వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల

Active discussions
(వాడుకరి చర్చ:నోముల ప్రభాకర్ గౌడ్ నుండి దారిమార్పు చెందింది)

Thank you sir

స్వాగతంసవరించు

ప్రభాకర్ గౌడ్ నోముల గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

ప్రభాకర్ గౌడ్ నోముల గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
 • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.    Palagiri (చర్చ) 13:29, 1 ఏప్రిల్ 2015 (UTC)


ఈ నాటి చిట్కా...
ఈ వారం వ్యాసాలను మెరుగుపరచడానికి తోడ్పడండి

ఉన్నంతలో మంచి వ్యాసాలను "ఈ వారం వ్యాసం"గా ఎన్నిక చేస్తున్నారు. ఇవి తెలుగు వికీ షోకేస్ (అద్దాలలో ప్రదర్శింప బడే) వ్యాసాలు. వీటిని ఇంకా మెరుగు పరిస్తే బాగుంటుంది. ప్రయత్నించండి.

వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Palagiri (చర్చ) 13:29, 1 ఏప్రిల్ 2015 (UTC)

అభినందనలుసవరించు

వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న నాంచారిమాదూర్ గురించి రాసినందుకు ధన్యవాదాలు. ఐతే ఆ ఊళ్ళో ప్రాచీన ఆలయం ఉందని రాశారు. ఓ చిన్న సలహా. మీ దగ్గర ఆ గుడి ఫోటో ఏదైనా ఉంటే ఈ లింక్‌లో అప్లోడ్ చేసి తెవికీలో చేర్చవచ్చు. ఆ గ్రామంలోని కాకతీయులు కట్టించిన ప్రాచీనాలయాన్ని ప్రపంచమంతా చూసిన అవకాశం కల్పించినవాళ్ళమవుతాం అని చిన్న ఆశ.--పవన్ సంతోష్ (చర్చ) 08:34, 3 ఏప్రిల్ 2015 (UTC)

ఏప్రిల్ 2015...నుండి 2019 వరకు. వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల/పాత చర్చ 1

2020...నుండి. .

 

మూసలకు లింకులు కావాలిసవరించు

కింద ఉన్న ఆ ముసలో చాలా వ్యాసలు ఇప్పటికి ప్రారంబించని పేజీలు చాలా ఉన్నవి నాకు ఇలాంటి మూసలకు లింకు కావాలి ఏవిదంగా దొరుకునో చెప్పగలరు గురువా ...అందులో కొన్ని ప్రారంబించని పేజీలు కొన్ని నేను ప్రారంబించాలను కుంటున్నాను . ప్రభాకర్ గౌడ్ నోముల 15:35, 16 ఏప్రిల్ 2020 (UTC)

ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, ఆంగ్ల వికీపీడియాలో en:template:public transport చూడండి. అందులో వ్యాసాలను అనువదించండి.--కె.వెంకటరమణచర్చ 15:45, 16 ఏప్రిల్ 2020 (UTC)

ఉదా ... {{ప్రజా రవాణా}}

దారి మార్పుసవరించు

బస్సు స్టేషన్ తెలుగు పదం బస్ స్టేషన్ ఆంగ్ల పదం అంతర్జాలంలో బస్ అనే వెతుకుతారు కావున బస్ స్టేషన్ అని వ్యాసం శీర్షికను చేర్చాను... కావున ఇప్పుడు దారి మార్పు చేసి బస్సు స్టేషన్ అని మార్చలనీ నా విన్నపం ...ప్రభాకర్ గౌడ్ నోముల 09:32, 22 ఏప్రిల్ 2020 (UTC)

వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020సవరించు

తెలుగు వికీపీడియాలో చాలా తక్కువ సమాచారమున్న వ్యాసాల జాబితాలను వివిధ విభాగాలలో తయారుచేయడం జరిగింది. వీటిని సమిష్టి కృషి ద్వారా ఒక ప్రాజెక్టు ద్వారా ద్వారా విస్తరింపదలచాం. కనుక వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 లో చేరి మీకు ఇష్టం ఉన్న రంగంలోని వ్యాసాలను విస్తరణ చేసి వికీలో నాణ్యమైన వ్యాసాలనుంచాలనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ తోడ్పాటు నందించగలరు. K.Venkataramana(talk) 14:13, 4 జూన్ 2020 (UTC)

K.Venkataramana(talk) గారు ధన్యవాదాలు, తప్పకుండ చేస్తాను ధన్యవాదాలు సార్.ప్రభాకర్ గౌడ్ నోముల 15:01, 4 జూన్ 2020 (UTC)

ఇటీవలి మార్పులపై మీ పర్యవేక్షణసవరించు

ప్రభాకర్ గారూ, నమస్కారం. "ఇటీవలి మార్పుల"ను మీరు పర్యవేక్షణలో పెట్టారు. వికీలో మనం చెయ్యాల్సిన చాలా చాలా ముఖ్యమైన నిర్వహణ పనుల్లో ఇది ఒకటని నా ఉద్దేశం. డేగ చూపు కావాలి దీనికి. అది మీకుందని నాకు అనిపించింది. ఈ పనిపై దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు సార్. నేను కూడా ఈ పని చేస్తూంటాను. అజ్ఞాతలు చేసేపనులను, కొత్తవారు చేసే పనులను, పెద్దగా అనుభవం లేని వారి పనులనూ వివిధ రంగుల్లో హైలైటు అయ్యేలా పెట్టుకుంటాన్నేను. దానితో మన చూపు ఇంకాస్త పదునెక్కుతుంది. పని కూడా కొంత సులువౌతుంది. __చదువరి (చర్చరచనలు) 00:24, 29 జూన్ 2020 (UTC)

