Prof kodali srinivas గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 04:47, 24 జూన్ 2009 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
చిట్కాల మూసలు

తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము చిట్కాలకు సంబంధించి రెండు మూసలున్నాయి.
{{ఈ నాటి చిట్కా}} - ఈ మూస వాడితే చిట్కా పేజీ మధ్యభాగంలో వస్తుంది.
{{ఈ నాటి చిట్కా2}} - ఈ మూస వాడితే చిట్కాను గడులలో (కాలమ్స్) చేర్చవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

విన్నపం మార్చు

శ్రీనివాస్ గారూ! వికీపీడియాలో తమ గురించి తామే వ్యాసాలు రాసుకోవడం నిషిద్ధం. కావున వికీ నియమ నిబంధనలనుసరించి ఈ వ్యాసం తొలగించబడుతుంది. ఇక మీ వివరాలను సభ్య పేజీ లో చేర్చుకోవచ్చు. ఇంకా మీరు హేతువాదంలో మంచి పరిశోధన చేశారంటున్నారు కనుక దానికి సంబంధించిన వ్యాసాలను అభివృద్ధి చేయండి. — రవిచంద్ర(చర్చ) 10:59, 24 జూన్ 2009 (UTC)Reply


నమస్కారం ప్రొఫెసర్ శ్రీనివాస్ గారూ! మీరు మీ గురించి వ్రాసిన విషయాలను మీ సభ్యుని పేజీలోకి మార్చాను. అక్కడ విషయాన్ని (అనగా మీ పరిచయాన్ని) మీ అభిరుచికి అనుగుణంగా వ్రాసుకోవచ్చును. ఇది వికీ నియమాల ప్రకారం చేయవలసివచ్చింది కాని మీ రచనల పట్ల తిరస్కారంభావం ఎంతమాత్రం కాదని, అన్యధా భావించవలదని మనవి చేస్తున్నాను. మీవంటి విజ్ఞుల రచనలు వికీ ప్రగతికి ఎంతో అవుసరం. ఉదాహరణకు మీరు వాస్తుశాస్త్రం గురించి, హేతువాదం గురించి, సివిల్ ఇంజినీరింగ్ గురించి వ్యాసాలు వ్రాస్తే చాలా బాగుంటుంది. ఏవయినా సందేహాలుంటే తప్పక నా చర్చాపేజీలో వ్రాయండి. --కాసుబాబు 13:17, 24 జూన్ 2009 (UTC)Reply

అభినందన మార్చు

నమస్తే ప్రొఫెసర్ గారూ! తపాలా బిళ్ళలు గురించి చక్కని సమాచారం అందించారు. చాలా కాలం నుంచి ఆ వ్యాసం అలా చిన్నది గానే ఉంది. ఇంకా తెవికీలో ఇలాంటి చిన్న వ్యాసాలున్నాయి. వాటిలో మీకు తెలిసినవి ఏవైనా ఉంటే అభివృద్ధి చేయమని ప్రార్థన. — రవిచంద్ర(చర్చ) 04:47, 30 జూన్ 2009 (UTC)Reply