వాడుకరి చర్చ:K.Venkataramana/పాత చర్చ 9

(వాడుకరి చర్చ:Kvr.lohith/పాత చర్చ 9 నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: చివరి తేదీ పొడిగింపు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
     పాత చర్చ 9   
All Pages:  ... (up to 100)


ఒక సహాయం కావాలి=

నేను "చరవాణి", సెల్ ఫోన్" అనే వ్యాసాలని విలీనం చేసి, విస్తరించేను. చరవాణి పేరు "చరవాణి (సెల్ ఫోన్)" అని మార్చేను. ఇప్పుడు "సెల్ ఫోన్" అన్న పేజీ అనవసరం. ఆ పేజీ తొలగించి, "సెల్ ఫోన్" అని వెతుకు పెట్టేలో వెతికినా "చరవాణి (సెల్ ఫోన్)" అనే వ్యాసం కనిపించేలా చేసిపెట్టండి. ధన్యవాదాలు. Vemurione (చర్చ) 14:21, 23 ఫిబ్రవరి 2016 (UTC)Reply

సెల్ ఫోన్ వ్యాసాన్ని "చరవాణి (సెల్ ఫోన్)" వ్యాసానికి దారిమార్పు చేసాను.-- కె.వెంకటరమణచర్చ 01:39, 3 మార్చి 2016 (UTC)Reply

గన్నేరు చెట్టు విలీనం

"గన్నేరు చెట్టు" ని "గన్నేరు" తో విలీనం చేసేను. చేస్తూ ఎక్కడో తప్పు చేసేను. "గన్నేరు" ఉంచి, "గన్నేరు చెట్టు" ని తొలగించడానికి బదులు ఏమి చేసేనో తెలియదు కాని "గన్నేరు" కనిపించడం లేదు. కొంచెం ఓపిగ్గా చూసి నేను చేసిన తప్పుని సవరించమని ప్రార్ధన. Vemurione (చర్చ) 02:27, 26 ఫిబ్రవరి 2016 (UTC)Reply

Vemurione గారూ, గన్నేరు వ్యాసాన్ని గన్నేరు చెట్టు వ్యాసానికి 24 ఫిబ్రవరి 2016‎ న రవిచంద్ర గారు దారిమార్పు చేసారు. అందువల్ల మీరు గన్నేరువ్యాసాన్ని శోధిస్తే గన్నేరు చెట్టు వ్యాసం వచ్చినది.-- కె.వెంకటరమణచర్చ 02:37, 26 ఫిబ్రవరి 2016 (UTC)Reply
విలీన నియమాన్ని అనుసరిస్తే 29 సెప్టెంబరు 2008‎ లో ప్రారంభించబడిన గన్నేరు వ్యాసంలో 11 జనవరి 2016‎ న సృష్టించబడిన గన్నేరు చెట్టు వ్యాసం విలీనం కావాలి. సరిచేయడం జరుగుతుంది.-- కె.వెంకటరమణచర్చ 02:39, 26 ఫిబ్రవరి 2016 (UTC)Reply

Address Collection Notice

Hi there, thank you for contributing to Wikipedia Asian Month in November 2015. You are qualified to receive (a) postcard(s) but we did not hear your back in past two months, or it could be an error on Google's server or a mistake. If you still willing to receive one, please use this new surveyto submit your mailing address. The deadline will be March 20th.

--AddisWang (talk) 14:40, 9 March 2016 (UTC)

మొలకలు మరియు విస్తరణ పై సందేహం

నేను మొలకలను అభివృద్ధి చేద్దామని నిశ్చయించుకున్నాను. చాలా వ్యాసాలు మొలకలు గా ఉన్నాయి. కాని ఎంత సమాచారం లేదా ఎన్ని వాక్యాలు ఉంటే ఇంక ఆ పేజీలు మొలకలు గా ఉండనవసరం లేదు. దయచేసి తెలపగలిగితే నేను ఆ పని మీద ఉండి కొన్ని మొలకల్నైనా కొంత వరకు అభివృద్ధి చేస్తాను.
అద్భుతమైన వాడుకరి పేజీ. అలాంటి చక్కటి పేజీ ఎలా చెయ్యాలో వివరించగలరా? ధన్యవాదములు.--Phani.2111 (చర్చ) 19:06, 21 మార్చి 2016 (UTC)Reply

