వాడుకరి చర్చ:Vu3ktb/పాతచర్చలు 3

తాజా వ్యాఖ్య: మీ ఊరి వ్యాసం టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

హామ్ రేడియో వ్యాసం మార్చు

హామ్ రేడియో వ్యాసం బాగున్నది. నా వ్యాఖ్యలు గమనించండి.

  • ఏదైనా వ్యాసం బాగున్నదని మీకనిపిస్తే దాని చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అనే మూస ఉంచండి. మీరు గాని, వేరొకరు గాని వ్రాసినదైనా సరే. ఈ విషయంలో సంకోచించవలసిన పని లేదు. ఒకరి అభిప్రాయాలకు ఎక్కువ గాని తక్కువ గాని విలువ లేదు. ఆ వ్యాసం లైనులో పరిగణనలోకి వస్తుంది. కొన్ని వారాలు పట్టవచ్చును.
  • తరువాత ఆ వ్యాసాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి.
  • ఈ వ్యాసంలోను, ఇతర వ్యాసాలలోను ఇంగ్లీషు వ్యాసానికి లింకు ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకు దీనికి ఆంగ్ల వికీలోని వ్యాసం పేరు Amateur radio. అప్పుడు తెలుగు వికీలో హామ్ రేడియో వ్యాసం చివర [[en:Amateur radio]] అని వ్రాయండి.
  • బొమ్మ:VU2RM.JPG గురించి - ఈయన పేరు, ప్రత్యేకతలు వ్యాసంలో వ్రాశారు గాని బొమ్మలో వ్రాయలేదు. ఆ బొమ్మ పేజీ తెరిచినవారికి బొమ్మలోని వ్యక్తి గురించి తెలియదు. కనుక బొమ్మ సారాంశం లో ఆ బొమ్మ గురించి ఇంగ్లీషులో వ్రాయడం మంచి పద్ధతి. ఎందుకంటే ఆ బొమ్మను ఇతర వికీపిడియాలలో కూడా వఅడుకోవచ్చును (అది GFDL బొమ్మ అయితే).
  • జీవించి ఉన్న వ్యక్తుల ఫొటోలను GFDL క్రింద ఉంచడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. నాకూ బాగా తెలియదు. ఆంగ్ల వికీలో వెతికి చూడండి. వారి అనుమతి లేకుండా అలాంటి బొమ్మను ఉంచడం సమంజసం కాకపోవచ్చును.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:50, 31 మార్చి 2008 (UTC)Reply

బాధ కలిగించిన విషయం/వ్యాఖ్య మార్చు

కాసుబాబుగారూ, ఈ కామెంటును చాలా బాధగా వ్రాస్తున్నాను. రంగారావుగారు, ఈ కింది వ్యాఖ్య చేసి నాకు మనస్తాపం కలిగించారు.

శివ గారు, మీరు ఒక మంచి వ్యాసాన్ని చాలా అసంబద్దంగా తీర్చిదిద్దారు. నేను మళ్ళీ దానిని సరి దిద్దాను. ఇంకొకసారి మార్పులు చేసే ముందు దయచేసి ఇతర వ్యాసాలను పరిశీలించమని కోరుతున్నాను. - --Svrangarao 14:29, 6 ఏప్రిల్ 2008 (UTC)

నేను వారికి ఈ కిందివిధంగా జవాబు వ్రాశాను: రంగారావుగారూ! నమస్తే. నేను అసంబంద్ధంగా తీర్చి దిద్దాను అని అరోపణ చేసారు కాని, నెను చేసిన మార్పులు ఏవిధంగా అసంబద్ధమో వ్రాయలేదు. దయచేసి తెలియ చేయమని మనవి.--SIVA 18:35, 14 ఏప్రిల్ 2008 (UTC) ఈ పైన విషయం ప్రముఖ సినీ నటుడు ఎస్వీ రంగారావు వ్యాసంగురించి జరిగింది.