చదువరి గారూ, నమస్కారం. మీ నుండి అభినందనలు అంటే నాకు చాలా చాలా సంతోషం సార్... ఎంత అంటే ఒక బంగారు పతకం స్వీకరించిన అంత... వికి గురించి నాకు చాలా తెలియదు, ఈ క్రమంలో నా ద్వారా తప్పు జరుగునేమోనని చిన్న జంకు ... ఉదా. రెండు రోజుల క్రితం శ్రీరామ మరియు భక్త గెంటాల నారాయణ రావు డిగ్రీ కళాశాల వ్యాసం మద్యలో మరియు వాడారు, కట్టా శ్రీనివాస రావు గారు అనుకోలేదు, ఎవరో వ్యక్తి అజ్ఞాత సృష్టించిన పేజీ అనుకున్నాను, కారణం అతను లాగిన్ కానందున ఐ.పి.అడ్రసు రికార్డు అయింది. డెలిట్ మూస పెట్టిన, ఇక ముందు అలా తప్పు జరిగిన హెచ్చరించ గలరు, దన్యవాదాలు . ప్రభాకర్ గౌడ్ నోముల 05:53, 29 జూన్ 2020 (UTC)

కాలం మొలక వ్యాసాలుసవరించు

వర్గం:కాలం మొలక వ్యాసాలు వర్గంలో ఇంకో 10 పేజీలు మిగిలాయి. వాటిని కూడా విస్తరించేస్తే ఈ వర్గం ఖాళీ అయిపోతుంది. ఇవ్వాళ రేపట్లో వీటిని అవగొట్టొచ్చు, నేను ఈ వర్గం మొత్తం నేను పూర్తి చేయాలని భావిస్తున్నాను, అవకాశం ఇవ్వండి చేస్తాను. ప్రభాకర్ గౌడ్ నోముల 16:02, 1 ఆగస్టు 2020 (UTC)

విస్తరించగలరు. K.Venkataramana(talk) 16:37, 1 ఆగస్టు 2020 (UTC)
అలాగే కానివ్వండి, ప్రభాకర్ గారూ. ఈ నెలతో ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆలోపు ఆ పదితో పాటు మరో వంద వ్యాసాలను విస్తరించాలనే లక్ష్యం పెట్టుకోండి. __చదువరి (చర్చరచనలు) 05:47, 2 ఆగస్టు 2020 (UTC)

రికార్డుల గురించిసవరించు

మొలకల విస్తరణ ఋతువు 2020 సమీక్ష పేజీలో మీరు రికార్డుల గురించి అడిగారు. ఏయే రికార్డులున్నాయో ఏంటో నాకు తెలియదు. కానీ ఒక సూచన - మీకు మీరే ఒక రికార్డు లక్ష్యాన్ని సృష్టించుకోండి. బహిరంగంగా ప్రకటించండి. పని మొదలుపెట్టి సాధించండి. ఉదాహరణకు 100 రోజులు-200 పేజీలు, నెల రోజులు-100 పేజీలు, 100 రోజులు-కోటి బైట్లు.. - ఇలాగ. __చదువరి (చర్చరచనలు) 04:38, 3 సెప్టెంబరు 2020 (UTC)

చదువరి గారూ, నమస్కారం. మీ సూచన నాకు చాలా నచ్చింది. ఈ విషయంపై స్పందించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు... ఒక ప్రాజెక్టు లక్ష్యంగా చేస్తున్న కానీ బహిరంగంగా ప్రకటించడమే చేయడం లేదు. నాకు విజయం లభిస్తుందో లేదో తెలియదు కాబట్టి బహిరంగ ప్రకటన చేయలేకపోతున్నా ఇప్పటికి 15 శాతం పని మాత్రమే జరిగింది. ఆ ప్రాజెక్టు కోసమే వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 లక్ష్యం లో మీరు 100 విస్తరణ చేయాలని చెప్పారు, నేను కూడా అదే 100 విస్తరణ చేయాలనుకుని చేయలేకపోయాను. మహోన్నతమైన తెలుగు వికీపీడియాలో 100 వ్యాసాల నుండి 68 వేల వ్యాసాల ఎదుగుదల చూస్తూ ఉన్నా ఎవరెస్ట్ శిఖరం మీరు ఇందులో మీ సహాయం మీ సలహాలు, సూచనలు నాకు చాలా అవసరం పడతాయి... తప్పకుండా కోరుతాను. నాకు విజయం లక్ష్యం, చేరువ అయ్యాను అనుకున్న సమయంలో నిర్వాహకులైన మన వారందరికీ తప్పకుండా వివరిస్తాను తెలియజేస్తాను, ధన్యవాదాలు.  ప్రభాకర్ గౌడ్ నోముల 19:32, 3 సెప్టెంబరు 2020 (UTC)

తొలగింపు ప్రతిపాదనల గురించిసవరించు

చొరవగా తొలగింపు ప్రతిపాదనలు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ విషయమై ఒక సూచన. ఏదైనా పేజీని తొలగించడానికి ప్రతిపాదించినపుడు కింది విధంగా చేస్తే ఆ ప్రతిపాదన అందరి దృష్టిలో పడుతుంది:

