వికీపీడియా:ఇంగ్లీషు పేర్లతో దారిమార్పు పేజీల ఆవశ్యకత
ఏదైనా తెలుగు పదము లేక పదబంధంతో జాలాన్ని శోధిస్తే వచ్చే ఫలితాల్లో సాధారణంగా తెలుగు వికీపీడియా అన్నిటికన్నా ముందుంటుంది. ఆయా తెలుగు పదాలకు సంబంధించిన ఇంగ్లీషు పదాలతో ఒక దారిమార్పు పేజీని సృష్టిస్తే ఆయా ఇంగ్లీషు పదాల వెతుకులాట ఫలితాల్లో కూడా తెలుగు వికీపీడియా పేజీలు కనిపించే అవకాశం కలిగి, తద్వారా తెలుగు వికీపీడియా మరింతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కదా అనే భావన ఉంది. ఈ విషయమై తెలుగు వికీపీడియా వాడుకరుల మధ్య సహేతుకమైన భేదాభిప్రాయాలు కనిపించాయి. దీనిపై గతంలోనూ చర్చలు జరిగినప్పటికీ, ఒక విధానం రూపుదిద్దుకోకపోవడం వలన ఈ అంశం మళ్ళీ తలెత్తింది. ఈ విషయాన్ని చర్చించి ఒక విధానాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉందని భావించి ఈ చర్చాపేజీని తయారుచేసాం. ఇలాంటి విధాన నిర్ణయాల్లో ఓటింగు సంఖ్యకంటే కూడా హేతువు ముఖ్యం కాబట్టి, వాడుకరులు సింపులుగా ఓటింగుతో సరిపెట్టకుండా తమ అభిప్రాయాన్ని సవివరంగా రాయవలసినదిగా మనవి.
చర్చ ముగింపు తేదీ: 2017 అక్టోబరు 23
గతంలో జరిగిన చర్చలు
మార్చుదీనిపై గతంలో జరిగిన చర్చలు ఇవి:
- వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_25#వ్యాసాలకు ఆంగ్ల పేరులు మరియు వాటికి దారి మళ్లింపులు
- వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_32#తెలుగు వ్యాసాలకు ఆంగ్ల దారిమార్పులు రూపొందించేందుకు మరొక కారణం
ఇలాంటి చర్చలు మరిన్ని జరిగాయి. ఆయా లింకులను గమనించినవారు వాటిని కూడా ఇక్కడ చేర్చవలసినదిగా మనవి.
చర్చకు ఉపయోగకరంగా ఉండేందుకు కొంత సమాచారం
మార్చు- వివిధ భాషా వికీల్లో ఇంగ్లీషు పేజీల జాబితాల లింకులు ఇవి: తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, హిందీ
- ఇతర భాషా వికీల్లో దీనికి సంబంధించిన విధానం ఒకే విధంగా లేదు. బెంగాలీ, మలయాళం భాషల్లో చాలా ఎక్కువగా ఇలాంటి దారిమార్పు పేజీలున్నాయి (బెంగాలీలోనైతే ఒకే పేజీకి అనేక ఇంగ్లీషు దారిమార్పు పేజీలున్నాయి). హిందీలో అలాంటి పేజీలు కొద్దిగా ఉన్నాయి. తమిళంలో అసలు లేనట్లున్నాయి. కన్నడ మరాఠీల్లో కూడా దాదాపుగా లేనట్లే.
- ప్రస్తుతం వెతుకుపెట్టెలో ఇంగ్లీషులిపిలో టైపించినపుడు ఆటోమాటిగ్గా తెలుగులోకి లిప్యంతరీకరణ జరుగుతుంది. లాగిన్ కాని వాడుకరులకు కూడా ఇది లభ్యం.
- "Vijayawada" అనే పేరుతో "విజయవాడ" పేజీ లక్ష్యంగా ఒక దారిమార్పు పేజీ ఉంది. కానీ Vijayawada కోసం గూగుల్లో వెతికినపుడు మొదటి పది పేజీల్లోనూ తెవికీలోని విజయవాడ పేజీ రాలేదు.
- దారిమార్పు పేజీలు వికీపీడియా నాణ్యతను ప్రభావితం చెయ్యవు. వ్యాసాలను చేరుకోవడంలో అవి దోహదపడతాయి.
అభిప్రాయాలు
మార్చుఈ విషయానికి సంబంధించి మీమీ అభిప్రాయాలను కింద చూపిన మూడు విభాగాల్లోనూ తగినదానిలో రాయవలసినదిగా మనవి. సాధారణంగా ఇలాంటి చర్చల్లో ఎవరి వాదనను వారు హేతుసహితంగా రాస్తారు. ఇతరుల వాదనపై ప్రతివాదనలు చెయ్యవద్దని మనవి. అయితే చర్చ తప్పనిసరి అయిన ఈ సందర్భంలో ఈ విభాగాన్ని అభిప్రాయాలు గా మార్చి, వాదనలను కొనసాగించేందుకు చివర్లో చర్చ విభాగాన్ని చేర్చాను. చర్చను మరొక 4 రోజులు పొడిగిస్తున్నాము. ఈ చర్చ ద్వారా తేలిన ఫలితాన్ని వికీపీడియా:దారిమార్పు పేజీలో విధానపరమైన నిర్ణయంగా పొందుపరుస్తాం.
ఇంగ్లీషులో దారిమార్పు పేజీ ఉండాలి
మార్చుఇంగ్లీష్ భాషలో దారిమార్పు పేజీ వుండాలి అనే విషయాన్ని నేను సమర్ధిస్తున్నాను. విధానపరమైన అంశాలలో అభిప్రాయాలను సవివరంగా రాయమని నిర్వాహకులు ఇచ్చిన స్వేచ్చ ప్రకారం నా అభిప్రాయాలు మీతో పాయింట్స్ పరంగా కాక ముఖాముఖి మాట్లాడుకొన్న విధానంలోనే, convince చేసే రీతిలోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఒక చర్చనీయాంశం డైకోటమీ అయినప్పుడు ఎవరి అభిప్రాయాలు వారికి వుంటాయి. వారు అంటిపెట్టుకొన్న అభిప్రాయాలకు అనుగుణంగానే హేతువు కూడా వుంటుంది. ఎవరి హేతువు వారికి వుంటుంది. కాదనలేం కూడా. emotions తో ముడిపడివున్న అటువంటి డైకోటమీ చర్చలలో convincing approach తో చెప్పడమే మంచిది.
దారిమార్పుగా ఆంగ్ల భాషను కొనసాగించాల్సిన ఆవశ్యకత గురించి నేను ఇంత సుదీర్ఘ వివరణ ఇవ్వడం అనవసరం అని ఒక వైపు నుంచి అనిపించినా మరోవైపు అసలు ఈ చర్చను కోరుకొన్నది నేను కూడా కాబట్టి కాస్త వివరంగానే అయినా నా అభిప్రాయాలను చెప్పాల్సివస్తున్నది. ఇక్కడ నాకు తోచిన మేరకు చెప్పిన నా భావనలే ఒప్పు అని, నేను చెప్పిన పోలికలు, ఉదాహరణలు సార్వత్రికమైనవి అని కూడా చెప్పలేను. కారణం దారిమార్పు అంశం అనేది చాలా వరకు ఇతర భాషా వికీలలో సకారాత్మకరీతిలో స్వచ్చందం (Voluntary with possitive approach) ప్రక్రియగానే కనిపిస్తున్నది.. ఎక్కడైతే స్వచ్చంద విధానం అనేది నకారాత్మకరీతిలో (Voluntary with negative approach) కనిపిస్తుందో అక్కడ చర్చ తప్పనిసరి అవుతుంది.
మన తెలుగుభాషను ప్రోత్సాహించుకొనే క్రమంలో మరో భాష లోని అక్షరాలపట్ల మనలో ఎందుకు ఇంతగా అసహనం (అక్కరలేదు, తొలగించాలనేంత అసహనం) పేరుకుందో చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ముఖ్యంగా దారిమార్పులలో english అక్షరాలను కూడా మన తెలుగు పదాలతో కలుపుకొంటూ పోవాల్సిన తరుణంలో, ఒకవేళ ఆంగ్లభాషా అక్షరాలు కనిపించకూడదు అని మనం ఒక నియమం చేస్తే అది ఏ విధంగా అనుచితంగా వుంటుందో, ఎటువంటి పరిణామాలకు దారితీయవచ్చో అని నాకు తోచిన పోలికలతో సోదాహరణంగా చెప్పడానికి ప్రయత్నించాను. నేను చెప్పే ప్రతీ ఒక్క పోలికకు, వాదనకు అవతలి వైపున కూడా ప్రతి పోలిక, ప్రతి వాదన కూడా వుంటుంది. ‘ఇతరుల వాదనపై ప్రతివాదనలు చెయ్యవద్ద’ని నిర్వాహకులు ముందే కోరారు. కాని అసలు చర్చ అనేదే వాదన ప్రతివాదనలతో కూడి వుంటుంది. అందువలన తప్పనిసరైనప్పుడు కాస్త స్వతంత్రించి అవతలివైపునుంచి ప్రతివాదన ఏ విధంగా వుండవచ్చో భావించి దానికి నా వివరణ కూడా జత చేసాను. అయితే తెలుగు వికీలో నాకున్న అనుభవం, పరిజ్ఞానం చాలా చాలా తక్కువే. కనుకనే సాధ్యమైనంతవరకూ Reductio ad absurdum పద్దతిలో నా అభిప్రాయం చెప్పడానికే ప్రయత్నించాను. అందుకే నా అభిప్రాయం ఎక్కువగా దారిమార్పులో మన విధానం ఎలా వుండాలి? ఎలా వుండకూడదు? ఎటువైపు ఒరుగుతున్నాం? ఎటువైపు ఒరగకూడదు? అన్న దానిమీదనే ఎక్కువ కేంద్రీకృతమయ్యింది. నా/మన అభిప్రాయాలు అందరికీ అంగీకయోగ్యం అయినా కాకపోయినా అది సాధ్యమైనంత ఎక్కువ మంది పాఠకుల (readers) హితం కోరుకొనేదిగా వుండాలి. ఆచరణాత్మకంగా వుండాలి. ఎక్కువమందిని కలుపుకుపోయే విధంగా వుండాలి. మరింత హేతుబద్దంగా వుండాలి. సాధ్యమైనత వరకూ సకారాత్మక ధోరణిగానే కనిపించాలి. ప్రగతివాద దృక్పధంతో వుండాలి. ఈ విధంగా చర్చించాలంటే పాయింట్ల వారీ కన్నా convincing విధానమే మంచిది. నాకు తోచిన అభిప్రాయం చెప్పే క్రమంలో తప్పులు, పునరుక్తులు దొర్లివుండవచ్చు. --Vmakumar (చర్చ) 18:29, 19 అక్టోబరు 2017 (UTC)
- దారిమార్పుగా చేసిన పదాన్ని మన తెలుగు వికీ సైట్ లోని సెర్చ్ బాక్స్ లో ప్రవేశపెడితే సరాసరి మనకు దానికి సంబందించిన తెలుగు వ్యాసమే కనిపిస్తుంది. దారిమార్పు పేజీ సాధారణ చదువరికి కనిపించదు. అది బ్యాక్ గ్రౌండ్ లో వుండేది. reader కి కనిపించని పేజీ. సాంకేతికంగా దారిమార్పు అనేది ఒక నిర్దిష్ట పేజీగా సృష్టింపబడుతున్నప్పటికీ అది back గ్రౌండ్ లో పనిచేసే అంశం కు సంబందించినది మాత్రమే అని భావిస్తున్నాను. అటువంటప్పుడు దానిని ఒక “seperate వ్యాసం”గా భావించకూడదు. అలా భావిస్తే మాత్రం ఆ దారిమార్పు వ్యాసానికి హెడ్డింగ్ గా తెలుగు అక్షర పదాలు లేవే అన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది. ఇలా బేక్ గ్రౌండ్ లో జరిగే తంతుకు సంబంధించిణ మార్పులో తెలుగు అక్షరం వుంటే ఏమిటి? english అక్షరం వుంటే ఏమిటి? అది మనకు అప్రస్తుతం, అనవసరం కావాలి కదా. నిజానికి ఇలా బేక్ గ్రౌండ్ లో అనేక ఆంగ్ల పదాలు (సర్వ సాధారణంగా, ప్రోగ్రామింగ్ భాషలో భాగంగా ఇంగ్లీష్ అక్షరాలు వుండటం సర్వసహజం) దోర్లాడటం ఎంతమాత్రం తప్పు కాదు కదా పైగా అవసరం కూడాను. దానిని మనం తప్పనిసరిగా అంగీకరించాం కదా. మరి అటువంటప్పుడు దారిమార్పు అనే బ్యాక్ గ్రౌండ్ పేజీలో ఈ అనవసర భాషా భేషజం దేనికి?
నిజానికి తెలుగు వికీ తోపాటు స్థానిక భాషా వికీలు జీవంతో వున్నాయి అంటేనే అలాంటి బాక్ గ్రౌండ్లో నిరంతరం కొనసాగే ఆంగ్ల అక్షరాలతో కూడిన సాప్ట్ వేర్ కదా! ఒక వ్యాసం పేరు ను కంప్యూటర్ లో ఏ భాషలో (ముఖ్యంగా ఇంగ్లీష్ అక్షరాలతో ) టైపు చేసినా అది మనం కోరుకున్న వ్యాసానికి తీసుకుపోతే చాలు. అంతకు మించి మనకు కావలిసినదేమిటి. బ్యాక్ గ్రౌండ్ లో జరిగే మేటర్ ను మనం పట్టించుకోనవసరం లేదు. సెర్చ్ చేసినప్పుడు ఒక చక్కని తెలుగు పాట దొరికితే వింటూ ఆస్వాదించాలే గాని, సెర్చ్ బాక్స లో english అక్షర పదం వాడాము, తెలుగు అక్షర పదం వాడలేదు అనుకొంటూ మన భాష పట్ల మమకారంతో భావోద్వేగానికి గురవ్వడం అనవసరం అని నా అభిప్రాయం. వీలయితే అంత చక్కని పాటకు ట్యాగ్ లుగా హిందీ అక్షర పదాలు వాడడం ద్వారా, మరికొంతమందికి ఆ పాటను దగ్గర చేయడం (accessibility కల్పించడం) మంచిది.
మనం ఒక సైట్ లోని సెర్చ్ బాక్స్ లో తెలుగు అక్షరాలతో ఒక పదం టైపు చేసాం అనుకుందాం. ఒక మంచి బోమ్మ (image) కనిపిస్తే ఆనందపడతాం. అదే ఎదుటివాడు ఆంగ్ల అక్షరాలతో కూడిన పదం పెట్టి అదే సైట్ లో సెర్చ్ చేస్తే అప్పుడు కూడా ఒక అందమైన బొమ్మ కనిపించినదనుకోండి. దానిని యధాతధంగా accept చేయాలి అంతేగాని నేను తెలుగు అక్షర పదాలతో సెర్చ్ చేస్తే బొమ్మలు కనిపిస్తున్నాయి కనుక ఇంకా అవతలివాడు కూడా తెలుగు లిప్యంతరీకరణం చేసి అయినా సరే తెలుగు అక్షర పదాలతోనే సెర్చ్ చేయాలనడం భావ్యం కాదు. ఇది ఒకరకమైన భాషా దురభిమానానికి దారి తీస్తుంది.
మనకు తెలుగు అక్షరాలపై మీద అభిమానం వుండాలే కాని అదే సమయంలో ఇంగ్లీషు అక్షరాలపై అనవసరమైన వ్యతిరేకత వుండకూడదు. “నీ చేతికి స్వేచ్చ ఎంతవరకూ వుందంటే అది ఎదుటివాడి ముక్కుకు తగలనంతవరకే” అన్నట్లు “మన తెలుగు అక్షరాల పట్ల అభిమానం ఎంతవరకు ప్రదర్శితమవ్వాలంటే ఆంగ్ల భాషా అక్షరాలు జోలికి అడ్డంగా వెళ్ళనంతవరకూ” అనే విధంగా ఉండాలి. అయితే మనలను సమర్ధించుకొనే ప్రయత్నంలో భాగంగా “ఇది తెలుగు వికీ సైటు. ఇక్కడ తెలుగు అక్షరాలకే ప్రాధాన్యం, ఆంగ్ల అక్షరాలకు కాదు కదా” అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా దారిమార్పులో ఇంగ్లీష్ అక్షరం పేర్లు అసలు కనే కనపడకూడదనే భావన – తొలగించాలనే భావన – ఇవి నెగటివ్ అప్రోచ్ తప్ప మరేదీ కాదు. ఒకసారి ఇటువంటి నెగటివ్ ధోరణితో ఒక తెలుగేతర భాషలోని అక్షరాల పట్ల ఏదైనా ఒక విధానం మనం రూపొందించుకొంటే, ఆ అసహనం ఇక అక్కడితో ఆగిపోదు. దీనివల్ల చివరకు తెలుగువికీకే నష్టం. ఇంగ్లీషు లాంటి ఇతర భాషలలో మంచి పరిచయం వున్న తెలుగు వాడుకరులకు అనవసరంగా మోకాలడ్డినట్లవుతుంది. వారిని నెమ్మది నెమ్మదిగా చేజార్చుకోన్నట్లవుతుంది. నిజానికి దానివల్ల చివరికి మనమే నష్టపోతాం. అంతేకాక ఈ నెగటివ్ అప్రోచ్ కొత్త సమస్యలకి దారి తీయవచ్చు కూడా. ఆంగ్ల భాష పట్ల ఈ క్రింది రెండు ధోరిణిలను చూడండి.
a. నెగటివ్ ధోరణివాలు పాఠ్యం: మన తెలుగు వికీ కదా, మన సైట్ కదా, మన తెలుగు సైట్ లో తెలుగు అక్షరాలు బాగా కనిపించాలి. దానికోసం బ్యాక్ గ్రౌండ్ లో ఒక మూలన పడివున్న english అక్షరాలను వెతికి మరీ వాటికి ముసుగు వేసేయాలి లేదా తొలగించాలి అనే భావన కొంతవరకు నెగటివ్ ధోరణి అవుతుంది. పరమత అసహనం మాదిరిగానే ఇది కూడా పరభాషా అసహనానికి దారితీస్తుంది.
b. పాజిటివ్ ధోరణివాలు పాఠ్యం: మనతెలుగు సైట్ లో తెలుగు అక్షరాలు బాగా కనిపించాలి. బ్యాక్ గ్రౌండ్ పేజీలలో english అక్షరాలు వుంటే ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. అవి తెలుగు అక్షరాలకు హానికరంగా లేనంతవరకూ ఒక మూలన వున్న వాటి ఉనికికి అడ్డుచెప్పకపోవటం అనేది కొంతవరకు పాజిటివ్ ధోరణి అవుతుంది. ఇది ఉదారవాదం (liberal view). ఒక రకంగా Live and let them live (తెలుగు అక్షరాలు వుండాలి, ఇంగ్లీష్ అక్షరాలు కూడా ఒక మూలన పడి ఉండనీయండి పరవాలేదు కదా) అనే విధానం అన్న మాట. ఇప్పుడు ఆలోచించండి. భాష పట్ల మన విధానం ఎలా వుండాలి. ప్రస్తుతం దారిమార్పు విధానంలో మనం ఏ విధంగా కోరుకుంటున్నాము. --Vmakumar (చర్చ) 18:31, 19 అక్టోబరు 2017 (UTC)
- తెలుగు వికీ సైట్ లో చేయబోయే దారిమార్పులలో ఇంగ్లీష్ అక్షరం పేర్లు అసలు కనపడకూడదనే కోరిక ఇంగ్లిష్ భాష పట్ల నెగటివ్ ధోరణిలో వుండటం అవుతుందని భావిస్తున్నాను. ఒకసారి ఈ విధమైన నెగటివ్ ధోరణితో ఆ భాషలోని అక్షరాల పట్ల మనం ఏదైనా ఒక విధానం ఏర్పరుస్తే (అది సంప్రదాయం కావచ్చు నియమం కావచ్చు) అలా బయటకు వచ్చిన ఆ అసహనం ఇక అక్కడితో ఆగిపోతుందని ఎవరూ హామీ ఇవ్వలేరు. ఉదాహరణకు
మన తెలుగు వికీలో ప్రధాన స్రవంతిలో (main stream) వున్న వ్యాసాలను ఆలనా పాలనా చూడడానికి ఎన్నో వందలు, వేల పెజీలు బ్యాక్ గ్రౌండ్ (నేపధ్యం) లో నిరవధికంగా కొనసాగుతాయి. (అవి దారిమార్పు పేజీ కావచ్చు, స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ పేజీలు ఏవైనా కావచ్చు- infobox కావచ్చు, image file కావచ్చు. చివరకు programme కు సంబంధించిన పేజీ కావచ్చు – ఇవి/ఈ పేజీలు వ్యాసానికి ఆధారభూతంగా నేపధ్యంలో పనిచేస్తూ వుండడం వలెనే మనం ఒక వ్యాసాన్ని ఆయా రూపాలలో తెలుగులో చూడగలుగుతున్నాం. ఒకవేళ ఒక వ్యాసంలో బయటకు కనిపించకుండా నేపధ్యంలో సాగిపోయే ఇటువంటి ఆంగ్ల పేజీలను రేపెవరైనా తెలుగు లిప్యంతరీకరణం లో లేవు అనే కారణం మీద వాటిని తొలగించాలంటూ వాదిస్తే ఏమవుతుంది. (అయితే ఇక్కడ దారిమార్పు తప్ప నేపధ్యంలో పనిచేసే ఇతర పేజీలను తొలగించే ప్రయత్నం చేయకుండా వికీ అధికారులు, నిర్వాహకులు ముందు జాగ్రత్తలు ఎన్నో తీసుకొనే వుంటారు.)
ఉదాహరణకు image files చూద్దాం. తెలుగు వ్యాసాలలోని కనిపించే బొమ్మలకు file name గా ఆంగ్ల అక్షరాలు ఉండటం ఏమిటి. తొలగించాల్సిందే అన్న వాదన ఎప్పుడైనా రావచ్చు. అదీ నిజమే కదా నేపధ్యంలో ఓ మూలన పడివుండే దారిమార్పు పేజీ లోని english అక్షరాల ఉనికినే సహించని మనకు తెలుగు వ్యాసంలో కనిపించే బొమ్మకు పేరు (File name) english అక్షరాలలో వుంటే సర్దుకుపోయే సహనం ఉంటుందా. ఫైల్ పేరుని ఆంగ్లం నుండి తెలుగులోనికి లిప్యంతరీకరణం చేయడం తప్ప అన్యదా రాజీపడని రేపటి తెలుగుభాషా ప్రేమికునికి ఏమని సర్ది చెప్పగలం!.