నేను సినీ నటుడు S.V.RANGARAO గురించి ఉన్న వ్యాసాన్ని కొంత సరిచేసాను. ఆ పనిలో ఒక పేతికను అమర్చాను, వారి చిత్రాలను వేరొక పేజీకి మార్చాను, బాపు చమత్కార భాషణను, వ్యాసానికి ఆరంభంలో ఉంచాను. తరువాత వ్యాస విషయాలు ఒక పద్దతి ప్రకారం కూర్పు చేసాను. ఈ మాత్రానికి, రంగారావుగారు పై విధంగా స్పదించి నేను చెసిన మార్పులు "అసంబద్ధంగా" తీర్చి దిద్దానని వ్యాఖ్య చేసారు. నేను చేసిన ఏ మార్పు అసంబంద్ధం?? నేను అమర్చిన పేటిక అలాగే ఉంచారు, చిత్రాల జాబితా table format లో ఉంచారు(నేను చర్చలో స్పందిచిన ప్రకారం,ఇలా చేస్తే వ్యాస నిడివి అసహజంగా పెరగకుండా కొంతవరకు కాపాడవచ్చు, 2వ పేజీ ఏర్పరచటంఇష్టంలేకపోతే).

నేను చిత్రాల జాబితాను వేరొక పేజీకి మార్చినప్పుడు, మీరు చూచి, అలా అవసరమా, చర్చించండి అన్నారు. నేను, నా స్పందన వెంటనే, చర్చా పేజీలో వ్రాసాను. ఇప్పుడు చూస్తే, నేను వ్రాసిన స్పందన చర్చా పేజీలో లేదు, రెండు పేజీలు ఒకటిచేసారు. సరే, మీరు నిర్ణయించి రెండుపేజీలు ఒకటి చేసారు అనుకుందాము, ఈ మాత్రానికి చర్చకు ప్రదిపాదించటం దేనికి? ఇతర సభ్యులు ఎవరూ కూడా స్పందించకుండానే ఎక పక్ష నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? OK రెండు పేజీలు ఒకటి చేసారు. ఈ విషయం మీద నా స్పందన చర్చా పేజీలో నుండీ తొలగించటం దేనికి?(ఎవరు తొలగించారో నాకు తెలియదు)

తరువాత, వికీ లో వ్యాసం వ్రాసినప్పుడు, ఇతరులు ఆ వ్యాసాన్ని "EDIT" చేస్తారు, చెయ్యచ్చు అన్న విషయం మౌలికమయినది (basic)కదా. ఒకవేళ ఇతరులు చేసిన మార్పులు నచ్చకపోతే, చర్చించాలి, ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవాలి, లేదా ఆ మార్పును నిశ్శబ్దంగా తిరిగి మార్చుకోవాలి. ఇతరులు చేసిన మార్పుల గురించి ఇలా దురుసుగా, కటువుగా వ్యాఖ్యలు చెయ్యటం సమంజసమా?? మీరు దయచేసి ఈ విషయం పూర్తిగా పరిశీలించి తెలుపగలరు. ఈ విషయం ఎవరికి ఫిర్యాదు చెయ్యలి కూడా తెలియ చేయగలరు.--SIVA 18:11, 15 ఏప్రిల్ 2008 (UTC)Reply

శివరామ ప్రసాద్ గారూ, తెలుగు వికీకి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మొదటగా నేను చెప్పేదేమిటంటే ఈ చర్చా పేజీ సంభాషణలు ఒక వ్యక్తి అనుకున్న భావాన్ని ఖచ్చితంగా తెలియజేయలేకపోవచ్చు (అప్రత్యక్ష సంభాషణా మాధ్యమం కదా). ఆ వ్యాఖ్యలకు నొచ్చుకోకండి. సదరు సభ్యులు ఏ ఉద్దేశ్యంతో చేశారో కనుక్కుందాం. ఇలాంటి చిన్నచిన్న వివాదాలు తలెత్తినప్పుడు మధ్యవర్తిత్వ సంఘానికి వెళ్ళాలి. అలాంటి యేర్పాటుకు తెవికీలో ఇప్పటిదాకా అవకాశం రాలేదు. ప్రస్తుతానికి కాసుబాబు గారు మధ్యవర్తిత్వం వహించగలరు. నేనూ చూస్తాను --వైజాసత్య 20:24, 15 ఏప్రిల్ 2008 (UTC)Reply
ముందుగా ఈ రెండు పేజీలు చూడండి వికీపీడియా:సంయమనంగా ఉండండి, వికీపీడియా:వివాద పరిష్కారం --వైజాసత్య 20:31, 15 ఏప్రిల్ 2008 (UTC)Reply

