Mylaptops గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   అర్జున (చర్చ) 11:14, 11 ఫిబ్రవరి 2013 (UTC)

ధన్యవాదాలుసవరించు

మీరు 50 కి పైగా దిద్దుబాట్లు పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. మీరు వ్యాసాల అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయం.మీ వాడుకరి పేజీలో మీ వివరాలు తెలియజేస్తే సంతోషిస్తాం.  కె. వి. రమణ. చర్చ 11:13, 21 ఫిబ్రవరి 2013 (UTC)

చర్చ:తెలుగు భాషలో అంతరిస్తున్న పదాలుసవరించు

చర్చ:తెలుగు భాషలో అంతరిస్తున్న పదాలు ఈ చర్చ పరిశీలించగలరు. Chavakiran (చర్చ) 16:53, 4 మార్చి 2013 (UTC)

సభ్య నామముసవరించు

భూపతిరాజు గారూ, మీకు అభ్యంతరం లేకపోతే మీ సభ్య నామమును తెలుగులో మార్చుకొనగలరా? MyLaptops అనే పదము కొంచెం కృతకంగా ఉన్నది. తెలుగు భాషపై ప్రత్యేక శ్రద్ద వహించి వ్యాసరచన చేస్తున్న మీకు తెలుగు సభ్య నామము ఉంటే బాగుంటుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయము.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:39, 5 మార్చి 2013 (UTC)

మీ ఆలోచన నిజమే. దయచేసి సభ్యత్వ నామం ఎలా మార్చుకోవాలో చెప్పండి. (Mylaptops (చర్చ) 10:05, 13 మార్చి 2013 (UTC))

నమస్కారం భూపతిరాజు గారూ. మీరు మన తెలుగు వికీ బ్యూరెక్రాట్లలో ఎవరినైనా ఒకరిని ఈ మార్పు చేయమని అడగవచ్చు. బ్యూరెక్రాట్లకై ఈ లంకె చూడండి http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE/bureaucrat విష్ణు (చర్చ)19:01, 16 మార్చి 2013 (UTC)

తెలుగు భాషలో చేరుతున్న ఆంగ్ల పదాలుసవరించు

భూపతి రాజు రమేష్ రాజు గారికి నమస్కారములు, మీరు మంచి వ్యాసాలను తెవికీకి అందించుచున్నందుకు అభినందనలు. మీరు ఈ వ్యాసం పేరు మార్చినందుకు ధన్యవాదములు. మన దేశం లో తెలుగు తో పాటుగా అనేక భాషల వారు ఉన్నారు. సౌలభ్యం కోసం ఉన్నత విద్యల కోసం అవసరాన్ని బట్టి కూడా తెలుగు భాష నుండి విద్యార్థులు దూరమగుచున్నారు. నేటి సమాజంలో communicative skills పెంపొందించుకొనుటకు కూడా చాలా మంది ఆంగ్ల భాష పై వ్యామోహం పెంచుకుంటున్నారు. కాని తెలుగు భాష యిష్టం లేక కాదని నా అభిప్రాయం. ఇలా పెంపొందుంచుకొంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని నేతి యువత అభిప్రాయం. మీ వ్యాసంలో [[తెలుగు భాష ను స్పష్టంగా మాట్లాడలేని పరిస్తితిలో నేటి పిల్లలు, యువతీ యువకులు ఉన్నారు. ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు అంటే తప్పనిసరిగా వారు తెలుగువారు అయివుండొచ్చని ఒక వేళ అనుకున్నా అతిశయోక్తి కాదు]] అనే వాక్యం వలన ఆంగ్ల భాష లో చర్చించేవారంతా తెలుగు వారే అనే అర్థం తోస్తుంది. దానిని తొలగిస్తే బాగుండునేమో పరిశీలించగలరు.(  కె. వి. రమణ. చర్చ 06:33, 9 మార్చి 2013 (UTC))

జవాబుసవరించు

తెలుగు భాషను సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో పిల్లలు, యువతీ యువకులు ఉన్నారనేది కఠిన వాస్తవం. ఆంగ్ల భాషలో చర్చించుకొనేవారంతా తెలుగువారు కాకపోవచ్చును కాని,

ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు అంటే తప్పనిసరిగా వారు తెలుగువారు అయివుండొచ్చని ఒక వేళ అనుకున్నా అతిశయోక్తి కాదు అంటే

ఆంగ్లం అంతలా తెలుగు వారిలో పాతుకుపోతోంది అని అర్ధం. ఒక తెలుగువాడు తోటి తెలుగువాడితో ఆంగ్లంలో మాట్లడటం పూర్తిగా కాకపోయినా చాలావరకూ జరుగుతోంది. ఇది ముఖ్యంగా పిల్లల్లో గమనించవచ్చు. ఒక భాషలో మాట్లాడటం లేదంటే ఆ భాషపై మక్కువ లేక కాదు. తెలుగు భాష పదాలు ఉచ్చరించడానికి నాలుకకు కొద్ది ఎక్కువ వ్యాయామం అవసరమౌతుంది. కాని ఆంగ్లం మాట్లాడటానికి నాలుకకు తక్కువ వ్యాయామం చాలు. వాస్తవంగా ఆంగ్ల భాష మాట్లాడటానికి తెలుగు భాషతో పోలిస్తే చాలా సౌలభ్యంగా ఉంటుంది. కాని ఆ క్రమంలో కొన్ని తెలుగు పదాలు వాడుకలోంచి తొలగిపోతాయి. అందుకే తెలుగువారిలో పిల్లలు, యువతీ యువకులు మాతృభాష స్పష్టంగా మాట్లాడలేని పరిస్తితి ఏర్పడింది. బ్రతుకు తెరువు కోసం పరాయి భాష అయిన ఆంగ్లం అవసరమే, అవసరమైనప్పుడు మాట్లాడవచ్చు. కాని ఆ క్రమంలో మాతృభాషలో పదాలు మరచిపోకూడదు. ఇతర రాష్ట్రాల వారు మనతో పోలిస్తే చాలా నయం. వారికి మనకంటే ఎంతో మాతృభాషాభిమానం ఉన్నది.(Mylaptops (చర్చ) 09:49, 13 మార్చి 2013 (UTC))