 1. ప్రతిపాదన మూసను పేజీలో చేర్చాక ఆ మూసలో ప్రతిపాదనపై తొలగింపు చర్చ పేజీకి ఒక ఎర్ర లింకు కనిపిస్తుంది. ఉదా: [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొసైన్ సారూప్యత]]
 2. ఆ లింకును నొక్కి, ఆ పేజీని తెరిచి అక్కడ మీ తొలగింపు కారణాన్ని రాయండి. దీంతో ఆ పేజీ తయారౌతుంది. ఉదా: వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొసైన్ సారూప్యత
 3. ఆ తరువాత ఈ పేజీ లింకును వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలోని తాజా చేర్పులు విభాగంలో అడుగున చేర్చండి. దీంతో తొలగింపుకు ఏయే పేజీలున్నాయి అని చూసేవారికి ఈ పేజీ ఉందని తెలిసి పోతుంది. దానిపై వారి వారి అభిప్రాయాలు రాస్తారు. చర్చపై నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయం అమలౌతుంది. ఆ విధంగా తొలగింపు కోసం చేసిన ప్రతిపాదన అడంగుకు చేరుతుంది. లేదంటే ఎవరూ పట్టించుకోక, ఏళ్ళ తరబడి అలా పడి ఉండే అవకాశం ఉంది.
పరిశీలించగలరు. ఒకవేళ ఈ పద్ధతి గురించి మీకు ముందే తెలిసి ఉంటే ఈ సూచనను పట్టించుకోకండి, పక్కన పడెయ్యండి. ఉంటానండి. __చదువరి (చర్చరచనలు) 04:49, 3 సెప్టెంబరు 2020 (UTC)
చదువరి గారూ, ఈ లింకు గురించి తెలియదు సార్. ముందే తెలిసి ఉంటే ఈ లింకు ను వాడిఉండే వాడిని ఆంగ్లములో చెత్త రాతలతో కొత్త పేజీలను అజ్ఞాతవాసి సృష్టించిన పేజీ లను కూడా తొలగించడానికి నిర్వాహకులైన మీరు చాలా సమయం తీసుకుంటే ఇలాంటి పేజీ లను కూడా ఎందుకు తొలగించడం లేదు అని నాకు నేనేమైనా తప్పుగా తొలగింపు మూస తప్పుగా వాడి ఉండవచ్చు అనే అనుమానం ఉండేది ఎందుకు ఆలస్యం అయిందో నాకు ఇప్పుడు తెలిసింది, అర్థమైంది. ఆన్లైన్లో ఈ సంవత్సరం చివరి వరకు అంటే ఎక్కువ రోజులు వికీపీడియాలో ఎక్కువ సమయం ఉంటాను, ఇక ముందు చెత్త రాతలతో కొత్త పేజీలను అజ్ఞాతవాసి సృష్టించిన పేజీల తొలగింపు వ్యాసాలకు ఈ మూస వాడుతాను... ధన్యవాదాలు.  ప్రభాకర్ గౌడ్ నోముల 19:32, 3 సెప్టెంబరు 2020 (UTC)

కొత్త సభ్యులను స్వాగతించడంసవరించు

ఉదాహరణకు వాడుకరి_చర్చ:Ram_Chinta పేజీలో మీరు పాత స్వాగతం మూస సమాచారాన్ని వాడటం గమనించాను. స్వాగతం మూసకు చదువరి గారు కొంతకాలం క్రిందట సవరణలు చేశారు. దానిని వాడటానికి {{subst:స్వాగతం}} --~~~~ అనిగాని లేక ట్వింకిల్ వాడతుంటే దానిలో ఆదేశవరుస Wel పై నొక్కడం కాని చేయండి. కొత్త సభ్యులందరికీ ఎవరు స్వాగతించినా ఒకే విధమైన స్వాగత సమాచారం చేర్చడం మెరుగైంది. --అర్జున (చర్చ) 22:11, 3 సెప్టెంబరు 2020 (UTC)

అర్జున గురువు గారు, {{subst:స్వాగతం}} --~~~~ఇప్పటినుండి కొత్త దే వాడతాను. {{వికీపీడియా ప్రకటనలు}}{{ఈ నాటి చిట్కా}} వాడిన కొత్త వాడుకరులకు ఉపయోగంగా ఉంటుందేమో అని ఈ ముసలు పెట్టవచ్చా వివరించగలరు. ప్రభాకర్ గౌడ్ నోముల 13:32, 5 సెప్టెంబరు 2020 (UTC)
వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రకటనలు, చిట్కాలగురించి మీ ఆలోచన బాగుంది. దీనిగురించి మూస చర్చ:స్వాగతం లో కొత్త విభాగంలో చర్చించితే మంచిది. అక్కడ చర్చమొదలుపెట్టి విభాగంలో {{సహాయం కావాలి}} చేర్చండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 17:09, 5 సెప్టెంబరు 2020 (UTC)

We sent you an e-mailసవరించు

Hello ప్రభాకర్ గౌడ్ నోముల,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)