వికి నిబంధన మార్చు

వికి మధ్యవర్తిత్వంలో ఈ కింది విధంగా ఉన్నది "వివాద పరిష్కారానికి ఉత్తమ మార్గం, అసలు వివాదం తలెత్తకుండా చూడడమే. ఇతరులను, వారి అభిప్రాయాలను గౌరవించండి. అంటే, ముఖ్యంగా వివాదంలో ఉన్న పేజీలో మార్పుచేర్పులను వెనక్కు తీసుకెళ్ళకండి. ఏదైనా దిద్దుబాటు పక్షపాతంగానో, అనుచితంగానో ఉందని మీకు అనిపిస్తే, దాన్ని మెరుగు పరచండి; వెనక్కి తీసుకుపోవద్దు. ఇతర సభ్యులు అభ్యంతరం చెబుతారనుకున్న దిద్దుబాట్లకు సముచితమైన దిద్దుబాటు సారాంశాన్ని రాయండి".

ఈ నిబంధనను రంగారావు గారు అతిక్రమించారు. అందుకనె, నేను మీ దృష్టికి తీసుకుని వచ్చాను. అదే నిబంధనలో ఈ విధంగా కూడా ఉన్నది "అనుచితమైన ప్రవర్తనను గమనించినపుడు మీరూ అదే పద్ధతిలో స్పందించకండి". అందుకని, నేను మళ్ళీ ఆయన చేసిన దిద్దుబాటును, సవరంచలేదు, గమనించగలరు.

కాబట్టి, దయచేసి,ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించగలరు, తద్వారా మళ్ళీ వికీలో నా ఉత్సాహాన్ని పునరుద్ధరించగలరు.--SIVA 00:11, 19 ఏప్రిల్ 2008 (UTC)Reply

నా జవాబు మార్చు

ధన్యవాదములు సత్యా గారూ. నా ఉద్దేశ్యం, ఎవరూ కూడాావతలి వారిని బాధ పెట్టే వ్యాఖ్యలు చెయ్యకూడదని. నలుగురూ కూడి చెయ్యవలసిన పని ఇది. చివరకు అందరికి అమోదయోగ్యమయినది నిలుస్తుంది. మార్పు చేసినవాళ్ళమీద దురుసుగా వ్యాఖ్యలు చెయ్యటం తగదు అన్న విషయం సభ్యుడి/ల కు తెలియాలి. నేనుకూడా అంత కటువుగా జవాబు వ్రాస్తే బాగుండదుకదా! అందుకనే నేను ఈ విషయం ఇతర సభ్యులకు తెలియచేసినది. కాసు బాబు గారు మధ్యవర్తిత్వం నాకు సమ్మతమే. ఈ సంఘటన పర్యవసానం మాత్రం, ఎవరినే కించపరచకుండా ఉండాలి.రచనలు చేసే సభ్యులు, ఇతర సభ్యులు చేసే మార్పులను గౌరవించగలగాలి, అవసరమయితే చర్చ చెయ్యాలి, వ్యాఖ్యలకు చోటు ఉండకూడదు అని నా అభిప్రాయమం --SIVA 19:45, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply

శివరామ ప్రసాద్ గారూ! వైజాసత్య గారి అభిప్రాయాన్నే నేనూ మరోసారి చెప్పుతున్నాను. వివాదాన్ని పరిష్కరించుకుందాం. δευ దేవా 21:13, 15 ఏప్రిల్ 2008 (UTC)Reply

శివా! విభేదించడం, ఖండించడం, ఫిర్యాదు చేయడం మీ హక్కు. కాని మనస్తాపం వలదు. అది వ్యక్తిగతం అవుతుంది. ఈ విషయాన్ని మరింత పరిశీలిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:52, 16 ఏప్రిల్ 2008 (UTC)Reply

