వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 32

పాత చర్చ 31 | పాత చర్చ 32 | పాత చర్చ 33

alt text=2014 ఫిబ్రవరి 1 - 2014 ఫిబ్రవరి 28 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2014 ఫిబ్రవరి 1 - 2014 ఫిబ్రవరి 28

మిత్రులకు శుభవార్త - తెలుగు వికీ జైత్రయాత్ర

మార్చు

తెలుగు వికీపీడియా తన పదేళ్ళ నడకలో ఎన్నో సంచలనాలకు వేదికగా నిలచిందనడం అతిశయోక్తి కాదు. 'విజయ' ఉగాది విజయోత్సవాలు అందుకు ప్రధమ నిదర్శనమైతే, కొత్తవ్యాసాలచేరికలో, కొత్త వాడుకరుల ప్రవేశం, కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మరో నిదర్శనం. సహా సభ్యులను పురోగమన దిశలో నడిపించడంలో అధికారులు, నిర్వాహకులు చూపిస్తున్న చొరవ- సమయస్ఫూర్తి- సంయమనం రేపటి మన విజయ పరంపరకు ఆలంబనగా నిలుస్తాయనడం సత్యదూరం కాదు. ఇదే సందర్భంలో... మనం వికీపీడియా:తెలుగు వికీ జైత్రయాత్ర - ఫిబ్రవరి 17-20 నిర్వహిస్తే సహసభ్యులకు ఉత్సాహంగానూ, స్ఫూర్తి దాయకంగానూ ఉంటుందన్నది నా ఆలోచన. అందుకే.. ఫిబ్రవరి 15,16 తేదీలలో విజయవాడ కే.బి.యెన్. కాలేజీలో తెవికీ దశాబ్ది ఉత్సవాలు ముగిసిన తరువాత ఆ మర్నాటి నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహసభ్యులందరం కలసి జైత్రయాత్ర చేస్తూ... కాకినాడ, రాజమండ్రి, తణుకు, భీమవరం,- (కుదిరితే మరో రెండు ఊళ్ళు కూడా) లలో అకాడమీలు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తే బావుంటుంది. సాధారణంగా అకాడెమీ ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరో,ముగ్గురో వెళ్లి అకాడెమీ నిర్వహించడం సహజం. కానీ ఇప్పుడు- ఆసక్తి వున్న మిత్రులందరం కలసి ప్రత్యేకంగా బస్సులో వెళ్ళడం మనలో కొత్త ఉత్సాహం నింపుతుందని నా భావన. ఈ క్రమంలోనే మార్గ మధ్యంలో చూడదగిన కొన్ని కొత్త పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. తద్వారా విజ్ఞాన విహారయాత్ర గా ఈ జైత్రయాత్ర రూపొందుతుంది. సహసభ్యులు అనుమతిస్తే కార్యక్రమ రూపకల్పన నేను నిర్వర్తించగలను. రవాణా, వసతి, భోజన తదితర ఏర్పాట్లకు సంబంధించి Cis-A2k వారిని అభ్యర్ధించ వచ్చు. సమయాభావం అతి స్వల్పమైనందున మిత్రులు త్వరితగతిన స్పందించవలసిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను. ....మల్లాది కామేశ్వర రావు (చర్చ) 08:17, 1 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విజయవాడ నుంచి ఫిబ్రవరి 17 వతేదినుంది మొదలగు వికీపిడియా జైత్రయాత్రకై ఏర్పాట్లు చురుకుగా జరుగుచున్నవి.జైత్రయాత్రలో స్వయంగా పాల్గొనుటకు ఉత్యాహం, ఆసక్తి,అభిరుచి వున్న తెవికీ సభ్యులు సమయం తక్కువగా వున్నందున మీ పేర్లను వెంటనే నమోదు చేసుకోవలసినదిగా కోరుచున్నాం.దీనివలన కార్యనిర్వాహకులకు సభ్యులకు సరిపడ ఎర్పాట్లు చెయ్యగల్గుతారు.ఎక్కువమంది తెవికీ సభ్యులు ఈ బస్సు జైత్రయాత్రలో పాల్గొని జయప్రదం చెస్తారని ఆకాంక్షిస్తున్నా

పాత చర్చ 31 | పాత చర్చ 32 | పాత చర్చ 33

ను.జైత్రయాత్రలో పాల్గొను సభ్యులు ఇక్కడ మీ పేరును నమోదు చెయ్యండి. Palagiri (చర్చ) 06:39, 7 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త పుస్తకాలు

మార్చు
    • అబుల్ ఇర్ఫాన్ గారి కురాన్ భావామృతం ను వికీసోర్స్ లో ఉంచినందుకు సంతోషం.16.2.2014 న విజయవాడ సమావేశంలో రహ్మానుద్దీన్ గారి కోరిక మేరకు ఇతర అనువాదకులను సంప్రదించాను.

ఈ క్రింది అనువాదకులు తమ అనువాదాల టెక్స్ట్ సాఫ్ట్ కాపీని ఇవ్వడానికి అంగీకరించారు. 2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్(ఫోన్ః 9000227264 ,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ (మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు 2010-అబ్దుల్ జలీల్(ఫోన్ః 9948151159),పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ. 2012-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అల్ ఖురానుల్ మజీద్ ,మౌలానా హాజీ హాఫిజ్ ఖ్వారీ ఫహీముద్దీన్ అహ్మద్ సిద్దీఖీ ,హైదరాబాద్ 2013 - ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,దివ్యగ్రంధం ఖుర్ ఆన్ ,మౌలానా వహీదుద్దీన్ ఖాన్,హైదరాబాద్ ముందుగా ఫోన్ లో సంప్రదించి డి.టి.పి. టెక్స్ట్ ను అనుమతి పత్రాలను వారినుండి తీసుకోవలసినదిగా మనవి.