అలాగే తెలుగు వికిలో english అక్షరాలతో పేజీలు వుండటమే అభ్యంతరకరంగా భావించే తెలుగు భాషాప్రేమికుడు నుంచి స్టాటిస్టిక్స్ పెజీలు, ఇన్ఫర్మేషన్ పేజీలు వంటి సాంకేతిక పేజీలను సైతం తెలుగు అనువాదంలోనో లేదా కనీసం తెలుగు లిప్యంతరీకరణం లోనే చూడాలని కోరుకొనే పరిస్థితి రేపు ఎదురవ్వవచ్చు. అలాగే తెలుగు వికీపీడియాలో నేపధ్యంలో వున్న ఆంగ్ల భాషలో వున్న అధికారిక, సమాచార పేజీలలో ఎన్నో వందల పేజీలను మన సీనియర్ తెలుగు వికీపీడియన్లు ఎంతో కష్టపడి తెలుగులో అనువదించారు. అయినా ఇంకా ఎన్నో వందలాది పేజీలు ఇంకా అనువాదానికి నోచుకోలేదు. అలాగే తెలుగువికీలో రచ్చబండ చూడండి. దీనిలో నిర్వాహకుల నుంచి, అధికార్ల నుంచి, ఇతర వాడుకరులనుంచి వచ్చే ఆంగ్ల మెసేజ్ లు ఎక్కువగా తెలుగులో అనువాదం లేనందువల్ల ఇవి english అక్షరాలతోనే సమాచారాన్ని కలిగివున్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం నడుస్తున్న రచ్చబండ పేజీలోని ఆంగ్ల మెసేజ్ లు IMPORTANT: Admin activity review, CIS-A2K Technical Wishes 2017 Announcement, Accessible editing buttons, Page Previews (Hovercards) update, CIS-A2K Newsletter June 2017, CIS-A2K Newsletter July 2017, Wiki Loves Monuments 2017 in India, Wikidata Workshops in India in September 2017, Featured Wikimedian [September 2017], RfC regarding "Interlinking of accounts involved with paid editing to decrease impersonation", Discussion on synced reading lists, Bhubaneswar Heritage Edit-a-thon 2017, presenting the project Wikipedia Cultural Diversity Observatory and asking for a vounteer in Telugu Wikipedia. రేపెవరైనా ఈ మేసేజ్ లను సైతం తెలుగు అనువాదంలోనో లేదా కనీసం తెలుగు లిప్యంతరీకరణం లోనే చూడాలని కోరుకోవచ్చు. నేపధ్యంగా వుండే పేజీలోనే english అక్షరాలను ఇష్టపడని భాషాభిమాని రేపటిరోజున మన రచ్చబండ పేజీలో కొట్టచ్చినట్లు కనపడే english అక్షరాలను ఉపెక్షిస్తాడని మనం ఎలా అనుకోగలం. తెలుగువారి రచ్చబండలోని చర్చలు, మెసేజ్ లు అన్నీ కూడా తెలుగుదనంతో గుబాళించాల్సిందే. లేదా కనీసం తెలుగు లిప్యంతరీకరణంతో నైనా వుండాలని, english అక్షరాలతో నిండినవున్న ఆ మెసేజ్ లను తెలుగువికీలో తొలగించితీరాల్సిందే అని గట్టిగా వాదిస్తే ఏం కారణం చేత అతనికి మనం నచ్చచెప్పగలం. అప్పుడు మనం చెప్పబోయే పరిష్కారం కూడా అనువాదం లేదా లిప్యంతరీకరణం ఒక్కటే అవుతుంది. ఆదర్శం వేరు, ఆచరణ వేరు. దీనివల్ల ప్రధానమైన భాషా లింక్ తెగిపోతుంది. ఇది ముందుముందు తెలుగు వికీకే నష్టదాయికమవుతుంది. నిజానికి ఇటువంటి భాషామమకారంతో ముడిపడిన డైకోటమీ చర్చలలో ఎవరి వాదనలు వారికి వుంటాయి . అయితే ఏదో వైపు ఒరుగుతూ చేసే నిర్ణయాల ప్రభావం మాత్రం ఒకొక్కసారి పులి మీద స్వారీలా మారతాయి. తెలుగు భాష పట్ల మమకారం (attachment) వుండటం వేరు, ఇంగ్లీష్ ప్రభావాన్ని కాదనలేని వాస్తవికత (practicality) ను అంగీకరించడం వేరు. – ఒకటి ఆదర్శం మరొకటి వాస్తవం వీటి మద్య సమన్వయం కుదరనప్పుడు చివరకు అంతిమంగా మిగిలేది వాస్తవికతయే. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. లేదా యథాతద స్థితిని మరికొంత కాలం కొనసాగించడం మేలు అని నా అభిప్రాయం. --Vmakumar (చర్చ) 18:35, 19 అక్టోబరు 2017 (UTC)
- ఒక వ్యాసానికి దారిమార్పుగా ఒక పదాన్నిగాని ఒక భాషను గాని నిర్ణయించడంలో ఎన్నో అంశాలు అంతర్లీనంగా వుంటాయి. – ఆ వ్యాసంలోని వస్తువు (content- అంటే చారిత్రిక, రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, మత, సాహిత్య, విజ్ఞాన శాస్త్ర తదితర అంశాలు), ఆ వ్యాసం ఎవరికీ చేరువవ్వాలి (అంటే విధ్యార్దులకా, పిల్లలకా, కార్మికులకా, పరిశోధకులుకా, చరిత్రకారులకా, సాహిత్యాభిలాషులకా తదితర), ఇతరత్రా అంశాలు (టెక్నికల్ అంశమా, నాన్ టెక్నికల్ అంశమా, భాషాపరమైన మాండలిక అంశం, వాడుక భాష తదితర) ఇంకా ఆ వ్యాసాన్ని చదవబోయేవారి విద్యా స్థాయి, భాషా ప్రమాణాల స్థాయి, వారి స్థానికత, వలస భాష, స్థానిక భాష, రాజకీయ కారణాలు ఇలాంటి అనేక అంశాలు దారిమార్పు పదాన్ని, భాషను నిర్ణయించడంలో కీలకమవుతాయి. ఉదాహరణకు వ్యాసం “Potassium permanganate” అయితే అది విజ్ఞాన శాస్త్ర పారిభాషిక పదం కాబట్టి, సైన్సు విద్యార్ధులను దృష్టిలో ఉంచుకొంటే, అప్పడు దారిమార్పు కు english లో కూడా KMnO4 అని ఉండాల్సిన పదం అవుతుంది.. ఇక్కడ KMnO4 ను తెలుగులో లిప్యంతరీకరణం చేసి తీరాల్సినదే అని పట్టుబడితే అది తెలుగుపట్ల మమకారం ను సూచిస్తుందే తప్ప వాస్తవాన్ని ప్రతిఫలించదు. మన తెలుగుమీడియం విద్యార్ధులకు రసాయన శాస్త్రం బోదించేటప్పుడు మనలో ఎంతమంది KMnO4 కు బదులు “కేఎమ్ఎన్ఓఫోర్” అని రాసి తెలుగు పిల్లలకి పాఠాలు చెపుతున్నాం. అంటే లిప్యంతరీకరణం లో మనం కోరుకొన్న వ్యాసాన్ని చేరుకోవడంలో కొంతైనా easyness కోల్పోయే అవకాశం వుంది అని చెప్పడం నా ఉద్దేశ్యం. Potassium permanganate కు సంబందించిన వ్యాసాలలో దారిమార్పులుగా english అక్షరాలు వున్న కొన్ని ప్రధాన ప్రపంచ భాషలలో చూద్దాం. జర్మన్ భాషలోని వికీ సైటులో Potassium permanganate వ్యాసానికి దారిమార్పు KMNO4 [[1]]. అలాగే రష్యన్ భాషా వికీ సైట్ లో [[2]], ఇంకా ఫ్రెంచ్ భాషలో [[3]], ఇటాలియన్ భాషలో [[4]], డచ్ బాషలో [[5]]], పొలిష్ భాషలొ [[6]], చైనా భాషలో [[[7]], జపాన్ భాషలో [[8]], అరబిక్ భాషలో [[9]] దారిమార్పులుగా KMnO4 ని చక్కగా వాడుతున్నారు. వారు తమ భాషా వ్యాసాలలో దారిమార్పులుగా ఆయా స్వభాషా అక్షరాలు వాడలేదే అని వారు బాదపడలేదు. కనీసం స్వభాషలో KMnO4 కి లిప్యంతరీకరణానికి కూడా ప్రయత్నించలేదు. వాళ్ళు దారిమార్పు అంశాన్ని practical గానే చూసారు కాని స్వభాష పట్ల మమకారాన్ని (attachment) ప్రదర్శించే అంశంగా మాత్రం చూడలేదు. అంటే తమ మాతృభాషలలోని సైన్సు వ్యాసాలకు దారిమార్పులుగా english అక్షర పదాలు ఉండటానికి ఆయా మాతృభాషా వాడుకరులకు ఏ అభ్యంతరం లేదని తెలుస్తుంది.
ఫిలిప్పీన్స్ ఒకప్పుడు స్పెయిన్ కు ఆ తురువాత ఆంగ్లేయుల వలస ప్రాంతం. వలసపాలకులు పోయినా నేటికీ ఆంగ్ల భాష డామినేషన్ మనలాగే అక్కడా వుంది. అలా అని వారు ఫిల్లిప్పిన్స్ ప్రజలు తమ మాతృభాషను వదలలేదు. ఫిలిప్పీన్స్ భాషలో Estados Unidos అనే పేరుతొ వున్న అమెరికా కు సంబందించిన వ్యాసానికి [[10]] దారిమార్పుల క్రింద వారి భాషలోని పదాలే కాక వలస భాషకు చెందిన english భాషా పదాలను కూడా వాడుకొన్నారు. దారిమార్పులలో పర భాష, దాస్య భాష అనేది వారికి అవసరం లేదు. వారి వ్యాసం మరింతమందికి చేరువవ్వడంకోసం english ను ఏ మాత్రం సంకోచించకుండా వాడుకొన్నారు. అలాగే ఎన్నో దేశాలు తమ మాతృభాషలలోని వ్యాసాలకు దారిమార్పులుగా తమ మాతృభాష ను వాడుకొంటూనే, ఒకప్పటి వలసపాలకులు తమ తమ దేశాలలో ప్రవేశపెట్టిన భాషలను (ఆంగ్లం, ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్ తదితర) దూరం చేసుకోవడం లేదు. --Vmakumar (చర్చ) 18:42, 19 అక్టోబరు 2017 (UTC)
- దారిమార్పు అనేది readers point of view (చదువరుల కోణంలో) చూడాల్సిన అంశం. దీనిని తెలుగు భాషా లేదా ఆంగ్ల భాషా మమకారాలతో చూడాల్సిన అంశం కాదు. కావలిసిన వ్యాసపేజీకి సులభంగా చేరుకొనేదిగా (easy accessibilty) దారిమార్పు వుండాలి. అయితే సులభంగా అంటే ఎవరికీ. వ్యాసం రాసిన వారికీ కాదు. ఒకానొక వ్యాసాన్ని చదవడం కోసం సెర్చ్ బాక్స్ లో టైపు చేస్తున్న వ్యక్తికీ అంటే చదువరికి చాలా సులభంగా వుండాలి. (easy accessibility). ఈ సౌలభ్యత అనేది ఎక్కువగా చదువరి విద్యా స్థాయీ ప్రమాణం బట్టి, తానూ స్థిరపడిన ప్రాంతంలోని స్థానిక వ్యవహార భాషా ప్రభావం బట్టి వుంటుంది. ఆతనికి ఆంగ్లంలో ఎక్కువగా పరిచయం వుంటే అతనికి ఆంగ్ల అక్షరాలతో టైపు చేయడం సులభంగా వుంటుంది. అతనికి జాతీయ భాష హిందీ , లేదా మరో భాష ఉర్దూ లో ఎక్కువగా పరిచయం వుంటే (తెలుగువాడైనప్పటికి నార్త్ india లో, లేదా హైదరాబాద్ లో చాలా కాలం స్థిరపడటం కావచ్చు) ఎక్కువగా పరిచయం వుంటే అతనికి హింది అక్షరాలతో లేదా ఉర్దూ అక్షరాలతో టైపు చేయడం ఇంకా సులభంగా వుండవచ్చు. మన తెలుగు వికీ సైట్ లో ప్రవేశించి ఓ వ్యాసాన్ని చదవాలని ఆశిస్తున్న చదువరికి తను కోరుకొన్న వ్యాసాన్ని direct గా చేరుకోనడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం అతనికి సెర్చ్ బాక్స్ లో వీలయినంతమేరకు సెర్చ్ సౌలభ్యత కల్పంచాలి. Bilateral way లో చూడాల్సిన అంశంలో Unilateral గా ఆలోచించడం అంత మంచిది కాదు అని నా అభిప్రాయం. దీనిలో మన అభిమతాలు, ఆశయాలు పనికిరావు. అతని కోణంలో కూడా ఎక్కువగా చూడాల్సిన అంశం. అంటే దారిమార్పు అనేది ఆయా వ్యాసకర్తలు వారి వారి అభిమతాలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సినది కాదు. వ్యాసాన్ని చదవబోయే పాఠకులను వారిని దృష్టిలో వుంచుకొని వారికి అనుకూలంగా ఉండేటట్లు చేయాల్సిన మార్పు.
సెర్చ్ బాక్స్ లో వెతికేవాడికి భాషాపరంగాను restrictions కల్పించ కూడదు. వీలయితే అతనికి చేయూత ఇవ్వాలి. అతనికి తెలిసిన అన్ని భాషలలో కూడా accessibility ని మనం కల్పించేటట్లుండాలి. కనీసంలో కనీసం అతనికి అనుసంధాన భాష అయిన english అక్షరాలను అయినా స్వేచ్చగా వాడుకొని వెతుక్కొనే అవకాశం కల్పించాలి.
మన ఇంటికి ఒక అతిధి రావాలని మనం కోరుకొంటున్నాము అనుకుందాం. అతని రాక మనకు ఎంతో ఆనందం, అయితే మన ఇంటి ద్వారం పొట్టిగా, చిన్నగా మాత్రమే వుంది. రాబోతున్న అతిధి గురించి వాకబు చేస్తే అతను భారీగా పొడుగ్గా, ఉండవచ్చు అని తెలిసింది. అయితే మన ఇంట్లో అడుగుపెట్టడానికి ఆ విశిష్ట అతిధి ఏ మాత్రం ఇబ్బంది పడకూడదు. ఆతని రాక మనకు ఎంతో అవసరం కూడా . ఆ సందర్భంలో ఏం చేస్తాం. వీలయితే ద్వారాన్ని కొంచెం పెద్దది, విశాలం చేసి ఆ విశిష్ట అతిధికి మన ఇంట్లో ప్రవేశించడంలో ఇబ్బంది పడనీయకుండా చేస్తాం. అంతేగాని మనయింటి ద్వారాన్ని అతనికి ఇబ్బంది కలిగించే విధంగా అలాగే వుంచం కదా! ఇంకా కురచగా పొట్టిగా చేయం కదా! కాని మనం ఏం చేయకూడదో అదే చేయడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ విశిష్ట అతిధి (చదువరి) రాక మన తెలుగు వికీ రీడర్స్ బేస్ ను మరింతగా పెంచుతుంది అని మనం భావిస్తే అతనికి మనం మరింత సులభమైన accessibility పెంచాలి. దానికోసం అతనికి బాగా convenient గా వున్న మరియు సుపరిచితమైన భాషా అక్షరాలలో (అది ఆంగ్ల భాష కావచ్చు ఏదైనా ఇతర భాష కావచ్చు) లో కూడా సెర్చ్ చేసుకొనే అవకాశం మనమివ్వాలి. అంటే దారిమార్పు, ట్యాగ్ పేజీలు అనేవి రీడర్స్ పాయింట్ అఫ్ వ్యూ నుంచి చూడాల్సిన అంశాలు. మన భావావేశాల నుంచి , ఆశయాల నుంచి ఆలోచించాల్సిన point ఎంతమాత్రం కాదు.
200 సంవత్సరాలు మనదేశంలో వటవృక్షంలా పెనవేసుకొన్న ఒక భాష, ఆ అనుసంధాన భాషలోనే ఈ నాటికి ఉన్నత చదువులు, దైనందిక వ్యవహారాలూ కొనసాగుతున్న రోజులలో – అటువంటి పరిస్థితుల నేపధ్యంలో వచ్చిన అతిధికి english లో టైపు చేయడమే ఎక్కువ సులభం. అతను తెలుగువికీ లో సైట్ లోకి వచ్చిన తరువాత తనకు కావలిసిన వ్యాసం కోసం వ్యాసం పేరుని తనకు easy గా వున్న english words లతోనే సెర్చ్ బాక్స్ లో టైపు చేయాలనుకొంటాడు. దానికోసం మనం దారిమార్పును తెలుగు అక్షరపదాలతో పాటు అదనంగా అటువంటి వారికి కూడా అనుకూలంగా వుండేటట్లు తీర్చి దిద్దాలి. అంతే గాని ఆ english పదానికి తెలుగు లిప్యంతరీకరణం మాత్రమే వాడాలి అని మనం అతని కాళ్ళకు బందాలు తగిలించకూడదు. ఉదాహరణకు మన తెలుగు readers ఉర్దూ భాషా ప్రాంతాలలో ఎక్కువగా వ్యాపించి వుంటే అటువంటి వారికోసం ఉర్దూఅక్షరాలలో కూడా మనం దారిమార్పు సృష్టించుకోవాలి. తప్పదు. ఇక్కడ భాషా భేషుజాలు, భాషా మమకారాలు పనికిరావు. మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో చాలా ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో స్థానికులుగా స్థిరపడ్డారు. మన తెలుగు భాషను క్రమేణా మర్చిపోతున్న స్థితి వారిది. ఆయా స్తానిక భాషలతో మమేకం అయిపోతుంటారు. వారు మన సైట్ కి వచ్చినపుడు ఏదైనా తెలుగు వ్యాసం గురించి తెలుసుకోవాలనుకొంటే వ్యాసపు పేర్లను టైపు చెయడం ఏ భాషలలో అయితే వారికి సులభంగా వుంటుంది? 1. స్థిరపడిన ప్రాంతం యొక్క దేశీయ/స్థానిక భాష 2. అనుసంధాన భాష అయిన english 3. విస్మృతి కి లోనవుతున్న తెలుగు. ఇటువంటి వారు కూడా మన సైట్ లోకి రావడమే ఒక గొప్ప. వారు మన వ్యాసాలను తెలుగులో చూడాలనుకోవవడమే మనకు, మన భాషకు ఎంతో మంచిది. నిజానికి వారికి తాము స్థిరపడిన దేశీయ/స్థానిక భాషలలో టైపు చేయడమే బాగా సులభంగా వుంటుంది. మహా అయితే వారికి అనుసంధాన భాష అయిన english అక్షరాలతో టైపు చేయడం కూడా సులభంగానే ఉండవచ్చు. కాని మన తెలుగు వికీ సైట్ ను దర్శించిన పాపానికి వారిని - వారు మరచిపోతున్న తెలుగు అక్షరాలను మాత్రమే సెర్చ్ బాక్స్ లో లిప్యంతరీకరణం చేయమనడం, అలా చేస్తేనే తెలుగు వ్యాసం చూపిస్తామనడం భావ్యం కాదు.
దారిమార్పుకి కేవలం తెలుగుఅక్షరాల ఉపయోగించాలని గిరిగీయడం వలన, మన వికీ సైట్లో ప్రవేశించిన పాఠకుడు తనకి సౌలభ్యమైన english అక్షరాలను ఉపయోగించి సెర్చ్ చేసుకొనే అవకాశం కొంతమేరకు కోల్పోతాడు. దానివల్ల తనకు కావలిసిన వ్యాసాన్ని సరాసరిగా చేరుకోవడంలో కొంత ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడిన ఆ సగటు పాఠకుడు మన సైట్ కి దూరమవుతాడే తప్ప సెర్చింగ్ లో కేవలం తెలుగక్షరాలను వాడటంలో తాను ఇబ్బంది పడ్డానని మనకు ఫీడ్ బ్యాక్ చేయడు. నిరసననూ వ్యక్తం చేయడు. సింపుల్ గా మన సైట్ నుండి క్రమంగా దూరంగా జరిగిపోతాడు. విసుక్కుంటూ అయినా తనకు పరిచయం వున్న పదాలతో సెర్చ్ చేసుకొనే అవకాశం వున్న ఆంగ్ల వికీ సైట్ ను తిరిగి ఆశ్రయించడం జరుగుతుంది. ఇలాంటి నిర్ణయాల వలన తెలుగు వికీ సైట్ కు రీడర్స్ బేస్ పాపులేషన్ మనం ఆశించినంత మేర పెరగడం ఇంకా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే సెర్చింగ్ అనే తొలిదశలోనే పాఠకులను మనం నిరుత్సాహపరుస్తున్నాం. తొలిదశలోనే మన భావాలను, భాషాబిమానాన్ని అతనిపై రుద్దడం ద్వారా అతని సౌలభ్యాన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్నాం. ప్రజాదరణ పొందాల్సిన ఏ సైట్ అయినా తప్పనిసరిగా అన్ని వర్గాల పాఠకుల సౌలభ్యాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. తెలుగు పాఠకవర్గంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్, హింది, ఉర్దూ తెలిసినవారు కూడా వున్నారు. తెలుగులో పూర్తిగా అంటే అచ్చతెలుగులో రాసేవాడు, చదివేవారు తక్కువే. మనం మాట్లాడే భాషలో 10 పదాలలో కనీసం 2,3 అయినా english పదాలు దొర్లుతున్నాయి. ఇంకా చదువుకున్న వారు మాట్లాడే తెలుగులో 10 పదాలలో కనీసం సగం పదాలు english పదాలే. ఇటువంటి పరిస్థితులలో మనం దారిమార్పు పేజీలో english అక్షరాలని తొలగించాలనుకోవడం అవివేకం.
తెలుగు వికీలో ప్రవేశించే రీడర్ తనకు తెలిసిన వ్యాసం కోసం సెర్చ్ చేసేటప్పుడు ఆంగ్ల అక్షరపదాలను వాడకూడదనడం. లిప్యంతరీకరణం పై పట్టుపట్టడం భావ్యకాదు. తెలుగు పాఠకులలో అనివార్యంగా కనిపిస్తున్న అన్య భాషా వైవిధ్యకతను, ఆంగ్ల భాషా ప్రభావాన్ని సహజంగా వున్నది ఉన్నట్లుగా గుర్తిస్తేనే మంచిది. అలాకాకుండా దానిని (ఆంగ్ల భాషా ప్రభావం) ఒక రోగంగా భావించి లిప్యంతరీకరణం దానికి విరుగుడుగా చేస్తే మంచిదే. ఎందుకంటే మన భాష వృద్ధి చెందాలి కదా. కాని అదే (లిప్యంతరీకరణం) గత్యంతరం చేయడం సబబు కాదు. చిన్న ఉదాహరణ మనం మనయింట్లో భోజనాలకు కొంతమందిని ఆహ్వానించాం అనుకొందాం. అయితే అందరి అతిధుల సామాజిక నేపధ్యం ఒకేలా వుండదు. మన యింటికి వచ్చేవారు బోజనానికి కూర్చోనేటప్పుడు మన సంప్రదాయానికి అనుగుణంగా కాళ్ళు కడుక్కొని భోజనం చేయండి అంటాం కాని కాళ్ళు కడుక్కొని వచ్చే వారికే భోజనం పెడతాం అని నియమం పెట్టం. అతిధులలో కొంతమందికి కాళ్ళు కడుక్కోకుండా భోజనం తినే అలవాటు, నేపధ్యం నుండి వచ్చినవారైతే వారిని అలాగే గుర్తిస్తాం కదా. వారిని కాళ్ళు కడుక్కోలేదని ఖాళీ కడుపుతో బయటకు పంపం కదా! అంటే మన యింటికి వచ్చిన అతిధికి భోజనం పెట్టడం ముఖ్యం కాని మన సాంప్రదాయం, ఇష్టానిష్టాలు అతనిపై రుద్దడం ముఖ్యం కాదు. భిన్న వైవిధ్యతలున్న భాషా సమాజంలో మనం చేయబోయే విదానాలు అందరనూ కలుపుకోనిపోవాలి తప్పితే ఏ ఒక్క భాష పట్ల (అనగా ఒక భాషలోని అక్షరాల పట్ల) నిరోధకవైఖిరి చూపుతున్నట్లు వుండకూడదు. ఒకవిధంగా చెప్పాలంటే liberal view అవలంబించాలి.