అసలు మీరు కాసుబాబు గారికి "ఫిర్యాదు" ఎందుకు చేసారు? డైరెక్టుగా రంగారావు గారుతో మాట్లాడచ్చు కదా. మీరు ఒక సారి చెప్పి చూసారు. ఆయన వినలేదు. మీరు తప్పు కదని మీకు తెలిసినప్పుడు ఎందుకు మనస్తాపం చెందాలి? మీరు గనక ఏ పాలసీకీ వ్యతిరేకంగా మార్పులు చేయనప్పుడు ఇతరులు దాని revert చేస్తే మీరు దాన్ని తిరిగి revert చేసే హక్కు ఉంది. వికీపీడియా ఎవరిదీ కాదు. ఇది అందరిదీ. ఎవరో ఒకరు చెప్పినట్టు మనము చేయనక్కర లేదు. ధైర్యాంగా మీకు నచ్చినట్లు ఆ పేజి ని మార్చండి. సాయీ(చర్చ) 06:05, 16 ఏప్రిల్ 2008 (UTC)Reply

ధన్యవాదములు సాయీగారూ.వారు వ్రాసిన వ్యాఖ్య చూసి వెంటనే, వారు ఏకారణాన అటువంటి వ్యాఖ్య వ్రాశారు అని చర్చా పుటలో వ్రాసాను, కాని సమాధానం లేదు నా ఉద్దేశ్యం, ఎవరూ కూడా ఆవతలి వారిని బాధ పెట్టే వ్యాఖ్యలు చెయ్యకూడదని. నలుగురూ కూడి చెయ్యవలసిన పని ఇది. చివరకు అందరికి అమోదయోగ్యమయినది నిలుస్తుంది. మార్పు చేసినవాళ్ళమీద దురుసుగా వ్యాఖ్యలు చెయ్యటం తగదు అన్న విషయం సభ్యుడి/ల కు తెలియాలి. నేనుకూడా అంత కటువుగా జవాబు వ్రాస్తే బాగుండదుకదా! అందుకనే నేను ఈ విషయం ఇతర సభ్యులకు తెలియచేసినది. ఈ సంఘటన పర్యవసానం మాత్రం, ఎవరినే కించపరచకుండా ఉండాలి.రచనలు చేసే సభ్యులు, ఇతర సభ్యులు చేసే మార్పులను గౌరవించగలగాలి, అవసరమయితే చర్చ చెయ్యాలి, వ్యాఖ్యలకు చోటు ఉండకూడదు అని నా అభిప్రాయం.నేను అనేక వ్యాసాలకు మార్పులు చేసాను. చందమామ వ్యాసాన్ని మరింత సమాచారముతో నింపాను,రచయిత చలం మీద వ్యాసాన్ని విస్తరించాను. అక్కడాకూడా, ఎవరూ నా మార్పులుల మీద ఇలా దురుసుగా వ్యాఖ్యానించలేదు.--SIVA 19:59, 17 ఏప్రిల్ 2008 (UTC)

ఈ వారం సమైక్య కృషి మార్చు

శివ గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply

శివ గారూ! మీరు ప్రస్తుతము మూస:ఈ వారము సమైక్య కృషిలో ఉన్న వ్యాసాల అభివృద్ధికి తోడ్పడండి. మీరు ఇంకా మిగతా మీకు నచ్చిన వాసాలపై కూడా పని చేయవచ్చును. తెలుగు వికీపీడియాలో చేయడానికి బోలెడంత పని ఉంది. మీకు తోచిన విధంగా మీరు సహకరించవచ్చు.δευ దేవా 17:13, 21 ఏప్రిల్ 2008 (UTC)Reply