  • http://www.thraithashakam.org/Books.html లోని కొన్ని పుస్తకాలను వికీసోర్స్ లో ఉంచేందుకు గ్రంధకర్త అనుమతించారు.ఈ పుస్తకాలన్నీ అనూ ఫాంట్ లో ఉన్నాయి.ఖురాన్ భావామృతాన్ని యూనికోడ్ లోకి మార్చినట్లే వీటినీ వికీపీడియా గ్రంధాలయంలో ఉంచగలరా? శ్రీమతి ఉషశ్రీ గారిని ఫోన్.9133353709,indusriushasri@gmail.com లో సంప్రదించగలరు.--Nrahamthulla (చర్చ) 14:03, 13 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

WMF కు చేసుకున్న గ్రాంట్ కి సమ్మతి దొరికింది

మార్చు

మెటా వద్ద అభ్యర్థన ను WMF వారు ఫండ్ చేస్తామని తెలిపారు. ఇది అందరికీ శుభవార్త. ఇందుకు సహకరించిన వారందరికీ ముఖ్యంగా విష్ణు, ప్రణయ్ మరియు అర్జున గార్లకు ధన్యవాదాలు. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:33, 2 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త పేజీని సృష్టించడం ఎలా..?

మార్చు

కొత్త పేజీలు సృష్టించడం కొత్త సభ్యులకు అంత తేలిగ్గా ఉన్నట్టు లేదు. "కొత్త పేజీని సృష్టించు" అని ఒక లింకును ఎడం పక్క లింకుల్లో చేరిస్తే ఎలా ఉంటుంది? -చదువరి (చర్చరచనలు) 07:18, 2 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పుడున్న వ్యాసాలేవో తెలిస్తే కదా కొత్తవేవో తెలియడానికి ??.

మార్చు

నా స్వీయ అభిప్రాయం ప్రకారం కొత్తసభ్యులు కొత్త పేజీలను సృష్ఠించ దానికి ప్రయత్నం చేయ కూడదు. ముందుగా ప్రస్తుతం వున్న వ్యాసాలేవో తెలిస్తే కదా..... తాము సృష్టించ బోయేది కొత్తదో పాతదో తెలియడానికి?? అంచేత వారు వ్రాసేదేదో వ్రాయనీయండి. వారు వ్రాసేదేది క్రొత్తదైతే క్రొత్తగా సృష్టించ బడుతుంది. పాత దైతే ఇదివరకు ఉన్న దానిలో విలీన మౌతుంది. ప్రప్రధమంగా వికీపీడియా గురించి వారికి అవగాహన ముఖ్యం. క్రొత్తవారు వికీపీడియాలో వ్రాయడమే గొప్ప. అది క్రొత్తదా పాతదా.... అనే విషయం తర్వాత వారే చూసుకుంటారు. లేదా నిర్వహకులు తగు సూచనలిస్తారు. ప్రప్రథమంగా ..... వారు వ్రాయడమే ప్రధాన అంశం. క్రొత్త వారికి నా వ్వక్తి గత సూచన ఏమంటే.....???..... క్రొత్తవారు మొదటగా.... విక్షనరీలోను.... మరియు వికీ సోర్సు లో గాని తమ రచనలు ప్రారంబిస్తే.... వారికే కొంత కాలంలో తగు అవగాహన వస్తుంది. ఆ తర్వాత వారిష్టం ఏది వ్రాస్తారో... అదే వ్రాస్తారు. నా వ్వక్తి గత అభిప్రాయం ప్రకారం ..... వికీపీడియా అంటే ఒకటే అనే అభిప్రాయము కొత్తవారిలో నాటుకుని వున్నది. అందులో అనేక విభాగాలున్నవని క్రొత్త వారికి తెలియ చెప్పడం మన ప్రధమ కర్థవ్యం. విక్షనరీ, వికీ సోర్సు , వికీ కామన్సు వంటి విభాగాలలో వారి ప్రథమంగా పాల్గొంటే మంచిదని నా అభిప్రాయం. ఎండు చేతనంటే ఆయా విభాగాలలో వున్న సరళ పద్దతే కారణం. వికీ పీడియా ఐతే..... అందులో వ్రాసిన విషయానికి మూల ఆధారమేమిటి? అది ఎక్కడినుండి తీసుకున్నారు? వారు తీసుకున్న మూలం నమ్మసక్యమైనదేనా..? ఆ మూలం శాస్వతమైనదా? నమ్మసక్యమైనదా? లాంటి సవా లక్ష ప్రశ్నలు ఎదురౌతాయి. క్రొత్తవారు వికీ పీడియాలో వారి ఉత్సాహం కొద్దీ వ్రాయడం ప్రారంబించడానికి మొదలు పెట్టగానే.... నిర్వహకులు... తమ విధి నిర్వహణ లో భాగంలో .... వారు వ్రాసిని వ్యాసానికి మూలం ఏమిటి?... అది నమ్మశక్యమేనా..? అనే సందేహాలు వెలుబుచ్చితే..... క్రొత్తవారు బెదిరి పోయి తమ వ్యాసంగాన్ని విరమించుకునే ప్రమాదమున్నది. కనుక క్రొత్తవారిని ముందుగా.... విక్షనరీ... వికీ సోర్స్ వంటి విభాగాలలో ప్రవేశం అయితే మంచిది. వాటిలో అయితే నకల హక్కులు అంతగా వుండవు. తర్వాత వారికి కొంత కాలంలో అసలు విషయం పూర్తిగా అవగాహన అవుతుంది. క్రొత్త వారు కొంత కాలం ఇందులో నిలబడతారు....... లేదంటే....  ???? ఇది నా వ్యక్తి గత అభిప్రాయము మరియు అనుభవము సుమా..... Bhaskaranaidu (చర్చ) 17:32, 2 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • కళాశాలలో జరిగే వికీ ఏకాడమి లకు విద్యార్డులకు విజ్ఞానము మరియు సాంకేతికం మీద కొన్ని మొలకలు,లేదా సాధారణ పాఠ్య అంశాలమీద తమ వ్యాసంగాన్ని ప్రారంబించడాని ప్రోత్సహిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం వికీ సోర్సు లకు స్వేచ్చా హాక్కుల మీద కొత్తవారికి అంత అవగాహన ఉండక పోవచ్చు వాటికి నకల హక్కులు చాలా ప్రధానం కదా ! ,విక్షనరీ లో ప్రస్తుతం వాడుక పదాలకు అర్ధాలు వున్నాయి కొత్తగా పుట్టిన పదాలకు తత్సమాన తెలుగు అర్ధాలు ఇవ్వటం కొంచెం కస్టమని నా భావన. --కశ్యప్ 05:28, 4 ఫిబ్రవరి 2014 (UTC)
  • వికీసోర్స్ లో కొత్త గ్రంథాలు చేర్చేకన్నా తెలుగు టైపింగు నేర్చుకోవడానికి ఉన్న గ్రంథాలపేజీలను టైపు చేయడం సులభం కాబట్టి కొత్త వాడుకరులు వికీసోర్స్ లో పేజీలు టైపు చేయడం మరియు తెలుగు వికీలో వున్న వ్యాసాలను విస్తరించడం మంచిది.--అర్జున (చర్చ) 05:00, 10 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Hmtv లో విజయవాడలో వికీపీడియా