అయితే అప్రస్తుతమైనా చెప్పదగినది. (కేరళ అనంతపద్మనాభ ఆలయానికి వెళ్ళినపుడు ఇదే ధోరణి కనిపిస్తుంది. ‘ఇది హిందువుల ఆలయం. ఆలయ ప్రవేశం కోరేవారు ప్రాచీన హిందూ సంప్రదాయానికి అనుగుణంగా ఉత్తరీయం, పంచె ధరించాల’నే నియమమే పెట్టుకొన్నారు. హిందువులలో కూడా నేడు భిన్న వస్త్రధారణ (ఫాంట్, షర్టు లాంటి) ధరించేవారు ఉంటారని, వారి ఆచార వ్యవహారాలను కూడా కాలానుగుణంగా గుర్తించాలనే విజ్ఞత అక్కడ లోపించింది. ఒకవిధంగా ఇది సంకుచిత ధోరణికి దారితేసే విధం. ఒక సంప్రదాయాన్ని నిబందనగా మార్చాలంటే అన్ని కోణాలనుంచి చూడాలి. సంప్రదాయం పేరిట శబరిమలైలో స్త్రీల ఆలయప్రవేశనిషేదంపై వున్న నిబందనల వ్యవహారం అనుచితంగా, ఏకపక్షంగా ఉండడంతో సుప్రీమ్ కోర్ట్ వరకూ విషయం వెళ్ళింది. ఇలాంటి విషయాలు ఇక్కడ చెప్పడం అసందర్భం అప్రస్తుతమైనా) ఇక్కడ నా భావం ఏమిటంటే - ‘ఇది మన తెలుగు సైట్, ఇక్కడ తెలుగు అక్షరాలే వుండాలి. english అక్షర పదాలను తొలగించాలి. లిప్యంతరీకరణం తప్ప అన్య భాషాపద వాడకం ఇక్కడ అంగీకారయోగ్యం కాదు’ అని భావించడం నెగటివ్ ధోరణిలో కనిపిస్తుంది అని చెప్పటమే నా పరమ ఉద్దేశ్యం.
కనీసం ఇంతవరకు ఒక సాంప్రదాయికంగా కూడా లేని “దారిమార్పులో english భాషా అక్షర వాడుక” విషయంలో ఏమైనా నిషేదాలు (forbidden actions) లాంటివి తీసుకొంటే అది దారిమార్పు ప్రక్రియలో అయినప్పటికీ ఒక భాషపట్ల, ఆ భాషా అక్షరాల పట్ల నెగటివ్ చర్యలు తీసుకోవడం గానే అందరికీ కనిపిస్తుంది. ఎంతమాత్రం హేతుబద్దంకాని ఇటువంటి చర్యలు ముందు ముందు అనేక సమస్యలకు దారితీయవచ్చు. మన దీపం వెలగాలంటే పక్కవాడి దీపం ఆర్పివేయాలని కోరుకొవడం ఒక సమస్యకు, చర్చకు ముగింపు కాకూడదు. మనం ఒక పరుగుపందెంలో గెలవాలంటే ముందు మన శక్తి మీదనే దృష్టి కేంద్రీకరించాలే కాని ( పాజిటివ్ అప్రోచ్) మనం పరిగెడుతున్నప్పుడు అదే సమయంలో మన పక్కవాడి కాలు కూడా విరగకొట్టాలి అన్నట్లు ఆలోచిస్తే అది నెగటివ్ అప్ప్రోచ్ అవుతుంది. 200 సంవత్సరాలుగా మన చుట్టూ పెనవేసుకొన్న భాష ప్రభావం గుర్తించకుండా ఆ భాష అక్షరాల పట్ల అనుచితమైన నెగటివ్ అప్రోచ్ కనపరచ కూడదు.
ఇక్కడ ఏది పాజిటివ్ అప్రోచ్, ఏది నెగటివ్ అప్రోచ్ అనేది క్రింది వాక్యాలు చూడండి.
- తెలుగుమీడియంలో చదివిన ఉద్యోగికి ప్రోత్సాహకరంగా ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇస్తున్నారు (పాజిటివ్), ఉద్యోగంలో తెలుగు వచ్చిన వాడిని తీసుకొంటాం (పాజిటివ్), తెలుగుమీడియంలో చదివిన విద్యార్ధికి ఉన్నత పరీక్షలో రెండు మార్కుల వెయిటేజీ ఇస్తాం. (పాజిటివ్), షాపులలో, ఆఫీసులలో తెలుగులో బోర్డులు. నేమ్ ప్లేట్స్ పెట్టండి (పాజిటివ్). దారిమార్పులలో తెలుగు అక్షరాలు కనిపించాలి. (పాజిటివ్).
ఇటువంటి పాజిటివ్ ధోరణి తెలుగు వికాసానికి కొంతవరకు ప్తోత్సాహకరంగా వుంటుంది. అయితే ఇంకొంత ముందుకు వెళ్లి చూద్దాం.
- తెలుగుమీడియంలో చదివిన ఉద్యోగికి ప్రోత్సాహకరంగా ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇస్తాం. ఆంగ్ల మీడియంలో చదివిన ఉద్యోగికి ఒక ఇంక్రిమెంట్ తొలగిస్తాం (నెగటివ్), ఉద్యోగంలో తెలుగు వచ్చిన వాడిని తీసుకొంటాం . అయితే అతనికి ఇంగ్లీషు భాష కూడా తెలిసివుంటే మాత్రం తీసుకోనము (నెగటివ్), తెలుగుమీడియంలో చదివిన విద్యార్ధికి ఉన్నత పరీక్షలో రెండు మార్కుల వెయిటేజీ ఇస్తాం. ఆంగ్లమీడియంలో చదివిన విద్యార్ధికి ఉన్నత పరీక్షలో రెండు మార్కులు తొలగిస్తాం (నెగటివ్), షాపులలో, ఆఫీసులలో తెలుగులో బోర్డులు. నేమ్ ప్లేట్స్ పెట్టండి. షాపులలో, ఆఫీసులలో ఆంగ్లంలో బోర్డులు, నేమ్ ప్లేట్స్ పెట్టడానికి ససేమిరా అంగీకరించం (నెగటివ్), దారిమార్పులలో తెలుగు అక్షరాలు కనిపించాలి. కాని ఆంగ్ల అక్షరాలు కనిపించకూడదు. (నెగటివ్)
ఇతర భాషా అక్షరాల పట్ల నెగటివ్ అప్రోచ్ సామాజిక సైట్ లలో ముఖ్యంగా విజ్ఞానదాయికమైన సైట్స్ లలో అందులోను ప్రాంతీయ భాషా సైట్స్ లలో వుండటం మంచిది కాదని నా అభిప్రాయం.
--Vmakumar (చర్చ) 19:22, 19 అక్టోబరు 2017 (UTC)
- మనం కొత్తగా ఏదైనా అంశం వికీలో చర్చించే ముందు మార్గదర్శి లాంటి english వికీ అలాంటి విషయంలో గతంలో ఎలా ఆలోచించిందనేది. ఏం నిర్ణయం తీసుకోంది అనేది కూడా కొంతవరకు ఆలోచిస్తాం. అలాగే english వ్యాసాలలో వాడుకరులు ఆయా విషయాలలో ఎలా చేస్తున్నారు అనేది కూడా చూడవచ్చు. ఒక పేజీ కి దారిమార్పు చేసె అంశంలో ఆయా పరభాషా వాడుకరులు మనకన్నా స్వేచ్చగా, చాలా చాలా ఉదారంగా (liberal) వున్నారు. చూడండి.
india ఆంగ్ల వ్యాసానికి దారిమార్పులు 21 ప్రాంతీయ భాషా అక్షరాలతో కూడిన పదాలున్నాయి. ఆంగ్ల భాషా ప్రేమికులేవరూ ఒక english వ్యాసానికి దారిమార్పులుగా ప్రాంతీయ భాషాక్షరాలతో కూడిన పదాలు ఎందుకని వివాదం చేయలేదు. లిప్యంతరీకరణం తప్ప గత్యంతరం లేదని విరుగుడుగానూ సూచించలేదు. వారికి కావాల్సింది ఆ india ఆంగ్ల భాషా వ్యాసానికి accessibility reasonable గా మరింత విస్తృతం చేయడమే. ప్రాంతీయ భాషలలో దారిమార్పులను ప్రోత్సాహిస్తూనే తమ english వ్యాసాలకు రీడర్స్ బేస్ పాపులేషన్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి మనం ...... ఈ పరిస్థితులలో మాతృభాషలోని మన వ్యాసాలకు రీడర్స్ బేస్ ను ఎంతో పెంచుకోవాల్సిన అవసరమున్న వాళ్ళం, దారిమార్పులు పెజీలలో english అక్షరపదాలను అవసరం లేదనుకొంటూ తొలగించుకొందామనుకొంటూన్నాం. అవతలి వాళ్ళు దారిమార్పులుగా ప్రాంతీయ భాషాఅక్షర పదాలను ఒకప్రక్క కలుపుకొంటూ పోతుంటే, మన చుట్టూ వ్యాపించివున్న అనుసంధానభాష లోని అక్షరపదాలను దూరం చేసుకొంటూ పొతే మన తెలుగు వ్యాసాలు ఇంకొద్ది సంకుచితంగా మిగిలిపోతాయి.
నా అభిప్రాయంలో తెలుగుని ప్రేమించడం వేరు. ఇంగ్లీష్ ను దూరం చేసుకోవడం వేరు. తెలుగుని విస్తృతం చేయాలంటే english భరతం పట్టాలనేది గత కాలపు అభిప్రాయం. మన తెలుగు భాష వెలగాలంటే, తెలుగు అక్షరాలు కనిపించాలంటే, english అక్షరాలపై ముసుగు కప్పాలి అనే ధోరణి ఎంతమాత్రం మంచిది కాదు. english భాషను నిరాకరించకుండా దానితో కలిపి ప్రయాణిస్తూనే మనం కూడా మన అస్తిత్వాన్ని నిలుపుకోవాలి తప్పదు. ఆ విధంగా ఆలోచిస్తే మన తెలుగు వ్యాసానికి english పదం మాత్రమె కాక హిందీ పదాలు పెట్టడం కూడా సముచితంగా వుంటుంది. వీలయితే అది ఉర్దూ భాషకు సంబందించిన వ్యాసమయితే లేదా మన వ్యాసం చదవాల్సిన టార్గెట్ ఉర్దూ భాషా ప్రాంతంలో స్థిరపడిన తెలుగువారు అయితే ఉర్దూ పదంలో కూడా దారిమార్పు ఇవ్వచ్చు. ప్రపంచంలోని అనేక దేశాలు అన్య భాషా ప్రాంతాలలో స్థిరపడిన తమ స్వభాషా ప్రజలను కలుపుకోనడానికి, విస్మృతికి లోనవుతున్న తమ సంస్కృతిని వారికి తెలియచేప్పదానికి తాము రూపొందించిన స్వభాష లోని వ్యాసాలకు తమవారు స్థిరపడిన ఆయా ప్రాంతాలలోని స్థానిక భాషలలో కూడా redirect pageలను కల్పించాయి. దారిమార్పు ఒక నిర్దిష్టమన ట్యాగ్ (Tag) లాంటిదే. అటువంటి ఎన్ని నిర్దుష్ట ట్యాగ్ లను జనరంజక భాషలలో (popular languages) ఇస్తే అంతగా మన వికీకు రీడర్స్ బేస్ పెరుగుతుంది. ముఖ్యంగా తెలుగు కన్నా పరాయి భాషలోనే మంచి అభినివేశం వున్న రీడర్స్ లను మన తెలుగు వ్యాసాలకు మరింతగా చేరువకు తీసుకుపోగలం. దారిమార్పును ఒక కొత్త పేజీ అనే భావన నుండి చూడకుండా అది పరాయి భాషా రీడర్స్ లను (ముఖ్యంగా ఆంగ్లభాషాభిరుచి గల తెలుగు రీడర్స్ లను) మన తెలుగువికీ ఇంటి లోనికి ఆహ్వానించే పేజీ (ఆహ్వాన పత్రం) గా భావిస్తే అది మన భాషకు మన వికీ కి ఎంతో ఉపకారం చేసినట్లు అవుతుంది.
english వికీలో Russia ఆంగ్ల వ్యాసానికి దారిమార్పులుగా 25 ఇతర భాషా పదాలున్నాయి. వీటిలో సోవియట్ కు చెందిన 9 భాషలు ఫిన్లాండ్, krysgyz, kazakh, ఉక్రేనియన్, బైలో రష్యన్ లాంటి ఒకప్పటి ప్రాంతీయ భాషా పదాలతో పాటు సెర్బియన్, మాసిడోనియన్, బల్గేరియన్, మంగోలియన్, ఫిన్లాండ్ లాంటి విదేశీ భాషలలోను దారిమార్పులు చేసుకొన్నారు. అదేవిధంగా United States అనే ఆంగ్ల భాషా వ్యాసానికి వారు english తోపాటే దారిమార్పుల కోసం ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఫిలిప్పీన్స్ భాషా అక్షరాలను స్వీకరించారు. Israel ఆంగ్లభాషా వ్యాసంలో రీడర్స్ బేస్ ను పెంచుకోవడానికి వారు ఆ ఆంగ్ల వ్యాసానికి దారిమార్పులుగా [[11]] హిబ్రూ, హంగేరియన్ తదితర భాషా పదాలను మాత్రమె కాక అరబిక్ భాషా పదాలను (دولة إسرائيل ) కూడా స్వేచ్చగా వాడుకొన్నారు. కనుక మనం కూడా english వికీ లో వలెనే తెలుగు వికీ లో కూడా పర భాషల పట్ల ముఖ్యంగా ఆంగ్ల భాషాక్షరాల పట్ల దారిమార్పుల విషయంలో లిబరల్ గానే వుండటం మన భాషకే మంచిదని భావిస్తున్నాను.
- ఇకపోతే మనం చర్చావిషయం "తెలుగు వికీ సైట్ లో దారిమార్పు" గురించి మాత్రమే కదా. అంతేగాని గూగుల్ సైట్ నుండి లేదా ఆంగ్ల వికీ సైట్ నుండి దారిమార్పుల గురించి కాదు. “తెలుగు వికీ వ్యాసానికి దారిమార్పు” అనేది రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటిది ఇతర సైట్ లనుండి సెర్చ్ చేస్తే చదువరిని ‘తెలుగువికేపీడియా సైట్ లోని వ్యాసా’నికి తీసుకోనిపోయేది. రెండవది తెలుగువికీపీడియా సైట్ నుండి సెర్చ్ చేస్తే ఒక చదువరిని ఆతను కోరుకున్న ‘తెలుగువికేపీడియా సైట్ లోని వ్యాసా’నికి తీసుకోనిపోయేది. ఈ రెండింటికీ చిన్న తేడా వుంది. మొదటిదానికి ఉదాహరణకు గూగుల్ లాంటి సెర్చ్ పేజీ లో టైపు చేస్తే వచ్చేవి మరియు ఆంగ్లవికీ సైట్ (enwiki) లో సెర్చ్ చేస్తే వచ్చేవి. ఇది అంతర్వికీ లింకుల వలన మన వ్యాసాలకు వచ్చినా మన ప్రస్తుత చర్చకు సంబందించినది కాదని నా అభిప్రాయం. గూగుల్ సెర్చ్ నుండి మన తెలుగు వ్యాసానికి లింక్ కలిస్తే అది గూగుల్ వారి దయ. మనకు ప్రాప్తం. అలాగే ఆంగ్ల వికీ సైట్ నుండి మన తెలుగు వ్యాసానికి లింక్ కలిస్తే అది ఆంగ్లవికీ దయ. మన ప్రాప్తం. అలా ఎంతకాలం ఏ విధంగా కొనసాగుతాయో చెప్పలేం. “అక్కడ కుదురుతుంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు” అని భావించకూడదనేదే నా అభిప్రాయం. బయట హోటల్ లో భోజనం దొరుకుతుందని మనం ఇంటిలో భోజనం వండటం ఇక అనవసరం అనలేం కదా!. google, ఆంగ్లవికీ సైట్లు వారు వారి సైట్ నుండి మన వ్యాసాలకు లింక్ కలుపుతున్నారు కదా అని మన సొంత తెలుగు వికీ సైట్లో ఇక ఆ అవసరం లేదు అని భావించరాదు. మన తెలుగు వికీ సైట్ కు వచ్చిన పాఠకుడికి సెర్చ్ ఆప్షన్స్ ను తగ్గించి, వీలయితే గూగుల్ కి, లేదా ఆంగ్ల వికీకి వెళ్ళమని refer చేయడం వేరే విధంగా వుంటుంది. మన ఇంటి (తెలుగు వికీ) కి వచ్చిన అతిథికి భోజనం (సెర్చింగ్ facilitity కల్పించడం) పెట్టలేక పక్కింట్లో (ఆంగ్లవికీ) భోజనం చేయమని, లేదా హోటల్ (గూగుల్) లో తినమని చెప్పడంలా వుంటుంది. నా అభిమతంలో మన చర్చ “తెలుగువికీపీడియా సైట్ నుండి సెర్చ్ చేయడం గురించి మాత్రమే”. ఎందుకంటే దారిమార్పు పేజీని మనం తెలుగు వికీ సైట్ లోన మాత్రమే చేస్తున్నాం. కనుక గూగుల్ లో సెర్చ్ చేస్తే, ఆంగ్ల వికీలో సెర్చ్ చేస్తే అనే విషయాలు మనకు సంబందించిన విషయం కాదు అనుకుంటున్నాను. మన "తెలుగు సైట్ లో సృష్టించే దారిమార్పు పేజీ"-దానిలో వాడే భాష గురించి మాత్రమే చర్చకు సంబందించినది.
అయితే english పదాలతో చక్కని పరిచయం గల ఒక రీడర్ ను మన తెలుగు వికీ సైట్ లో తనకు కావలిసిన వ్యాసాలను english అక్షరాలతో సెర్చింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఒకపక్క అతన్ని english అక్షరాలతో సెర్చింగ్ చెయడాన్నీ నిరోదిస్తూ అంతగా కావాలంటే అతను గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేదా ఆంగ్ల వికీ సైట్లోకి వెళ్లి అక్కడ english అక్షరాలతో సెర్చ్ చేసుకొని, ఆ ఆంగ్ల వ్యాసం చేరుకొన్న తరువాత అక్కడినుండి అంతరవికీ లింకుల ద్వారా మళ్ళీ తెలుగు వ్యాసం చేరుకోవచ్చు కదా అని మనం సమర్ధించుకోవచ్చు. కాని రీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించిస్తే అతనికి “అది అతనికి అంత అవసరమా!”. మన సైట్ కు వచ్చిన అతిధి (reader) ని పొమ్మనకుండా పొగబెట్టి మళ్ళీ డొంక దారిలో రావచ్చుకదా అని చెప్పినట్లవుతుంది. --Vmakumar (చర్చ) 21:10, 19 అక్టోబరు 2017 (UTC)
రీడర్స్ లకు అతి సులభంగా ఉండాల్సిన ఈ అంశంలో మన జోక్యం అతి తక్కువగా వుండాలి. దానిలో మన ఇష్టానిష్టాలు ప్రతిఫలించకూడదు. మన భాష, పరాయి భాష అనే భాషాకోణంలో అసలే చూడకూడదు. దారిమార్పును కేవలం చదువరిని దృష్టిలో పెట్టుకొనే వుండాలి. ఒకవిధంగా చెప్పాలంటే customer point of view అన్నమాట. ఒకవిధంగా ఒక వ్యాసం (ప్రోడక్ట్) రూపొందిన తరువాత reader (customer) కు ఎన్ని విధాలుగా మన ప్రోడక్ట్ ను చేరుకోగలడో అన్ని విధాలుగా దారిమార్పు వుండాలి. అలా దారిమార్పు చేసేటప్పుడు కూడా reader కి తెలిసిన భాషలను, అతని వెతికే పద్దతినే మనం దారిమార్పు విధానంలో అనుసరించాలి. అతనికి english అక్షరాలతోనే టైపు చేయడం మోస్ట్ కన్వీనియంట్ అయితే ఆ పద్ధతికి మనం (తెలుగు అబిమానం పేరుతో) మోకాలడ్డకూడదు. దీనిలో మన భాష అక్షరాలుఅని, english భాష అక్షరాలు అని ఆలోచిస్తే మనం తయారుచేసిన ప్రోడక్ట్ ని మనమే ఒక మూల పెట్టుకోన్నట్లవుతుంది.
- అంటే దారిమార్పులో మనం english భాషపై restrictions విధించకుండా వుంటే, ఆంగ్లభాషాభినివేశం ఎక్కువగా వున్న తెలుగు రీడర్స్ లకు సెర్చింగ్ మరింత సులభంగా వుంటుంది. దీనిలో తెలుగు వికీ అదనంగా కోల్పోయేదేముంది. మహా అయితే ఒక దారిమార్పు పేజీ. వికీ కి పేజీలు కొరతగా లేవు కదా. ఈ విషయంలో వికీ నిర్వాహకులకు, పరిపాలనాపరమైన కారణాలు కాని, ప్రత్యేకమైన ప్రతికూల కారణాలు ఏమైనా ఉన్నట్టు లేవు. దారిమార్పు page తెలుగులో లేదే అన్న మానసిక భావన (emotional feelings) కాకుండా ఏదైనా తార్కిక కారణం ఉందా! మన మానసిక భావాల కారణాలతో ఎదుటివాడి సౌలభ్యాన్ని దెబ్బతీయకూడదు. హేతుబద్దతకు నిలువజాలలేని మానసిక భావనలను పరిగణనలోనికి తీసుకొని విధాన నిర్ణయాలు తీసుకోవడం నిబందనలను రూపొందించడం చేస్తే అది వేరే అర్ధాలకు దారి తీస్తుంది. కేవలం ఒక భాష పై అకారణంగా అనుచితంగా అణచడం అనే అభిప్రాయానికి నెలకొంటుంది.