వికీపీడియా నుండి నాకు ఈ సందేశం అందింది. ఈ సందేశం నాకు పూర్తిగా అర్థం కాలేదు. దయచేసి ఎవరైనా వివరించగలరు.... Prabhakargoudnomula 19:44, 25 సెప్టెంబరు 2020 (UTC)
Prabhakargoudnomula గారు, నాకు కూడా ఈమెయిల్ ద్వారా సందేశం అందింది. ప్రతిసంవత్సరం వికీమీడియా ఫౌండేషన్ వికీ వాడుకరులు సముదాయం పరంగా,సాంకేతికంగా అభిప్రాయాలను తెలుసుకొని, తన వనరులను వికీ ఉద్యమానికి, సముదాయానికి మేలు చేసే విధంగా పనిచేయటానికి సర్వే నిర్వహిస్తుంది. గతంలో వాడుకరి పేజీలలో సందేశాలు పంపటం ద్వారా సభ్యులకు తెలిపేవారు. ఒక్కోసారి, ఒకటి కంటే ఎక్కువ సందేశాలు కూడా చేర్చేవారు. అది కొంతమందికి అసౌకర్యగా వుండవచ్చునని, అలా కాకుండా ఈ సారినుండి సందేశాలు ఈ మెయిల్ ద్వారా పంపటం, ఈ మెయిల్ సందేశానికి సర్వేలో పాల్గొనే ఇష్టాన్ని తెలుసుకొని, అలా కోరినవారికే సర్వే హెచ్చరికలు, లింకులు పంపుతారు. కావున ఈ రాబోయే సర్వేలో పాల్గొనటానికి ఇష్టమైతే మీరు Yes,Please contact me about the Community Insights survey అనే దానిపై మీకు వచ్చిన ఈ మెయిల్ సందేశం నొక్కండి. దీనివలన మీ ఈమెయిల్ వారు నమోదు చేసుకుంటారు అయినా మీ ఈమెయిల్ సమాచారాన్ని వారి గోప్యత నియమాల ప్రకారం వాడుతారు.
గత సంవత్సర సర్వే నివేదిక గూగుల్ ట్రాన్స్లేట్ తెలుగు అనువాదం చూడండి. --అర్జున (చర్చ) 21:31, 25 సెప్టెంబరు 2020 (UTC)
అర్జున గురువు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. చాలా మంచిగా వివరించారు. ధన్యవాదాలు. మరో విషయం గురువా. అనువాద పరికరం ఓటింగ్ విషయములో అనుకూల ఫలితం రాకపోయినా అనువాద పరికరం అనుభవం ఉన్నవారికి, లేనివారికి రెండు విధాలుగా వర్గీకరించే సదుపాయం వస్తే ఆ సదుపాయం తప్పకుండా వస్తుంది. సాంకేతికం ఎన్నో అంశాలు మార్పులు వస్తున్నట్లు ఆ సదుపాయం అనువాద పరికరము లోను తప్పకుండా వస్తుంది. ఆ రోజు మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. ఉంటాను సార్ ధన్యవాదాలు. Prabhakargoudnomula 05:18, 26 సెప్టెంబరు 2020 (UTC)

ప్రయోగశాల పేజీలో వర్గాలు తొలగింపుసవరించు

ప్రభాకర్ గౌడ్ గారూ, వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల/ప్రయోగశాల పేజీలో వర్గం:లోక్‌సభ స్పీకర్లు ఇలాంటి వర్గాలు కొన్ని జోడించారు.అలా జోడించటంవలన మీ పేరు ఆవర్గాలలో చేరుతుంది. గమనించండి.వర్గం:లోక్‌సభ స్పీకర్లు వర్గంలో మీపేరు చేరుతుంది.అలాంటి వర్గాలు తొలగించగలరు.--యర్రా రామారావు (చర్చ) 05:21, 27 సెప్టెంబరు 2020 (UTC)

Mahatma Gandhi edit-a-thon on 2 and 3 October 2020సవరించు

Hello,
Thanks for showing interest to participate in the Mahatma Gandhi 2020 edit-a-thon. The event starts tomorrow 2 October 12:01 am IST and will run till 3 October 11:59 pm IST.

Note a few points

 • You may contribute to any Wikimedia project on the topic: Mahatma Gandhi, his life and contribution. Please see this section for more details.
 • If you have added your name in the "Participants" section, please make sure that you have mentioned only those projects where you'll participate for this particular edit-a-thon. The list is not supposed to be all the projects once contributes to in general. You may go back to the page and re-edit if needed.

If you have questions, feel free to ask.
Happy Gandhi Jayanti. -- User:Nitesh (CIS-A2K) (sent using MediaWiki message delivery (చర్చ) 23:09, 30 సెప్టెంబరు 2020 (UTC))

మూస పేరు, మూస పేజీ పేరుసవరించు

ప్రభాకర్ గారూ, మూస:ప్రపంచంలోని ప్రసిద్ధ లోయలు కు సంబంధించి ఒక సలహా.. మూసపేరు (మూసలో name అనే పరామితికి ఇచ్చే విలువ), మూస పేజీ పేరూ ఒకటే ఉండాలండి. ఈ మూసలో అలా లేదు. వికీపీడియా:వాడుకరులకు సూచనలు#మూస "పేరు", మూస "పేజీ పేరు" ఒకటే ఉండాలి లో దీని గురించిన వివరాలు చూడవచ్చు. ఈ మూసలో తగు మార్పు నేను చేసేవాణ్ణే. కానీ మీ దృష్టికి తీసుకువస్తే మీకు ఉపయోగంగా ఉంటుందని చెయ్యలేదు. పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 11:22, 23 అక్టోబరు 2020 (UTC)