మార్చు

మిత్రులకు ------------- Hmtv లో “విజయవాడలో వికీపీడియా’’ ఫిబ్రవరి 8వతేదీ శనివారం సాయంత్రం 4-30 గంటల నుంచి 5-00 గంటల వరకు ప్రసారమవుతుంది. ___________Malladi kameswara rao (చర్చ) 17:43, 7 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

‘ఆకాశవాణి హైదరాబాద్’ లో తెలుగు వికీపీడియా

మార్చు

‘ఆకాశవాణి హైదరాబాద్’ మెయిన్ స్టేషన్ లో తెలుగు వికీపీడియా చర్చా వేదిక కార్యక్రమం – 2014 ఫిబ్రవరి 13 వ తేదీ ఉదయం 7-20 గంటల నుంచి 7-45 గంటల వరకు ప్రసారం అవుతుంది. అలాగే - ‘ఆకాశవాణి హైదరాబాద్’ FM – ‘రెయిన్ బో’ లో అదే రోజు అంటే (2014 ఫిబ్రవరి 13 వ తేదీ) ఉదయం 8-00 గంటల నుంచి 8-25 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో నాతో బాటు విష్ణు, రాజశేఖర్, రహమానుద్దీన్ గార్లు పాల్గొన్నారు. _____________మల్లాది కామేశ్వర రావు (చర్చ) 11:56, 10 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఉత్సవాలు యధావిధిగా జరుగుతాయా?

మార్చు

పార్లమెంటులోనూ, రాష్ట్రంలోనూ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, తెవికీ దశాబ్ది ఉత్సవాలు యధావిధిగా జరుగుతాయా? లేదా మార్పులేమైనా ఉంటాయా? నిర్వాహక కమిటీ తెలిపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 12:07, 13 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ది ఉత్సవాలు విజయవాడలో విజయవంతం

మార్చు

దశాబ్ది ఉత్సవాల సంబరాలు అధికారికంగా విజయవాడలో ముగిసాయి. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. --రహ్మానుద్దీన్ (చర్చ) 21:11, 16 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఎంతో ఘనంగా నిర్వహించిన నిర్వహించిన నిర్వాహక కమిటీ వారికి, సభ్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 16:28, 17 ఫిబ్రవరి 2014 (UTC)![ప్రత్యుత్తరం]
ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించిన ఘనత విశ్వనాధ్, రహ్మానుద్దీన్, విష్ణు గారికి దక్కుతుంది. ఇది కొత్తవారికే కాకుండా నాలాంటి సీనియర్లకు కూడా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇందులో పాలుపంచుకొన్న విద్యార్ధుల్ని వికీలో మంచి వాడుకరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను మనం అందరూ చేపట్టాలి. అలాగే మన సభ్యుల మధ్య జరిగిన చర్చలు చాలా ప్రయోజనకరంగా వున్నాయి. వాటిని దీర్ఘకాలంగా ఒక ప్రణాలికబద్ధంగా మనం నడిపిస్తేనే మన తెవికీ అభివృద్ధిని కొనసాగించగలము. వసతి, భోజనసౌకర్యాలు చాలా బాగున్నాయి. నిర్వహించిన వారికి, అందులో చాలా బాగా సహకరించిన కాలేజీ యాజమాన్యానికి, విద్యార్ధులను మనం అందరం ధన్యవాదాలు తెలియజేయాలి.Rajasekhar1961 (చర్చ) 17:55, 17 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ మూసలు వాడేవారికి సూచన

మార్చు

గ్రామానికి కొద్దిమంది మూస:Infobox Settlement వాడటం గమనించాను. మనకు ఇదివరకే మూస:గ్రామం అనే తెలుగు మూస ఉంది. ఆంగ్ల మూసలో మనకు అవసరం లేని సమాచారం అంతా ఉంది. అవి ఇవ్వకపోతే అది దోషభూయిష్టంగా కనిపిస్తోంది. కాబట్టి తెలుగు మూస వాడండి.--రవిచంద్ర (చర్చ) 09:41, 18 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:గ్రామం అభివృద్ధి చేయట్లేదు. భవిష్యత్తులో దాన్ని మరింత మెరుగైన మూసకు దారిమార్పు చేయబడుతుంది (ఉదా: మూస:సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం ). సెటిల్మెంటు మూసను గ్రామాలకు అన్వయిస్తూ వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/గ్రామాల మూస, (మూస:Infobox Settlement/sandbox ఆధారితం) ఇసుకపెట్టెలో ఒక మూసను అభివృద్ధి చేస్తున్నాను. అయితే అది పూర్తి కాకముందే సభ్యులు వాడటం ప్రారంభించారు. సరేలే మూస పూర్తయిన తర్వాత బాటు ఉపయోగించి వాటిని దిద్దుదామని అలా వదిలేశాను --వైజాసత్య (చర్చ) 10:01, 19 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అక్షాంశరేఖాంశాలు ఇవ్వకుంటే అసలు పటమే చూపించకూడదు, కానీ చూపిస్తుంది. అందుకే ఈ దోషపు సందేశం వస్తుంది. దానికి ఒక చిన్న తాత్కాళిక పరిష్కారం చేశాను. --వైజాసత్య (చర్చ) 10:47, 19 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండీ. మూస:గ్రామం గురించి తెలియక ఎవరైనా కొత్త సభ్యులు ఆంగ్ల వికీ నుంచీ కాపీ చేసి ఇక్కడ వాడుతున్నారేమో అనుకున్నా. --రవిచంద్ర (చర్చ) 11:25, 19 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

