వారణాసిలో స్నానఘట్టాలు
వారణాసిలోని స్నానఘట్టాలు (ఘాట్) గంగా నది ఒడ్డున ప్రజలు స్నానాలు చేసేందుకు వీలుగా కట్టించిన నదీతీర మెట్లు. నగరంలో 84 ఘాట్‌లు ఉన్నాయి. చాలా ఘాట్‌లు స్నానాలు, పూజా ఘాట్లు కాగా, మణికర్ణిక, హరిశ్చంద్ర అనే రెండు ఘాట్‌ల వద్ద ప్రత్యేకంగా దహన సంస్కారాలు చేస్తారు.[1]
వారణాసిలోని చాలా ఘాట్‌లు 18వ శతాబ్దంలో మరాఠాలు పునర్నిర్మించారు. ప్రస్తుత ఘాట్‌ల పోషకులు మరాఠాలు, షిండేలు (సింధియాలు), హోల్కార్లు, భోంస్లేలు, పేష్వాలు, బెనారస్ మహారాజులు. అనేక ఘాట్‌లకు ఇతిహాసాలు, పురాణాలతో సంబంధం ఉంది. మరొ కొన్నిటికి ప్రైవేట్ చరిత్రలు, వినియోగదారులూ ఉంటారు. ఘాట్‌ల వెంట గంగానదిలో ఉదయం పూట పడవ ప్రయాణం సందర్శకులను ఆకర్షిస్తుంది.
ఘాట్‌ల జాబితా
మార్చుఈ ఘాట్‌లను, అస్సి ఘాట్ నుండి ఆది కేశవ ఘాట్ వరకు వాటి స్థానం ప్రకారం ఇచ్చిన సంఖ్యల ఆరోహణ క్రమంలో, ఈ జాబితాలో చూడవచ్చు:
మొదటి భాగం: అస్సీ ఘాట్ నుండి దశాశ్వమేధ ఘాట్ వరకు (1–41)
సంఖ్య. | పేరు | బొమ్మ |
---|---|---|
1 | అస్సీ ఘాట్ | |
2 | గంగా మహల్ ఘాట్ | |
3 | లస్సీ ఘాట్ | |
4 | తులసీ ఘాట్ | |
5 | భదైనీ ఘాట్ | |
6 | జానకీ ఘాట్ | |
7 | మాతా ఆనందమాయి ఘాట్ | |
8 | వచ్చరాజా ఘాట్ | |
9 | జైన్ ఘాట్ | |
10 | నిషాద్ ఘాట్ | |
11 | ప్రభు ఘాట్ | |
12 | పంచ్‌కోట ఘాట్ | |
13 | చేత్ సింగ్ ఘాట్ | |
14 | నిరంజని ఘాట్ | |
15 | మహానిర్వాణి ఘాట్ | not available |
16 | శివాలా ఘాట్ | |
17 | గులేరియా ఘాట్ | |
18 | దండీ ఘాట్ | |
19 | హనుమాన్ ఘాట్ | not available |
20 | ప్రాచీన హనుమాన్ ఘాట్ | |
21 | కర్ణాటక ఘాట్ | |
22 | హరిశ్చంద్ర ఘాట్ | |
23 | లాలీ ఘాట్ | |
24 | విజయనగరం ఘాట్ | |
25 | కేదార్ ఘాట్ | |
26 | చౌకీ ఘాట్ | |
27 | క్షేమేశ్వర/సోమేశ్వర ఘాట్ | |
28 | మానసరోవర్ ఘాట్ | |
29 | నారద ఘాట్ | |
30 | రాజా ఘాట్ | |
31 | ఖోరీ ఘాట్ | not available |
32 | పాండే ఘాట్ | |
33 | సర్వేశ్వర ఘాట్ | not available |
34 | దిగ్పతియా ఘాట్ | |
35 | చౌసత్తి ఘాట్ | |
36 | రాణామహల్ ఘాట్ | |
37 | దర్భంగా ఘాట్ | |
38 | మున్షీ ఘాట్ | |
39 | అహిల్యాబాయి ఘాట్ | |
40 | శితలా ఘాట్ | |
41 | దశాశ్వమేధ ఘాట్ |
రెండవ భాగం: ప్రయాగ నుండి ఆది కేశవ ఘాట్ వరకు (42–84)
. లేదు. | పేరు. | చిత్రం |