ఫణి గారూ మొలకపేజీల నియంత్రణ విధానం ప్రకారం తే.01.04.2013 న "తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలు, ప్రారంభించిన నెలరోజులలోగా కనీస స్థాయికి అనగా వ్యాస పరిమాణం 2000బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని వీలైతే ఇతర వ్యాసాలలో విలీనం చేసి తొలగించవలెను." అని సముదాయంచే ప్రతిపాదించబడినది. కనుక మీరు 2000బైట్ల స్థాయి మరియు కనీస అంతర్గత లింకు చేర్చగలిగితే మొలక స్థాయిని దాటించవచ్చు. మొలకల అభివృద్ధి కృషిచేయ సంకల్పించినందుకు ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 09:12, 22 మార్చి 2016 (UTC)Reply
వికీపీడియాలో ఒక మంచి వ్యాసం లక్షణాల కోసం వికీపీడియా:మంచి వ్యాసం లక్షణాలు పేజీ చూడండి.-- కె.వెంకటరమణచర్చ 09:17, 22 మార్చి 2016 (UTC)Reply

పట్రాయని వంశవృక్షం

పట్రాయని వారి వంశవృక్షాన్ని తయారుచేయమని కోరుతున్నాను. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:58, 2 ఏప్రిల్ 2016 (UTC)Reply

రాజశేఖర్ గారూ, మీరు కోరినట్లు {{పట్రాయని వారి వంశవృక్షం}} మూసను తయారుచేసితిని. దానిలో లోపాలేమైనా ఉంటే తెలియజేయండి. సరిచేద్దాం.-- కె.వెంకటరమణచర్చ 11:44, 7 ఏప్రిల్ 2016 (UTC)Reply

తెనాలి ఆదాయ విభాగం

ఈ వ్యాసం టైటిల్ సరిచూడండి?--Vin09 (చర్చ) 13:47, 5 ఏప్రిల్ 2016 (UTC)Reply

తెనాలి రెవెన్యూ విభాగం వ్యాసంగా సరిదిద్దినందుకు ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 09:52, 7 ఏప్రిల్ 2016 (UTC)Reply

నా అభిప్రాయం

నేను మన తెవి లో 10 మంది తెలుగు కళాకారుల చరిత్ర ,10 మంది రాజకీయనాయకుల చరిత్ర రాశాను. కానీ మనం రాశామనీ తెవితో అనుబందం ఉన్నవారీకి తప్ప బయటి వారికి తెలిసే అవకాశం ఏ మాత్రం లేదు ప్రతి వ్యాసానికి ఎక్కువ పదాలు కూర్చిన వారే రచయితగా కనిపిచేవిదంగా ఉంటే వారుకి ఎంతో తృప్తి ఉండి ఇంకా రాయాలనేందుకు ప్రోచ్చాహంలా ఉండేదని నా అభిప్రాయం కొందరికి ఇష్టం వద్దనుకుంటే(కొన్ని వ్యాసాలకు) ఆఫ్ చేసుకునేఅవకాశం ఇవ్వాలి.--ప్రభాకర్ గౌడ నోముల (చర్చ) 18:20, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply

ద్వారం వారి వంశవృక్షం

ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వంశంలొ 3-4 గురు ప్రముఖ వ్యక్తుల గురించిన వ్యాసాలు తయారయ్యాయి. కాబట్టి ద్వారం వారి వంశవృక్షం తయారుచేయమని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 09:39, 8 మే 2016 (UTC)Reply

తప్పకుండా ఈ రోజే తయారుచేస్తాను. ప్రాథమికంగా వారి వంశవృక్షంలో సమాచారాన్ని సేకరించాను. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 09:41, 8 మే 2016 (UTC)Reply
రాజశేఖర్ గారూ, మీరు కోరినట్లు {{ద్వారం వారి వంశవృక్షం‎}} తయారు చేసితిని. పరిశీలించండి. ఏదైనా దోషాలున్నచో తెలియజేయండి. చేర్చవలసినవి ఏవైనా ఉంటే తెలియజేయగలరు.-- కె.వెంకటరమణచర్చ 14:28, 8 మే 2016 (UTC)Reply

Participate in the Ibero-American Culture Challenge!