నా స్పందన మార్చు

దేవ్ గారూ!నమస్తే. నేను వికీపీడియాలోకి వచ్చి మహా అయితే ఒక నెల, నెలన్నర అయి ఉండవచ్చు. కొన్ని కొన్ని పదజాలాలు, ఇంకా కొత్త. "మొలకలు" అంటే కొత్తగా మొదలు పెట్టి ఇంకా పూర్తిగాని వ్యాసాలా? దయచేసి వివరించగలరు, లేదా ఈవిషయం గురించి పూర్తి సమాచాం ఉన్న లింక్ తెలియచేయగలరు. వికిలొ వ్యాసాల నాణ్యత పెంచటానికి, వికీ, ఇంటర్-నెట్ లో ఓక ప్రమాణపూర్వకమయిన, నిర్దిష్ట సమాచారం ఇవ్వగలిగే ఒక "మూలం" గా రూపొందాలని నా ఆకాంక్ష. తెలుగునాట ఎవరయినా తమకు తెలియని విషయం మీద సమాచారంకొరకు వెదుకులాడుతుంటే, వికి ఒక ప్రధాన సమాచార మూలంకావాలి, లేదా ఎవరయినా ఒక విషయం మీద తర్జన భర్జన పడుతుంటే, ఒక వివాద పరిష్కార సాధనం కావాలి. ఈ విధంగా చేసే కృషిలో/ ప్రయత్నంలో నే చెయ్యవలసిన పని గురించి ఏ మాత్రం సంకోచించకుండా, పని అప్పగించండి,నాకు చాతనయినంతవరకు తప్పకుండా అటువంటి పని సాధ్యమయినంత త్వరగా పూర్తి చెయ్యగలను. ఇంకా కొత్త కావటంవలన నా అంతటనేను వ్యాసాలు వ్రాయటం/దిద్దటం మాత్రం ఉత్సాహంగా చేస్తున్నాను. సమైక్య క్రుషిలో కూడ పాలు పంచుకోవాలని నాకు చాలా ఉత్సాహం ఉన్నది.--SIVA 02:39, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

శివగారూ, మీ ఉత్సాహం అందరినీ పరుగులెత్తిస్తుంది. మొలకలంటే ఎక్కువ సమాచారంలేని చిన్నవ్యాసాలు. మరింత సమాచారం కొరకు వికీపీడియా:మొలక చదవండి. --వైజాసత్య 03:16, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఇప్పుడే(18 04 2008SIVA 04:09, 18 ఏప్రిల్ 2008 (UTC))వైజా సత్యగారు ఈవిష్యం మీద లింక్ పంపించారు. విషయం అర్థమయింది. మొలకల విషయంలో నా ఉద్దేశ్యం::Reply

  • మొలకలను 1 నుండి 250, 250 నుండి 500 ఇలా ఉత్సుకత చూపిన సభ్యులకు పంపిణీ చేసి, ఆ సభ్యులను ఆ మొలకల విషయంలో ఒక నిర్దిష్ట భవిస్య కార్యక్రమాన్ని ప్రదిపాదించవలసినదిగా కోరాలి
  • ఈ ప్రతిపాదనలను ఒక ప్రత్యేక పుట ను తయారు చేసి (మొలకల వర్గీకరణ వంటి పేరుతో)అందులో పొందుపరచాలి, మొలకలను తొలగించటం, ఆ విషయం మీద ఇప్పటీకే ఉన్న వ్యాసంతో విలీనం చెయ్యటం వంటి ప్రదిపాదనలను చెయ్యచ్చు.అలా ప్రతిపాదించేటప్పుడు, ఈ పనికి ప్రత్యేకించబడిన సభ్యులు, ఆ మొలక లింక్ ఆ పుటలో తప్పనిసరిగా ఇవ్వాలి.
  • ఇలా చెయ్యబడ్డ ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్య తీసుకోవటానికి ఇద్దరు ముగ్గురు సీనియర్ వికీ సభ్యులు కలసి వారానికి ఒకసారి నిర్ణయం ప్రకటీంచాలి.
  • అటువంటి నిర్ణయం, మొలకలను ఏర్పరిచిన సభ్యునికి తెలియచెయ్యాలి, ఒక మూడు రోజుల వ్యవధి తరువాత, సీనియర్ల కమెటీ చేసిన ప్రకటన ప్రకారం మొదట, ఆ మొలకల మీద బవిష్య కార్యక్రమం ప్రతిపాదించిన సభ్యుడు చర్య తీసుకోవాలి.
  • మొలకల పరిశీలన, సభ్యులకు పంపిణీ చేశేటప్పుడె ఏంత సమయంలో ఆ పని చెయ్యాలి (15-20 రోజులు)తెలియచెయ్యాలి. ఆ సమయంలో ఆ పని జరగక పోతే మరొక 7 రోజుల వ్యవది ఇవ్వాలి. ఆప్పటికి, ఆ పని జరగకపొతే, మరొక సభ్యునికి పంపిణీ చెయ్యాలి
  • దీనికి సాఫ్ట్వేర్ లొ ఈక్రింది అవకాశాలు ఉంటే అంతయినా ఉపకరిస్తుంది:
  • మొలక ఏర్పరిచిన సభ్యునికి, అతను లాగ్ ఇన్ అయిన ప్రతిసారి, అతను ఏర్పరిచిన మొలకలగురించి ఒక రిమైండరు అటోమాటిక్ గా
  • భవిష్య కార్యక్రమం ప్రత్యేక పుటలో వ్రాయగానే, ఆ మొలక ఏర్పరిచిన సభ్యునికి, ఆ ప్రతిపాదన అతను లాగ్ ఇన్ అయిన వెంటనే అటోమాటిక్ గా సందేశం
  • మొలకలగురించి బాధ్యత అప్పగించబడిన సభ్యునికి, అతను ఇంకా భవిష్య కార్యక్రమం చెయ్యని మొలకల సంఖ్య, తదుపరి చర్య తీసుకొని మొలకల సంఖ్య సందేశంగా అతను లాగ్ ఇన్ అయిన వెంటనే రావటం.