చదువరి గారూ, నమస్తే సార్ మీ సూచనకు ధన్యవాదాలు, మూసలు తయారు చేయడం ఇది మూడవది, మీరు చేసిన సూచన అర్థమైంది, నేను మళ్లీ తర్వాత చేయు మూసలకు మీ సూచనలు, సలహాలు పాటిస్తాను ... ఇప్పటికీ చేసిన మూడు మూసల లో ఏ మార్పులు అయినా మీరు నిరభ్యంతరంగా చేయవచ్చు, నాకు తర్వాత ఉపయోగపడుతుంది, కాబట్టి వెంటనే చేయాలని అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు .ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 11:39, 23 అక్టోబరు 2020 (UTC)
మూస:ప్రపంచంలోని ప్రసిద్ధ లోయలు పేజీలో తగు మార్పు చేసాను, చూడండి. తదనుగుణంగా మిగతా మూసల్లో మార్పులు చెయ్యగలరు. __చదువరి (చర్చరచనలు) 13:13, 23 అక్టోబరు 2020 (UTC)

కృతజ్ఙతలుసవరించు

ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీ ఆత్మీయ సందేశానికి కృతజ్ఙతలు. మీ సహాయసహకారాలు ఎళ్ళవేళలా ఉండునని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. మళ్ళీ కలుద్దాం.--Bagathikishore (చర్చ) 17:01, 5 నవంబర్ 2020 (UTC)

Festive Season 2020 edit-a-thonసవరించు

Dear editor,

Hope you are doing well. As you know, A2K conducted a mini edit-a-thon Mahatma Gandhi 2020 edit-a-thon on the 2nd or 3rd October to celebrate Mahatma Gandhi's anniversary.
Now, CIS-A2K is going to conduct a 2-day-long Festive Season 2020 edit-a-thon to celebrate Indian festivals. We request you in person, please contribute to this event too, enthusiastically. Let's make it successful and develop the content on our different Wikimedia projects regarding festivities. Thank you Nitesh (CIS-A2K) (talk) 19:28, 2 December 2020 (UTC)

మీ సంతకం రంగుతో చిరు సమస్యసవరించు

ప్రభాకర్ గౌడ్ గారూ,
రంగురంగులతో సంతకాలు పెట్టడం వికీపీడియాలో ఉన్నదే. అది అనుసరించే చక్కటి ఆకర్షణీయమైన సంతకాన్ని మీరూ రూపొందించుకున్నట్టు ఉన్నారు. మంచిదే. కానీ, చిన్న సమస్య ఉందండీ. మీరు సంతకంలో మీ పేరు ఎర్ర రంగులో వచ్చేలా వాడుతున్నారు. మన వికీపీడియాలో ఎర్ర రంగుతో ఉన్న పదం ఎప్పుడైనా వ్యాసం లేని లింకు (రెడ్ లింక్ అంటాం కదా) సూచించడానికి వాడతాం కదా. మీ సంతకం చూడగానే ఈయన వాడుకరి పేజీ సృష్టించుకోలేదా అనిపిస్తోంది. ఇంతకుముందు మీ వాడుకరి పేజీ సందర్శించిన నాకే ఒక క్షణం అనుమానం కలిగిందంటే ఇతరులు ఖచ్చితంగా పొరబడే వీలుంది. దీనివల్ల ఎక్కువ నష్టం మీతో సంప్రదించదలిచినవారికే (పేజీ లేదు గావును, కొత్తవారేమోలే అని ముందుకువెళ్ళిపోయే అవకాశం ఉండవచ్చు), తద్వారా మీక్కూడాను. కనుక, వేరే రంగు ఎంచుకోరాదూ? ఇది కేవలం సూచనే. ఇలాగే చేయమని కాదు. --పవన్ సంతోష్ (చర్చ) 05:51, 6 డిసెంబరు 2020 (UTC)

పవన్ సంతోష్ గురువు గారు, ఎరుపు రంగు వాడిన కారణం చిన్నది ఉంది. నా పేజీ సందర్శన ఆ మధ్య చాలా ఎక్కువగా ఉండేది, తగ్గింపు కోసం ఎరుపు వాడాను కావాలని, ఈమధ్య సగానికి సగం తగ్గిపోయింది. మీ సూచనకు ధన్యవాదాలు సార్. ఆకుపచ్చ రంగులోకి మార్చాను. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 13:03, 6 డిసెంబరు 2020 (UTC)

నిర్వాహకత్వ ప్రతిపాదనసవరించు

నోముల ప్రభాకర్ గౌడ్ కు నమస్కారములు, మీరు వికీపీడియాలో విశేష కృషి చేస్తున్నారు. మీరు నిర్వాహకులుగా మరింత కృషి చేసి వికీపీడియా అభివృద్ధికి పాటుపడతారని భావిస్తూ మిమ్మల్ని నిర్వాహకునిగా ప్రతిపాదించాను. మీరు వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రభాకర్ గౌడ్ నోముల లో మీ సమ్మతి/అబిప్రాయం తెలుపగలరు. – K.Venkataramana  – 15:55, 11 డిసెంబరు 2020 (UTC)

నమస్కారము గురువు గారు ధన్యవాదాలండీ మీ అభిప్రాయాన్ని, సూచనలను తప్పకుండా పాటిస్తా ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 03:52, 12 డిసెంబరు 2020 (UTC)

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆవు పులి కథసవరించు

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆవు పులి కథ లో మీరు నేను చేసిన మార్పులను రద్దుచేసి అభిప్రాయం రాసారు. ఆ వ్యాసానికి తొలగింపు మూసను చేర్చాను. కథలను యదాతథంగా రాసి వ్యాసంగా ప్రచురించలేము. కానీ దానిని రవిచంద్ర మూలాలను చేర్చడానికి 7 రోజుల సమయం అడిగారు. కానీ నేనే మూలాలను చేర్చి వ్యాసంగా తీర్చిదిద్దాను. ఆ వ్యాసం చర్చను ముగించాను. మీకు ఆ ఆ వ్యాసంపై ఏవైనా అభిప్రాయాలుంటే ఆ వ్యాస చర్చా పేజీలో రాయండి. అక్కడ చర్చించవచ్చు. – K.Venkataramana  – 07:15, 15 డిసెంబరు 2020 (UTC)