Hi!

Iberocoop has launched a translating contest to improve the content in other Wikipedia related to Ibero-American Culture.

We would love to have you on board :)

Please find the contest here: https://en.wikipedia.org/wiki/Wikipedia:Translating_Ibero_-_America/Participants_2016

Hugs!--Anna Torres (WMAR) (చర్చ) 13:48, 10 మే 2016 (UTC)Reply

అంకితం వారి వంశవృక్షం

http://vizagcityonline.com/EminentFamilies/index.html ఈ సైటులో అంకితం వారి వంశపు వివరాలున్నాయి. వీరి వంశవృక్షాన్ని తయారుచేయగలరు.--Rajasekhar1961 (చర్చ) 05:44, 15 మే 2016 (UTC)Reply

{{అంకితం వారి వంశవృక్షం}} తయారుచేసి సంబంధిత వ్యాసాలలో చేర్చితిని.-- కె.వెంకటరమణచర్చ 10:15, 15 మే 2016 (UTC)Reply

దిగవల్లి వంశ వృక్షములో 12వ తరం

  • వెంకట రమణ గారు దయచేసి మా వంశవృక్షములో రెండే రెండు చోట్ల 12వ తరం జతచేయమని కోరు చున్నాను. వివరాలు ఈ క్రంద విధంగా
  • 11వ తరం తండ్రి-తల్లి దిగవల్లి వెంకట శివరావు-నీతామెహరోత్ర లకు ఇద్దరు ఆడపిల్లలు(1) మల్లిక (14-05-2004) (2)అంజలి(06-08-2011)
  • 11వ తరం తండ్రి-తల్లి దిగవల్లి శ్రీనివాస్ -కస్తూరి లకు వక మగపిల్లవాడు ఫ్రణవ్ విరాజ్ దిగవల్లి (12-08-2010)
  • పై ముగ్గురి పిల్లలను 12 వతరం గా చేర్చమని ప్రార్ధన. ధన్యవాదాలు. శ్రమయిచ్చానేమో నాకు ఆ వంశ వృక్షంలో సవరించటం తెలీలేదు --దిగవల్లి రామచంద్ర (చర్చ) 14:27, 25 మే 2016 (UTC)Reply
దిగవల్లి రామచంద్ర గారూ మీరు కోరినట్లు {{దిగవల్లి వంశవృక్షం}} లో వివరాలు చేర్చడం జరిగినది.-- కె.వెంకటరమణచర్చ 14:46, 25 మే 2016 (UTC)Reply
Thank you. We could have put year of birth as we did in all other generations. Thanks a lot for prompt response.--దిగవల్లి రామచంద్ర (చర్చ) 01:37, 26 మే 2016‎ (UTC)Reply
వారి పేర్లకు దిగువన వారి జన్మ సంవత్సరాలను చేర్చడం జరిగినది.-- కె.వెంకటరమణచర్చ 06:00, 26 మే 2016 (UTC)Reply

నాగార్జున ఎక్స్‌ప్రెస్

దక్షిణ మధ్య రైల్వే రైళ్ళు వ్యాసంలో నాగార్జున ఎక్స్‌ప్రెస్ సమాచారం తప్పుగా ఉన్నది. సవరించండి.--Rajasekhar1961 (చర్చ) 05:42, 28 మే 2016 (UTC)Reply

7005/7006 సంఖ్యలుగా గల ఈ ఎక్స్‌ప్రెస్ మొదట 12719/12720 గా గల రైలుగా అప్‌గ్రేడు అయినది. కానీ జూన్ 2007 లో విశాఖపట్నం - తెనాలి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాదు వరకు పొడిగించినండువల్ల ఈ రైలు రద్దు కాబడినది.-- కె.వెంకటరమణచర్చ 07:14, 28 మే 2016 (UTC)Reply

నా పేరు తొలగింపుకు కారణం?