ఈ విధమయిన కార్యాచరణ మనం ఆచరించగలిగితే, మొలకల సంఖ్య గణనీయంగా తగ్గించి, వ్యాసాల సంఖ్యను పెంచవచ్చును. పరిశీలించి తెలియచెయ్యగలరు.--SIVA 04:09, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

మరొక ప్రతిపాదన మార్చు

మొలకల జాబితా పర్శీలించిన మీదట, నాకు అనిపిస్తున్నది ఏమంటే, జాబితాలో ఎక్కువ భాగం "సామెతలు" మరియి "గ్రామాలు"

సామెతలుసామన్యంగా సామెత చూడగానే అర్థం స్పురిస్తుంది. చాలా కొద్ది సామెతలకు వివరణ ఇవ్వవలసి వస్తుంది. అటువంటి వివరణ అవసరమయిన కొద్ది సామెతలకు మొలక టాగ్ ఉంచి, మిగిలిన సామెతలకు మొలక టాగ్ తొలగించవచ్చు. ఎవరయినా సభ్యులు ఏదయినా మొలక టాగ్ లేని సామెత విస్తరించదలిస్తే మంచిదే. కాని, వివరణ అవసరమయిన సామెతల మీద ఎక్కువ కేద్రీకరణ జరిగితె బాగుంటుంది.

గ్రామాలుసామాన్యంగా, ఆ గ్రామాల్లో ఉన్నవారుగాని, ఇరుగు పొరుగు గ్రామంవారుకాని, వికీ సభ్యులయినప్పుడు, ఆ గ్రామ వ్యాసం విస్త్రణ జరుగుతుంది. మనం పుట్టిన గ్రామం, తండ్రిగారి/తల్లిగారి/అత్తవారి గ్రామం/చదువుకున్న గ్రామం/ఉద్యోగం చేసిన గ్రామం గురించి ప్రతి సభ్యుడూ వ్రాస్తే చాలా గ్రామాల వ్యాస విస్తరణ జరుగుతుంది.ఈ విషయం ప్రతి వారం పది రోజులకు, సభ్యులందరికీ రిమైండు చెయ్యటం,మొదటి పేజీలో ప్రత్యేక ప్రకటన కొంత ఉపకరించవచ్చు. గ్రామ వ్యాస విస్తరణ అంత సులభం కాదు. పైన చెప్పినట్లుగా, ఆ గ్రామానికి సంబధించిన వారు గనక వ్రాస్తే వ్యాసం సమతూకంగా వస్తుందని నా అభిప్రాయం. కనుక, గ్రామ వ్యాసాలకు "మొలక" స్తాయి తీసివేసి,అప్పుడప్పడూ సభ్యులకు సందేశాలు/ప్రకటనల ద్వార కావలిసిన పని జరిగేటట్లు వేయవచ్చు.