మార్చు

తెలుగు వికీ పది సంవత్సరాల వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు. నిర్వహణాపరమైన లోపాల ద్వారా కాని, ఏర్పాట్ల ద్వారాకాని ఎవరికైనా ఏవిదమైన కష్టం కలిగినా, ఎవరినైనా పలుకరింపులలో విస్మరించినా, అలాంటి లోపాలు పనుల ద్యాసలో వత్తిడి వలన జరిగినవే తప్ప మాకు ఎవరియందు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, అలాంటివి జరిగి ఉంటే తెలిసి చేసినవి కావని గమనించి మమ్ము మన్నించాలని, మీరంతా మీయొక్క సేవలను తెలుగువికీకి మరింతగా అందిస్తూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు జరుపుకునేందుకు ప్రోత్సాహం ఇస్తూతెలుగు వీకీపీడియాను రాబోయే రోజులల్లో లక్ష వ్యాసాల దిశగా వేగంగా తీసుకువెళ్ళాలని మా కార్య నిర్వహక వర్గం తరుపున కోరుతున్నాను....విశ్వనాధ్ (చర్చ) 14:48, 18 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ది ఉత్సవాలను విజయంతం చేసిన వారినందరికీ అభినందనలు. అహ్మద్ నిసార్ (చర్చ) 13:47, 19 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ది ఉత్సవాలు - డిటైల్డ్ రిపోర్ట్

మార్చు

దశాబ్ది ఉత్సవాల డిటైల్డ్ రిపోర్ట్ వ్రాసి, అందులో పాల్గొన్న ముఖ్య అతిధులు, భాషా ప్రముఖులు, మరీ ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన తెలుగేతర వికీపీడియన్ల గురించి (ఓడిషీ, మలయాళీ మరియు కొంకణి ) నూ వ్రాస్తే సమగ్రంగా వుంటుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 13:47, 19 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక వర్గానికి అభినందనలు.--శ్రీరామమూర్తి (చర్చ) 16:54, 20 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ది ఉత్సవాలను విజయంతం చేసిన వారినందరికీ అభినందనలు, ఒక సూచన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పురస్కార విజేతలకు 3టైరు ఏ‌సి ప్రయాణ ఖర్చు స్కాలర్షిప్పులు ఇస్తాము అని కార్యవర్గం వారు తెలియచేసారు అని ఈ రోజు నాదృస్టికి వచ్చినది, దూరప్రాంతాల నుండి వచ్చేవారికి మేము ఇచ్చిన వెయ్యిరూపాయలు కంటే ఎక్కువ ఖర్చు అయి వుండవచ్చు కావున దయచేసి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పురస్కార విజేతలు వెయ్యిరూపాయలకన్నా ఎక్కువ టిక్కెట్ల ఖరీదు ఉంటే దయచేసి 28 ఫిబ్రవరి లోగా నాకు kasyap.p@జీమేల్.com పంపగలరు మిగిలిన మొత్తం మీ ఖాతాలో జమచేయగలను,ఇంకా స్కాలర్షిప్పులు తీసుకొని వారు కూడా నన్ను 28 ఫిబ్రవరి లోగా సంప్రదించగలరు.కశ్యప్ --కశ్యప్ 12:22, 25 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కశ్యప్ గారు, నేను చెక్ ఇంకా బ్యాంకులో జమ చేయలేదు. ప్రస్తుతం నేను కొన్ని రోజులుగా హైదరాబాదులో ఉంటున్నాను. దయచేసి గమనించ గలరు. JVRKPRASAD (చర్చ) 12:28, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
బ్లాగర్ల నివేదికలలో ప్రథమంగా నాకు కనబడిన గబ్బిట ప్రసాద్ గారి సరసభారతి వుయ్యూరు బ్లాగులో నివేదికచూడండి.--అర్జున (చర్చ) 12:14, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Universal Language Selector will be enabled by default again on this wiki by 21 February 2014

మార్చు

On January 21 2014 the MediaWiki extension Universal Language Selector (ULS) was disabled on this wiki. A new preference was added for logged-in users to turn on ULS. This was done to prevent slow loading of pages due to ULS webfonts, a behaviour that had been observed by the Wikimedia Technical Operations team on some wikis.

We are now ready to enable ULS again. The temporary preference to enable ULS will be removed. A new checkbox has been added to the Language Panel to enable/disable font delivery. This will be unchecked by default for this wiki, but can be selected at any time by the users to enable webfonts. This is an interim solution while we improve the feature of webfonts delivery.