వెంకటరమణ గారూ, ఇక్కడ నా పేరును ఎందుకు తొలగించారు? కారణం సవివరంగా వ్రాయగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:19, 6 జూన్ 2016 (UTC)Reply

రహ్మానుద్దీన్ గారూ, నాకు ఈ మార్పు ఎలా జరిగిందో తెలియదు. మొబైల్ వీక్షణలో ఇటీవల మార్పులను చూస్తున్నప్పుడు మార్పు ప్రక్కన ఉన్న "దిద్దుబాటు రద్దుచేయు" బొత్తముపై టచ్ స్త్రీన్ పై పొరపాటున ప్రెస్ చేసి ఉంటాను. క్షమించగలరు.-- కె.వెంకటరమణచర్చ 15:59, 6 జూన్ 2016 (UTC)Reply


Yakutpura (Assembly Constituency) (తెలుగు అనువాదం)

వెంకటరమణ గారు, ఈ వ్యాసం తెలుగు లో లేదని మీరు తెలిపటం నేను గమనించాను. అందుకే యాకుత్‌పురా (శాసనసభ నియోజికవర్గం) అనే పేరు తో ఈ ఆంగ్ల వ్యాసాన్ని అనువదించాను. ధన్యవాదాలు. Thank you--దిగవల్లి రామచంద్ర (చర్చ) 04:13, 15 జూన్ 2016 (UTC)Reply

సందేహం

రమణగారు, మరి ఒక చిన్న సందేహం సహాయం:- నేను ఈమధ్యనే వ్రాసిన జమాబంది వ్యాసమును వర్గీకరణం బ్రిటిష్ ఇండియాలో పెట్టమన్న నా కోరికపై డాక్టరు రాజశేఖరుగారు బ్రిటిష్ ఇండియా అనే వర్గమును సృష్టించారు. కానీ అది ఇంకా ఎర్రరంగులోనే ఎందుకువున్నది? లింకులు చేసినవన్నీ నీలం రంగులోకి మారతాయికదా, మారలేదేమిటి ?--దిగవల్లి రామచంద్ర (చర్చ) 02:10, 15 జూన్ 2016 (UTC)Reply

దిగవల్లి రామచంద్ర గార్కి, యిదివరకు తెవికీలో వర్గం:బ్రిటిష్ ఇండియా అనే వర్గం ఉన్నది. అందులో ప్రస్తుతానికి మూడు వ్యాసాలున్నాయి. రాజశేఖర్ గారు సృష్టించిన వర్గం:బ్రిటిష్‌ ఇండియా అనే వర్గం సృష్టించబడలేదు. అందువల్ల ఎర్ర లింకులో ఉన్నది. గమనించగలరు. మీరు రెండు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ పైనుదహరించిన మొదటి వర్గం briTish indiyaa అని టైపింగ్ చేస్తే యేర్పడినది. ఆ వర్గం తెవికీలో యున్నందున నీలం రంగులో కనబడింది. రాజశేఖర్ గారు సృష్టించిన వర్గం british^ india అనే టైపింగు తో యేర్పరిచినది. ఇది తెవికీలో సృష్టించబడననందున ఎర్రలింకుతో కనబడింది. రెండు వర్గాల చూడడానికి ఒకేలా ఉన్నా టైపింగులో భేదం ఉన్నదని గమనించగలరు. మీరు సృష్టించిన జమాబంది వ్యాసానికి వర్గీకరణ చేసితిని. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 02:48, 15 జూన్ 2016 (UTC)Reply
ధన్యవాదాలు. పొరపాటు సరిచేసినందుకు.--Rajasekhar1961 (చర్చ) 06:00, 15 జూన్ 2016 (UTC)Reply

సాదర స్వాగతానికి నమస్సులు

మీ స్వాగతానికి నమస్సులు Kvr.lohith గారు.--తెగించినోడు (చర్చ) 05:48, 28 జూన్ 2016 (UTC)Reply

చొక్కాపు వెంకటరమణ

మీరు వ్రాసిన చొక్కాపు వెంకటరమణ వ్యాసంలో ఈ క్రింది విధంగా ఉంది.