సూచనసవరించు

[[ఇప్పుడు ప్రపంచంలోని (భారతదేశంలోని భాషలతో సహా) చాలా భాషలవలెనే తెలుగు భాష కూడా ఆంగ్లభాషా ప్రభావానికి లోనవుతుంది. సాంఘీకంగా ఆంగ్ల భాషాపదాలు కలిపి మాట్లాడటం ప్రెస్టీజ్ ఇస్యూగా భావించడం గత యాభై నూరు సంవత్సరాల నుండి జరుగుతున్న ప్రక్రియ. గతంలో ఆంగ్ల భాష ఏ విధంగా ఫ్రెంచ్ ప్రభావానికి లోనైనదో (ఉదాహరణకు, పిగ్ అనేది నేటివ్ పదం అయితే ఫోర్క్ అనేది నార్మన్ ఫ్రెంచ్ పదం) అదే విధంగా తెలుగు గతంలో సంస్కృతం, ప్రాకృతం, పార్శీ, అరబిక్ ఇప్పుడు ఆంగ్ల భాషా ప్రభావాలకు లోనవుతోంది]] -

అనే పరిచయం ఈ వ్యాసానికి సరైనది కాదు. మరోవిధంగా ఆలోచించి వ్రాయమని వ్రాసినవారికి విన్నపం చేస్తున్నాను. ఈ వ్యాసంలో పరిచయం కేవలం తెలుగు భాష వాడుకలోంచి తొలగిపోతున్న పదాలు గురించి మాత్రమే ఉండాలి. (Mylaptops (చర్చ) 10:07, 13 మార్చి 2013 (UTC))

దయచేసి చర్చలలో సంతకం చేయండిసవరించు

  • మీరు చర్చా వ్యాఖ్య రాసిన తర్వాత నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. ఇలా చేయటం వలన చర్చ ఎవరు జరిపారో తెలుస్తుంది.
  • మీ సభ్య నామం Mylaptops అనునది ఆంగ్లంలో ఉన్న పదం. మీరు చక్కని తెలుగు పేరుండగా దానిని సభ్యనామంగా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
  • మీరు సభ్య నామం My laptops అని మార్చుకోక పోవటం యిష్టం లేనిచో చర్చలలో మీరు నాలుగు టిల్డెలతో (~~~~) సంతకం చేసినపుడు భూపతిరాజు రమేష్ రాజు - చర్చ అని వచ్చే వీలుంది. అది ఎలా అంటే మీరు లాగిన్ అయిన తర్వాత మొదటి పేజీలో పై భాగమున గల "అభిరుచులు" పై క్లిక్ చేస్తే ఒక విండో open అవుతుంది. అందులో సంతకం అనిఉన్న భాగంలో గల ముద్దుపేరు వద్ద గల బాక్స్ లో [[సభ్యుడు:Mylaptops|<font style="background:yellow;color:blue;"> భూపతిరాజు రమేష్ రాజు </font>]][[సభ్యులపై చర్చ:Mylaptops|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] అని టైప్ చేసి ఆ విండో క్రింది భాగంలో గల "భద్రపరచు" అనే దానిని క్లిక్ చేసి భద్రపరిస్తే మీరు సంతకం చేసినపుడు భూపతిరాజు రమేష్ రాజు - చర్చ అని కనిపిస్తుంది. ఈ సూచనను పరిగణనలోనికి తీసుకోగలరు.(  కె. వి. రమణ. చర్చ 12:36, 12 మార్చి 2013 (UTC))

వాడుకరి పేరు మార్పుసవరించు

అందరికీ నమస్కారం! నెను నా లాగిన్ (వాడుకరి పేరు) (Mylaptops నుండి భూపతిరాజు రమేష్ రాజు గా మార్చుకున్నాను. అంతకు ముందు Redaloes అని కూడా వాడుకరి పేరు ఉండేది. నా తోటి వికీపిడియన్ల సూచన మేరకు తెలుగు వికీపిడియాలో ఆంగ్లంలో వాడుకరి పేరు ఉండటం బాగోలేదని తెలుసుకున్నాను. ఇది అందరూ గమనించవలెనని నా ప్రార్ధన! (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 07:41, 15 మార్చి 2013 (UTC))

హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు

భూపతిరాజు రమేష్ రాజు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 03:26, 13 మార్చి 2013 (UTC)

  • వికీ మహోత్సవంలో మీకోసం ఎదురుచూస్తాము. త్వరలో తప్పకహాజరయ్యే వారి పట్టీలోకి మీ పేరును మార్చండి.--అర్జున (చర్చ) 10:56, 6 ఏప్రిల్ 2013 (UTC)

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా తెలుగు కులాల గురించిన విస్తృతమైన వివరాల విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 12:28, 26 జూలై 2014 (UTC)