిష్తి' అనీ, 2. 'ఎస్.జెడ్. ఖాసిమ్' ఉండాలి కానీ 'ఎస్.జడ్, ఖాసిమ్' అనీ వున్నది. వ్యాసాల నుండి తరలింపుగా కాకుండా, వ్యాసాల పేర్లే మారాలి, ఇదెలా చేయాలో నాకు తెలియదు, కావున మీ సహాయం కోరుచున్నాను. మిత్రుడు nisar 12:33, 26 మార్చి 2008 (UTC)Reply

  • దేవాగారూ నమస్తే, మీ సహకారానికి ధన్యవాదాలు, మీ సూచనకు ధన్యవాదాలు, అలాగే చేస్తాను, మిత్రుడు nisar 07:57, 27 మార్చి 2008 (UTC)Reply

మూస ఇస్లాం

మార్చు

దేవాగారూ నమస్తే, ఇస్లాం వ్యాసానికి చక్కటి మూస తయారు చేశారు, ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రుడు nisar 12:07, 1 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఈ వారం సమైక్య కృషి

మార్చు

దేవా గారూ నమస్తే, ఈ ఆలోచన చాలా బాగుందండి, మన తెవికీ లో ఏకవాక్య వ్యాసాలు వేలసంఖ్యలో కనబడుతున్నాయి. అలాగే మొలకలునూ. అంతెందుకు నిజం చెప్పాలంటే (నిజం నిష్టూరం) కొద్దో గొప్పో జ్ఞానాన్నిచ్చే వ్యాసాలు ఓ ఐదువేలకు మించవనుకుంటాను. ఈ కృషితో వ్యాసాల 'stuff' కొంచెం పెంచవచ్చును. సినిమాలు, క్రికెట్ ల వ్యాసాలు, ఈ సమైక్య కృషి తొలి దఫాలలో చేర్చవద్దని కోరుతున్నాను. nisar 20:44, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply

మెదటి పేజి

మార్చు

ఒక సారి సభ్యులు:Sai2020/ప్రయోగశాల/మెదటి_పేజి చూసి ఏలా ఉందో చెబుతారా? సాయీ(చర్చ) 05:24, 30 మార్చి 2008 (UTC)Reply

ప్రతిపాదన చేసాను. సాయీ(చర్చ) 11:38, 30 మార్చి 2008 (UTC)Reply

తెలుగు పథకం

మార్చు

కృతజ్ఞతలు దేవా గారు. ప్రస్తుతం నా పరీక్షలు దగ్గర్లో ఉన్నాయి. ఏప్రిల్ 15 నుండి మే 2 వరకు కొంచం inactive గా ఉంటాను. సాయీ(చర్చ) 11:50, 3 ఏప్రిల్ 2008 (UTC)Reply

దేవా! "తెలుగు పథకం" అని వ్రాస్తున్నావు. "తెలుగు పతకం" అని ఉండాలి కదా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:03, 15 ఏప్రిల్ 2008 (UTC)Reply

తెగిపోయిన వేదిక లింకులు

మార్చు

దేవా! కొన్ని వేదికల లింకులు ఉదా:Portal:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 10 - తెగిపోయి ఉన్నాయి. వీటిమీద ఇంకా పని జరుగుతున్నదా? అవుసరం లేకుంటే తుడిచివేయండి. ప్రత్యేక:BrokenRedirects చూడండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:14, 3 ఏప్రిల్ 2008 (UTC)Reply

అవును వాటి అవసరం లేదు ప్రస్తుతం ఆ పేజీలను నేను తొలిగించాను. అవే తేదీలకు సంబంధించి వేదిక:...తో ప్రారంభమయ్యే పేజీలున్నాయి.-- C.Chandra Kanth Rao(చర్చ) 17:05, 3 ఏప్రిల్ 2008 (UTC)Reply

చిట్కాల చిట్టా లింకు

మార్చు

దేవా!

{{ఈ నాటి చిట్కా}} మూసలో ఇతర చిట్కాలను వాడాలంటే [[Wikipedia:వికీ చిట్కాలు/అక్టోబర్ 25|వికీ చిట్కాల చిట్కా]] చూడండి. అని ఉంది. "వికీ చిట్కాల చిట్కా"ను "వికీ చిట్కాల చిట్టా"గా మార్చాను. నువ్వుకొన్నది అదే అని. తరువాత ఇక్కడి లింకు వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 25, 2007కు దారి తీస్తుంది. ఈ లింకు వికీపీడియా:వికీ చిట్కాలుకు వెళ్ళాలనుకొంటాను. సరి చూడవలెను. నా అభిప్రాయం ఇతర చిట్కాల కోసం [[వికీపీడియా:వికీ చిట్కాలు|]] చూడండి. అని ఉండాలి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:39, 8 ఏప్రిల్ 2008 (UTC)Reply

వరంగల్ ఫోటోలు

మార్చు

దేవా గారూ! నేను వరంగల్ లోనే ఉన్నాను కాబట్టి అన్ని ప్రదేశాలనూ చాలా ఫోటోలు తీశాను. కాకపొతే అవి ఏ వ్యాసంలో పెట్టాలో తెలియక ఎగుమతి చేయలేదు. రవిచంద్ర(చర్చ) 05:55, 14 ఏప్రిల్ 2008 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