"ఆయన విజయవాడలో శ్రీమతి సావిత్రమ్మ, దానయ్య దంపతులకు ఏప్రిల్ 1 1948 న హైదరాబాదు లో జన్మించారు." ఇంతకీ చొక్కాపువారు పుట్టింది విజయవాడలోనా? హైదరాబాదులోనా? ఆయన జీవించి ఉన్న వ్యక్తే కనుక వారినే అడిగి తెలుసుకొని పై వాక్యాన్ని సరిచేయగలరని విన్నపం --స్వరలాసిక (చర్చ) 01:06, 30 జూన్ 2016 (UTC)Reply

అలాగే వారి పోటోను వారి అనుమతితో అప్‌లోడ్ చేయగలరు--స్వరలాసిక (చర్చ) 01:08, 30 జూన్ 2016 (UTC)Reply
స్వరలాసిక గారూ ఆయన జన్మస్థలం సూర్య పత్రికలో విజయవాడగానూ, తెలుగు వన్ డాట్ కాం లో హైదరాబాదుగానూ ఉన్నది. అందువల్ల ఏది సరియైనదో తెలియడం లేదు. మీకు తెలిస్తే సరిచేయండి.-- కె.వెంకటరమణచర్చ 03:05, 30 జూన్ 2016 (UTC)Reply

గుంటూరు

గుంటూరు పేజీలొ మూసా Chennai Corporation అని చూపిస్తుంది. సరి చెయ్యందడి.--Vin09(talk) 10:48, 1 జూలై 2016 (UTC)Reply

Vin09 గారూ, {{భారత స్థల సమాచారపెట్టె}} లో స్వల్ప మార్పులు చేయడం చేయడం ద్వారా సరిచేయడమైనది. లోపాన్ని తెలియజేసినందులకు ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 11:11, 1 జూలై 2016 (UTC)Reply

చర్చ:బుడమేరు ఒక సారి చూడండి.--Vin09(talk) 11:26, 1 జూలై 2016 (UTC)Reply

ఆంగ్ల వికీలో కూడా budameru అనే వ్యాసం ఉన్నది. కానీ నది పేరున వ్యాసం లేదు. కనుక దానిని మార్చాలనుకుంటే బుడమేరు నది గా మార్చవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 11:37, 1 జూలై 2016 (UTC)Reply
en.wiki లొ మార్చబడింద. చూడండి.--Vin09(talk) 12:01, 1 జూలై 2016 (UTC)Reply
ఆంగ్లవికీ మరియు మరికొన్ని లింకుల ఆధారంగా ఈ వ్యాసం యొక్క పేరును బుడమేరు కాలువ గా మార్చితిని.-- కె.వెంకటరమణచర్చ 12:21, 1 జూలై 2016 (UTC)Reply

image galleries

వికీపీడియా:Image_use_policy#Image_galleries ప్రకారం, మరీ అవసరం అయితే తప్ప, దృశ్యమాలిక ఉండరాదు. WikiCommons కి తరలించాలి, లేదా ఆ పజీ sections లొ చేర్చాలి. మీ అభిప్రాయం.--Vin09(talk) 15:10, 2 జూలై 2016 (UTC)Reply