---|---|---|
42 | ప్రయాగ్ ఘాట్ | |
43 | రాజేంద్ర ప్రసాద్ ఘాట్ | .. |
44 | మాన్ మందిర్ ఘాట్ | |
45 | త్రిపుర భైరవి ఘాట్ | |
46 | మీర్ (మీర్ ఘాట్) | |
47 | ఫుటా/నయా ఘాట్ | యజ్ఞేశ్వర ఘాట్ పాత ప్రదేశం |
48 | నేపాలీ ఘాట్ | |
49 | లలితా ఘాట్ | |
50 | బౌలి/ఉమరోగిరి/అమ్రోహా ఘాట్ | |
51 | జలసేన్ (జలసాయీ ఘాట్) | |
52 | ఖిర్కి గేట్ | |
53 | మణికర్ణిక ఘాట్ | |
54 | బాజీరావ్ ఘాట్ | |
55 | సింధియా ఘాట్ | |
56 | సంకటా ఘాట్ | |
57 | గంగా మహల్ ఘాట్ (II) | |
58 | భోంస్లే ఘాట్ | |
59 | నయా ఘాట్ | 1822 నాటి ప్రిన్సెప్ మ్యాప్లో దీనికి గులారియా ఘాట్ అని పేరు పెట్టారు. |
60 | గణేశ ఘాట్ | |
61 | మెహతా ఘాట్ | అధికారికంగా ఇది గణేశ ఘాట్లో భాగంగా ఉండేది, కానీ V.S.Mehta ఆసుపత్రి (1962) నిర్మాణం తరువాత దీనికి ఈ పేరు వచ్చింది |
62 | రామ ఘాట్ | |
63 | జటారా ఘాట్ | |
64 | రాజా గ్వాలియర్ ఘాట్ | |
65 | మంగళ గౌరీ ఘాట్ (బాల ఘాట్ అని కూడా పిలుస్తారు) | |
66 | వేణుమాధవ ఘాట్ | పంచగంగా ఘాట్ లో భాగం. దీనిని బిందు మాధవ ఘాట్ అని కూడా పిలుస్తారు |
67 | పంచగంగా ఘాట్ | |
68 | దుర్గా ఘాట్ | |
69 | బ్రహ్మ ఘాట్ | |
70 | బుంది పరకోటా ఘాట్ | |
71 | (ఆది శీతలా ఘాట్ | ఇది మునుపటి ఘాట్లో విస్తరించిన భాగం |
72 | లాల్ ఘాట్ | |
73 | హనుమాన్ గర్ధి ఘాట్ | |
74 | గయా/గై ఘాట్ | |
75 | బద్రీ నారాయణ్ ఘాట్ | |
76 | త్రిలోచన్ ఘాట్ | |
77 | గోలా ఘాట్ | 12 వ శతాబ్దం చివరి నుండి ఈ ప్రదేశాన్ని పడవల రేవుగా ఉపయోగించేవారు. ఇది ధాన్యాగారాలకు కూడా ప్రసిద్ధి చెందింది |
78 | నందేశ్వర/నందు ఘాట్ | |
79 | సక్కా ఘాట్ | |
80 | తెలియానాలా ఘాట్ | |
81 | నయా/ఫుటా ఘాట్ | 18వ శతాబ్దంలో ఘాట్ ప్రాంతం నిర్జనంగా మారింది (ఫుటా) కానీ తరువాత దానిని పునరుద్ధరించారు. ఈ విధంగా ఘాట్ను గతంలో ఫుటా అని, తరువాత నయా అని పిలిచేవారు. |
82 | ప్రహ్లాద్ ఘాట్ | |
83 | రాజా ఘాట్ (భైససూర్ రాజ్ఘాట్/లార్డ్ డఫరిన్ వంతెన/మాలవీయ వంతెన | |
84 | ఆది కేశవ ఘాట్ | |
సంత్ రవిదాస్ ఘాట్ | ||
నిషాద్ ఘాట్ (ప్రహ్లాద్ నుండి విభజించబడింది) | ||
రాణి ఘాట్ | ||
శ్రీ పంచ అగ్ని అఖాడా ఘాట్ | ||
తథాగత్ ఘాట్/బుద్ధ ఘాట్ |
ప్రసిద్ధ ఘాట్లు