భారత అంతర్జాతీయ సంబంధాలు పేజీ తొలగింపు గురించిసవరించు

ప్రభాకర్ గౌడ్ నోముల గారూ భారత అంతర్జాతీయ సంబంధాలు అజ్ఞాత వాడుకరి సృష్టించిన పేజీ నేను తొలగించాను కదా?మరలా దానికి వెను వెంటనే సృష్టించి తొలగింపు మూస పెట్టారు.నాకు అర్థం కావటం లేదు.--యర్రా రామారావు (చర్చ) 16:52, 15 డిసెంబరు 2020 (UTC)
యర్రా రామారావు గారు అజ్ఞాత వాడుకరి సృష్టించిన పేజీలో నేను మూస చేరుస్తూ ఉన్నాను, మీరు తొలగించారు. దానితో కొత్త పేజీ నా పేరున సృష్టించినట్లు వచ్చింది. ఈ పేజీని కూడా వెంటనే తొలగించండి. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 17:04, 15 డిసెంబరు 2020 (UTC)
సరే నండీ. యర్రా రామారావు (చర్చ) 17:09, 15 డిసెంబరు 2020 (UTC)

మీ ఉపసంహరణసవరించు

ప్రభాకర్ గారూ, మీ నిర్వాహకత్వ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నందుకు కష్టంగా ఉన్నప్పటికీ సరైన నిర్ణయం తిసుకున్నందుకు అభినందిస్తున్నాను. ఉపసంహరణను ప్రకటిస్తూ "విక్కీ అంటే ఎంత ప్రేమ ఉందో నాకు మీ మీ అందరి పైన నాకు అంత ప్రేమ ఉంది" అంటూ అనడం చాలా హుందాగా ఉంది. మీపై నాకున్న గౌరవం పెరిగింది. "ఇంటర్వ్యూ నాడే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అడిగారు" అనడం కాస్త ఉద్వేగం కలిగించింది కూడా. అయితే మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినవారు, సమర్ధించిన వారు, నేనూ.. అందరం మిమ్మల్ని అభిమానిస్తున్నామనడంలో నాకే సందేహమూ లేదు. చర్చలో అభ్యర్థిత్వం పట్ల కనిపించిన వ్యతిరేకత మీపట్ల వ్యక్తిగతమైన వ్యతిరేకత కానేకాదనీ, అది కొన్ని అంశాల ప్రాతిపదికన చూపించినదనీ నేను భావిస్తున్నాను. మీరూ అలానే భావిస్తున్నారని నేను గ్రహించాను.

వికీపీడియాలో ఇకముందు కూడా ఎప్పట్లాగే మనం సమష్టిగా, పరస్పర గౌరవంతో, మైత్రీ భావంతో పని చేసుకు పోదాం. __చదువరి (చర్చరచనలు) 09:00, 16 డిసెంబరు 2020 (UTC)

జిల్లాల ప్రాజెక్టు చర్చ పేజీలో మీరు రాసిన దానికి సమాధానంసవరించు

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ పేజీలో నన్నుద్దేశించి రాస్తూ "..అలాగే, నిన్న మొన్న నేను చేసిన అనువాదం పేజీలు గోవా, డయ్యూ డామన్ పేజీల నాణ్యత ఎలా ఉంది. ఒక మాట చెప్పండి అని మనవి... అలాగే, నిన్న మొన్న నేను చేసిన అనువాదం పేజీలు గోవా, డయ్యూ డామన్ పేజీల నాణ్యత ఎలా ఉంది. ఒక మాట చెప్పండి అని మనవి...ఎందుకు అంటున్నాను అంటే నేను మాటవరసకి వికీ గురించి నాకు ఏమీ తెలియదు, అంటే నిజంగానే నన్ను జీరో చేశారు. నా ఉద్దేశం కొత్త అంశాలు నాకు తెలియనివి ఏమైనా చెప్తారేమో అని నేను భావించాను. చీమ 1 అనుకుంటే శివుడు ఒకటి అనుకున్నట్లు, నేను కుట్టగానే చనిపోవాలి(మనిషి అని) చీమ అనుకుంటే, ఓహో చనిపోవాలని అనుకుంటుంది అని శివుడు అనుకున్నట్లు. జరిగింది నా విషయం." అని రాసారు.. దానికి సమాధానం ఇక్కడ రాస్తే బాగుంటుందని రాస్తున్నాను:

అసలీ నిష్ఠూరాలన్నిటికీ మూలం మీ నిర్వాహక హోదా ప్రతిపాదనపై జరిగిన చర్చ వల్లనేనని నేను అనుకుంటున్నాను. ఆ చర్చలో - అనువాద పరికరం పనితీరు పట్ల వివిధ సందర్భాల్లో మీరు కనబరచిన భిన్నాభిప్రాయాలకు సంబంధించి నాకున్న సందేహాలను అడిగాను. అవి నిలకడగా లేవని, అందుకు మీరు చూపించిన కారణాలు నిలకడగా లేవనీ అన్నాను. మీరు చూపించిన కారణాలు పరిణతి తోనే ఉన్నాయని మీకు అనిపిస్తోంటే ఆ విషయంలో మనిద్దరి మధ్య స్పష్టమైన భేదాభిప్రాయమున్నట్టే! కానీ మీకు ఏమీ తెలియదని నేను అనలేదు. ఇక దాన్ని దాటుకుని ముందుకు పోదాం..