ఇమేజ్ యూస్ పాలసీ ప్రకారం ఒక వ్యాసంలో చాలా చిత్రాలు ఉన్నప్పుడు అన్ని చిత్రాలను వ్యాసంలో చేర్చడం సరికాదు. ఇతర లింకులలో {{commonscat|చిత్రాలు}} కు లింకు యివ్వవచ్చు. వ్యాస విభాగాలలో అవసరం మేరకు చిత్రాలను చేర్చాలి. గ్యాలరీలలో ముఖ్యమైన చిత్రాలను చేర్చాలని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణచర్చ 15:15, 2 జూలై 2016 (UTC)Reply
en.wiki లొ ఆయితే, మెము తీసెస్తాం -> wik is not a repository అని ఉంటది ఆ policy లొ. నాకు te.wiki గురించి తెలీదు. మీరు చెప్పినట్టు నదుచుకుంటాను. ఒకసారి రాజమండ్రి,లొ ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రలో చూడండి.--Vin09(talk) 15:18, 2 జూలై 2016 (UTC)Reply
రాజమండ్రి#ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రలో విభాగంలో ఏనుగుల వీరాస్వామయ్య ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర మార్గం లో గల వివిధ అంశాల గూర్చి కాశీయాత్రను కాశీయాత్రచరిత్రగా గ్రంథస్తం చేశారు. ఆ పుస్తకంలో ఆయన రాసిన రాజమండ్రి గూర్చి విషయాన్ని యదాతథంగా చేర్చారు. అది గ్రాంధిక పదాలతో చదువరులకు అర్థంగాని విధంగా ఉన్నది. కనుక ఆ విభాగంలొని విషయాన్ని శుద్ధి చేసి, సంగ్రహంగా చేరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణచర్చ 15:28, 2 జూలై 2016 (UTC)Reply

దూసిపేట

వెంకటరమణగారూ! మీరు చదువుకున్న, మరియు చాయారాజ్, లోకనాథం నందికేశ్వరరావు మొదలైన ప్రముఖులు పనిచేసిన దూసిపేట గ్రామం గురించిన వ్యాసం విస్తరణలో మీరు చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎన్నో వ్యాసాలను అభివృద్ధి చేసిన/చేస్తున్న మీరు ఈ వ్యాసాన్ని కూడా అభివృద్ధి చేసి పూర్తి స్థాయి వ్యాసంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాను.--స్వరలాసిక (చర్చ) 04:50, 3 జూలై 2016 (UTC)Reply

తప్పకుండా అభివృద్ధి చేయగలను. ఛాయరాజ్ గారు నాకు బాగా పరిచయం ఉన్నవారు మరియు నాకు గురువు. వారి గూర్చి వ్యాసం వ్రాసాను. లోకనాథం నందికేశ్వరరావులతో కలసి పనిచేసాను. వారి గూర్చి కూడా వ్యాసం వ్రాసాను. అటువంటి ప్రముఖులు పనిచేసిన దూసిపేట ఉన్నత పాఠశాల గల గ్రామాన్ని విస్తరించుటకు కృషిచేస్తాను. -- కె.వెంకటరమణచర్చ 09:29, 3 జూలై 2016 (UTC)Reply

సవరణ గూర్చి

దిగవల్లి వంశవృక్షములో ఆరవ తరం నీలిరంగులోనున్న దిగవల్లి రామలింగం గారి జీవిత కాలం 1764-1850 బదులు గా 1790-1850 అని వుండటం ఈరోజే గమనించాను. దయచేసి 1790బదులు 1764 గా సరిదిద్దమని కోరుతున్నాను.--దిగవల్లి రామచంద్ర (చర్చ) 11:45, 18 జూలై 2016 (UTC)Reply

{{దిగవల్లి వంశవృక్షం}} లో పై విషయం సరిదిద్దడమైనది.-- కె.వెంకటరమణచర్చ 13:04, 18 జూలై 2016 (UTC)Reply

మీకొక పంజాబీ పతకం!

  Punjab Medal
పంజాబ్ ఎడిట్-అ-థాన్ 2016లో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. రానున్న రోజుల్లో మీరు మరింతగా కృషిచేస్తారని ఆశిస్తున్నాం.