మార్చుపురాణ మూలాల ప్రకారం, నదీతీరంలో ఐదు ముఖ్యమైన ఘాట్‌లు ఉన్నాయి. అవి పవిత్ర కాశీ నగరానికి గుర్తింపు తెచ్చాయి. అవి: అస్సి ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్, పంచగంగ ఘాట్, రాజేంద్ర ప్రసాద్ ఘాట్, ఆది కేశవ ఘాట్.[2]
అస్సీ ఘాట్
మార్చువర్తమాన కాలంలో ఎండిపోయిన అసి నది, ఒకప్పుడు గంగానదిలో కలిసే సంగమం వద్ద ఉండే ఘాట్, అస్సీ ఘాట్. నగరానికి ఒకప్పటి దక్షిణ సరిహద్దు ఇది. ఘాట్ వద్ద ఉన్న అసిసంగమేశ్వరాలయం ప్రస్తావన స్కందమహాపురాణంలోని కాశీ ఖండంలో ఉంది. విశాలమైన వీధులు ఉన్న అతి కొద్ది ఘాట్‌లలో ఇది ఒకటి. అందుచేత ఈ ఘాట్ చాలా ప్రసిద్ధి చెందింది. బనారస్ హిందూ యూనివర్శిటీకి దగ్గరగా ఉన్న ప్రధాన ఘాట్ కూడా ఇది. ఈ ప్రదేశంలో రెండు లింగాలను పూజిస్తారు. కొన్ని పురాణాలలో, దుర్గాదేవి ఇద్దరు అసురులైన శుంభ నిశుంబలను ఓడించిన ప్రదేశం అస్సీ ఘాట్ అని నమ్ముతారు.తులసీదాస్ రామచరితమానస్ పూర్తి చేసిన ప్రదేశం కూడా అస్సీ ఘాటే.[3] ప్రధానమంత్రి నరేంద్రమోడీ, 2015 సెప్టెంబరు 17 న తన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వాటర్ ATMని ప్రారంభించాడు.[4]
దశాశ్వమేధ ఘాట్
మార్చు- ↑ Rob Bowden (2003), The Ganges, ISBN 978-0739860700, Heinemann
- ↑ Shankar, Hari (1996). Kashi ke Ghat (1 ed.). Varanasi: Vishwvidyalaya Prakashan.
- ↑ Warrier, Shrikala (2014). Kamandalu : the seven sacred rivers of Hinduism. London: Mayur University London. p. 59.
- ↑ Mishra, Rajnish (2017). Ghats of Varanasi (1 ed.). New Delhi. p. 51. ISBN 978-1521414323.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link)
దశాశ్వమేధ ఘాట్ కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో ఉంది. ఇది అత్యంత ప్రసిద్ధి గాంచిన ఘాట్.[1] పురాణాల ప్రకారం, బ్రహ్మ ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసాడు.[2] ప్రతి సాయంత్రం ఈ ఘాట్ వద్ద శివుడు, గంగ, సూర్యుడు, అగ్నిలకీ, అలాగే విశ్వం మొత్తానికి హారతి ఇస్తారు.[2]
మణికర్ణికా ఘాట్
మార్చు- ↑ Diana Eck, Banaras - City of Light, ISBN 978-0231114479, Columbia University Press
- ↑ 2.0 2.1 Warrier, Shrikala (2014). Kamandalu : the seven sacred rivers of Hinduism. London: Mayur University London. p. 59.