ఒకవేళ మీ నిర్వాహక హోదా ప్రతిపాదనను నేను సమర్ధించి ఉంటే - మీ పరిశీలనా శక్తి కంటే మీ పరిశీలనాసక్తిని నేను లెక్క లోకి తీసుకునేవాణ్ణి. చర్చల్లో మీరు వెల్లడిస్తున్న అభిప్రాయాల కంటే చర్చల్లో ఉత్సాహంగా పాల్గొనడం గురించి మాట్లాడేవాణ్ణి. ఇటీవలి మార్పులను పర్యవేక్షిస్తూ మీరు తీసుకుంటున్న చర్యల కంటే ఆ పని పట్ల మీరు కనబరుస్తున్న శ్రద్ధను గమనం లోకి తీసుకునేవాణ్ణి. ఎంతోమంది అనుభవజ్ఞులు ఓరకంటితో కూడా చూడని అనువాద పరికరాన్ని మీరు సాధన చేస్తున్న విధానం గురించి మాట్టాడేవాణ్ణి. "వాడుకరులకు సూచనలు" పేజీలో చొరవగా మీరు రాసిన సంగతి గురించి మాట్టాడేవాణ్ణి. స్వాగతం ఎవరికి చెప్పాలనే సంగతి గురించి తోటి వాడుకరులతో చర్చ మొదలుపెట్టి కనీసం ఒక మార్పైనా చేసాకే స్వాగతం చెబుదాం అని చొరవ తీసుకోవడం గురించి మాట్టాడేవాణ్ణి. ఇన్ని సుగుణాలున్న మీరు ఆయా పనులను మరింత సమర్ధవంతంగా ఎలా చెయ్యొచ్చో చెప్పేవాణ్ణి, ఇంకా ఏం చేస్తే, ఎలా చేస్తే మీ పని మెరుగవుతుందో చెప్పేవాణ్ణి. ఈ ముక్క చెప్పడానికి నాకున్న అర్హతేంటని (మీరు అడక్కపోయినా మరెవరైనా) అడగొచ్చు - దానికి నాకున్న అర్హతేంటంటే, నేను "ప్రభాకర్ గౌడ్ నోముల"ను కాకపోవడమే. మీరు "ప్రభాకర్ గౌడ్ నోముల" అవడం చేత "ఆయన" లోటుపాట్లు ఇతరులకు తెలిసినంతగా మీకు తెలవదు. ఎలాగంటే.., నేను "చదువరి"ని కాబట్టి, "చదువరి" తప్పులేంటో ప్రభాకర్ కు తెలిసినంతగా నాకు తెలవదు. చాలా సింపులిది.

నిర్వాహక హోదా చర్చ, దాని ఫలితం మీకు కష్టం కలిగించాయనడంలో సందేహం లేదు. అయితే దాన్ని దాటుకుని ముందుకు పోయి, మళ్ళీ వికీ రథాన్ని ముందుండి లాక్కెళ్ళే పనిలో పడాలి ప్రభాకర్ గారు. మీరు మరింత శక్తిమంతులు కావాలని కోరుకునేవాణ్ణే గానీ, మీ మైత్రిని మీ సాహచర్యాన్నీ వద్దనుకునేవాణ్ణి కాను. అందరూ అలాగే అనుకుంటారని నా ఉద్దేశం. మిమ్మల్ని సమర్ధించేవారు మీకు మిత్రులే. అంత మాత్రాన మిమ్మల్ని వ్యతిరేకించినవారు మిత్రులు కారని భావించకండి. మీ లోపాలను గుర్తించి మీకు చెప్పేవారు, మీ మెరుగుదలను ఆశించేవారు కూడా మిత్రులే. కలసి ముందుకు సాగుదాం పదండి.

పోతే మీరు అడిగినట్టుగా, మీరు అనువాదం చేసిన పేజీలను చూసి నా అభిప్రాయం చెబుతాను.

మరో సంగతి.. మీ సంతకంలో "చర్చ" అనే మాటకు లింకు మీ వాడుకరి పేజికి పోతోంది. మీ చర్చకు పోవడం లేదు, గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 19:03, 21 డిసెంబరు 2020 (UTC)

చదువరి గారూ, మీ లోతైన అవగాహన నేను కోరుకుంటున్నాను, అదే చెప్పారు, మీరు అందుకే మీకు నేను కృతజ్ఞుణ్ణి అయితే నిర్వహణ పదవి రాకపోయినా అంత అంతగా విరిగిపోతుంది అని మొదటిరోజు బాధపడ్డాను కానీ, మీరు గమనించిన అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అని మాత్రం భావించాను, అది కాక ప్రతిపాదనకు ముందు రోజు ప్రచురించిన ఒక వ్యాసం ను కారణంగా చూపుతూ వ్యతిరేకించడం బాధించింది. నిర్వాహకులకు ఉండవలసిన అంశాలు వదిలేసి, వ్యాసాలు వ్యాఖ్య నిర్మాణం సరిగా లేనందు వలన అనేది విచిత్రంగా అనిపించింది. మరింత నేర్చుకోవాలి అనేది కొంత నిజం అయి ఉండవచ్చు కానీ, ఇల్లు ఉడ్చడానికి చీపిరిలా ఉపయోగపడాలి అనుకున్న , అనువాద పరికరం తో నా వ్యాసాలు గమనించి అభిప్రాయం చెప్పాలని అందుకే అడుగుతున్నా ... ధన్యవాదాలు మీరు స్పందించిన తీరుకు. నా చర్చ పేజీ లింకు కూడా సవరించానండి.__ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 06:56, 22 డిసెంబరు 2020 (UTC)