దేవా గారూ! హృదయపూర్వక ధన్యవాదాలు. Deepasikha 13:33, 16 ఏప్రిల్ 2008 (UTC)Reply

బోయింగ్ 747

మార్చు

బోయింగ్ 747 లోని అక్షర దోషాలను సరిద్దినందుకు కృతజ్ఞతలు :) సాయీ(చర్చ) 16:09, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply

అవుననుకోండి. కాని ఎందుకో చెప్పాలనిపిచ్చింది చెప్పేశాను :) సాయీ(చర్చ) 16:29, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply
ఒక వ్యాసం ఎన్ని KBలు ఉందో ఎలా చూసేది? సాయీ(చర్చ) 16:41, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply

వీకీపీడియా మొలకలు

మార్చు

వీకీపీడియా మొలకలను అరికట్టే సమైక్య కృషిలో నావంతు కృషి చేయడానికి సంసిద్ధత తెలియచేస్తున్నాను.నాపై విశ్వాసముంచి మీరు పంపిన ఆహ్వానానికి కృతజ్ఞతలు దేవాగారూ.
--t.sujatha 04:25, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

దేవా! వికీపీడియా చర్చ:ఈ వారం సమైక్య కృషి మరియు వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి ఒకమారు చూడు. నేననుకొన్నది explain చేయడం కోసమే అవి నేరుగా వ్రాసేశాను ఇతరులను సంప్రదించకుండా. నా ప్రణాళిక అర్ధమైందనుకొంటాను. అది పరిశీలించి, నీకు ఎలా మంచిదనిపిస్తే అలా మూసలను, పేజీ అమరికను, నిర్వహణా విధానాన్ని రూపొందించగలవు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:20, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

కాసుబాబు గారూ! మీరు చిట్కాలకు ముందుగానే పేర్లు పెట్టి ఏదో రాద్దామని ఉద్దేశించినట్లున్నారు. వాటిని దయచేసి పూర్తి చేయండి. ఇకనుండి చిట్కా వ్రాసిన తర్వాత పేరు ఇవ్వండి. δευ దేవా 13:48, 19 ఏప్రిల్ 2008 (UTC)

అలాగే. పనిలో పడి మరచిపోయాను. అవన్నీ ఈ రోజు పూర్తి చేస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:58, 19 ఏప్రిల్ 2008 (UTC)Reply

బొమ్మ:Trans.jpg

మార్చు

బొమ్మను SVG format లోకి మారిస్తే బావుంటుంది. నాకు ప్రస్తుతం తీరిక లేదు. సాయీ(చర్చ) 05:20, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply

మీరు direct గా convert చేసారనుకుంట. నేను కూడా అదే చేసి చూసాను. బొమ్మ:TransTest.svg. ఇంక్‌స్కేప్ లో సృష్టించడానికి చూస్తే "తె" సరిగా కనబడటం లేదు. "Telugu = తెలుగు" బదులుగా వత్తులు వంటివి లేని విషయం పెడితే నేను SVG తయారుచేయగలను. సాయీ(చర్చ) 02:42, 23 ఏప్రిల్ 2008 (UTC)Reply
అదే బొమ్మను download చేసి open చేస్తే సరిగా కనపడుతున్నది. ఇక్కడ చూడండి సాయీ(చర్చ) 02:50, 23 ఏప్రిల్ 2008 (UTC)Reply
మీరు తయారు చేసిన SVGలో చాలా పెద్దలోపం వుంది. SVG అంటే ఎటూ XMLఏ కాబట్టి ఒకసారి బొమ్మ:TransTest.svgను మీ కంప్యూటరులోకి దిగుమతి చేసుకుని దాని సోర్సును చూడండి. అందులో original jpgని, HTMLలో చేసినట్లుగా embed చేసేసారు. అది కూడా మీ కంప్యూటరు local pathను point చేస్తుంది. అలా jpg నుండి svgలోకి convert చేయాలని చూడకుండా, freshగా తయారు ఇంక్‌స్కేప్‌లో ఉండే text toolని ఉపయోగించి చేయగలరేమో చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:18, 24 ఏప్రిల్ 2008 (UTC)Reply


ఆసియా క్రీడలు

మార్చు

దేవా గారూ, నమస్తే! వ్యాసం ఆసియా క్రీడలు లో గల 'క్రీడల జాబితా', ఒకే కాలమ్ లో చాలా పొడుగ్గా వున్నది. వీటిని 3 కాలమ్స్ లో ప్రక్క ప్రక్కనే వచ్చేటట్లు కొంచెం చేయగలరా, ఇవికీ లో ఈ విధంగా నున్నది. ధన్యవాదములు. మిత్రుడు nisar 08:48, 27 ఏప్రిల్ 2008 (UTC)Reply

  సరిచేసాను. చూడండి. చర్చసాయీరచనలు 08:53, 27 ఏప్రిల్ 2008 (UTC)Reply

నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి

మార్చు

నా నిర్వాహక హోదా విజ్ఞప్తికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు. వ్యతిరేకించే వారు ఉన్న మొట్ట మొదటి విజ్ఞప్తి నాదే అనుకుంట. మౌర్యుడు (చర్చదిద్దుబాట్లు) sock puppet అని నాకు అనుమానం ఉంది. మీరు verify చేయగలరా? చర్చసాయీరచనలు 11:27, 27 ఏప్రిల్ 2008 (UTC)Reply

fyi meta:Steward_requests/Checkuser#2_users_in_tewiki చర్చసాయీరచనలు 05:02, 28 ఏప్రిల్ 2008 (UTC)Reply
Return to the user page of "Dev/ క్రితం చర్చ 4".