దహన సంస్కారాలు జరిగే ఘాట్‌లలో మణికర్ణిక ఒకటి.[1] మణికర్ణికా ఘాట్‌కు సంబంధించి రెండు పురాణగాథలు ఉన్నాయి.[2] ఒకదాని ప్రకారం, విష్ణువు తన చక్రాన్ని ఉపయోగించి ఒక గొయ్యి త్రవ్వి, అక్కడ తపస్సు చేస్తూ తన చెమటతో దాన్ని నింపాడు. విష్ణుమూర్తిని చూస్తున్న శివుని చెవిపోగు (మణికర్ణిక) ఒకటి ఆ గోతిలో పడింది. రెండవ పురాణం ప్రకారం, శివుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటించకుండా ఉండటానికి పార్వతి తన చెవిపోగులను ఈ ప్రదేశంలో దాచి, గంగానది ఒడ్డున తన చెవిపోగులు పోయాయని చెప్పింది. మణికర్ణిక ఘాట్ వద్ద మానవ దేహం దహనమైనపుడు శివుడు ఆ ఆత్మను, నీకు చెవిపోగులు కనబడ్డాయా అని అడుగుతాడు.[1]
రాజ్ ఘాట్
మార్చుకాశీ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఈ ఘాట్ వారణాసిలోని ప్రసిద్ధ ఘాట్‌లలో ఒకటి. ఇది రాజ్ ఘాట్ వంతెనకు ఆనుకుని ఉంది. ప్రసిద్ధ రవిదాస్ దేవాలయం ఈ ఘాట్ మీద ఉంది. ఇది పిండప్రదానాలకు, అస్థికల నిమజ్జనాలకూ ప్రసిద్ధి చెందింది. ఘాట్‌ను వివిధ రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు, పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కాశీలోని ఇరుకైన మార్గాల్లో నడవలేని వికలాంగులకు ఈ ఘాట్ వీలుగా ఉంటుంది. కార్లు, బైకులపై ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
సింధియా ఘాట్
మార్చుషిండే ఘాట్ అని కూడా పిలువబడే సింధియా ఘాట్ ఉత్తరాన మణికర్ణిక ఘాట్‌ను ఆనుకుని ఉంది. సుమారు 150 సంవత్సరాల క్రితం ఘాట్ నిర్మాణం జరిగినపుడు దాని బరువు ఎక్కువై ఇక్కడి శివాలయం నేలలో దిగబడి పోయి, నదిలో పాక్షికంగా మునిగిపోయింది. ఈ ఘాట్ పైన, అనేక గుడులు ఉన్నాయి. అగ్ని దేవుడు ఇక్కడ జన్మించాడని భావిస్తారు. భక్తులు పుత్రుని కోసం ఇక్కడి వీరేశ్వరుడిని పూజిస్తారు.
మన-మందిర్ ఘాట్
మార్చుమన-మందిర్ ఘాట్: జంతర్ మంతర్ నిర్మించిన జైపూర్ మహారాజా జై సింగ్ II 1770లో ఈ ఘాట్‌ను నిర్మించాడు. ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని, మథురలో ఉన్నట్లుగా ఇక్కడ కూడా అందమైన కిటికీలు ఉన్నాయి. ఘాట్ ఉత్తర భాగంలో చక్కటి రాతి బాల్కనీ ఉంది. భక్తులు ఇక్కడి సోమేశ్వర లింగానికి పూజలు చేస్తారు.
లలితా ఘాట్
మార్చులలితా ఘాట్ : నేపాల్ దివంగత రాజు వారణాసి ఉత్తర ప్రాంతంలో ఈ ఘాట్‌ను నిర్మించాడు. ఇది గంగా కేశవ దేవాలయం, విలక్షణమైన ఖాట్మండూ శైలిలో నిర్మించిన చెక్క ఆలయం, ఈ ఆలయంలో శివుని స్వరూపమైన పశుపతేశ్వరుని చిత్రం ఉంది.
జైన్ ఘాట్ లేదా బచ్రాజ్ ఘాట్
మార్చుజైన ఘాట్ లేదా బచ్రాజ్ ఘాట్ ఒక జైన ఘాట్. నది ఒడ్డున మూడు జైన దేవాలయాలు ఉన్నాయి. జైన మహారాజులు ఈ ఘాట్‌ల యజమానులని భావిస్తారు. బచ్‌రాజ్ ఘాట్‌లో నది ఒడ్డున మూడు జైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చాలా పురాతనమైన తీర్థంకర సుపార్శ్వనాథ్ ఆలయం.
తథాగత ఘాట్ లేదా బుద్ధ ఘాట్
మార్చుతథాగత ఘాట్ వారణాసిలోని సరాయ్ మోహనలో ఉన్న ప్రసిద్ధ ఘాట్. సరాయ్ మోహన సారనాథ్ సమీపంలో ఉంది. తథాగత బుద్ధుడు తన ఐదుగురు శిష్యులకు మొదటి ఉపదేశం ఇచ్చిన ప్రదేశం, సారనాథ్. ఈ ఘాట్‌కి గౌతమ బుద్ధుని పేరు పెట్టారు. "తథాగత" అనే పదం గౌతమ బుద్ధునికి పర్యాయపదం కాబట్టి దీనిని బుద్ధ ఘాట్ అని కూడా అంటారు. బౌద్ధులు ఈ ఘాట్‌లను ఉపయోగించేవారని నమ్ముతారు. ఘాట్ ఆవరణలో తథాగత బుద్ధ (భగవాన్) విగ్రహం ఒకటి ఉంది.