ఒకవేళ తెలుగువికీలో ఆంగ్ల దారిమార్పులు కూడదని నిబందన పెట్టుకొంటే అది హిందీతో పాటు అన్ని ఇతర భాషా వికీ సైట్స్ లలో కూడా ఆ మనం పెట్టిన నిబందన తార్కికంగా నిలవాలి. మనది కూడా వికీ గ్రూప్ లోని ఒకానొక ప్రాంతీయ భాషా సైట్ కదా. ఇక్కడ ఒక ప్రాంతీయ సైట్ లో తీసుకొనే ఒక భాషాపరమైన విధాన నిర్ణయానికి మనం చూపే కారణాలు అదే గ్రూప్ లోని మరో ప్రాంతీయ భాషా సైట్ లో కూడా applicable కావాలి. ఇక్కడ మన వాదన తార్కికంగా చెల్లుబాటు అయితే అక్కడ english వికీతో సహా మిగిలిన అన్నిప్రాంతీయ భాషా సైట్ లలో కూడా చెల్లుబాటు అయినట్లే కదా! ఆ పైన ఆంగ్ల వికీలో అన్యభాషలలో వున్న redirect page లను తొలగించమని అడిగే నైతిక హక్కు కూడా మనకు వచ్చినట్లే కదా!. అలాగే ఫ్రెంచ్ భాషా వికీ సైట్లో కూడా దారిమార్పు పేజీలు englishతో సహా అనేక ప్రపంచ భాషలలో ఆయా భాషాక్షరాలతో పదాలున్నాయి. అవి కూడా తొలగించబడాలి. అలాగే స్పానిష్, జర్మనీ, డచ్, జపాన్, రష్యా, చైనా, జపాన్ ... భాషా సైట్లలో కూడా దారిమార్పు పేజీలు ఆయా మాతృభాషలలో తప్ప వేరే భాషలలో తొలగించగలమని చెప్పగలమా! ఇక్కడ దారిమార్పుగా ఆంగ్ల భాష అక్కర్లేదనే నియమం చెల్లుబాటైతే అక్కడ కూడా reciprocal గా ఆ వాదన నిలవగలగాలి. అలా నిలవలేనినాడు “ఆంగ్లభాష అక్కరలేదు” అన్న వాదనకు మనం చెప్పబోయే కారణాలు తర్కబద్దమైనవి కావని హేతుబద్దమైనవి కావని రుజువవుతుంది. అప్పుడు ఆంగ్ల భాష అవసరం లేదు అనే మన వాదన కేవలం మన మానసికపరమైన వాదనగా, ఉద్వేగపరమైన అభిప్రాయాలుగా మిగిలిపోతుంది. emotions మీద ఆధారపడి తీసుకొనే ఏ నిబందన, నిర్ణయాలు చెల్లుబాటును త్వరగా కోల్పోతాయి. అందువలన దారిమార్పు భాషగా english భాషను కూడా నిర్నిబందంగా అంగీకరించాలి.
అయితే దీనికి సంబంధించి తెలుగు వికీలో మనదైన సంప్రదాయాలను, నిబందనలను ఓటింగ్ ద్వారా రూపొందించుకొనే స్వేచ్చ మన నిర్వాహకులకు వుంది కదా అని ప్రశ్నించవచ్చు. అయితే స్పష్టంగా చెప్పేదేమీటంటే ఒక ప్రాంతీయ భాషా వికీ సైట్ లో మరొక భాషా వాడుకను హేతుబద్దత లేని కారణాలతో restrict చేస్తూ తీసుకోనే ఏ నిర్ణయమైనా మన సైట్ లోనే కాదు మిగిలిన ప్రాంతీయ భాషా వికీ సైట్ లలో కూడా వివాదాస్పదం అవుతుంది. మన వికీ సైట్లో మన స్వేచ్చ, మన తీసుకొనే నిర్ణయాలు ఎంతవరకు వుండాలి? మన స్వేచ్చ, మనం తీసుకొనే నిర్ణయాలు మన తెలుగు వాడకంను ఇతోధికంగా ప్రోత్సాహించాలే కాని మరో భాషపై అనుచితమైన నిబందనలు విధించేటట్లు వుండకూడదనేది నా అభిప్రాయం. అసలు ఒక ప్రాంతీయ భాషా వికీ సైట్ లో దారిమార్పుభాషగా english ను ఎందుకు restrict చేస్తున్నారు అని రేపెవరైనా ప్రశ్నిస్తే అంటే మన ఏమని ఆన్సర్ చేయగలం? తెలుగు వాడకం ప్రోత్సాహించడానికి అన్నదే మన విధానమని చివరకు తేలిపోతుంది. (లేకపోతే english భాషలోని అవలక్షణాలు ఏమైనా వుంటే మనం ఏకరువు పెట్టాల్సి వుంటుంది.) దానికోసం మీ తెలుగు భాషను ప్రోత్సాహించడానికి సానుకూల చర్యలు చేపట్టాలే గాని english భాష మీద ప్రతికూల చర్యలు చేపట్టడం దేనికి? ఒక భాషను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అన్న ప్రశ్నమళ్ళీ ఎదురవుతుంది. ఇలాంటి ప్రశ్నలకు హేతుబద్దమైన జవాబులు మన దగ్గర లేనప్పుడు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకపోవడమే కొంతలో కొంత మంచిదవుతుంది. నా వరకు సమంజసమని తోచిన విధానం తెలియచేస్తాను.
సకారాత్మకరీతిలో స్వచ్చందం (Voluntary with possitive approach): ఎవరైనా ఒక తెలుగు వ్యాసానికి ఆంగ్ల భాషలో దారిమార్పు చేయవచ్చు. చేయకుండా కూడా ఉండవచ్చు. అయితే అలా ఒకరు చేసిన ఆంగ్ల దారిమార్పును వేరొకరు తొలగించకూడదు. అలాగే ఒక తెలుగు వ్యాసానికి తెలుగులోకూడా ఎవరైనా దారిమార్పు చేయవచ్చు. చేయకుండా కూడా ఉండవచ్చు. అయితే అలా ఒకరు చేసిన తెలుగు దారిమార్పును వేరొకరు తొలగించకూడదు. సాధారణంగా ఏ దారిమార్పునైనా ఒకసారి చేసిన తరువాత కేవలం భాషాకారణంగా తొలగించకూడదు. అంటే దారి మార్పు పేజి ని తొలగించడానికి అది ఆంగ్లంలో వుంది, తెలుగులో వుంది అనేది కారణం కాకూడదు.
నా దృష్టిలో live and let them live దృక్పధానికి పై రకమైన విధానం సమంజసంగా తోస్తుంది. దీనివల్ల వివాదాలు రేగడానికి అవకాశం తక్కువ. english ను కూడా మనతో కలుపుకుపోదాం అన్న భావన ఉన్నవారికి ఇది నచ్చవచ్చు. కేవలం నా తెలుగు భాష అని పట్టించుకొనే వారికి నచ్చక పోవచ్చు. ఎవరి వాదన వారిది. ఎవరినీ తప్పు పట్టలేం. అయితే ఒక భాషా విధానంపై మనం తీసుకొనే నిర్ణయం ముందు ముందు మనలను పాజిటివ్ గా నడవాలా, నెగటివ్ గా నడవాలా అనేది సూచిస్తుంది. అయితే అనుభవజ్ఞులైన నిర్వాహకులకే ఇలాంటి విషయాలలో మాకన్నా / ఇతరుల కన్నా ఎక్కువ విషయాలు కూలంకుషంగా తెలిసే అవకాశం వుంది. వివేచనతో కూడిన వారి నిర్ణయమే ఫైనల్.
--Vmakumar (చర్చ) 22:09, 19 అక్టోబరు 2017 (UTC)
చిన్న గమనిక. పై వివరణ తెలియచేసిన క్రమంలో పొరపాటున మధ్యలో మిస్ అయిన చిన్న పేరాను తిరిగి చివరలో జత చేస్తున్నాను.
అలాగే అన్ని పదాలకు ఆంగ్ల దారిమార్పులు అనవసరం అనేదానికి నేను కూడా ప్రాధమికంగా సమర్దిస్తాను. అయితే ఏ పదాలకు అవసరం లేదు. ఏ పదాలకు అవసరం అని కొలబద్ద గీసి చెప్పలేం. పదాలను పరిచయమైన, పరిచయం కాని పదాలు అని తిరిగి విభజించడం, పరిచితమైన పదాలకు దారిమార్పులుగా ఆంగ్ల పదాలుండకూడదనడం. అంతగా పరిచయం లేని పదాలకు మాత్రమే చేయాలనడం ఎల్లవేళలా కరెక్ట్ కాకపోవచ్చు. పైగా ఇది లేనిపోని సమస్యలకు దారి తీస్తుంది. ఎందుకంటే మనకు పరిచయమైన పదం అందరికీ పరిచయం కాకపోవచ్చు! అలాగే మనకు పరిచయం కాని పదం అందరికీ పరిచయమై వుండవచ్చు! తెలుగులో ఎవరో చెప్పినట్లు ‘మనం చూసేదంతా నిజమూ కాదు. మనం చూడనిదంతా అబద్ధమూ కాదు’. మనకు నచ్చినది అందరికీ నచ్చాలని లేదు కదా! ఉదాహరణకు తెలుగువికీకి వచ్చిన కొత్తలో ఎన్ని తెలుగు పదాలు కొరుకుడుపడకపోవడంతో అర్ధం తెలియక ఇబ్బంది పడ్డాను. ఆంగ్లంలో లేదా కనీసం ఒక బ్రాకెట్ లో englishలోని సమానార్ధక పదం జత చేసినా కొత్తవారికి ఎంతో సహాయకారిగా వుండేది అనిపించేది. ఉదాహరణకు తెలుగులో “తెరపట్టు” పదం అంటే నాకు అర్ధం కాక చాలా కాలం వరకు confuse గురయ్యేవాడిని. తరువాత తెలిసింది అది screenshot కి తెలుగు పదం అని. సర్, ఎవరి భాషా స్థాయి వారికుంటుంది. అందరి విజ్ఞాన స్థాయిలు ఒకేలా ఉండవు కదా! అందరి భాషా స్థాయిని మన కోణంలోనే చూడకూడదు. దారిమార్పుల కోసం పరిచయ పదాలు, పరిచయం కాని పదాలు అని ఓ కొత్త విభజన గీసుకొని పోవడం కన్నా, తర్వాత ఆ విభజనలో ఒక పదం పరిచయమా, కాదా అని తిరిగి చర్చించుకోవడం, కీచులాడుకోవటం పరమ వృధా ప్రయాస. దీనివల్ల మనం అసలు టాస్క్ నుండి divert అయిపోతాం. ఇటువంటి వివాదాస్పద విషయాలలోనే సకారాత్మకరీతిలో స్వచ్చందం విధానం (Voluntary with possitive approach) సమంజసంగా ఉండవచ్చు. ఈ పద్దతిలో ఆయా వాడుకరుల స్వీయ విచక్షణకే వదిలివేయడం ఉత్తమోత్తమ పద్దతి అవుతుంది. దీని ప్రకారం సాధారణంగా ఎవరికైనా ఒక పదం అపరిచిత పదం అనిపిస్తే దారిమార్పు చేస్తాడు. ఒకసారి దారిమార్పు చేసిన పేజీని తొలగించడానికి అది పరిచయ పదం అనేది కారణం కాకూడదు. సాధారణంగా ఎవ్వరూ అదేపనిగా దారిమార్పు పేజీలను సృష్టిస్తూ పోవాలనుకోరు. అయినా అటువంటివారు ఎదురవుతారేమోనని ముందుగానే మనం rigidity గా వుండవసరం లేదు. ఎవరైనా (రోబోట్ తప్ప) తమ పొట్టకు సరిపోయెంతగా మాత్రమే తినగలరు. అయితే అదే పనిగా ఒక టాస్క్ లా అలుపెరగకుండా దారిమార్పుల పేజీలను మాత్రమే ఎవరైనా సృష్టిస్తుంటే మాత్రం అది కొంత చికాకు వ్యవహారంగానే వుంటుంది. అటువంటప్పుడు నిర్వాహకులు తమ తమ విచక్షణాధికారం వుపయోగించి అటువంటివారిని విచారిస్తే సరిపోతుంది. కొరడా ఝులిపిస్తే సరిపోతుంది. సాధారణంగా క్రియేటివిటి కి సంబందించినంత వరకూ నిబందనలు చాలా చాలా క్లుప్తంగా చాలా సరళంగా(simple) చాలా ఉదారంగా (liberal) గా వుండాలి. rigidity గా ఏమాత్రం వుండకూడదు. అయితే అసాధారణ పరిస్థితులలలో మాత్రమే విచాక్షణాదికారం ఉపయోగించాలి. తెలుగు వికీపేడియా చేసేది క్రియేటివ్ వర్క్. --Vmakumar (చర్చ) 05:42, 20 అక్టోబరు 2017 (UTC)
ఇంగ్లీషులో దారిమార్పు పేజీ ఉండకూడదు
మార్చు- ఇంగ్లీషు దారిమార్పు పేజీ అక్కర్లేదు. ఎందుకంటే..
- ఇంగ్లీషు పేరుతో వెతికినపుడు ఫలితాల్లో తెలుగు పేజీలు వస్తాయనేదే దీని ఉద్దేశమైతే, వాస్తవంలో అది జరగడం లేదు. గూగులు వంటి సైట్లలో వచ్చే వెతుకులాట ఫలితాల్లో సాధారణంగా ప్రజలు మొదటిపేజీ దాటి ముందుకెళ్ళరు. మహా అయితే రెండో పేజీ చూస్తారు. ఈ పేజీల్లో మన లింకు దొరక్కపోతే ఆ తరువాత ఉన్నా లేనట్టే. ఇంగ్లీషు పదంతో వెతికి తెలుగు వికీపీడియా లింకు కోసం చూస్తే ఇదే జరుగుతుంది. Vijayawada వెతుకులాటలో జరిగిందదే -మొదటి పది పేజీల్లో ఈ లింకు లేదు. ఏ పేజీలో ఉందో, అసలుందో లేదో తెలియదు.
- ఇంగ్లీషు పేరుతో వెతికినపుడు ఫలితాల్లో ఎన్వికీ లింకు వస్తుంది. అక్కడి నుండి తెలుగు వ్యాసానికి ఎలాగూ రావచ్చు.
- ఒకసారి తెలుగు వికీపీడియాకు వచ్చాక, ఇక్కడ తెలుగులోనే వెతకవచ్చు. వెతుకుపెట్టెలో తెలుగులో రాయొచ్చు కాబట్టి.
- అన్నిటికంటే ముఖ్యమైనది.. google.co.in/ లో తెలుగును ఎంచుకుంటే, వెతుకుపెట్టెలో తెలుగులోనే నేరుగా టైపుచేసి వెతకవచ్చు. ఇక ఇంగ్లీషు దారిమార్పు పేజీ అవసరమేముంది?
- క్రోమ్ బ్రౌజరులో తెలుగు వికీపీడియాను డిఫాల్టు సెర్చి ఇంజనుగా పెట్టుకునే వీలుంది. అపుడు వెతుకులాట తెలుగు వికీపీడియాలోనే జరుగుతుంది.
- గూగులు, తమ వెతుకులాట ఫలితాలు చాలా యాక్యురేటుగా ఉండాలని కోరుకుంటుంది. ఫలితాల్లో పైన కనబడడం కోసం అనుచితమైన పద్ధతులకు పాల్పడినవారిని గూగులు బ్యాన్ చేస్తుంది. ఒ ఏడెనిమిదేళ్ళ కిందట ఈ కారణంగానే BMW వెబ్‌సైటును నిషేధించింది. ఇపుడీ ఇంగ్లీషు పేజీనుండి తెలుగు పేజీకి దారిమార్పును ఎలా భావిస్తారో వాళ్ళు!?
- ఆంగ్ల దారిమార్పుల పేజీలు అవసరంలేదు...
- వ్యాసం ఆంగ్లవికీపీడియాలో ఉన్నప్పుడు దాని ఎన్వికీ లింకుల ద్వారా తెలుగు వికీపీడియా వ్యాసానికి చేరుకోవచ్చు.
- క్రోమ్ బ్రౌజరులో నేరుగా తెలుగు పదంతో వెతికే అవకాశం ఉంది. ఇలా వికీలో వ్యాసం ముందుగా వస్తుంది.----కె.వెంకటరమణ⇒చర్చ 04:56, 13 అక్టోబరు 2017 (UTC)
- తెలుగు పేర్లకు ఇంగ్లీషు పేరు నుంచి దారి మార్పు అవసరం లేదు. ఒక సమస్య ప్రస్తావిస్తాను. ఒక తెలుగు పేరును ఇంగ్లీషులో పలు రకాలుగా రాయవచ్చు. ఉదాహరణకు ఒక సినిమా పేరును తీసుకుందాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. దీనిని ఒకరు ఆంగ్లంలో Sitamma Vakitlo Sirimalle chettu, Seethamma Vakitlo Sirimalle chettu అనీ ఇంక వాటి కాంబినేషన్లు, చాలా రకాల స్పెల్లింగులు తయారు చేసుకోవచ్చు. ఎవ్వరినీ తప్పు పట్టలేం. వాటికి పర్యాయపదాలు ఉండవచ్చు. వాటన్నింటితో దారి మార్పులు చేయాల్సి రావచ్చు. --రవిచంద్ర (చర్చ) 05:12, 13 అక్టోబరు 2017 (UTC)
ఇంగ్లీషులో దారిమార్పు పేజీ ఉన్నా లేకున్నా ఇబ్బందేమీ లేదు (తటస్థ వైఖరి)
మార్చు- JVRKPRASAD అభిప్రాయము
- ఇంగ్లీషులో దారిమార్పు పేజీ ఉండాలి: కొన్ని ముఖ్యమైన వాటికి తప్పని సరిగా దారి మార్పులు ఉండాలి. వ్యాసములలో ఫార్ములా రూపములో వస్తాయి. కొన్ని శాస్త్రాలలోని వాటికి ఆంగ్లము అవసరము. ఉదా:-Al → అల్యూమినియం
Al(NO3)3 → అల్యూమినియం నైట్రేట్ Al(OH)3 → అల్యూమినియం హైడ్రాక్సైడ్ Al2(SO4)3 → అల్యూమినియం సల్ఫేట్ Al2O3 → అల్యూమినియం ఆక్సైడ్ Al2S3 → అల్యూమినియం సల్ఫైడ్ Al4C3 → అల్యూమినియం కార్బైడ్ AlAs → అల్యూమినియం ఆర్సనైడ్ AlAsO4.8H2O → అల్యూమినియం ఆర్సెనేట్ AlB2 → అల్యూమినియం డైబోరైడ్ AlBr3 → అల్యూమినియం బ్రోమైడ్ AlCl → అల్యూమినియం మోనోక్లోరైడ్ AlCl3 → అల్యూమినియం క్లోరైడ్ AlI3 → అల్యూమినియం అయోడైడ్ AlK(SO4)2 → అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ AlN → అల్యూమినియం నైట్రైడ్ AlP → అల్యూమినియం ఫాస్ఫైడ్ AlSb → అల్యూమినియం ఆంటిమొనైడ్ @ → ఎట్ సైన్ AFI 10 టాప్ 10 → అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు ASCII → ఆశ్కి ASLV → సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక
- ఇంగ్లీషులో దారిమార్పు పేజీ ఉండకూడదు: ఈ క్రింద సూచించిన ప్రజలకు బాగా వాడుకలో ఉన్నవి, సంపూర్ణ పదములు, ఇలాంటి వాటికి ఆంగ్ల పదములు అవసరము లేదు. Asvaghosa → అశ్వఘోషుడు
Vijayawada → విజయవాడ Back arc basin → బ్యాక్ ఆర్క్ బేసిన్ Barabar caves → బరాబర్ గుహలు Barampuram → బరంపురం Beryllium nitrate → బెరీలియం నైట్రేట్ Bethamcherla → బేతంచెర్ల Bhadrachalam → భద్రాచలం Bhadrachalam Mandal → భద్రాచలం మండలం Bhainsa → భైంసా Bheemadevarpalle → భీమదేవరపల్లి Bheemini → భీమిని Bhopal → భోపాల్ Bhuavanacandra → భువనచంద్ర
- ఏ పదాలు ప్రజలకు సులువుగా అర్థం అవుతాయో వాటికి ఆంగ్లము అవసరము లేదు. ఎబ్రివేషను పదాలకు అవసరము. (ఇంకా ఎంతో వ్రాయాలని ఉంది...)JVRKPRASAD (చర్చ) 00:46, 11 అక్టోబరు 2017 (UTC)
చర్చ
మార్చుతెలుగువికీలో ఇంగ్లీషు దారిమార్పు పేజీ వల్ల ఉపయోగమేంటో చూద్దాం. తెలుగులో వెతికే వీలు లేని, రాయడం చేతకాని వ్యక్తికి ఇది ఉపయోగపడుతుంది. అతడు తెలుగులో చదవగలడు. తెలుగు వ్యాసాన్ని చదవాలి అనే కోరికతో వెతుకుతున్నాడు. ఉదాహరణకు విజయవాడ గురించి చదవాలని తలచిన సదరు వ్యక్తి ఏంచేస్తాడో చూద్దాం.
- Vijayawada అని రాసి గూగుల్లో (జాలంలో) వెతకవచ్చు: ఇలా చేస్తే గూగుల్లో తెలుగు పేజీ కనబడదు/ఫలితాల్లో బాగా చివరగా ఎక్కడో ఉంటుంది -ఇంగ్లీషు ఫలితాలే ముందు కనిపిస్తాయి. (ఎందుకో తెలుసుకోవాలంటే ఎస్ ఇ వో గురించి చదవాలి) ఇంగ్లీషువికీలో Vijayawada పేజీకి వెళ్ళి, ఎడమ పక్కన ఉన్న తెలుగు లింకును పట్టుకుని తెవికీలోని విజయవాడ పేజీని చేరుకోవచ్చు. (ఈ పద్ధతిలో తెవికీలో Vijayawada అనే దారిమార్పు పేజీ అక్కర్లేదు.)
- Vijayawada అని రాసి ఇంగ్లీషు వికీపీడియాలో వెతకవచ్చు: నేరుగా ఎన్వికీని చేరుకుని అక్కడ వెతుకుపెట్టెలో Vijayawada కోసం వెతికి, ఆ పేజీకి వెళ్ళి, అక్కడ ఎడమ పక్కన ఉన్న తెలుగు లింకును పట్టుకుని విజయవాడ పేజీని చేరుకోవచ్చు. (ఈ పద్ధతిలో కూడా తెవికీలో Vijayawada అనే దారిమార్పు పేజీ అక్కర్లేదు.)
- Vijayawada అని రాసి తెలుగు వికీపీడియాలో వెతకవచ్చు: నేరుగా te.wikipedia.org ని చేరుకుని అక్కడ వెతుకుపెట్టెలో Vijayawada కోసం వెతుకుతాడు. Vijayawada అనే దారిమార్పు పేజీ ఉంటే తప్ప, అతడు విజయవాడ పేజీని చేరుకోలేడు. కుమార్ గారు చెబుతున్నది దీని గురించే. ఈ సంభావ్యతను ఎందుకు తోసిపుచ్చుతున్నారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్నే. దాని గురించి నా వివరణ ఇది:
- ఆ వ్యక్తి నేరుగా తెలుగు వికీపీడియాకు వచ్చేసాడు. (అంటే అతడికి అదొకటి ఉందని తెలుసు, చెప్పనక్కర్లేదు)
- అతడు తెలుగు చదవగలడు, కానీ రాయలేడు. అందుకు కారణం తెలుగులో రాసే సౌకర్యం అతడి కంప్యూటరులో లేదు/రాయడం అతడికి రాదు.