You can read the announcement and the development plan for more information. Apologies for writing this message only in English. Thank you. Runa

తెలుగు వ్యాసాలకు ఆంగ్ల దారిమార్పులు రూపొందించేందుకు మరొక కారణం

మార్చు

ఇంతకు ముందు చర్చలలో ఎన్నో సార్లు ఈ విషయం ముందుకొచ్చి సరియయిన చర్చ జరగకుండా సభ్యులందరికీ సరిగా అర్ధమయ్యేలా చెప్పుకోకముందే చర్చ పాతబడిపోవటం జరుగుతుంది.
ఇంతకు ముందు చెప్పిన వాదనలు :

  1. ఆంగ్ల దారిమార్పుల వలన అప్రమేయంగా తెలుగు టైపు లేని (ఇది ULS చేతనమయినా సరే ఉండే సమస్య) వెతుకు పెట్టెలో ఆంగ్లంలో మాత్రమే టైపు చేయగలిగే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
  2. SEO ప్రకారం తెలుగు వికీపీడియా పేజీలు (ముఖ్యంగా ఆంగ్లంలో వ్యాసాలు లేని తెలుగు సినిమా/గ్రామ వ్యాసాలకు) సెర్చ్ ఇంజన్ ఫలితాలలో కనిపించి వీక్షణలు పెరగడం.
  3. ఆంగ్లం వచ్చి తెలుగురాని తెలుగువారికి తెవికీపై పనిచేసేందుకు ఒక చక్కని అవకాశం.
  4. వికీడేటాకు లేబెలింగ్ పరంగా కొంత తక్కువ శ్రమ

మొ॥
ఇందుకు భిన్నంగా వ్యతిరేకులు చెప్పిన వాదనలు :

  • తెలుగు వికీపీడియాలో ఆంగ్లం పేరుకుపోతుంది అన్న భయం
    • దారిమార్పులు వ్యాసాల పేరుబరిలోకి రావు, అందువలన తెవికీ నాణ్యతకు ఎలాంటి సమస్యా లేదు! ఆంగ్లం పేరుకు పోతోంది అన్నది అనవసరపు భయం మాత్రమే. అలా భయపడె వారే ఆంగ్ల మూసలను అనువదించకుండా దిగుమతి చేసేస్తున్నారు.
  • వ్యాసాలలో ఆంగ్లం కనిపిస్తుందన్న వాదన
    • కేవలం ఫలాన పేజీ నుండి దారిమార్పు చెందిందని - అదీ పైన పేర్కొన్నతె లుగు టైపుంగు రాని వారికి మాత్రమే అలా కనిపిస్తుంది, అంతకు మించి ఆంగ్లం ఎక్కడా కనిపించదు.


ఇక కొత్తగా ఆంగ్ల దారిమార్పులకు అనుగుణంగా మరొక వాదన :

  • ఆఫ్లైన్ సీడీ చేసినపుడు అందులో నేరుగా తెలుగులో టైపు చేసి వెతికే వెసులుబాటు లేదు. అందువల్ల ఆంగ్ల దారిమార్పు ఉంటేనే కావాల్సిన వ్యాసానికి చేరుకోగలము.

అలా కాకుండా సీడీ పంచి వ్యర్థమవుతుంది. మరొక్కసారి సభ్యులు ఈ విషయమై చర్చించగలరు. సీనీయర్ సభ్యులు ఈ విషయమై పట్టు సడలించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 15:03, 20 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామానికి పిన్ కోడ్

మార్చు

మండలంలోని అన్నిగ్రామాలకు పిన్ కోడ్ ఒకటే ఉంటుందా లేక వ్యత్యాసం ఉంటుందా తెలుపగలరు.--శ్రీరామమూర్తి (చర్చ) 02:38, 21 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తెలిసినంతవరకు పిన్ కోడ్ అనేది పోస్టాఫిసు యొక్క గుర్తింపు సంఖ్య.రెండు మూడు గ్రామాలకు ఒకే పొస్టాఫిసు వున్నప్పుడు,ఒకే పిన్ కోడ్ ఆగ్రామాలకు వుండే అవకాశమున్నది.మండలం లో ఒక పొస్టాఫిసు వున్నప్పుడు మాత్రమే ఒకే పిన్ కోడు వుంటుంది. Palagiri (చర్చ) 02:49, 21 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అవును. పాలగిరి గారి వ్యాఖ్య సబబే. నాకు తెలిసిన చాలా పల్లెలలో, ఒకటి కంటే ఎక్కువ పల్లెలకు ఒకటే పిన్‌కోడ్ ఉన్నది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:03, 21 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సాంకేతిక విషయములు

మార్చు

వికీపీడియాలో టెక్నికల్ విషయాల్ని అభివృద్ధి చేయాలంటే ఏం చెయ్యాలి? నేను సాఫ్ట్వేర్ స్టూడెంటుని. ఇప్పటివరకూ కొంత హెచ్.టి.ఎం.ఎల్. నేర్చుకున్నాను. జేఎస్పీ, ఎక్స్.ఎం.ఎల్. లాంగ్వేజుల్ని కూడా బేసిక్స్ వరకూ నేర్చుకున్నాను. వికీపీడియాలో వాడుతోంది హెచ్టీఎమ్మెల్ ఏనా? ఒకవేళ ఐతే ఉన్న టాగులే వాడుతున్నారా? కొన్ని యూజర్ డిఫైండ్ టాగులు ఉన్నట్టుగా అనిపిస్తోంది? యూజర్ డిఫైండ్ టాగ్స్ ఎలా తెలుసుకుని వాడాలి?--Meena gayathri.s (చర్చ) 06:39, 21 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా PHP లో రాయబడింది.ప్రత్యేకమయిన వికీ మార్కప్ లాంగ్వేజీ ఇక్కడ వాడబడుతుంది. ఇది ప్రత్యేక ఎక్సెంఎల్ ఫార్మాట్. ఇది హెచ్టీఎమ్మెల్ కాదు. ఆఖరి వాడుకరికి హెచ్టీఎమ్మెల్ కనిపించేలా తీర్చిదిద్దబడింది. ఇంకేమైనా సందేహాలుంటే రాయండి.--రహ్మానుద్దీన్ (చర్చ) 09:25, 21 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ పటము

మార్చు

ఆంధ్రప్రదేశ్ వ్యాసము ఇంకనూ పాత రాష్ట్ర పటమునే చూపిస్తున్నది. దీనిని కొత్త పటముతో మార్చే అవసరం ఉన్నది. సభ్యులు తమ అభిప్రాయాలు తలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:01, 21 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