ఇతరత్రా
మార్చు- మాన్-సరోవర్ ఘాట్‌ను అంబర్‌కు చెందిన మాన్ సింగ్ నిర్మించాడు.
- దర్భంగా ఘాట్‌ను దర్భంగా మహారాజు నిర్మించాడు
- తులసీదాస్ తులసీ ఘాట్ వద్ద రామచరితమానస్ రచించాడు.
- చైత్ సింగ్ ఘాట్‌లో ఒక అద్భుతమైన కోట లాంటి రాజభవనం ఉంది. దీనికి చైత్ సింగ్ పేరు పెట్టారు. ఈ ఘాట్ అసలు పేరు శివలా ఘాట్ అయినప్పటికీ బ్రిటిషు వారిపై అతని తిరుగుబాటు జ్ఞాపకార్థం దీనిని చైత్ సింగ్ ఘాట్ అని పిలుస్తారు.
- కొంకణి మాట్లాడే గౌడ సరస్వత బ్రాహ్మణుల ఆధ్యాత్మిక పాఠశాలైన శ్రీ కాశీ మఠం సంస్థాన్ ప్రధాన కార్యాలయం బ్రహ్మ ఘాట్‌లో ఉంది.
- బరోడా రాజు నిర్మించిన సంకట ఘాట్ వద్ద సంకట దేవి మందిర్ ఉన్నది
ఘాట్‌లపై దహన సంస్కారాలు
మార్చుహిందూ సంప్రదాయంలో, దహన సంస్కారాలు అంతిమ మార్గానికి సంబంధించిన ఆచారాలలో ఒకటి.[3] వారణాసి ఘాట్‌లు ఈ ఆచారానికి అనుకూలమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడతాయి.[4][3] దహన సంస్కారాలు లేదా "చివరి కర్మలు" సమయంలో, పూజారులు పూజ చేస్తారు. పవిత్ర శ్లోకాలు మంత్రాలు పఠిస్తారు. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లలో దహన సంస్కారాలు జరుగుతాయి. ఏటా, 25,000 నుండి 30,000 మంది (రోజుకు సగటున 80) మృతదేహాలను వివిధ వారణాసి ఘాట్‌లపై దహనం చేస్తారు.
ఘాట్‌ల కాలుష్యం
మార్చువారణాసిలో దహన సంస్కారాలు నిర్వహించడం వల్ల గంగా నదికి పర్యావరణ కాలుష్యం కలగడం వివాదాస్పదంగా మారింది.[5] 1980వ దశకంలో, వారణాసి ఘాట్‌ల వెంబడి దహన సంస్కారాల వలన కలిగే నీటి కాలుష్యాన్ని, ఇతర సమస్యలనూ పరిష్కరించడానికి భారత ప్రభుత్వం క్లీన్ గంగా కార్యక్రమానికి నిధులు సమకూర్చింది. చాలా సందర్భాలలో, దహన సంస్కారాలు వేరే చోట చేసి, బూడిదను ఈ ఘాట్‌ల సమీపంలో నదిలో వెదజల్లుతారు.[6] నగర మునిసిపల్ వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీరు వారణాసి ఘాట్‌లకు సమీపంలో ఉన్న గంగానది కాలుష్యానికి అతిపెద్ద మూలం.[7][8]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Warrier, Shrikala (2014). Kamandalu : the seven sacred rivers of Hinduism. London: Mayur University London. p. 59.
- ↑ Varanasi Guru (5 September 2020). "Manikarnika Kund" – via Varanasi Guru.
- ↑ 3.0 3.1 McBride, Pete (7 August 2014). "The Pyres of Varanasi: Breaking the Cycle of Death and Rebirth". National Geographic. Washington, D.C.: National Geographic Society. ISSN 0027-9358. OCLC 643483454. Archived from the original on 25 April 2022. Retrieved 1 October 2022.
- ↑ Diana Eck, Banaras - City of Light, ISBN 978-0231114479, Columbia University Press
- ↑ S. Agarwal, Water pollution, ISBN 978-8176488327, APH Publishing
- ↑ Flood, Gavin: Rites of Passage, in Bowen, Paul (1998). Themes and issues in Hinduism. Cassell, London. ISBN 0-304-33851-6. pp. 270.
- ↑ O. Singh, Frontiers in Environmental Geography, ISBN 978-8170224624, pp 246-256
- ↑ "Ghats of Varanasi". Archived from the original on 5 October 2018. Retrieved 3 November 2017.