- తెలుగు వికీపీడియాలో వెతుకు పెట్టెలో ఇంగ్లీషు, తెలుగు రెండు భాషల్లోనూ రాయవచ్చు. తెలుగులో రాయడానికి ఆరు పద్ధతులున్నాయి. వెతుకుపెట్టెలో కర్సరు పెట్టగానే ఈ పద్ధతులను అది చూపిస్తుంది. అతడు లిప్యంతరీకరణను ఎంచుకుని ఇంగ్లీషులో టైపు చేస్తే అది తెలుగులో చూపిస్తుంది. vijayavaaDa అని అతడు టైపిస్తే అది విజయవాడ అని రాస్తుంది. విజయవాడ పేజీని చూపిస్తుంది. ఇక ఇంగ్లీషు దారిమార్పు పేజీ అవసరముందా? లేదు!
ఇకపోతే ఇంగ్లీషు దారిమార్పు పేజీ అక్కర్లేదన్న వాదనను నకారాత్మకంగా భావించి కుమార్ గారు వాదించారు. కావాలనో, అనుకోకుండానో.. దారిమార్పు పేజీ వద్దన్నవారిని తెలుగు దురభిమానులుగాను, నెగటివ్ ఆలోచనాపరులుగానూ చిత్రించారు. అది నాకు సహేతుకంగా తోచలేదు. నకారాత్మక ధోరణి ఉండకూడదని చెబుతూనే ఆయన ఇతరుల అభిప్రాయాలను నకారాత్మక ధోరణిలో చూసారని నాకనిపించింది.
- నా వాదన ఇంగ్లీషుకు వ్యతిరేకం కాదు. ఇంగ్లీషు దారిమార్పు అక్కర్లేదని చెప్పడం. దానికి కారణాలు కూడా చెప్పాను. మరింత వివరంగా పైన చెప్పాను.
- తెలుగు వికీపీడియాలో ఇంగ్లీషు దారిమార్పు అవసరం లేదని చెప్పడం దురభిమానం కాదు, ఇంగ్లీషు వికీపీడియాలో తెలుగు పేరుతో దారిమార్పు పేజీ పెట్టడం మాత్రం దురభిమానం అనిపించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పేజీ అవసరం లేదు కాబట్టి. ఇంగ్లీషు పేజీ చదవగలిగినవాడు ఇంగ్లీషు పేజీ చూడాలనుకుంటే ఇంగ్లీషులోనే వెతుకుతాడు, ఇంగ్లీషు పేజీకి వెళ్తాడు. అక్కడ తెలుగులోనో రష్యనులోనో చైనీసులోనో దారిమార్పు పేజీ ఎందుకు, దురభిమానం కాకపోతే!
- India, Vijayavaada, NT Ramarao అనేవి ఇంగ్లీషు పదాలు. KMnO4 అనేది ఇంగ్లీషు కాదు, అది సైన్సు, అదొక విశ్వభాష. ప్రపంచంలో ఏ భాషలోనైనా దాన్ని KMnO4 అనే అంటారు. దాన్ని దారిమార్పుగా ఉంచేందుకు నా కభ్యంతరమేమీ లేదు.
- అవసరం లేదని చెప్పినంత మాత్రాన, ఈసరికే సృష్టించిన ఇంగ్లీషు దారిమార్పు పేజీలను తొలగించాలన్నది నా మతం కాదు. కానీ ఇకపై సృష్టించనక్కర్లేదు అని చెబుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 07:19, 20 అక్టోబరు 2017 (UTC)
చదువరి గారు గారు. నేను చెప్పదలుచుకొన్న అంశాన్ని, నా భావాన్ని (3) విభాగంలో ఎంతో సూటిగా catch చేసారు. ఎంతో కృతజ్ఞతలు. అంతే ప్రతిభావంతంగా పాయింట్ల వారీగా చక్కగా విశ్లేషించారు. మీరు మూడు విభాగాలుగా (1),(2),(3) పరిశీలించారు. మూడవ విభాగంలో కూడా అంటే 3(3) లో పరిష్కారం చెప్పారు. నేను కూడా ఆయా విభాగాల వారీగానే వివరిస్తాను. అయితే మీ అంత సూటిగా, గాడంగా తెలుగుపదాలలో నేను చెప్పలేకపోవచ్చు. తీవ్ర పని వత్తిడి వలన, అందులోన తెలుగులోను, ఆంగ్లంలోను టైపింగ్ సరిగా చేతకాకపోవడం వల్ల నా రెస్పాన్స్ ఆలస్యం అవుతూ వున్నది. అన్యదా భావించవద్దు.
ముందుగా 3 వ విభాగంలో పాయింట్ కు వద్దాం.
3(3) లో మీరు “ .......అతడు లిప్యంతరీకరణను ఎంచుకుని ఇంగ్లీషులో టైపు చేస్తే అది తెలుగులో చూపిస్తుంది. vijayavaaDa అని అతడు టైపిస్తే అది విజయవాడ అని రాస్తుంది. విజయవాడ పేజీని చూపిస్తుంది. ఇక ఇంగ్లీషు దారిమార్పు పేజీ అవసరముందా? లేదు! “ అయితే ఈ వివరణలో మీరు చెప్పిన ఉదాహరణ (vijayawada) యొక్క సార్వత్రికత, సౌలభ్యత లపై కొన్ని సందేహాలున్నాయి. మరో రెండు ఉదాహరణలతో కొద్దిగా వాటిని మీ ముందు ఉంచుతూ నా వాదన కొనసాగిస్తాను. ప్రాధమికంగా దారిమార్పు readers point of view లో ఆలోచించాల్సిన అంశం. దాని ఉద్దేశ్యం అతనికి మన వ్యాసాన్ని direct గా చేరుకోవడంలో అతనికి సౌలభ్యత కల్పించడమే కదా. ఈ సౌలభ్యత మీరు చెప్పే విధానంలో ఎలా వుంది. నేను చెప్పే విధానంలో ఎలా వుంది. పరిశీలిద్దాం . reader కి తను కోరుకున్న వ్యాసం చేరుకోవడానికి - ఆంగ్ల దారిమార్పు అవసరం లేకుండానే సులభంగా ఉన్నట్లయితే ఆంగ్ల దారిమార్పు అనవసరం. అలాకాక ఆంగ్ల దారిమార్పు వలన అతనికి సులభంగా వుంటే ఆంగ్లమార్పును కొనసాగిద్దాం.
ముందుగా మీరు 3(3) విభాగం లో ప్రస్తావించిన లిప్యంతరీకరణం పద్దతిలో ఒక reader తను కోరుకొన్న వ్యాసాన్ని చేరుకోవడానికి ఎన్ని స్టెప్స్ దాటాలో వివరిస్తాను. అదే దారిమార్పును ఆంగ్లంలో కల్పిస్తే - అతను అదే వ్యాసానికి చేరడానికి ఎన్ని స్టెప్స్ లు దాటాలో కూడా చూడవచ్చు. ఏది తక్కువ స్టెప్స్ వుంటే, ఏది confuse లేకుండా వుంటే అదే సులభమైన పద్దతి అనవచ్చు. ఆ వ్యాసానికి ఒక ఉదాహరణగా విజయవాడ అయితే మీరన్నట్లు సరిపోయింది. ఎందుకంటే vijayavaaDa ఆంగ్లపదం లిప్యంతరీకరణంలో విజయవాడ గా మారడంతో ఏ సమస్య రాలేదు. అయితే తెవీకీలో కనిపిస్తున్న లిప్యంతరీకరణం మరీ అంత సులువుగా లేదు. మామూలుగా అయితే ఇది మనకు బాగా అలవాటై పోయింది. పైగా ఈ విధానంలో సగటు reader కి తెలుగు లిప్యంతరీకరణం మీద కొంత అవగాహన, పట్టు వుండాలి అనిపిస్తున్నది. క్రింది ఉదాహరణలతో చూద్దాం.
- మొదటి ఉదాహరణగా నేను ఒక సగటు పాఠకునిగా భావించుకొని నేపాల్ రాజధాని “khatmandu” పేరుతొ వున్న తెలుగు వ్యాసాన్ని చేరుకొనే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రకారంలో ఎన్ని స్టెప్స్ దాటుతున్నానో కూడా విశిదీకరిస్తూ పోతాను. 3 వ విభాగంలో చెప్పబడిన సాధారణ reader ‘expert కాడు’ అన్నదానిని దృష్టిలో పెట్టుకొని ఇలా చెపుతున్నాను.
మొదటి పద్దతి : (ఒకవేళ english పదం khatmandu తో దారిమార్పు పేజీ ఏర్పరచకపోతే)
స్టెప్-1: తెవీకిలో ప్రవేశించిన నేను సెర్చ్ లో లిప్యంతరీకరణం అనే option tick చేసాను. (selection of an option)
స్టెప్-2: సెర్చ్ బాక్స్ లో నాకు తెలిసిన ఆంగ్ల అక్షరాలు “khatmandu” అని టైపు చేసాను. లిప్యంతరీకరణంలో “ఖత్మందు” అని వచ్చింది. సెర్చ్ బటన్ నొక్కాను. ఫలితాలు లేవు అని వచ్చింది. తెలుగులో వ్యాసం లేదు అనిపించింది. (First attempt-failed) దీనివలన నాకు khatmandu ను తెలుగులో ఖత్మందు అని రాయరు అని కొంతవరకు అర్ధమయ్యింది.
స్టెప్-3: కాని మన తెలుగు వారు ఆ వ్యాసం ఎందుకు రాసి వుండరు. వుండే వుంటుంది. సరిగా వెతుకుదాము. రకరకాల combinations లలో సెర్చ్ చేయాలని భావించడం (Again hope)
ఈ సారి లిప్యంతరీకరణం ను నా ఉచ్చారణ తో సరిపోలుస్తూ “ ఖా ” అక్షరం ఉండాల్సిన చోట “ ఖ ”, “ ట “ అక్షరం ఉండాల్సిన చోట “ త ” అక్షరం , “ డు “ అక్షరం ఉండాల్సిన చోట “ దు “ అని వుండటం గమనించాను.
సగటు పాఠకుడిని కాబట్టి “ఖ” ను “ఖా” గా అంటే దీర్ఘంగా మార్చాలంటే kha కు అదనంగా మరో a జత చేస్తే సరిపోతుందని తెలుసు. అంటే “kha” ను “khaa” గా రాస్తే సరిపోతుంది అని తెలుసు. ఆ విధంగా “ఖత్మందు” > “ఖాత్మందు” గా మార్చాను. ఎందుకైనా మంచిదని ఈ పేరు “ఖాత్మందు” తో వ్యాసం ఉండవచ్చు అని భావించి మళ్ళీ సెర్చ్ బటన్ కూడా నొక్కాను. ఏ ఫలితమూ లేదు. (Cross checking)
అయితే నాకు khatmandu కు సరైన లిప్యంతతరీకరణం కావాలి కనుక khaatma టైపు చేస్తే ఖాత్మ.... అని వస్తుంది. నాకు ఖాట్మ.... అని రావాలి. అంటే రెండవ అక్షరమైన “త” అక్షరాన్ని ఉచ్చారణ ప్రకారం “ట” గా మార్చాలి. అంటే “ఖాత్మందు” ను “ఖాట్మందు” గా మార్చాలి.
“ త ” అక్షరాన్ని “ ట “ అక్షరంగా మార్చాలంటే ఎలా? కాని “ త “, “ ట “ అనే రెండు అక్షరాల ఉచ్చారణకు english లో “ ta “ అనే ఒక్క దానినే వాడతాము కదా. ఇప్పుడు తెలుగులో “త”, “ట” అక్షరాలను distinguish చేస్తూ రాయాలంటే english లో ఏ విధంగా టైపు చేయాలి? అంటే “ఖాత్మం......” పదాన్ని , “ఖాట్మం.....” పదంగా చూపించాలంటే ఎలా? (Fell in dilemma)
స్మాల్ లెటర్ (t) వాడితే “ త ” అక్షరం, కాపిటల్ లెటర్ (T) వాడితే “ ట “ గా మారుతుంది. (First advice should be given to the reader) అదే విధంగా స్మాల్ లెటర్ (d) వాడితే “ ద ” అక్షరం, కాపిటల్ లెటర్ (D) వాడితే “ డ “ గా మారుతుంది. (This second advice should also be given to the reader)
స్టెప్-4: ఆ రెండు సలహాల సాయంతో ఈ సారి టైపింగ్ జాగ్రత్తగా ఎక్కడ కాపిటల్ లెటర్ నొక్కాలో అక్కడ చూసుకొంటూ, నేను చేసే టైపింగ్ బట్టి నా ఉచ్చారణకు అనుగుణంగా సెర్చ్ బాక్స్ లో ప్రత్యక్షమవుతున్న పదాన్ని సరిపోల్చుకొంటూ KhaaTmanDu అని టైపు చేసాను. సెర్చ్ బటన్ నొక్కిన వెంటనే ఫలితం కనిపించింది. అంటే నేను కోరుకున్న తెలుగు వ్యాసం చేరుకోగలిగాను (second attempt-success)
[ఇక్కడ చిన్ననోట్: నాకు కావలిసిన వ్యాసానికి తెలుగులో దారిమార్పు (ఖాట్మండు) పేజీ సృష్టించబడి వుంది లేకపోతే ఉచ్చారణకు, లిప్యంతరీకరణంనకు లింకు కుదరక నేను అనుకొన్న వ్యాసానికి చేరడం మరింత కష్టతరమయ్యేది. ఎందుకంటే నేను కోరుకున్న వ్యాసం పేరు (కాఠ్మండు ) పేరుతొ వుంది. త అక్షరాన్ని ట అక్షరంగా తీసుకురావడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఒకవేళ “కాఠ్మండు” వ్యాసానికి “ఖాట్మండు” దారిమార్పుపేజీ గా లేకపోతే నేను వ్యాసానికి అసలు చేరుకోగలిగినవాడినే కాను. ఎందుకంటే “ta” అక్షరాన్ని తెలుగు లిప్యంతరీకరణంలో త, ద అనే రెండు రకాలుగా చూపుతారు అని తెలుసు కాని “ఠ” అక్షరంగా కూడా చూపుతారు అనేది సగటు పాఠకునిగా నాకు ఊహకు అందలేదు. ఒకవేళ “ ta” ను లిప్యంతరీకరణంలో “ఠ” అక్షరంగా చూపవలసి వస్తే ఇంతకీ ఎవరిని సలహా అడగాలి?]
రెండవ పద్దతి: (ఒకవేళ english పదం khatmandu తో దారిమార్పు పేజీ ఏర్పరుస్తే)
స్టెప్-1: తెవీకీలో ప్రవేశించిన నేను సెర్చ్ బాక్స్ లో “ khatmandu” పదాన్ని సింపుల్ గా టైపు చేసి సెర్చ్ బటన్ నొక్కాను. (ఒకసారి కాపిటల్ లెటర్స్, మరోసారి స్మాల్ లెటర్స్ , దీర్ఘాలు తో KhaaTmanDu అని టైపు చేయనవసరంలేదు) నేను కోరుకొన్న వ్యాసం ఖాట్మండు కు సరాసరి చేరుకోగలిగాను.
దీనినిబట్టి khatmandu కు సంబందించిన తెలుగు వ్యాసాన్ని చేరుకోవడానికి తెవీకి సైట్ లో ప్రవేశించిన సగటు పాఠకునికి 4 స్టెప్స్ (i)option tick, (ii) first attempt, (iii) dilemma లో పడటం మరియు అతనికి external sources నుండి రెండు సలహాలు పొందాల్సిరావడం, (iv) second attempt) పట్టింది. అదే సగటు పాఠకునికి మనం వికీలో దారిమార్పుగా khatmandu ఆంగ్ల దారిమార్పు ఇచ్చి వున్నట్లయితే ఒక్క స్టెప్ లోనే నేరుగా అతనికి కావలిసిన వ్యాసం చేరుకొంటాడు. మొదటిది డొంకదారి. రెండవది తిన్ననిదారి. ఏది reader కి సులభం?
అయితే మనకు లిప్యంతరీకరణం బాగా అలవాటయిపోయింది. లిప్యంతరీకరణం కోసం విజయవాడ కోసం vijayavaaDa అని, ఖాట్మండు కోసం khaaTmanDu అని టైపు చేస్తే సరి ...... అని చాలా easy గా మన view of accessibility లోనే ఆలోచిస్తూ చెప్పుకుపోతున్నాం. కాని సగటు పాఠకుడు ముందుగా vijayawada అని, khatmandu అని మాత్రమే టైపు చేస్తాడు. చేయగలడు. ఫలితాలు దొరకకపోతే బుర్ర గోక్కుంటూ vijayavaada అని khaatmandu అని రెండవసారి ప్రయత్నిస్తాడు. (అంతవరకే అతని స్థాయి వుంటుంది) అతనికి “ta” తో “ త “, “ ట “ లను సూచించవచ్చని తెలుసుకాని వాటిమధ్య distinguish చూపడానికి english లో ఎలా టైపు చేయాలో అతనికి తెలియదు. అదే విధంగా “da” తో “ద” “డ” లను సూచించవచ్చని తెలుసుకాని వాటిమధ్య distinguish చూపడానికి english లో ఎలా టైపు చేయాలో అతనికి తెలియదు. ఎందుకంటే అతను తెలుగు పదాలు రాయడంలో లిప్యంతరీకరణంలో ఏవిధమైన స్పెషలైజ్డ్ పరిచయం లేని సామాన్య reader మాత్రమే. ఆ విషయం మనం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
- మరో ఉదాహరణ: Fahian ఇండియాకు వచ్చిన ప్రసిద్ధ చైనా యాత్రికుడు. ఇప్పుడు Fahian గురించిన తెలుగు వ్యాసం కోసం మనతెలుగు వికీ సైట్ లో సెర్చ్ చేయబోయే సగటు పాఠకుడినిగా భావిస్తూ నాకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో చూస్తాను.
మొదటి పద్దతి: (ఒకవేళ english పదం fahian తో దారిమార్పు పేజీ ఏర్పరచకపోతే)
స్టెప్-1: తెవీకీలో ప్రవేశించిన నేను లిప్యంతరీకరణం ఆప్షన్ ను select చేసుకోవాలి.
స్టెప్-2: సెర్చ్ బాక్స్ లో fahian అక్షరాలను టైపు చేస్తే “ఫహియన్” వచ్చింది. సెర్చ్ బటన్ నొక్కితే ఫలితాలు లేవు అని వచ్చింది.
స్టెప్-3: మళ్ళీ ఈ సారి faahian అని టైపు చేసి చూస్తే “ఫాహిఅన్” వచ్చింది. ఇలా కాదని faahiyan నొక్కాను. లిప్యంతరీకరణం లో కనిపించిన “ఫాహియన్” కరెక్ట్ పదం. అయినా సెర్చ్ చేస్తే మళ్ళీ ఫలితాలు లేవు అని వచ్చింది. ఉచ్చారణ (ఫాహియన్) విధానానికి కు అనుగుణంగానే ఆంగ్ల అక్షరాలను టైపు చేసినా రాలేదంటే తెలుగులో ఆ వ్యాసం లేనట్లే అనుకోవాల్సి వచ్చింది.
స్టెప్-4: అయితే “.... an” రూపాన్ని తెలుగులో కొందరు “.....యన్” గాను, మరి కొందరు “......యాన్” గాను భావిస్తారు అని తెలుగు బాగా తెలిసిన నిపుణుడు సలహా ఇవ్వడం జరిగింది. అందుకే ఈ సారి faahiyaan టైపు చేస్తే లిప్యంతరీకరణంలో “ఫాహియాన్” కనిపించింది. సెర్చ్ బటన్ నొక్కితే నాకు కావలిసిన వ్యాసం దొరికింది.
అంటే చదువరి గారు alternative గా చెప్పే లిప్యంతరీకరణం పద్దతిలో fahian కి సంబందించిన తెలుగు వ్యాసం చేరుకోవడానికి 4 స్టెప్స్ దాటాలి. ఇక్కడ కూడా సలహా పొందడం/ లేదా రకరకాల కాంబినేషన్స్ తో క్రాస్ చెక్ చేసుకొంటూ పోవడం అవసరమవుతుంది.
రెండవ పద్దతి (ఒకవేళ english పదం fahian తో దారిమార్పు పేజీ ఏర్పరుస్తే)
స్టెప్-1: తెవీకీలో ప్రవేశించిన నేను సెర్చ్ బాక్స్ లో “fahian” పదాన్ని టైపు చేసి సెర్చ్ బటన్ నొక్కాను. నేను కోరుకొన్న వ్యాసం “ఫాహియాన్” కు సరాసరి చేరుకోగలిగాను.
అదే మనం దారిమార్పుగా మన “ఫాహియాన్” తెలుగు వ్యాసానికి “fahian” అనే ఆంగ్ల పదం సృష్టిస్తే కేవలం ఆ సగటు పాఠకుడు ఒకే ఒక స్టెప్ లో తనకు కావలిసిన తెలుగు వ్యాసానికి చేరుకొంటాడు. ఇక్కడ మనం లిప్యంతరీకరణం ను default గా పెట్టుకొంటే ఒక స్టెప్ తగ్గవచ్చు కదా అని చెప్పవచ్చు. కాని default గా పెట్టుకోవడం కూడా ఒక స్టెప్ క్రిందే పరిగణించబడుతుంది. లేకపోతె సెర్చ్ బాక్స్ లో ఆరు ఇతర ఆప్షన్స్ కూడా వున్నాయి. వాటి ఉపయోగమూ ఆ reader తెలుసుకోవాలి. లేదా గూగుల్ ఇండిక్ మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకొంటే easy కదా! ఇలాంటివి ఎన్నైనా చెప్పవచ్చు. కాని overall గా చూడాలి చదువరి గారు గారు మనం రీడర్స్ పాయింట్ అఫ్ వ్యూ లో reader కి ఏది సులభం అనే విషయంలో. reader కి నేరుగా english అక్షరాలతో టైపు చేయడమే easy. దానిని మనం తెలుగు భాషాభిమానం (మన విషయంలో కావచ్చు! కాకపోవచ్చు!) కారణంగా (?) ఆ easyness ను నిరోదించడం ఎంతవరకూ సబబు? reader కి ఇప్పటివరకూ వున్న ఆంగ్ల దారిమార్పులో వున్న సౌలభ్యాన్ని ఎత్తివేసే మార్గంలో ఒక విధానం రూపొందించుకొనే ప్రయత్నం చేయాల్సినవసరం ఉందా! alternative గా మనం చెప్పబోయే లిప్యంతరీకరణం అతనికి ఆంగ్లదారిమార్పు ఇచ్చినంత సౌలభ్యం ఇవ్వదు అని నా అభిప్రాయం.