బిల్లు రాష్టపతి ఆమోదం పొందిన తరువాత మాత్రమే రెండు రాష్టాలను వేరు వేరుగా చూపడం సబబు.Palagiri (చర్చ) 09:21, 21 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అదొక్కటే కాదు. ఇంకా చాలా విషయాలు మార్చవలసి ఉంటుంది. ఒకసారి కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు అందాక దాన్ని అనుసరించి మార్పులు చేయడం మంచిది. --రవిచంద్ర (చర్చ) 09:54, 21 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
బాంబే స్టేట్, మద్రాస్ స్టేట్, హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ (విభజనకు పూర్వం), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (విభజన తరువాత-కొత్తరాష్ట్రం), ఈ పేర్లతో వ్యాసాలుండడం మంచిది. విభజన జరిగి కొత్త రాష్ట్రం (సీమాంధ్రలున్న ఆంధ్రప్రదేశ్) ఏర్పడిన తరువాత కొత్త వ్యాసం ప్రారంభించడం ఉత్తమం. విభజనకు పూర్వపు ఆంధ్రప్రదేశ్ వ్యాసాన్ని తుడిచి వేయలేం కదా! దాని చరిత్రతో వ్యాసం వుంచి కొత్త రాష్ట్రం కొరకు కొత్త వ్యాసం సృష్టించడం సబబు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:30, 24 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Amendment to the Terms of Use

మార్చు

పట్టికల ఫార్మాటింగ్ గురించి

మార్చు

పట్టికలు సరిగా ఫార్మాట్ లేని పేజీలకు వర్గం:సరిలేని_పట్టిక ను చేర్చగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:50, 24 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామములు

మార్చు
  • తరిగొప్పుల, నూజెళ్ళ అనే గ్రామములు కృష్ణా జిల్లాలో కూడా ఉన్నాయి.
  • పసలపూడి గ్రామము, మండవల్లి తాలూకా, కృష్ణా జిల్లాలో ఉన్నది.


ఆ గ్రామాలు ఉన్న మండలాలను సూచించగలరు. రెవెన్యూ రికార్డుల్లో ఆ గ్రామాలు ఉన్నాయా? సెస్సస్ వెబ్సైటులో లేని గ్రామాలు ఎన్నో తొలగించబడ్డాయి. అలా మీరు సూచించిన గ్రామాలు తొలగించబడి ఉండవచ్చు. సరియయిన ఋజువులు (రిఫరెన్స్ తో చూపించి మీరు ఆ గ్రామ వ్యాసాలు సృష్టించవచ్చు) -- (చర్చ) 20:21, 26 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారు,
  • ఈ లింకుల్లో తరిగొప్పుల, నూజెళ్ళ .... [1], [2] కొన్ని దొరుకుతాయి.

C.Chandra Kanth Rao రచనలు కొంత కాలం నిషేధించండి

మార్చు

సి. చంద్ర కాంత రావుగారు వికీపీడియాలో మీ రచనలు చాలా రాజ్యంగ విరుద్ధంగా ఉన్నాయి. కేవలం మీ గురించి, రచనలు గురించి ఇదివరకు ఎవరయినా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఎవైనా చర్చలు ఉంటే లింకులు, మీరైనా, తెలిసిన వారు ఎవరైనా లింకులు ఇవ్వగలరు. మీతో వ్యక్తిగతంగా, చట్టపరంగా, న్యాయపరంగా, వికీపీడియా పరంగా, రాజ్యాంగా పరంగా, ఏవిధంగా నయినయిననూ చర్చలు తప్పకుండా చేయాలి. మీరు చదువరులను మీ కొన్ని రచనల ద్వారా చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఎందుకూ పనికి రాని వారిగా తయారు చేస్తున్నారు. ఇంకా రాస్తాను. మీరు ఏం రాస్తారో రాయండి. తగిన విధంగా చర్యలు అవసరమయితే తీసుకుని స్పందిస్తారు. JVRKPRASAD (చర్చ) 02:58, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సి. చంద్ర కాంత రావుగారు, ఆంధ్రప్రదేశ్ ని రెండు రాష్ట్రాలుగా రాజ్యాంగా ఆధారం చూపించండి. విద్యార్థులు, ఉద్యోగస్థులు, ఇలా చాలా మందికి ఆ ఆధారాలు నాకు ఇస్తే వారికి తెలియజేస్తాను. JVRKPRASAD (చర్చ) 03:18, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సి. చంద్ర కాంత రావుగారు, ఆంధ్రప్రదేశ్ ని రెండు రాష్ట్రాలుగా మీ బ్లాగుల్లో ఎందుకు ఇంకా విడగొట్టలేదు. ? JVRKPRASAD (చర్చ) 03:19, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సి. చంద్ర కాంత రావుగారు, ఇక్కడ సమాచారం పొందు పరచే వాళ్ళు ఎలా ఇస్తారో, ఉంచుతారో వృద్ధవరిష్టులకు తెలియదా ? JVRKPRASAD (చర్చ) 03:21, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]