పవన్ సంతోష్
పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు, WCI నిర్వాహకుల తరఫున పవన్ సంతోష్ (చర్చ) 12:19, 18 జూలై 2016 (UTC)Reply

కఠిన చర్యలు

నేను పెట్టిన ఇన్‌ఫర్‌మేషన్ ను డిలీట్ చెసారు.వారిపై కఠిన చర్యలు తిసుకొనును / / మి అనంద్

మీరు అనేక గ్రామ వ్యాసాలలో ఖాళీ విభాగాలను చేర్చారు. విషయం లేని ఖాళీ విభాగాలూ చేర్చరాదు. కనుక డిలీట్ చేసితిని. మీకు తెలిసిన విషయాలుంటే మూలాలతో సహా ఆయా గ్రామ విభాగాలలో చేర్చండి. మీకేదైనా సహాయం కావలసి వస్తే అభ్యర్థించండి.-- కె.వెంకటరమణచర్చ 14:46, 18 జూలై 2016 (UTC)Reply
నెను ఖలి విభగాలు చెర్చలెను.ఇన్ ఫర్ మెషన్ చెర్చను,ఎవరొ దిలిత్ చెస్తున్నరు / / మి అనంద్
మీరు సమాచారం చేర్చిన పేజీలను తెలియజేయండి. సరియైనదైతే తిరిగి చేర్చవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 15:56, 18 జూలై 2016 (UTC)Reply

మీ ప్రస్తావన ఎవరి గురించో అర్థం కాలేదు

రమణ గారికి నమస్కారము. మీరు రచ్చబండలో చంద్రకాంతరావు గారి ప్రశ్నలకు జవాబులిస్తూ, మీ అభిప్రాయము తెలుపుతూ ఈ మధ్య కొంతమంది సీనియర్ సభ్యులకు వికీ నియమాల గురించి ఎవరైనా సలహాలిస్తే వారు ప్రతిస్పందించిన తీరు అందరికీ విదితమే. సభ్యులకు వికీ నియమాలు చెబుతుంటే తిరిగి తిట్లు కాయడం స్వచ్చందంగా ఇక్కడ పనిచేసేవారికి ఎవరికి యిష్టం ఉంటుంది? అని వ్రాయడము జరిగినది. మీరు నా విషయములో దృష్టిలో ఉంచుకుని ప్రస్తావించినట్లుగా అయితే మాత్రము అది ఎంత మాత్రము సహేతుకం కాదు. నేను ఎవరినీ తిట్లు తిట్టలేదు, తిడతాను అవసరమైతే అని వ్రాయడము జరిగింది. నిజానికి ఎవరి తప్పులు వారికి తెలియదు. మీరు నాకు ఒకే వాక్యం పదే పదే వ్రాస్తూ నా మనసును బాధ పెట్టే విధంగా ఉంటే, ఒక సందర్భంలో నేనే మీతో విభేదిందాను. అంత మాత్రము చేత మిమ్మల్ని నేను చులకన చేసినట్లుగా కాని, మీకు నా మీద సదభిప్రాయము లేకపోవడము కాని జరుగ కూడదు. నిందలు వేయడము నేను చేయను. అందరి మనస్థత్వాలు, ఆలోచనలు, అభిప్రాయములు ఎంతో విభిన్నంగా ఉంటాయి. నేను సలహా, సందేహము, సూచన, అభిప్రాయము, సమస్య ఇత్యాదివి వ్యక్త పరచినప్పుడు కొందరు సభ్యులు వాటి గురించి కాకుండా అందులోని భాషలోని లోపాలున్నట్లుగా, నేనేదో ఎవరిమీదనో, దేనిగురించో మనసులో పెట్టుకొని వ్రాసినట్లుగా ఊహించి నా మీద వ్యక్తిగతంగా దాడి చేయడము జరిగింది. నిజానికి నాకు ఎలాంటి ఉద్దేశ్యాలు, వేరే అభిప్రాయములు ఏమాత్రం లేవు. నేను వికీ నియమాలు గురించి విభేదించి స్పందించ లేదు, కొత్త నియమాలు కూడా ఇంకా చేర్చుకోవాలి అని నా అభిప్రాయము. మీరన్నట్లుగా, ఏవరైనా స్వచ్చందంగా ఇక్కడకు వచ్చి పనిచేసేవారికి తిరిగి తిరిగి తిట్లు కాయడం కోసమే ఎందుకు వస్తారు ? ఇప్పుడు నేను ఇక్కడకు పని చేయుటకు రావడము లేదు, కానీ జరిగే విషయాలు గమనిస్తూ ఎక్కువ సేవు ఇక్కడే గడుపుతూ ఉంటాను. వికీ ప్రశాంత అభివృద్ధి కోసం ఎవరు ఏమి సలహాలు, సూచనలు ఇచ్చినా అనుసరిస్తాను. ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 11:35, 24 జూలై 2016 (UTC)Reply