పైన చెప్పిన రెండు పనులవల్ల, మొలకలలో ఉన్న ఇతర విషయాలమీద దృష్టి కేద్రీకరింవచ్చు అని నా ఉద్దేశ్యం.--SIVA 05:02, 18 ఏప్రిల్ 2008 (UTC) శివ గారూ! మీరు చేసిన ప్రతిపాదనలన్నీ సరైనవే! వ్యాసాల అభివృద్ది అనేది నెమ్మదిగానే మొదలవుతుంది. తెలుగు వికీ తెలుగు వారందరికీ ఖచ్చితంగా మొదటి రిఫరెన్సుగా కాగలదని నా నమ్మకం.δευ దేవా 08:03, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

బొమ్మ:HAM RADIO MAGAZINE.jpg గురించి మార్చు

ఈ బొమ్మ యొక పేజీలో ఉన్న సారాంశంలో "THIS PICTURE IS THE COVER PAGE OF A MAGAZINE" అని రాశారు. దానికి బదులుగా అది ఏ పత్రిక నుండి సేకరించారో, స్పష్టంగా పేర్కొనండి. అలాగే మీరు సేకరించిన పత్రిక ప్రతి తేదీని కూడా ఈ సారాంశంలో పేర్కొనండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:28, 19 ఏప్రిల్ 2008 (UTC)Reply

పత్రిక పేరే Ham Radio Magazine. సాయీ(చర్చ) 07:25, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply

తెవికీ పాలసీలపై ఒక చర్చ మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:04, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఏకవచన ప్రయోగం మార్చు

తెలుగు వికీపీడియాలో ఇదివరకే ఒకసారి ఏకవచన ప్రయోగం మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ చర్చ ఫలితమే వికీపీడియా:ఏకవచన ప్రయోగం అనే పేజీ. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:16, 1 మే 2008 (UTC)Reply

బేతాళ కథలు మార్చు

ప్రసాదు గారూ, బేతాళ కథలు వ్యాసంలో మంచి కృషి చేసారు. అలాగే ఎస్వీయార్ వ్యాసంలో కూడా. అభినందనలు. __చదువరి (చర్చరచనలు) 17:40, 4 మే 2008 (UTC)Reply

ధన్యవాదములు చదువరి గారూ. చందమామ నా అభిమాన పత్రిక (ఇప్పటికి కూడా). ఆందువలన, వికీలోకి రాగానే ముందు చందమామ వ్యాసానికి మెరుగులు దిద్దటం మొదలు పెట్టాను. ఆ వరుసలో బేతాళ కథలు ప్రత్యేక వ్యాసం వ్రాయాలనిపించింది. సమయానికి నా దగ్గర ఉన్న పాత చందమామ పుస్తకాలలోని బొమ్మలు, మొదటి బేతాళ కథలు పనికి వచ్చాయి. ఇంతకన్న పెద్ద కృషి అని ఏమీ లేదు.

ఎస్వీర్ రచన నాది కాదండి. అది రంగారావుగారు వ్రాశారు. నేను కొన్ని మార్పులు చేశాను అవి ఆయనకు నచ్చలేదు. మళ్ళీ మార్చి మెరుగులు దిద్దటానికి మూడ్(మనసు) రావటం లేదు(ఎస్వీర్ చర్చా పేజీ చూడండి). త్వరలో ఎస్వీర్ గురించి సమగ్ర సమాచారం సేకరించి మెరుగులు దిద్దాలని ఉంది మరి.--SIVA 16:54, 6 మే 2008 (UTC)Reply

మీ ఊరి వ్యాసం మార్చు

మీ ఊరి వ్యాసం అందమైన బొమ్మలతో చాలా అందంగా అలంకరించారండీ. దానికి తగ్గట్లుగా కొంచెం సమాచారం(గ్రామ చరిత్ర, గ్రామ ప్రజల ఆదాయ వనరులు,గ్రామంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు మొదలైనవి) కూడా ఎక్కువగా ఉంటే మరింత ఆకర్షణీయమైన వ్యాసంగా తయారవుతుంది. రవిచంద్ర(చర్చ) 06:54, 11 మే 2008 (UTC)Reply

మీ మంచి వాఖ్యలకు ధన్యవాదాలు. వెన్నూతల గురించి మరింత సమాచార సేకరణకొరకు ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు ఆయన చిన్నతనంలో ఆ ఊరు వదలిన తరువాత(దాదాపు 70 సంవత్సరాల క్రితం) నేను 4-5 సార్లు మాత్రమే అక్కడకు వెళ్ళగలిగాను. త్వరలో మరిం త సమాచారం పొందుపరచటానికి ప్రయత్నిస్తున్నాను.--SIVA 09:47, 11 మే 2008 (UTC)Reply
Return to the user page of "Vu3ktb/పాతచర్చలు 3".