రాష్టం అవతరించిన పిదప తెలంగాణాకు సంబంధించిన వ్యాసములు అందుబాటులో ఉంటే బావుంటుంది. ఇదంతా (పటము, జిల్లాలు, ఇతరత్రా) ఊహలు మాత్రమే. రాజ్యంగ పరంగా లబించినదే మనకు ఆధారము. అంతవరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యాసాలు మనకు తోచినట్లు వ్రాసుకుంటే, ప్రపంచములోని తెలుగు మరియు భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరిని మనము తప్పుదారి పట్టించినట్లు అయి విద్యార్థులు, ఉద్యోగస్థులు, అందరూ తప్పుడు సమాచారముతో చాలా నష్టపోతారు. JVRKPRASAD (చర్చ) 03:15, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అయ్యా, తెలుగు వికీపీడియాను కోర్టులకి ఈడిస్తే, మీరు బాగానే ఉంటారు. నిర్వాహాకులు, అధికారులు బోనులో నిలబడి వారు అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వాలి. మీరు మీడియాకి, పోలీసులకి, కోర్టులకి, చట్టాలకి, ప్రభుత్వాలకి, ఇతరత్రా వారి అందరికీ తమరే హాజరు అయ్యి అన్నింటికీ నాదే (తమరిదే) భాధ్యత, వికీపీడియాకి ఎటువంటి సంబంధములేదని ఇప్పుడే ఒక హామీ పత్రము విడుదల చేయండి. నిర్వాహాకులు, అధికారులు అందరికి మెయిల్ వెంటనే పంపండి. JVRKPRASAD (చర్చ) 00:54, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD garu, edayina abyantaralunte a vyasa charcha pejilo vrayalani meeku telvada? oka vadukari rachana hakkulanu bhangaparachadam kuda rajyangabaddamena? aa vadukari rachanalu nishedinchamane hakku meeku dvaricharu. samyanam leni vyaktulaku nirvahakatwam kuda tagadu106.220.114.86
పేరులేని (LB Nagar-Patancervu-Shamirpet ప్రాంతముల మధ్య భూభాగము) వాడుకరి, ఇదివరకు చాలా సార్లు ఆయనతో చర్చలు చేశారు. చాలా మంది విఫలం అయ్యారు. అటువంటి విఫలమయిన వారే నాకు చెప్పారు. ఆ మనిషి ఎవరి మాట వినే రకం కాదు. నువ్వు నాకు కొత్త లేదా పాత అనేది తెలిస్తే 'తెలవదా' అని నన్ను అడగవు. నువ్వు ఎందుకు వకల్తా పుచ్చుకుంటున్నావు ? పిచ్చి రాతలు, ఇలాంటివి........రచనలతో పాటుగా వాడుకరిని కూడా నిషేధిస్తారని నీకు తెలియదా ? నీ నుంచి సంమయనము నేర్చుకోమంటావా ? ముందు నువ్వు ఎవరో నీతి,నిజాయితీ ఉంటే మాట్లాడు. నా నుంచి నేర్చుకుందువు చాలా. నాలో కంటే నీలో ఏం నేర్చుకోవాలో అందరికి తెలుస్తుంది. నువ్వు ఈ జీవితంలో నా జీవితములోని కొంతయినా నీతి,నిజాయితీ, అన్నివిషయలలో కొన్ని మంచివి పాటించి, జీవించు చూద్దాం. JVRKPRASAD (చర్చ) 10:19, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD garu mee neethi ,nijayitheelu thelisekada meepai vyasam vrasthunnanu. meenundi prathi okkaru neethi ,nijayitheelu nerchukovali kani ayachitha kopam tappa.
నేను చర్చలు ఎక్కువగా చేయనండి. నీతి కబుర్లు వినేవాళ్ళు ఉంటే అలాగూ చెబుతాము. నాకు ఏ విషయములయినా (ఏ సంస్థ అయినా) వ్యక్తిగతంగానే నేను తెలుసుకున్నప్పుడు మాత్రమే స్పందిస్తాను. ఒక్కొక్కసారి, ఆ సంస్థలో ఆ విషయము మీద చర్చించి అలిసి, వదిలేస్తారు. న్యాయం-స్థానం ఇంకా చచ్చిపోకూడదనే ఆవేశ పదాలు ఆ సందర్భాలలో వాడాల్సి రావచ్చు. అది నా ఆవేశం కాదు, అయినా నాకు ఆ వయసు ఎప్పుడూ లేదు. నిరంతర మానసిక వైరాగికి కోపమెందుకండీ ! JVRKPRASAD (చర్చ) 11:55, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారిని ఎందుకు నిషేధించాలి? ఇందులో మీరు చేసిన అభియోగాలకు అధారాలు చూపించండి. --వైజాసత్య (చర్చ) 09:11, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పొద్దున్న మీరే కదా కొంత మార్చారు. పదాలు పరుషంగా ఉంటేనే ప్రతి మనిషి మనసులోని అసలు మనిషి బయటకు వస్తాడు. చర్చలు ఏం చేస్తారో చూద్దాంలెండీ ! JVRKPRASAD (చర్చ) 10:09, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మార్పులు ఎవరివి? 1, 2, 3, 4, 5, 6, సి. చంద్ర కాంత రావు- చర్చ 15:32, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర వికీపీడియా మరియు తెలంగాణా వికీపీడియా రెండుగా విడగొట్టండి.