పై రెండు పద్దతులలో ఏ పద్దతిలో పాఠకుడికి సులభం? ఏది తక్కువ స్టెప్స్ లలో, ఏది వీలైన సులభంగా పాఠకుడు తను కోరుకొన్న వ్యాసానికి (without getting any advice/assistance from the external sources or without possessing any specialized knowledge regarding Transliteration in telugu) చేరగలుగుతున్నాడంటారు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లిప్యంతరీకరణం ఎంచుకొమ్మని 3 (3) విభాగంలో మీరు చెపుతున్న పద్దతి ప్రకారంగా చూస్తే
a) ఆంగ్ల దారి మార్పు అవసరం లేదని భావించే పద్దతిలో – అంటే మొదటి పద్దతిలో - reader తను కోరుకున్న వ్యాసానికి చేరుకోవడానికి 4 స్టెప్స్ కనీసం పడుతుంది. పైగా reader ని నిరుత్సాహపరిచే, అసహనానికి గురిచేసే విధంగా వుంది. ఎందుకంటే ఈ విధానంలో సగటు పాఠకుడు వెతుక్కోవడంలో సలహాల కోసం చూడవలసిన అగత్యం గాని/ తెలుగు లిప్యంతరీకరణంలో వున్న రకరకాల సంభావ్యతలను కనుగుణంగా వివిధ combinations తో క్రాస్ చెక్ చేసుకొవడాలు గాని/ తెలుగు లిప్యంతరీకరణంలో కొద్దిగా నైపుణ్యం, అనుభవం ముందుగానే పొందాల్సిన అవసరం గాని వుంటుంది.
b) ఆంగ్ల దారి మార్పు అవసరం కావాలి అని భావించే పద్దతిలో – అంటే రెండవ పద్దతిలో - reader తను కోరుకున్న వ్యాసానికి చేరుకోవడానికి ఒక్క స్టెప్ మాత్రమే పడుతుంది. పైగా reader ని నిరుత్సాహపరిచే, అసహనానికి గురిచేసే విధంగా ఏ మాత్రం వుండదు. ఎందుకంటే ఈ విధానంలో సగటు పాఠకునికి వెతుక్కోవడంలో ఇతరత్రా సలహాల కోసం పొందవలసిన అగత్యం గాని/ తెలుగు లిప్యంతరీకరణంలో వున్న రకరకాల సంభావ్యతలను కనుగుణంగా వివిధ combinations తో క్రాస్ చెక్ చేసుకోవడాలు గాని/ తెలుగు లిప్యంతరీకరణంలో కొద్దిగా నైపుణ్యం, అనుభవం ముందుగానే పొందాల్సిన అవసరం గాని ఏ మాత్రం అవసరం లేదు. అంటే confuse వుండదు.
కనుక 3(3) లో చదువరి గారు గారు చెప్పిన విధంగా దారిమార్పుకి ఆంగ్లం అవసరం లేదు అన్న వాదన నిలబడదు అని భావిస్తున్నాను. పైగా ఆయన తన వాదనకు మద్దతుగా కేవలం విజయవాడ అనే సరళమైన ఉదాహరణ తీసుకొన్నారు. అయితే అన్ని తెలుగు పదాలు సరళంగా వుండవు అని చెపుతూ నేను ఉదాహరణగా ఫాహియన్, ఖాట్మండు చెప్పాను. పైగా నా తర్కంలో ఒక్క స్టెప్ తో కోరుకున్న వ్యాసానికి చేరవచ్చని వివరించాను. ఆయన తర్కం ప్రకారం కోరుకున్న వ్యాసానికి 4 స్టెప్స్ కూడా పడుతుందని సోదాహరణగా వివరించాను. (ఇంకా ఆ పదం సంయుక్త, దిత్వాక్షరాలతో కూడిన సంక్లిష్ట పదమైతే ఇంకా ఎక్కువ స్టెప్స్ పట్టదానికి అవకాశం వుంటుంది.)
--Vmakumar (చర్చ) 10:53, 22 అక్టోబరు 2017 (UTC)
ఇప్పుడు (1) వ విభాగంలోని పాయింట్ కి వద్దాం
గూగుల్ లో సెర్చ్ చేయడం అనేది చర్చకు సంబంధించిన పాయింట్ కాదు. నా ఉద్దేశ్యంలో చర్చ "within the purview of teluguwikipedia site“ గా చెప్పాలనేదే. దాన్ని గూగుల్ లాంటి ప్రైవేటు అంతర్జాల సెర్చ్ ఇంజిన్ ఫలితాలతో పోల్చడం అనవసరం. తెవీకీలో మనం ఆంగ్ల దారి మార్పు చేస్తే– తెవీకీలో కోరుకున్న వ్యాసానికి మరింత సులభంగా చేరవచ్చా ? లేదా? ఆంగ్ల దారి మార్పు చేయకపోతే- కోరుకున్న వ్యాసానికి సులభంగా చేరలేమా? ” అనే దాని చుట్టూ మన చర్చ తిరిగితేనే relevent గా వుంటుంది. అయితే ఒకవేళ గూగుల్ లో సెర్చ్ చేస్తే మనం చేయబోయే ఆంగ్ల దారి మార్పు వలన తెవీకి వ్యాసానికి వెంటనే చేరుకోగాలిగితే అది గూగుల్ వారి దయ, మన ప్రాప్తం. గూగుల్ సెర్చ్ వేరు. మన సొంత తెవీకి సైట్ లోని సెర్చ్ వేరు. ఒక ప్రైవేటు సెర్చ్ ఇంజిన్ లో ఒక పదం తో రిజల్ట్స్ కనిపించే మార్గం తెలిసినంత మాత్రాన్న తెవీకి సొంత సైట్ లో ఆ పదం ఉపయోగించి సెర్చ్ చేయడం ఇక అనవసరం అనడం ఎంతమాత్రం సమంజసం కాదు.
అయితే చదువరి గారు (1) వ విభాగంలోని లో చెప్పిన ప్రకారమే గూగుల్ లాంటి ప్రైవేటు అంతర్జాల సెర్చ్ ఇంజిన్ ఫలితాలతో proceed అవుదాం. ఆ గూగుల్ సెర్చ్ పద్దతిలో ఎన్ని స్టెప్స్ దాటాలో, అడ్డంకులు ఏమైనా ఉన్నాయా కూడా చూడాలి. (స్టెప్స్ అంటే ఎన్ని సార్లు క్లిక్ చేస్తున్నాము అనే అర్ధం లో చూడాలి)
స్టెప్ 1: గూగుల్ సెర్చ్ఇంజిన్ open చేసి సెర్చ్ బాక్స్ లో vijayawada అని టైపు చేసి బటన్ ప్రెస్ చేసాను.(first attempt –first click)
స్టెప్ 2: vijayawada పేరుతొ వున్న ఎన్వికీ వ్యాసాన్ని select చేసుకొని ఓపెన్ చేసాను. (selection of enwiki article-second click)
స్టెప్ 3: enwiki ఆర్టికల్ లో ఎడమవైపు లో వున్న తెలుగు లింక్ ను క్లిక్ చేయడం ద్వారా తెలుగువ్యాసానికి చేరుకోవడం. (second attempt-third click)
ఇక్కడ కూడా చదువరి గారు vijayawada అనే సరళమైన ఉదాహరణనే చెప్పారు. అయితే ఈ పద్దతిలో కొన్ని drawbacks వున్నాయి. నాకు తోచినవి చెపుతాను.
మొదటి ప్రతిబందకం: ఒక తెలుగు వ్యాసానికి enwiki అంటే దానికి సంబందించిన ఆంగ్ల వ్యాసంతో లింక్ కలపకపోతే ఈ పద్దతి ఫెయిల్ అవుతుంది. ఉదాహరణకు krypton పదం తీసుకొని గూగుల్ లో సెర్చ్ చేస్తే పైన తెలిపినవిధంగా స్టెప్-1, స్టెప్-2 లు దాటతాము. కాని స్టెప్-3 చేరుకోలేం. ఎందుకంటే మన తెలుగు వ్యాసానికి సంబందిత ఆంగ్ల వ్యాసానికి లింక్ లేనేలేదు. అలాగే anju chadha వ్యాసం, ashlesha (nakshatra), rauvolfa serpentina ........ లాంటి ఎన్నో వ్యాసాల నుండి ఈ పద్ధతిలో మన తెలుగు వ్యాసాలకు అంటే అంజు చధా, ఆశ్లేష నక్షత్రము, సర్పగంధ లకు చేరుకోలేం.
రెండవ ప్రతిబందకం: ఒక తెలుగు వ్యాసం విశిష్టంగా తెలుగులోనే సృష్టించబడి వున్నప్పుడు, ఆ పేరుతొ english లో ఎవరూ వ్యాసాన్ని సృష్టించలేని పక్షంలో – ఈ పద్దతి ఫెయిల్ అవుతుంది. ఉదాహరణకు Catuhsataka వ్యాసం కొరకు గూగుల్ లో సెర్చ్ చేస్తే enwiki కి చెందిన ట్యాగ్ (tag) వ్యాసాలు కనిపిస్తాయే కాని enwiki కి చెందిన సరాసరి ఆంగ్ల వ్యాసం కనపడదు. అంటే ఈ పద్దతిలో మొదటి స్టెప్ తోనే మనం ఆగిపోవడం జరిగింది. నిజానికి Catuhsataka కు సంబందించిన తెలుగు వ్యాసం తెవీకీలో చతుశ్శతకం వుంది. అలాగే Vinukonda Vallabharayudu, Maalapalli (Novel), Jantika, Hypsographic curve........ లాంటి ఎన్నో వ్యాసాల నుండి ఈ పద్ధతిలో మన తెలుగు వ్యాసాలు అంటే వరుసగా వినుకొండ వల్లభరాయుడు, మాలపల్లి (నవల), జంతిక, హిప్సోగ్రాఫిక్ వక్రం........ కు చేరుకోలేం. కారణం ఇలాంటి వ్యాసాలు ఎన్నో మన తెలుగులోనే ప్రత్యేకంగా సృష్టించబడ్డాయి. అనేకంగా వున్నతెలుగు గ్రామాలు, తెలుగుకి చెందిన కవులు, తెలుగు గ్రంధాలు మాత్రమె కాక ఇతర వ్యాసాలు చతుశ్శతకం లాంటివి వీటిని ఆంగ్లంలో ఎందుకనో సృష్టించక పోవడంతో గూగుల్ ద్వారా ఆంగ్లపేరుతొ సెర్చ్ చేసినా మన తెలుగు వ్యాసాలకు ఎన్వికీ ద్వారా వెళ్ళలేం.
గూగుల్ ద్వారా 3 స్టెప్స్ లతో తెలుగు వ్యాసం చేరుకొనే పద్దతి (అదికూడాను limitations వున్న పద్దతి) వున్న కారణంగా తెవికీలో ఒక్క క్లిక్ ద్వారా తెలుగువ్యాసం చేరుకొనే మార్గం మూసివేయాలని భావించడం అసంబద్దం. నిర్హేతుకం.
అంటే చదువరి గారు ప్రకారం,(1) విభాగంనకు సంబందించినంతవరకూ vijayawada ను పట్టుకొంటే విజయవాడ తెలుగు వ్యాసానికి చేరుకోవచ్చు అనే వాదన సార్వత్రికంగా నిలవదు. పైగా అది అసంబద్ధం. కాబట్టి ఇక ఆంగ్ల దారిమార్పు అక్కరలేదు - అనే తర్కం వారు పేర్కొన్న (1) విభాగంలో ఎల్లవేళలా పనిచేయదు అని భావిస్తున్నాను.
--Vmakumar (చర్చ) 11:32, 22 అక్టోబరు 2017 (UTC)
ఇప్పుడు (2) వ విభాగంలోని పాయింట్ కి వద్దాం
ఇక్కడ నా వాదన (1) వ విభాగంలో చెప్పిన ప్రకారమే వుంటుంది. enwiki లో సెర్చ్ చేయడం అనేది చర్చకు సంబంధించిన పాయింట్ కాదు. నా ఉద్దేశ్యంలో చర్చ "within the purview of teluguwikipedia site“ గా చెప్పాలనేదే. దాన్ని enwiki సెర్చ్ ఇంజిన్ ఫలితాలతో పోల్చడం అనవసరం. “తెవీకీలో ఆంగ్ల దారి మార్పు చేస్తే దానివలన తెవీకి లో సులభంగా వ్యాసానికి వెళ్లగలమా? లేదా? అనే విషయం తెవీకి సైట్ పరంగానే చర్చిస్తేనే relevent గా వుంటుంది. అంటే గాని తెవీకి యేతర సైట్ లు గూగుల్ సైట్, enwiki సైట్ లనుంచి చూడకూడదని నా ఉద్దేశ్యం. enwiki సెర్చ్ వేరు. మన సొంత తెవీకి సైట్ లోని సెర్చ్ వేరు. ఒక పరభాషా సెర్చ్ ఇంజిన్ లో ఒక పదంతో రిజల్ట్స్ కనిపించే మార్గం తెలిసినంత మాత్రాన్న తెవీకి సొంత సైట్ లో ఆ పదం ఉపయోగించి సెర్చ్ చేయడం ఇక అనవసరం అనడం ఎంతమాత్రం భావ్యం కాదు.
అయితే చదువరి గారు (2) వ విభాగంలోని లో చెప్పిన ప్రకారం కూడా proceed అవుదాం. ఎన్ని స్టెప్స్ దాటాలో, అడ్డంకులు ఏమైనా ఉన్నాయా కూడా చూద్దాం.
స్టెప్ 1: enwiki సెర్చ్ఇంజిన్ open చేసి సెర్చ్ బాక్స్ లో vijayawada అని టైపు చేసి బటన్ ప్రెస్ చేసాను. vijayawada ఆంగ్ల వ్యాసం కనిపించింది. (first attempt)
స్టెప్ 2: ఆ enwiki ఆర్టికల్ లో ఎడమవైపు లో వున్న తెలుగు లింక్ ను క్లిక్ చేయడం ద్వారా ద్వారా తెలుగువ్యాసానికి చేరుకోవడం. (final attempt)
ఇక్కడ కూడా చదువరి గారు vijayawada అనే సులభమైన ఉదాహరణనే తీసుకోవడం జరిగింది.( ఇక్కడ నా దృష్టిలో సులభ ఉదాహరణ అంటే కేవలం ఆంగ్లం, తెలుగు రెండు భాషలలోను వుండి, అంతర్వికీ లింకుల ద్వారా అనుసంధానించబడిన వ్యాసం అని అర్ధం) ఈ పద్దతిలో కూడా పైన చెప్పిన drawbacks (ప్రతిబంధకాలు) వున్నాయి. అయినా వాటిని (2) విభాగం aspect లోనే చెప్పాల్సి వుంటుంది.
మొదటి ప్రతిబందకం: ఒక తెలుగు వ్యాసానికి enwiki అంటే దానికి సంబందించిన ఆంగ్ల వ్యాసంతో లింక్ కలపకపోతే ఈ (2) విభాగంలోని పద్దతి ఫెయిల్ అవుతుంది. ఉదాహరణకు krypton పదం తీసుకొని enwiki లో సెర్చ్ చేస్తే పైన తెలిపినవిధంగా స్టెప్-1, దాటతాము. కాని స్టెప్-2 చేరుకోలేం. ఎందుకంటే మన తెలుగు వ్యాసానికి సంబందిత ఆంగ్ల వ్యాసానికి లింక్ లేనేలేదు. అలాగే the satanic verses వ్యాసం, archaebacteria, lower paleolithic, ........ లాంటి అనేకానేక వ్యాసాల నుండి ఈ పద్ధతిలో మన తెలుగు వ్యాసాలకు చేరుకోలేం. అయితే తెలుగులో వీటికి సంబందించిన వ్యాసాలు లేకేం. నిక్షేపంగా వున్నాయి. శటానిక్ వర్సెస్, ఆర్కీబాక్టీరియా, పూర్వ ప్రాచీన శిలాయుగం......... అయితే వాటికి enwiki ఆంగ్ల వ్యాసాలతో లింక్స్ లేకపోవడం వలన మన వ్యాసాలకు చేరుకోలేకపోయాం. (ఇలా enwiki తో లింకులు లేని తెలుగు వ్యాసాలు మన తెవీకీలో మొదటినుంచీ నేటివరకూ అనేకంగా వున్నాయి.)
రెండవ ప్రతిబందకం: ఒక తెలుగు వ్యాసం విశిష్టంగా తెలుగులోనే సృష్టించబడి వున్నప్పుడు, ఆ పేరుతొ english లో ఎవరూ వ్యాసాన్ని సృష్టించలేని పక్షంలో – ఈ పద్దతి ఫెయిల్ అవుతుంది. ఉదాహరణకు vennelakanti annaiah వ్యాసం కొరకు enwiki లో సెర్చ్ చేస్తే no results కనిపిస్తాయే కాని సరాసరి ఆంగ్ల వ్యాసం కనపడదు. అసలు ఉంటేగా కనపడటానికి. అందువలన left side లో లింకు కనిపించే అవకాశమే లేదు. అంటే తెలుగు వ్యాసానికి చేరుకోలేము. అంటే ఈ పద్దతిలో ఫెయిల్ అవుతాము. నిజానికి vennelakanti annaiah కు సంబందించిన తెలుగు వ్యాసం తెవీకీలో వెన్నెలకంటి అన్నయ్య వుంది. అలాగే Vinukonda Vallabharayudu, Shodashakumara charitra, ........ లాంటి ఎన్నో వ్యాసాలకు ఈ పద్ధతిలో మన తెలుగు వ్యాసాలు అంటే వరుసగా వినుకొండ వల్లభరాయుడు, షోడశకుమార చరిత్ర,… కు చేరుకోలేం. కారణం ఇలాంటి వ్యాసాలు ఎన్నో మన తెలుగులోనే ప్రత్యేకంగా సృష్టించబడ్డాయి. అనేకంగా వున్నతెలుగు గ్రామాలు, అనేకానేక తెలుగు కవులకు , గ్రంధాలకు, ఇతర వ్యాసాలు (చతుశ్శతకం లాంటివి ) కూడా ఆంగ్లంలో వ్యాసాలు లేవు. వీటిని ఆంగ్లంలో ఎందుకనో సృష్టించక పోవడంతో enwiki ద్వారా ఆంగ్లపేరుతొ సెర్చ్ చేసినా మనం రూపొందించుకున్న, రూపొందించుకోబోయే తెలుగు వ్యాసాలకు ఎన్వికీ ద్వారా ఎప్పటికీ వెళ్ళలేం. మనవారు తెలుగు మీద మమకారంతో అక్కడ తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే నూతన ఆంగ్ల వ్యాసాలు, మన తెలుగువారి చిరస్మరణీయులైన వ్యక్తులకు సంబందించిన కొత్త ఆంగ్ల వ్యాసాలను enwiki లో కూడా సృష్టిస్తే తెలుగువారికి మహోపకారం చేసినట్లవుతుంది. చివరిగా ఈ పద్దతిలో ఆంగ్లంలో వ్యాసం సృష్టించబడలేదు కారణంగా enwiki ద్వారా ఆంగ్లపేరుతొ సెర్చ్ చేసినా మన తెలుగు వ్యాసాలకు వెళ్ళలేం.
enwiki ద్వారా 2 స్టెప్స్ లతో తెలుగు వ్యాసం చేరుకొనే పద్దతి (అదికూడాను limitations వున్న పద్దతి) వున్న కారణంగా తెవికీలో ఒక్క క్లిక్ ద్వారా తెలుగువ్యాసం చేరుకొనే మార్గం మూసివేయాలని భావించడం అసంబద్దం. నిర్హేతుకం.
అంటే చదువరి గారి ప్రకారం (2) విభాగంనకు సంబందించినంతవరకూ vijayawada ను పట్టుకొంటే విజయవాడ తెలుగు వ్యాసానికి చేరుకోవచ్చు అనే వాదన సార్వత్రికంగా నిలవదు. అంటే అన్ని సందర్భాలలో పనిచేయదు అని తేలుతుంది. కాబట్టి కొన్ని సందర్భాలలోనే పనిచేసే పద్దతిని అనుసరించి వారు (2) విభాగంలో “ఇక ఆంగ్ల దారిమార్పు అక్కరలేదు” – అంటూ conclusion కు రావడం సమంజసం కాదు. పైగా ఆంగ్లదారిమార్పు కొనసాగేటప్పుడు ఉన్నంత సౌలభ్యం వారు పేర్కొన్న ఆ (2) విభాగపు పద్దతిలో కనిపించదు. పైగా drawbacks అనివార్యంగా వుంటాయి అని చెప్పడం జరిగింది. --Vmakumar (చర్చ) 11:55, 22 అక్టోబరు 2017 (UTC)
- కుమార్ గారు రాసిన విస్తారమైన వాదనలో నేను గ్రహించగలిగినది ఇది -లిప్యంతరీకరణ ద్వారా తెలుగులో టైపు చెయ్యడంలో ప్రజలు ఇబ్బంది పడతారు. తప్పులు టైపు చేస్తారు. అందువలన పేజీని చేరుకోవడంలో ఇబ్బందులెదురై, మూణ్ణాలుగు సార్లు టైపు చెయ్యాల్సిన పరిస్థితి ఎదురౌతుంది. ఉదాహరణగా విజయవాడ పనికిరాదన్నారు, ఫాహియాన్ ను చూపించారు.
- Fahian అని ఇంగ్లీషులో వెతకడం తేలిక అని కుమార్ గారు అన్నారు. అది ఎంత తేలికో చూద్దాం.
"fahian", "fa hian", "fa hien" అని వెతకవచ్చు. "Fa hien" అనేది అసలైన పేరు. (అసలైన పేరు ఏంటో ఇప్పుడే ఇంగ్లీషు వికీపీడియాలో చూసి నేను ఆశ్చర్యపోయాను.) సరే.. ఫాహియాన్ పేజీకి దారిమార్పుగా ఏ పేజీని సృష్టించాలి? FA Hien అనే దారిమార్పు పేజీని సృష్టించామనుకుందాం. పాఠకుడు Fahian అని వెతికితే దొరకదు కదా. మరైతే, మొత్తం మూడు దారిమార్పు పేజీలూ సృష్టిద్దామా? ఎన్వికీలో చూపినట్లు Faxian అని సృష్టిద్దామా? లేదా మొత్తం నాలుగు పేజీలూ సృష్టిద్దామా?
- తప్పేముంది, చేద్దాం అని కుమార్ గారు అనవచ్చు. అలా ఐతే, లిప్యంతరీకరణలో పాఠకుడు చేసే తప్పిదాలన్నిటికీ, ఇంగ్లీషు వెతుకులాటలో చేసే తప్పులన్నిటికీ దారిమార్పు పేజీలు తయారుచేద్దామా? అంటే సిసలైన వ్యాసం పేజీ ఒక్కోదానికీ ప్ఫదో పదిహేనో దారిమార్పు పేజీలు! ఒక్కో తప్పుకూ ఒక్కో పేజీ.. 60 వేల వ్యాసాలుంటే ఆరు లక్షల దారిమార్పు పేజీలు!! దారిమార్పులే దారిమార్పులు!!!
- తెలుగులో తప్పులు విరివిగా చేస్తారు, ఇంగ్లీషులో తప్పులే చెయ్యరు అని అనుకోవడం, అంచేత ఇంగ్లీషులో దారిమార్పు పేజీ ఉండాలనడం అంత లాజికల్‌గా లేదు. కచ్చితంగా అవసరమైన చోట (KMnO4) ఉండొచ్చు.