చివరి తేదీ పొడిగింపు

వికీ మిత్రులకు, పంజాబ్ ఎడిటథాన్ 6 ఆగష్టు 2016 వరకు పొడగించారు. మీరు వ్యాసాలు మార్పులు/సృష్టించడానికి 6 ఆగష్టు వరకు వ్యాసాలు విస్తరించవచ్చు. చూడండి JVRKPRASAD (చర్చ) 07:45, 30 జూలై 2016 (UTC)Reply

సవరణ చెయటం

రమణ గారు, మళ్లీ మీ సహాయం కోరటమైనది. ఈ రోజు నేను సృష్టించిన వ్యాసం హెడ్డింగ్ లో తప్పు సరి చేయటం నాకు తెలియటండలేదు. బ్రిటిష్ అని వుండవలసిన బ్రిటీష్ అని తప్పుగా పడినది పొరబాటు. దయచేసి అది సరి చేసిపెట్టమని కోరుతున్నాను. అలా సరిచేయటం నాకు నేర్పితే మిమ్ములను ఇలా మాటిమాటికీ వేదించను.--దిగవల్లి రామచంద్ర (చర్చ) 14:23, 6 ఆగష్టు 2016 (UTC)

బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్ గా సరిదిద్దబడినది. మీరు సదరు వ్యాసాన్ని దారిమార్పుతో సరైన శీర్షికకు తరలించవచ్చును. పైన సూచించబడిన బొత్తాలలో "తరలించు" పై క్లిక్ చేస్తే మీరు శీర్షికను మార్చవచ్చు. ప్రస్తుతం ఉన్న శీర్షిక పూర్తిగా తప్పు అయినపుడు దానిని నిర్వాహకులే దారిమార్పు లేకుండా తరలించాలి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 17:18, 6 ఆగష్టు 2016 (UTC)

పంజాబ్ ఎడిటథాన్ విజయం చేసినందుకు ఓ పతకం

  పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా అనేక చక్కని వ్యాసాలు రాసి తెవికీ సముదాయం విజయం సాధించడంలో చక్కని పాత్ర పోషించినందుకు, తెవికీ పంజాబ్ గురించిన వ్యాసాలతో కళకళలాడేలా చేసినందుకు ఈ విజయ పతకం

పవన్ సంతోష్
పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున పవన్ సంతోష్ (చర్చ) 14:42, 10 ఆగష్టు 2016 (UTC)

పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున పతకం అందించిన పవన్ సంతోష్ గారికి ధన్యవాదాలు. ఎడిట్-అ-థాన్ ని విజయ పథంలో నడిపి తెలుగు వికీపీడియాకు విశేష గుర్తింపు తేవడంలో కీలక పాత్ర పోషించిన మీకు ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 01:52, 12 ఆగష్టు 2016 (UTC)

Rio Olympics Edit-a-thon

Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.

For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (చర్చ) 16:54, 16 ఆగష్టు 2016 (UTC), subscribe/unsubscribe)

Return to the user page of "K.Venkataramana/పాత చర్చ 9".