భారతదేశ జిల్లాలు, పట్టణాల వర్గంలో మార్పులు గురించిసవరించు

ప్రభాకర్ గౌడ్ గారూ నమస్కారం. మీరు వర్గాలలో చాలా చురుకుగా సవరణలు చేస్తున్నందుకు ధన్యవాదాలు.వర్గం:భారతదేశ నగరాలు, పట్టణాలు వర్గంలో వరంగల్ పట్టణ జిల్లా, మహబూబాబాదు జిల్లాలు చేర్చారు.కానీ నాకు తెలిసినంతవరకు వీటిని చేర్చవలసిన అవసరంలేదు.వాటి ప్రధానకేంద్రాలు చేర్చవచ్చు.జిల్లాలు భారతదేశ జిల్లాలు వర్గంలో చేర్చవచ్చు. వర్గంలో మనం చేర్చవలసినవి లోగడ ఏమైనా చేర్చారా అని నిశితంగా పరిశీలిస్తే మనకు తెలుస్తుంది.నేను ఇలాగే పరిశీలిస్తాను. గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 09:55, 24 డిసెంబరు 2020 (UTC)

మీ అనువాదాల పరిశీలనసవరించు

మీరు కోరినట్లుగా అనువాదాల పరిశీలన చేసాను. బీదరు వ్యాసంలో కొన్ని భాషా సవరణలు చేసాను. ఇంకా ఉండి ఉండవచ్చు. బొమ్మల వ్యాఖ్యలను చూడలేదు. మీరు పరిశీలించి ఇంకా ఏమైనా మార్పుచేర్పులు అవసరమైతే చెయ్యండి. నేను గమనించినంతలో.. ప్రచురించే ముందు అనువాదాలను మరింత పరిశిలించాలని భావిస్తున్నాను. పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 10:25, 24 డిసెంబరు 2020 (UTC)

కృతజ్ఞతలుసవరించు

నేను రాసిన వ్యాసము అభివృద్ధి లో సహక రించినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు (అరుణ (చర్చ) 19:41, 14 జనవరి 2021 (UTC))


ఇనగంటి రవిచంద్ర సత్వర తొలగింపు ప్రతిపాదనసవరించు

 

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

ఇనగంటి రవిచంద్ర పేజీని సత్వరమే తొలగించాలని ఆ పేజీలో ఒక ట్యాగును పెట్టారు. సత్వర తొలగింపు కారణాల్లో A7 విభాగం కింద ఈ ప్రతిపాదన చేసాఎరు. ఎందుకంటే a person or group of people వంటి అంశానికి సంబంధించిన ఈ పేజీలో విషయానికి ఉన్న ప్రాధాన్యతను ఎలాంటిదో వివరించలేదు: అంటే ఈ విషయానికి విజ్ఞాన సర్వస్వంలో వ్యాసం ఎందుకు ఉండాలి అని. సత్వర తొలగింపు పద్ధతిలో అలాంటి వ్యాసాలను ఎప్పుడైనా తొలగించవచ్చు. విషయ ప్రాధాన్యత గురించి చదవండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు.

--అర్జున (చర్చ) 05:06, 24 ఫిబ్రవరి 2021 (UTC)

కృతజ్ఞతలుసవరించు

వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీరు నా పేరుతో వ్యాసం సృష్టించిన సంగతి ఇప్పడే గమనించాను. మీ అభిమానానికి ధన్యవాదాలు. వికీపీడియా విధానాల ప్రకారం నా పేరుతో వ్యాసానికి అర్హత లేదని భావించినందున, వ్యాసం తొలగించాను. --అర్జున (చర్చ) 08:57, 24 ఫిబ్రవరి 2021 (UTC)

కటకం వెంకటరమణ వ్యాసం తొలగింపు ప్రతిపాదనసవరించు

 

కటకం వెంకటరమణ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

వికీపీడియనుకు ప్రత్యేకంగా వాడుకరి పుట ఉంటుంది. వికీపీడియాలో స్వచ్ఛందంగా సేవ సేసినంత మాత్రాన వికీపీడియాలో వ్యాసం ఉండాలని నియమం లేదు. ఒక్క తెలుగు వెలుగు పత్రిక వాడుకరుల అభిప్రాయాలను తెలుసుకొని దానిని ప్రచురించినంత మాత్రాన వ్యక్తికి వ్యాసం అవసరం లేదని నా అభిప్రాయం. నోటబిలిటీ ఉండాలి. ఈ వ్యాసాన్ని తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కటకం వెంకటరమణ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. -- K.Venkataramana -- 14:11, 24 ఫిబ్రవరి 2021 (UTC) -- K.Venkataramana -- 14:11, 24 ఫిబ్రవరి 2021 (UTC)

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులుసవరించు

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)

Requestసవరించు

Hi can you translate the article Indian Institute of Science Education and Research Berhampur in telugu. You can use Google translate to easily understand the contents in Odia or ahamiya version of this article. Thank you ଲେଖକ (చర్చ) 18:42, 17 మార్చి 2021 (UTC)