- ఓ ముఖ్యమైన సంగతి.. లాగిన్ కాని వ్యక్తి - అంటే వికీపీడియాలో నమోదుకాని వ్యక్తి అనుకుందాం - వికీపీడియాకు వస్తే అతడికి ప్రతిపేజీలోనూ పైన ఒక నోటీసు కనబడుతుంది. తెలుగులో టైపు చేసేందుకు ఫలానా విధంగా చెయ్యండి అని. మొదటిపేజీలో తెలుగులో టైపుచెయ్యడంలో సహాయం అనే లింకు కూడా ఉంది. ఆ లింకును పట్టుకుని వెళ్తే వచ్చే పేజీ, ఏ గుణింతానికి ఏయే ఇంగ్లీషు అక్షరాలు రాయాలో వివరిస్తుంది. ప్రస్తుతం ఆ లింకును నేరుగా నోటీసులోనే పెట్టాను. ఇక ఈ పేజీ లింకు ప్రతీపేజీలోనూ పైన స్ఫుటంగా కనిపిస్తుంది. లిప్యంతరీకరణలో సహాయం మరింత అందుబాటులో ఉంటుందిపుడు.
- కుమార్ గారు ఏమంటారో తెలుసు... పాఠకుడు ఆ పేజీకి వెళ్ళాలి, ఎలా రాయాలో నేర్చుకోవాలి అప్పుడుగదా అతడు సరిగ్గా రాయగలిగేది, అందుకు మూణ్ణాలుగు స్టెప్పులవసరమౌతాయి గదా అని. :) అయితే, లిప్యంతరీకరణలో సాయం అందుబాటులో ఉంది. Fahian అని ఇంగ్లీషులో తప్పుగా టైపు చేసినపుడు సాయం చెయ్యడానికి అసలు ఏ సాధనమూ లేదని మనం గుర్తుంచుకోవాలి. __చదువరి (చర్చ • రచనలు) 18:23, 22 అక్టోబరు 2017 (UTC)
నిర్వాహకులకు, నాకున్న పనివత్తిడి కారణంగా దయచేసి నా వాదన చెప్పడానికి నాకు ఒక్క రోజు గడువు అదనంగా ఇవ్వగలరు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. విధానపరమైన విషయానికి సంబందించినది కాబట్టి చర్చ ముగించేముందు ఈ ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.
--Vmakumar (చర్చ) 00:12, 24 అక్టోబరు 2017 (UTC)
- శాస్త్రీయ పదజాలానికి అంటే రసాయన మూలకాలకు (ఉదా. Al) , పలు శాస్త్రాలకు సంబంధించిన అబ్రివియేషన్లకు (RAM) దారి మార్పులు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ పేర్ల విషయంలో ముఖ్యంగా తెలుగు వ్యక్తులు, ప్రాంతాలు లాంటి వాటికి మాత్రం ఆంగ్ల పేర్ల నుంచి దారి మార్పులు అవసరం లేదని నా అభిప్రాయం.--రవిచంద్ర (చర్చ) 12:52, 24 అక్టోబరు 2017 (UTC)
చదువరి గారు ఫాహియాన్ ఉదాహరణ ను 3 వ విభాగానికి సంబంధించి counter argument కి తీసుకొన్నారు. “‘Fa hien’ అనేది అసలైన పేరని, ఫాహియాన్ – యొక్క అసలైన పేరు ఎన్వికీలో చూసి ఆశ్చర్యపోయాను” అంటున్నారంటే లిప్యంతరీకరణం గురించి కొద్దిగా చెప్పవలసి వుంది. తరువాత “ అసలైన పదం ఏది?, ఆశ్చర్యపోవడమా! లేదా! అనేది అవగాహన మేరకు వుంటుంది.
ఇక్కడ రెండు భాషల మధ్య ఉచ్చారణ-లిప్యంతరీకరణం మధ్య సంబంధం dynamic and irreversible పద్దతిలో వుంటుంది. అంటే ఒక భాషలోని ఉచ్చారణను వేరొక భాషలోనికి ఖచ్చితంగా లిప్యంతరీకరణం చేయలేం. కొంతవరకూ చేయగలమే కాని ఖచ్చితంగా చేయలేము. x భాషలోని Ax అనే పదాన్ని y భాషలోనికి లిప్యంతరీకరణం చేస్తే By గా మారుతుంది అనుకోండి. తిరిగి y భాషలోని By పదాన్ని x భాషలోనికి యధాతదంగా మార్చలేము. అలా లిప్యంతరీకరణానికి ప్రయత్నిస్తే మారుతుంది కాని మొదటి పదంగానే యధాతదంగా మారలేదు. దీనికి ఎన్నో కారణాలుంటాయి. ఈ పరిస్థితి ప్రాచ్య భాషా (Oriental languages) వర్గానికి చెందిన చైనీస్, జపానీస్, కొరియన్ భాషలలో స్ఫుటంగా కనిపిస్తుంది. నిజానికి మనం fahian పదానికి అసలు సిసలైన ఉచ్చారణ చైనీస్ భాష ప్రకారమే 法顯 చూడాలి. అంతేగాని english పదాన్ని ఉచ్చరించే విధం కాదు. ఇది లిప్యంతరీకరణంలో గుర్తుంచుకోవాల్సిన మొదటి ప్రాధమిక విషయం. ఆ చైనీస్ భాషలోని ఉచ్చారణను మనం ఇంగ్లీష్ లిప్యంతరీకరణంలో చూపిన Fahian, Fahsien, Fahien, Faxian పదాలన్నీ దాదాపుగా కరెక్టే !!!, అయితే reversible గా తిరిగి ఆయా ఆంగ్ల ఉచ్చారణతో చైనీస్ లోనికి లిప్యంతరీకరణం చేయడానికి ప్రయత్నిస్తే ఆ చైనీస్ లిప్యంతరీకరణ పదం తొలి చైనీస్ పదం (法顯) తో సరిసమానంగా రావు. మరి ఈ విధంగా అయితే భాషలమధ్య , ఆయా భాషాపదాల మధ్య తులనాత్మకమైన అధ్యయనం కష్టమవుతుంది. దీనికి ఒక తార్కికమైన ముగింపు వుండాలంటే adjustments తప్ప మరోదారిలేదు. అందులోను యురోపియన్ భాషావర్గానికి భిన్నంగా కనిపించే చైనీస్ వంటి ప్రాక్ భాషలో లిప్యంతరీకరణానికి అనుసంధానభాష english లో చేసిన లిప్యంతరీకరణాలను కొంతలో కొంతవరకు మాత్రమే గీటురాయిగా తీసుకొంటారు. మిగిలిన భాషల వాళ్ళు ప్రతీసారి చైనీస్ పదాల ఉచ్చారణ వెతుక్కోలేక అనుసంధానభాష అయిన ఆంగ్ల భాషలో చేసే లిప్యంతరీకరణంని తమ తమ భాషలలో ఫాలో కావడానికి ప్రయత్నిస్తారు. దీని గురించే చైనీస్ భాషలోని పదాలను ఆంగ్లంలో లిప్యంతరీకరణం చేసేటప్పుడు ఇంగ్లీష్ వారు తప్పనిసరిగా ఒరిజినల్ చైనీస్ పదాన్ని పక్కనే ప్రత్యేకంగా రాయడం గమనించే వుంటారు. అదే absolute transliteration ను ఆంగ్లంలో కనుక చేయగలిగితే అలా ఆంగ్ల లిప్యంతరీకరణ పదం పక్కన చైనీస్ పదాలను ప్రత్యేకంగా సూచించనవసరంగాని, అగత్యంగాని ఆంగ్లభాషకు వుండదు. చైనీస్ భాషా పేర్లకు ఇంగ్లీష్ లో చేసేన లిప్యంతరీకరణం చూసి ఆ english లిప్యంతరీకరణమే అసలైన పేరుగా భావించి మనం ఆశ్చర్యపోనవసరంలేదు.
ఉదాహరణకు 義淨 అనే మరో చైనీస్ పదాన్ని తీసుకోండి. ఇతను కూడా మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు. ఈ పేరును ఆంగ్లంలోనికి లిప్యంతరీకరణం చేస్తే Yì Jìng, I-Tsing , I Ching అనేవి ప్రామాణిక (?) ఆంగ్ల పేర్లుగా మీకు కనిపిస్తాయి. అందులోను ప్రాచీన కాలం నుండి కొనసాగిన పదం I tsing లేదా I ching అయితే తరువాత ఆధునిక కాలంలో పేర్కొన్న పదం Yi Jing. ఇక్కడ చూడండి ఆంగ్ల భాషలోని అక్షరాలు అవే. మారలేదు. దేశ, కాల, భాషా, మాండలిక, ........ ఇత్యాది కారణంగా ఉచ్చారణ కనుగుణంగా లిప్యంతరీకరణం మారిపోతూ వస్తుంది (dynamic in nature). అందువలన లిప్యంతరీకరణంలోని భేదాలు కనిపిస్తాయి. అలా కనిపించడం అనివార్యమే కాదు జీవ భాషకు ఆవశ్యకం కూడా. ఈ పదాలను మనం రాసుకున్న లిప్యాంతరీకరణ ఆంగ్ల పద ఉచ్చారణతో పలికితే చైనీయులకు మనం విదేశీయులమని ఒక్క క్షణంలో గ్రహిస్తారు. ఎందుకంటే చైనీస్ ఉచ్చారణలో అంత తేడా వుంటుంది. ఈ I-tsing పదం పదం చూడండి. హిందీలోకి వచ్చేసరికి యిత్సింగ్ గా మారిపోయింది. తెలుగులోకి “యీ-చింగ్” అవ్వాల్సింది “ఇత్సింగ్” అయిపొయింది. .義淨 పదాన్ని కొంతవరకు Yì Jìng ఉచ్చారణతో పలకాల్సి వచ్చినప్పటికీ తెలుగులో ఆ రాసే అక్షర సౌలభ్యం లేకపోవడంతో కొంతలో కొంత దగ్గరగా యీ-చింగ్ అని అయినా లిప్యంతరీకరణం చేయాలి. అయితే మనం ఇత్సింగ్ గానే రాస్తున్నాం. పలుకుతున్నాం. పాత తెలుగు పాఠ్య పుస్తకాలలొ కూడా ఇత్సింగ్ గా వున్నట్లు గుర్తు. అంటే ఖచ్చితంగా కాకపోయినప్పటికీ కనీసంలో కనీసం Yì Jìng ఉచ్చారణలో పలకాల్సిన పదాన్ని మనం ఇత్సింగ్ గా వ్యవహించడానికి అలవాటుపడిపోయాం.
దీన్ని బట్టి తేలేదేమిటంటే ఫాహియాన్ చైనీయ పదానికి english, తెలుగులలోనే కాదు, ప్రపంచంలోని ఏ భాషలోను ఖచ్చితమైన లిప్యంతరీకరణం వుండదు. మనం చేసిన ఏ లిప్యంతరీకరణం అయినా ఆయా అంతర భాషల మధ్య irreversible గానే వుంటుంది. కాబట్టి english భాషకు సంబంధించినంత వరకు fahian, faxian, fahsien, fahien నాలిగింటినీ కొంతవరకూ (ప్రామాణికం?) అమోదించవచ్చు. అంతే గాని వీటిలో అసలైన పేరు? అని తెలుసుకోవడంగాని, ఆలోచించడంగాని శుద్ధ అవివేకం. మరైతే సరైన ఉచ్చారణ ఏది? సరైన లిప్యంతరీకరణం ఏది? సరైన ఉచ్చారణ చైనీస్ భాషలోనే వుంటుంది. సరైన లిప్యంతరీకరణం ఏ భాషలోను వుండదు, జరగదు. english భాష, లేదా తెలుగు భాషలో మనం చేసుకొనే లిప్యంతరీకరణాలు కొంతవరకు సరిపోతాయి అని మాత్రమే చెప్పాలి. ఈ విషయం అర్ధమైతే ఇంక ఆశ్చర్యపోవడాలు వుండవు అని భావిస్తున్నాను.
మరైతే ఫాహియాన్ పేజీకి దారిమార్పుగా ఏ పదం తీసుకోవాలి అనేది ఒక ప్రశ్న. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటీ absolute transliteration కాదు అని పైన చెప్పాం. కొంతలో కొంత దగ్గరగా వున్నా పేర్లు కాబట్టి కాబట్టి కనుక దేనినైనా మనం దారిమార్పు చేసికోవచ్చు. లేదా నాలుగింటినీ ఆంగ్లదారిమార్పులుగా తీసుకోవచ్చు. దారిమార్పు అంటేనే ఎన్ని విధాలుగా వ్యవహరిస్తామో అన్ని విధాలుగా చేసేది కాబట్టి, నాలుగింటికీ ఆంగ్ల దారిమార్పు చేస్తే reader కి అత్యంత సౌలభ్యంగా వుంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అంత ఓపిక లేవు ఒకటే చేస్తాను అనుకొంటే ఒకటే చేయండి.
--Vmakumar (చర్చ) 18:40, 24 అక్టోబరు 2017 (UTC)
- నందమూరి తారక రామారావు వ్యాసానికి గల 18 దారిమార్పు పేజీలలో english లిప్యంతరీకరణం combinations లతో ముడిపడివున్నవి 15 వరకూ ఉన్నాయి. అసలు ఒక భాషా పదానికి మరో భాషాలోని ‘లిప్యాంతరీకరణ పదం’ ఛాయ (shadow) లాంటిది. మీ వాదన ప్రకారం చూస్తె, “ఆంగ్ల ఛాయ” (ఆంగ్ల పేరుకి గల లిప్యంతరీకరణం) ను నమ్ముకొని మీరు ఎన్ని దారిమార్పులకైనా సిద్ధపడటం మీకు అంగీకారమవుతుంది. కాని ఆ ఆంగ్ల పదాలు (N.T.R/ N.T. Ramarao) మీకు అంగీకారం కావు. అంటే మీరు తెలుగు లిప్యంతరీకరణంలో ఎన్ని దారిమార్పుల పేజీలనైనా ఆమోదిస్తున్నారు కాని ఆంగ్ల పద పేజీ వాడటం మాత్రం మీకు అనవసరం అనిపిస్తుంది.
ఇంకా సూటిగా చెప్పాలంటే బ్యాంకు పదానికి ఒకవేళ దారిమార్పులు చేయవలసి వస్తే, - బ్యాంకు, బ్యాంక్, బాంక్, బాంకు, బేంక్, బేంకు లాంటి ఆరు పదాలను (ఛాయా పదాలు) దారిమార్పుపేజీలు గా చేయడానికి మీకు ఓకే. ఎందుకంటే అవి మీకు తెలుగు అక్షరాలలో కనిపిస్తున్నాయి కాబట్టి. మీ వాదన ప్రకారం ఇటువంటి లిప్యంతరీకరణం లో reader చేసే తప్పులన్నిటికీ (?) ఆరు దారిమార్పు పేజీలు సృష్టించడం మీకు ఓకే. కారణం అవి మీకు తెలుగు భాషలో కనిపిస్తూ వుండటమే. కాని bank (ఆంగ్ల పదం) తో ఆంగ్ల దారిమార్పు చేయడానికి మాత్రం ససేమిరా ఆమోదయోగ్యంగా వుండదు. కారణం bank పదంలో ఆంగ్ల అక్షరాలు మీకు కనిపిస్తున్నాయి. అంటే దారిమార్పులకు మీ ప్రధాన అభ్యంతరం ఆంగ్ల అక్షరాలు. ఒకచోట తెలుగు దారిమార్పులను ఎన్ని పేజీలైనా మీరు ఆమోదించడానికి సిద్ధపడతారు. మరోచోట ఆంగ్లంలో ఒక్క దారిమార్పు పేజీ ఉనికిని కూడా మీరు ఆమోదించే స్థితిలో లేరు.
- ఇక్కడ సగటు రీడర్ తరుపున నేను కోరుతున్నది కొద్దిగా సావదానంగా పరిశీలించండి.
1. తెలుగు పదాల విషయంలో:
దారిమార్పుగా తెలుగు పదాలు వుండాలి.
తెలుగు పదాలకు 10 ఏమిటి ఇంకా ఎన్ని variants ఉన్నప్పటికీ మీరు ఎన్ని దారిమార్పు పేజీలు అయినా సృష్టించుకోండి. (అది reader కి సౌలభ్యంగా వుంటుంది. – అది అందరికీ ఆనందం)
2. ఆంగ్ల పదాల విషయంలో:
a. దారిమార్పులుగా ఆంగ్లపదం వుండాలి. ఇప్పటివరకూ వున్న అవకాశాన్ని కొనసాగించాలి.
b. బహుళ తెలుగు లిప్యంతరీకరణాలు వాడద్దు అనడంలేదు. (ఒక వ్యాసానికి ఆంగ్లం నుంచి 10 తెలుగు లిప్యంతరీకరణాలు వుంటే నిరభ్యంతరంగా 10 టినీ వాడండి.) ఉదాహరణకు బ్యాంకు వ్యాసానికి తెలుగు లిప్యంతరీకరణంలో 6 రకాలు గా చేయవచ్చు అనుకొంటే నిరభ్యంతరంగా చేయండి. (అది reader కి సౌలభ్యంగా వుంటుంది. –అది అందరికీ ఆనందం)
c. బహుళ ఆంగ్ల పదాలు అన్నిటికీ దారిమార్పులు సృష్టించాల్సిందే అని కోరడమూ లేదు. (ఒక వ్యాసానికి 10 ఆంగ్ల పదాలు variant గా వుంటే వాటన్నింటికీ దారిమార్పు పేజీలు ఉండవలసిందే అని కోరుకోవడం లేదు. ) ఉదా. మీరు చెప్పినట్లు ఫాహియాన్ వ్యాసానికి 4 ఆంగ్ల variants, ఆ నాలిగింటికీ దారిమార్పులు చేసితీరవలసిందే అనడం లేదు.)
--Vmakumar (చర్చ) 18:54, 24 అక్టోబరు 2017 (UTC)
- పాహియాన్ ఉదాహరణకు సంబంధించి: ఆంగ్ల దారిమార్పు అక్కరలేదంటూ మూడు విభాగాలలో మీరు వివరించారు. అయితే ఆ మూడు విభాగాలలో మీరు చేసిన వాదనలో drawbacks వున్నాయని, సౌలభ్యత అసలే లేదని అది హేతుబద్ధతకు ఏమాత్రం నిలువదని సోదాహరణంగా చెప్పబడింది. అయితే మీరు ఎలా హేతుబద్దమో వివరించడానికి పునః ప్రయత్నం చేయలేదు. బదులుగా 3 వ విభాగంలోని పాహియాన్ అనే ఉదాహరణను ప్రస్తావించారు. దీనికి సంబంధించి జవాబు A)తప్పిదాలపరంగాను, B)సంఖ్యా పరంగాను రెండుగా వుంది.
A. “అలా ఐతే, లిప్యంతరీకరణలో పాఠకుడు చేసే తప్పిదాలన్నిటికీ, ఇంగ్లీషు వెతుకులాటలో చేసే తప్పులన్నిటికీ దారిమార్పు పేజీలు తయారుచేద్దామా? ....” అని మీరు చెప్పడం జరిగింది. మీ భావనలో పాఠకుడు లిప్యంతరీకరణం లో చేసిన తప్పిదాలు అంటే ఏమిటి? ఫాహియాన్ పదం చైనీస్ నుండి ఆంగ్లం లోనికి, ఆంగ్లం నుండి తెలుగులోనికి లిప్యంతరీకరణం జరిగింది. 法顯 పదానికి లిప్యంతరీకరణంలో 4 ఆంగ్ల variants ఉన్నట్లయితే ఇవి తప్పులు ఎలా అవుతాయి. ఒక భాషనుండి వేరొక భాషలోనికి లిప్యంతరీకరణం చేసేటప్పుడు వచ్చే variants లను తప్పుగా భావించకూడదు. ప్రాంతీయత, సంస్కృతి, మాండలికం, యాస, .....ల కారణంగా ఉచ్చారణ కొద్దిమేరకు మారుతుంది. దాని కనుగుణంగా లిప్యంతరీకరణంలో variants వస్తాయి. ఉదాహరణకు bank ను లిప్యంతరీకరణంలో బ్యాంక్, బేంక్ అనేవి రెండు variants అనవచ్చు. దీనిలో ఎక్కువమంది వ్యవహరించే బ్యాంక్ ను ప్రామాణికంగా భావించినంత మాత్రాన్న బేంక్ ను అప్రామాణికం, తప్పు అనకూడదు. లిప్యంతరీకరణంలో బేంక్ అనవలసిన పదాన్ని ఎవరైనా టేంక్ అని రాస్తే అది పాఠకుడు చేసే తప్పిదం అవుతుంది. ఒక పదానికి వేర్వేరు మాండలికాలున్నప్పుడు వాటిలో ఒక పదమే కరెక్ట్, మిగిలినవి తప్పులు అనకూడదు కదా. ఇదీ అంతే. మనకు పాహియాన్ కు సంబంధించి చైనీస్ నుంచి ఆంగ్లానికి వచ్చినవి 4 variants గా అనుకుంటే.ఆ నాలుగూ variants అమోదయోగ్యమైనవే. తప్పులుగా భావించకూడదు. అదేవిధంగా ఆ నాలుగు ఆంగ్ల పదాలను తిరిగి తెలుగులోకి లిప్యంతరీకరణం చేస్తే వచ్చే తెలుగు పదాలలో (4 లేదా 4+) ఎదో ఒకటే కరెక్ట్ పదంగా భావించి మిగిలిన తెలుగు పదాలను పాఠకుడు చేసిన తప్పులుగా భావించకూడదు. మరో ఉదాహరణలో ఇప్పుడు NTR పదానికి లిప్యంతరీకరణం ఎన్టీఆర్ అవుతుంది లేదా యన్టీఆర్ రెండు variants. ఒకవేళ ఎవరైనా NTR ను సరిగా లిప్యంతరీకరణం చేయలేక ఎమ్టీఆర్ అని టైపు చేసాడు అనుకోండి. అది తప్పవుతుంది. ఈ తప్పుకి కూడా దారిమార్పు పేజీ (NTR ఆంగ్లపదానికి) చేయమని ఎవరూ కోరుకోరు. అలాగే Fahien పదానికి ఫాహియాన్ ను దారిమార్పు చేసారు కాని ఫహియన్ ను దారిమార్పుగా చేసుకోవడం లేదు. కోరుకోలేదు. కనుక ఫాహియాన్ కు english లో 4 varients ఉన్నట్లయితే మనం ఆ 4 ఆంగ్ల పదాలను దారిమార్పులుగా స్వీకరించడం ఒకరకంగా ఉత్తమ పద్దతి. అలాకాదు అంటే ఎక్కువ పాపులర్ అయ్యిన ఎదో ఒక పదాన్ని మాత్రమే తీసుకుంటాను అంటే మీ ఇష్టం. లేదా వాటికి తెలుగు లిప్యంతరీకరణం తప్ప అన్యదా శరణం నాస్తి అని భావిస్తే ఆ 4 ఆంగ్ల పదాలు తెలుగు భాషా స్వభావం బట్టి కనీసం కనీసంగా మరో 8+ పదాలుగా మారవచ్చు ఎందుకంటే (NTR – ఎన్టీఆర్, యన్టీఆర్ అయినట్లు). దీనినీ తప్పు పట్టలేం. అయితే ఎన్ని పదాలు పాపులర్ అవుతాయి. ఇంకా చైనీస్ ఉచ్చారణకు అనుగుణంగా అనేక పదాలను తెలుగులో లిప్యంతరీకరణంలో రాయాల్సివున్నప్పటికి వాటన్నిటినీ మనం పట్టించుకోలేదు. జనాల్లో చోచ్చుకొనిపోయే పదాలే, వారి నోట్లో తిరిగే పదాలే ప్రామాణికం (?) అనిపించుకొంతాయి. ఎక్కువకాలం మన్నుతాయి. క్రమేణా జనాంతికంగా పాహియాన్ పదమే తెలుగులో పాపులర్ అయ్యింది. ఎంతగా పాపులర్ అయ్యిందంటే ఫాసియన్ అనే మరో తెలుగు లిప్యంతరీకరణపదం కూడా భాషా శాస్త్రం ప్రకారం ఒప్పైనప్పటికీ “పాఠకుడు తప్పిదం చేసాడనుకోనేంతగా” . [అలాగే మరో చైనా యాత్రికుడు ఇత్సింగ్ – ఈ పదం తెలుగులో ఎంతగా చొచ్చుకు పొయిందంటే ఇ-చింగ్ అనే మరో పదం ఒప్పైనప్పటికీ తప్పురాసేడన్నంతగా] ‘పాఠకుడు చేసే తప్పిదనాల’ గురించి మనకు ఇంతకంటే జవాబు అవసరం ఉండకపోవచ్చు.
B. ఈ పాహియాన్ ఉదాహరణలో కొన్ని పదాలకు ఆంగ్ల variants ఉంటాయిగా ఆన్నింటికీ దారిమార్పులు చేయవలసినదేనా! అయితే ఫాహియాన్ కు నాలుగు ఆంగ్ల దారిమార్పులు చేయాలి కదా? అంటూ ప్రశ్నించారు అయితే దానిని 6 లక్షల దారిమార్పులు చేసేయవచ్చు అనేవరకూ విపరీతార్ధంలో లాక్కుపోయారు. ఇక్కడ ప్రశ్నించే విధానం మాత్రం హేతువు చెప్పడం కంటే సంఖ్యలను విపరీతార్ధంలో ఊహించేంతవరకూ పోయింది. ఆంగ్లంలో ఎన్ని variants వుంటే అన్నీ చేయాలా! అనే స్థాయిలో అడుగుతున్నారు.
"అంటే సిసలైన వ్యాసం పేజీ ఒక్కోదానికీ ప్ఫదో పదిహేనో దారిమార్పు పేజీలు! ఒక్కో తప్పుకూ ఒక్కో పేజీ.. 60 వేల వ్యాసాలుంటే ఆరు లక్షల దారిమార్పు పేజీలు!! దారిమార్పులే దారిమార్పులు!!!" ఇలా మీరు చెప్పే విధానంలో ఆంగ్ల దారిమార్పులు పట్ల తీవ్ర అసహనం తొంగి చూస్తుంది. ఎందుకంటే మీరు ఆంగ్లదారిమార్పులను హేతువు ప్రకారం కాకుండా "సంఖ్యలపరంగా" అసంబద్ధమైన రీతిలో పోలుస్తున్నారు.
- ఎక్కడా లేని సంఖ్యా నిబందనను ఆంగ్లదారిమార్పులకు ముడిపెట్టి పోల్చడం అసంజసం: దారిమార్పులకు (అది ఏ భాషలోనైనా కావచ్చు) అసలు సంఖ్యలతో ఎందుకు ముడి పెట్టవలసివస్తున్నది. ప్రస్తుతం తెవీకీలో కొనసాగుతున్నది స్వచ్చంద విధానం. తెవీకీలో “తెలుగు దారిమార్పు” లు ఇన్ని వుండాలి అనే విధానం ఏదీ లేదు. (ఆంగ్ల పదాలకు సంబంధించిన) లిప్యంతరీకరణ పదాల విషయంలోనూ ఇన్ని దారిమార్పులే చేయాలి అనే విధానం ఏదీ లేదు. అలాగే ఆంగ్ల దారిమార్పులకు కూడా ఇన్ని వుండాలనే విధానం కూడా ఏదీ లేదు. “ఇన్ని వుండాలి” అనే విధానమే తెవీకీలో అసలు లేనపుడు “ఇన్ని వుంటా”యని ఆంగ్లదారిమార్పుల పట్ల ఎందుకు మీరు కలవరపడుతున్నారు? అసలు సంఖ్యా నిబందన అన్నదే తెవీకిలో లేనపుడు – దానిని ఆంగ్ల దారిమార్పులకు ముడిపెట్టాల్సి కామెంట్ చేయడం చర్చలో అవసరమా చెప్పండి. ఆంగ్లం పట్ల ఇది అసహనంకాక మరేమవుతుంది.
ఒకవైపు reader కి వున్న ’సౌలభ్యత”ను పణంగా పెడుతూ. reader కి ఎదురవుతున్న అసౌకర్యంను పట్టించుకోకుండా మరోపక్క ఉంటాయో వూడతాయో తెలియని (struggle for existence) స్థితిలో వున్న “ఆంగ్ల దారిమార్పు పేజీలను సంఖ్యాపరంగా భూతద్దంలో చూపించే ప్రయత్నం” - ఇది ఆంగ్ల భాష పట్ల అసహనత కనపరచడమే.
--Vmakumar (చర్చ) 21:49, 24 అక్టోబరు 2017 (UTC)
- సహాయక పేజీ : చదువరిగారు, మీరు external sources నుండి advice లు పొందాల్సిన అవసరం లేదనడానికి ప్రత్యామ్నాయంగా టైపింగ్ లో సాయం అంటూ లిప్యంతరీకరణం నికి సంబంధించి ఒక సహాయక పేజీ చూపించారు. ఇది విన్నవారికి సమంజసమే కదా టైపింగ్ పేజీ ప్రముఖంగానే కనిపించేటట్లు చేసారు కదా అనిపిస్తుంది. ఈ పద్దతి సౌలభాన్ని పెంచిదా అంటే అదేం లేదనే చెపుతున్నాను. దాన్ని మీరు ఒకపక్క అంగీకరిస్తూనే ఇంకా సాయం, సాయం అనే పదాలను పట్టుకొని సాగుతున్నారు. మీరు చెప్పే సాయం లిప్యంతరీకరణంపై మనలాంటి వారికి చక్కని అవగాహన కలిగిస్తుందే గాని మనం చర్చిస్తున్న సగటు reader కి కడు. ఇది అతనిని ఇంకా సులభదారికి కాదు మరిన్ని స్టెప్స్ లో ప్రవేశించాల్సిన స్థితికి తీసుకుపోతుంది. ఆ విషయం మీకూ తెలుసు. అయినప్పటికీ మరోసారి కంపూటర్ పరిభాషలోనే చెప్పడం జరిగింది. ఒక పదం సెర్చ్ చేసుకోవడానికి ఈ పేజీని open చేస్తూ అందులో చెప్పిన విధంగా అక్షరం –అక్షరంతో మన టైపింగ్ సరి చూసుకొంటూ పోవాలంటున్నారు. ఈ విధంగా internal source లో మీరు కల్పించే ఈ సౌకర్యం ఇంకా అదనంగా స్టెప్స్ create చేస్తుందే తప్ప తగ్గించదు. ఎందుకంటే ఒక పద్దతి సులభమా కాదా అనేది శాస్త్రీయంగా క్లిక్స్ పద్దతిలోనే చెప్పాలి. ఆ ప్రకారం మొదటిసారి హోమ్ పేజీ నుండి చూస్తాడు అనుకొంటే, మీరన్నట్లు .... పాఠకుడు ఆ పేజీకి వెళ్ళాలి, ఎలా రాయాలో నేర్చుకోవాలి అప్పుడుగదా అతడు సరిగ్గా రాయగలిగేది, అందుకు మూణ్ణాలుగు స్టెప్పులవసరమౌతాయి. అలాగే ఈసారి హోమ్ పేజీలో కాకుండా లోపలి వ్యాసం పేజీలో వున్నప్పుడు సెర్చ్ బాక్స్ ఉపయోగించాలంటే మళ్ళీ హోమ్ పేజీకి రావాలి. మళ్ళీ అదనపు click. ఇలా కాదని ప్రత్యేకంగా మరో tab ను open చేసి అక్కడ మీరు చెప్పిన టైపింగ్ సాయం పాఠoను స్థిరంగా ఉంచుకొన్నా డౌట్స్ వచ్చిన ప్రతీసారి ఆ పక్కపేజీలోకి వెళ్ళడానికి క్లిక్కులు చేస్తూనే వుండాలి. ఇది చాలా చాలా ప్రయాస. చదువరిగారు స్ట్రెయిట్ గా చెప్పండి ఒక సగటు reader కి ఇన్ని క్లిక్కులవసరమా! ఒక reader ని ఇన్ని క్లిక్కులు చేయాల్సినవిధంలోకి నెట్టడం ఏ మాత్రం భావ్యం కాదు. మనకున్న భావాలతో, ఒక reader కి వున్న ఆంగ్ల ఆప్షన్ ను ఎత్త్తివేస్తూ అతనిపై తెలుగు లిప్యంతరీకరణంని రుద్దే ప్రయత్నమే ఇది అని నా అభిప్రాయం. general point of view లోనే సార్వత్రికంగానే చెపుతున్నాను. ఈ రోజు మనకు ఇక్కడ బలం (మెజారిటీ) వుందని, అవతలివాడు మనలాగే ఆలోచించాలని ఆశించడం, మనం చెప్పినరీతిలోనే ఆతను నడుచుకోవాలనుకోవడం పరిణితి అనిపించుకోదు. లోకో భిన్నతః రుచి అంటారు. దానిని అనివార్యంగా గుర్తిస్తేనే ఘర్షణ -అశాంతి రాదు. మన భావాలతో మనం నడవాలి. కొంతవరకు మన కుటుంబం నడవాలి అంతే గాని వ్యవస్థ నడవాలని కోరుకూడదు.
--Vmakumar (చర్చ) 22:37, 24 అక్టోబరు 2017 (UTC)
- లిప్యంతరీకరణం లో సాయం చేసే పరికరం అందుబాటులో వుందని మీరంటున్నారు. english లో అయితే తప్పులు దిద్దడానికి ఏ పరికరమూలేదు అని చెపుతున్నారు. అయితే ఆంగ్లంలో పరికరం లేనంత మాత్రాన్న ఆంగ్లదారిమార్పులు అనవసరం అని మీరు అభిప్రాయపడుతున్నారా! ఆంగ్లదారిమార్పులు అవసరం లేదనే వాదనకు మద్దతుగా 'పరికరం లేదు' అని ఒకవేళ చెప్పాల్సివస్తే దాని analogy క్రిందివిధంగా సాగుతుంది. స్థూలంగా మాత్రమే చూడండి.
1.రోడ్డుపై ఒక మనిషి నడుస్తున్నాడు. (ఆంగ్లదారిమార్పులు)
2.అతను ఎప్పుడైనా దారి తప్పవచ్చు (mistakes చేయవచ్చు)
3.దారితప్పినపుడు సాయపడటానికి మార్గ సూచీ లేదు (తప్పులు చేసినపుడు సాయం చేసే పరికరం లేదు)
4.కనుక అతను రోడ్డు మీద నడవడం అనవసరం ( కనుక ఆంగ్ల దారిమార్పులు అనవసరం)
5.ఇక అతనిని రోడ్డుమీద నడవనీయకుండా చూడాలి. ( ఇక ఆంగ్ల దారిమార్పులు నిరోదించే విధానం కావాలి)
ఇటువంటి analogy ఏఏ విషయాలలో implement చేయాలి. శైశవ దశలో వున్న వ్యవస్థలకు, హానికరమైన పరిస్థితులున్న వ్యవస్థలకు. ఆంగ్లదారిమార్పులు ఎవరికైనా హాని చేస్తున్నాయా?
.... contd
--Vmakumar (చర్చ) 23:01, 24 అక్టోబరు 2017 (UTC)
- ఇక్కడ ఒక్క చిన్న విషయం చదువరిగారు, మరోలా అనుకోవద్దు. తొలినుంచి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని, enwiki లను చూపిస్తూ “ఆ పద్దతిలో వుంది కనుక ఈ పద్దతిలో ఇక దారిమార్పు అవసరం లేదు అంటూనే వాదన కొనసాగింది. ఏదైనా ఒక పద్దతి సులభంగా ఉందా లేదా అనేది తేల్చాలంటే- ఆ పద్దతిలో కోరుకొన్న టార్గెట్ ను చేరడానికి ఎన్ని క్లిక్స్ నోక్కవలసి వస్తుంది అనేది తులనాత్మకంగా పరిశీలిస్తే ఏ పద్దతి సులభం, ఏ పద్దతి సులభం ఏది కాదు అన్నది క్లిక్స్తే సంఖ్యను బట్టి తేలిపోతుంది. ఆ విధంగా మీ వాదనలో మీరు చెప్పే పద్దతికి ఎక్కువ క్లిక్స్ అవసరం అవుతున్నాయని తెలియచేయడం జరిగింది. పైగా మీ పద్దతిలో reader కి అదనంగా advice పొందడం, reader కి లిప్యంతరీకరణంపై కొంత అవగాహనా నైపుణ్యం అవసరమని చెప్పడం జరిగింది. దీనికి ప్రతి వాదనగా మీరు చేసిన పని కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. నా వాదనకు అనుగుణంగా నేను చెప్పిన పాయింట్స్ లలో క్లిక్స్, advice ల ప్రస్తావన వచ్చేసరికి మీరు “ ..... ప్రస్తుతం ఆ లింకును నేరుగా నోటీసులోనే పెట్టాను. ఇక ఈ పేజీ లింకు ప్రతీపేజీలోనూ పైన స్ఫుటంగా కనిపిస్తుంది. లిప్యంతరీకరణలో సహాయం మరింత అందుబాటులో ఉంటుందిపుడు. “ అంటూ మార్పులు చేసేపారేసారు. ఒక పక్క మీరు చెప్పే మార్గం క్లిష్టం అంటూ నేను చెపుతున్నప్పుడు మీ వాదనకు అనుగుణంగా అంటే నా వాదనను బలహీనపరిచే మార్పులు చేసి వేసారు. ఒక చర్చ జరుగుతుండగా చర్చ మధ్యలో చేయకూడని పని ఇది అని భావిస్తున్నాను. ఇదే విధంగా మరికొందరు ఎవరైనా నేను చెప్పిన నేను చెప్పిన ఉదాహరణలలో దిద్దుబాట్లు, మార్పులు చేసివేస్తే నా వాదన వీగిపోతుంది కదా! మీరు అధికారి హోదాలో కూడా వున్నారు. వాడుకరిగా చర్చిస్తూనే, హుందాగా సమీక్షిస్తూ వుండాలి. తెవీకీలో సామాన్య వాడుకరులకు లేని accessibility అధికారి హోదాలో మీకు వుంటాయి. దానిని మీ వాదనకు అనుగుణంగా, అందులోను మీరు పాల్గొన్న చర్చ మధ్యలో మీ కనుకూలంగా ఉపయోగించకూడదు అనేది ఔచిత్యం . అదేవిధంగా ఒక వాడుకరిగా చర్చ లో పాల్గొనే హక్కు మీకు వుంది. ఎవరూ ప్రశ్నించడం లేదు. అయితే ఒక వాడుకరిగా సీరియస్ గా పాల్గొంటూ వున్న మీరు చర్చ మధ్యలో లింకును నేరుగా నోటీసులోనే పెట్టడం దేనికి? అంటే ఇప్పటివరకూ నేను చర్చిస్తున్నది వాడుకరితోనా! అధికారి తోనా! వాడుకరి హోదాలో మీరు నాతొ చర్చిస్తే, నేను లేవనెత్తిన వాదనను బలహీనపరిచే ప్రయత్నం అధికారి హోదాలో మీరు చేయకూడదు కదా! ఒకవేళ అధికారి హోదాలో చర్చనీయాంశం అవుతున్న విషయానికి సంబందించిన మార్పులు చేర్పులు చేసేటట్లయితే వాడుకరిగా నాతొ చర్చించడం దేనికీ! ఇది చర్చ మధ్యలో అనుచితమైన జోక్యం కిందకు వస్తుందా! లేదా! నాకైతే కొంచెం తికమకగా వుంది.
ఒకవేళ ఆ లింకును నేరుగా నోటీసులోన పెట్టకుండా , దానిని ఈ విధంగా చేస్తే మన readers కి కొద్దిగా అనుకూలంగా ఉండవచ్చు అని చర్చలో భాగంగా, మార్పు చేయకమునుపే ఒక ముక్క చెపితే అది proper wayలో ఉంటుంది కదా అని just అనిపించింది. చర్చ మధ్యలో ఇటువంటి ప్రయత్నం అటుదిటు అయినా తన వాదన నెగ్గించుకోవాలన్న తపనను, ఆదుర్ధాను సూచిస్తుంది. అందుకే మీ వాదనలో వున్నది తెలుగు పట్ల అభిమానంతో పాటు కొద్దిగ స్థాయిలో english పట్ల అసహనం నాకు కనిపించింది అని చెప్పగలుగుతున్నాను. అయితే తేవీకిలో ఇలాంటివి మామూలే. దీనికి ప్రాధాన్యత లేదు అన్నా ఓకే. --Vmakumar (చర్చ) 01:20, 25 అక్టోబరు 2017 (UTC)
అయితే చదువరిగారు. మీరు రీడర్స్ కు మేలుచేయాలనే సదుద్దేశంతోనే అది చేసివుంటారు అని మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే అలా మార్పులు చేసి సర్దేసే వాళ్ళు ఇలా చేసాను అని చర్చ మధ్యలో చెప్పనే చెప్పరు. పైగా అలా చేసాను అని మీరు చెప్పడంలో రీడర్స్ కి మరింత సహాయం చేస్తున్నాననే తపనే కనిపించింది. వాడుకరి పేజీలో చూస్తె తెలుగుమీద మీ అభిమానం, తెలుగును కాపాడుకోవాలన్న తపన మూడు లైన్లలో కనిపిస్తుంది. అయితే మార్పును radical గా మనం కోరుకోకూడదు. మార్పు ఎప్పుడూ నిదానంగానే రావాలి. అప్పుడే అది sustainable అవుతుంది.
NOTE: చివరిగా నావాదన వినిపించడానికి నా అభ్యర్ధనను మన్నించి అదనంగా కొంత సమయం కేటాయించినందుకు నిర్వాహకులకు, అధికార్లకు కృతజ్ఞతలు. ఈ చర్చలో నేను డిఫెన్సివ్ గానే అప్రోచ్ అయ్యాను. అందుకే సుదీర్ఘంగా one way traffic లా కొనసాగింది. ఈ చర్చలో నాకు తెలిసినది ఏమిటంటే ప్రాధమికంగా ఇది తెలుగువారి తెవీకి సైట్. తెలుగు మీద గాడమైన అనురక్తి, ఆశక్తి, అభిరుచి, అభినివేశం, పని పట్ల చక్కని కమిట్మెంటు వున్నవారే దీనిలో ఎక్కువగా వున్నారు. వుంటారు కూడా. చర్చలో ఒకరిద్దరు స్పృశించారు తప్ప చర్చ ఆసాంతం ద్విముఖంగానే కొనసాగింది. ఉద్దండులైన ఇతర సభ్యులకూ ఆశక్తి లేకపోవడం అనుకుంటా చర్చకు దూరంగానే వున్నారు. నా అనివార్యమైన పని వత్తిడి స్వభావరీత్యా నేను వెంటవెంటనే చర్చించడం, సమాధానమివ్వడం జరగలేదు. ఇది ప్రధానంగా నా లోపం. చర్చలో english భాష పట్ల కొంత అసహనం, radical change కోరుకొనే వైఖిరి కొద్దిగా కనిపించాయి (నాదృష్టిలోనే సుమా.) అందుకే చిట్టచివరలో నేను కొద్దిగా మృదువు కాని పదాలను వాడవలసి వచ్చింది. నోచ్చుకొనే విధంగా అవి ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వారిపట్ల , వారి సిన్సియర్ కమిట్మెంట్ పట్ల నాకు రవ్వంత అయినా సందేహంలేదు. చర్చకు ఇచ్చిన గడువూ పూర్తయ్యింది. నిర్ణయమేదైనా మళ్ళీ వెంటనే వికీ వ్యాసాలలోనే మునిగిపోదాం. ధన్యవాదాలు. --Vmakumar (చర్చ) 02:00, 25 అక్టోబరు 2017 (UTC)
నిర్ణయం
మార్చుఆంగ్లపేర్లతో దారిమార్పులు ఉండాలా? వద్దా? అనే విషయంలో గత కొన్నేళ్ళుగా సాగుతున్న సుధీర్ఘ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేవు. మళ్ళీ ఇప్పుడు ఇదేవిషయంపై నిర్వహించిన ఓటింగులో కూడా (వాస్తవానికి ఇది ఓటింగ్ తరహాలో సాగలేదు) దురదృష్టవశాత్తూ ఎటువైపు కూడా నిర్ణయం జరగలేదు. ఇది ఓటింగు అనుకున్ననూ వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం కనీసం ఐదుగురు తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది (చర్చలు, అభిప్రాయాలలో కాకుండా అనుకూలం, వ్యతిరేకం, తటస్థ విభాగాలలో మాత్రమే) కాని ఈ ఓటింగు(?)లో ఈ సంఖ్య కొరవడినట్లు స్పష్టమైంది. అంతేకాకుండా ఇందులో పాల్గొన్న సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలు చూసిననూ (అనుకూలం, వ్యతిరేకం, తటస్థ విభాగాలలోనే కాకుండా చర్చల విభాగంలో అభిప్రాయాలు తెలిపిన సభ్యులను పరిగణనలోకి తీసుకున్ననూ) ఎటువైపు కూడా 80% మద్దతు రాలేదు. కాబట్టి ఈ ప్రతిపాదన వీగిపోయినట్లుగా పరిగణించబడింది.
- దారిమార్పు పేజీలు ఉండాలి: Vmakumar (మొత్తం ఓట్లు 1)
- ఉండకూడదు: కె.వెంకటరమణ, రవిచంద్ర, (మొత్తం ఓట్లు 2)
- తటస్థవైఖరి: JVRKPRASAD, (మొత్తం ఓట్లు 1)
మొత్తంపై 2 కారణాల వల్ల ఈ ప్రతిపాదన వీగిపోయింది. (ఓటింగులో పాల్గొన్న సభ్యుల సంఖ్య 5కు మించకపోవడం మరియు 80% మద్దతు లభించకపోవడం) మళ్ళీ ఈ ప్రతిపాదనకు కనీసం 60 రోజుల వ్యవధి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన వీగిపోయింది కాబట్టి దారిమార్పులపై ఇదివరకు అంటే ఈ ప్రతిపాదనకు ముందు ఉన్నట్లుగా పరిమితంగా ఆంగ్లపేర్లతో దారిమార్పులకు అవకాశం ఉంటుంది. ఆంగ్లపేర్లతో దారిమార్పులు విపరీతంగా జరుగుతున్నాయని ఎవరైనా అభ్యంతరపరిస్తే మాత్రం చర్చలద్వారా ఈ సంఖ్యను తగ్గించడానికి అవకాశం ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:33, 29 అక్టోబరు 2017 (UTC)