మార్చు

ఆంధ్ర వికీపీడియా, తెలంగాణా వికీపీడియా అని రెండు విభాగాలుగా తెలుగు వికీపీడియాను విభజిస్తే చాలా మంది సంతోషిస్తారని ప్రస్తుత సమాచారం వల్ల అనిపిస్తోంది. తెలుగు వారము ఇక్కడ కూడా రెండు రాష్ట్రాలకు సేవలు చేసుకుందాము. ఏ రాష్ట్రానికి ఎవరి సేవలు ఏ విధంగా ఉంటాయో చాలా బాగా తెలుస్తుంది. ఈ పని త్వరగా చేస్తే మంచిది. నేను రెండు రాష్ట్రాలకు సేవలు చేసుకుంటాను. JVRKPRASAD (చర్చ) 03:49, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది ఆంధ్రప్రదేశ్ వికీపీడియా కాదు, ఇది తెలుగు వికీపీడియా. దేశ, ప్రాంతాలకు అతీతం --వైజాసత్య (చర్చ) 03:00, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మన తెలుగు వికీపీడియా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగుభాషకు చెందిన తెలుగువారిది అందరిదీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా (కొత్తగా ఏర్పడిన), తమిళనాడు, మలేషియా ఇలా ఎక్కడ ఏ రాష్ట్రంలో గాని, ఏ దేశంలో గాని నివసించే తెలుగువారు అందరూ దీనిని తమది అని చెప్పుకోదగినదిగా దీన్ని సరిహద్దుల కతీతంగా అభివృద్ధి చేద్దాం. నా స్పూర్తిని అర్ధం చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 03:44, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
-వైజాసత్య గారు, Rajasekhar1961 గారు, మరి అందరికీ ఆ తెలుగు జాతి లక్షణాలు ఉండకుండా చాలా మూర్ఖులుగా వ్యవహరించే వారి గురించే నండి, నేను తెలియజేసేది. అలాంటి వారికోసమే నా రాతలు. JVRKPRASAD (చర్చ) 04:44, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలు భాషా పరంగా ఉన్నవి. ఇలాంటి చర్చలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనవసరం. ఆంధ్రప్రదేశ్ వంద రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వికీపీడియాకు దానితో పెద్ద సంబంధం ఉండదు. వికీపీడియాపై ప్రభావం శూన్యమాత్రమే. --వైజాసత్య (చర్చ) 09:39, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
కొంతమంది బయటకు చెప్పలేక పోవడము వలన, నాకు తెలియడము వలన, ఇది బహిరంగ పరచాను. దీని ద్వారా అపోహలలో ఉన్న కొంత మంది ప్రపంచ తెలుగు ప్రజలు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 10:27, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ తెలుగు జాతిని, తెలుగు ప్రాంతాన్ని ఎవరూ విమర్శించడం లేదు. ఒక ప్రాంతం గురించి వ్యాసం అభివృద్ధి పరిస్తే మరో ప్రాంతం గురించి వ్యతిరేకించినట్టు ఎలా అవుతుంది. తెవికీలో మనకు నచ్చిన వ్యాసాలపై పనిచేయవచ్చు అంతమాత్రానా మనం పనిచేయని వ్యాసాలు మనకు వ్యతిరేకం ఎలా అవుతాయి? అనవసరంగా ఆవేశానికి లోనై వాడిన "మూ..." పదాన్ని సదరు సభ్యుడికే త్రిప్పిపంపిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:54, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది కేవలము తెలుగువారి వికీపీడీయా. తెలుగు వారికి ఒకే వికీపీడీయా ఉంచుట చాల అవుసరము. గుళ్లపల్లి నాగేశ్వర రావు.

గుళ్లపల్లి నాగేశ్వర రావు గారు, తెలుగు వికీపీడియాని ప్రాంతాలుగా చీల్చటం ఎవరికయినా సాధ్యమేమోనని ఇది ప్రశ్న అని మీరు అర్థం చేసుకోగలరు. JVRKPRASAD (చర్చ) 05:14, 4 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియనులు - కీర్తిశేషులు

మార్చు

కొన్ని వ్యాసాలు చూసాక, వికీపీడియనులు కూడా కీర్తిశేషులు (కొంతమంది) కాబోతున్నారు. వీరి గురించి ఇప్పటినుంచే వ్యాసాలు మొదలు (బాగా వ్యాసాలు రాశాడు అని) పెడితే మంచిదేమో అనిపిస్తోంది. ఎలాగూ అందరూ పోయే వారు. అటువంటి వారి గురించి లేదా అతని కుటుంబం గురించి కూడా వివరాలు ముందుగానే పొందు పరచుకుంటే మంచిది. JVRKPRASAD (చర్చ) 05:27, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

wikipedianulaMdaru kirthiseshulu twaraga kavalani vaari alochanemo?106.220.32.248 14:14, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ప్రేతవాడుకరి (IP Address:106.220.32.248, ISP:Bharti Airtel Limited, Organization:BHARTI Airtel, Region: Chandra (IN)) భూమి మీద శాశ్వతమా ? నీ ఆలోచన అలా ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాసే రచనలకి నువ్వు మాట్లాడవు. నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా. చేతనయితే మనిషి రూపములో చర్చించు. JVRKPRASAD (చర్చ) 00:52, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
intaki mee perutho vyasam kavalantaru.aa vishayam sutiga cheppavachukada!106.220.122.112 02:13, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
నీ గురించి వ్రాస్తాను. నువ్వు ఎవరో తెలిస్తే నా గురించి తరువాత వ్రాయచ్చు. ముందు నీ వివరాలు ఇవ్వు. ఎలాగూ మాయావాడుకరి కదా ! JVRKPRASAD (చర్చ) 02:46, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
mee pai vyasam జె.వి.ఆర్.కె.ప్రసాద్ modalupettanu. Mee vivaralanu aa vyasa charcha pejilo vrayandi. moolalanu teliyajeyandi, vishstha vivaralunte vrayandi.106.220.113.245
ఎక్కడో లింకు ఇస్తే మంచిది. మీరడిగినట్లు నా చర్చ పేజీలో ఇచ్చాను. తదుపరి తొలగిస్తాను. వ్యాసాలు లోని కొన్ని భాగాలు కొన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా అంతగా పట్టించుకోని వారలున్నప్పుడు, ఇంక నా బోంట్ల వారము గురించి రాసే ముందస్తు రచనలకి పెద్దగా నాకుగా నేను ఆలోచించ నవసరము లేదు. పైన ఎవరో వ్రాసినట్లు నా కోసం వ్యాసము గురించి అని చాలా భ్రమ పడుతున్నారు. అది చాలా అసమంజసం. నా కోసం వ్యాసము వ్రాయమని నాకుగా నేను ఇంత రాద్ధాంతం చేయనవసరము లేదు. అర్హత ఉంటే ఏ వ్యక్తి గురించి అయినా వ్రాయాలనుకుంటే ఎక్కడో, ఎవరో, ఎప్పుడో, ఏదో వ్రాస్తునే ఉంటారు. JVRKPRASAD (చర్చ) 04:02, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
(1)http://gw.geneanet.org/ezee2299_w ఇది నా వంశవృక్షం. JVRKPRASAD (చర్చ) 04:13, 28 ఫిబ్రవరి 2014 (UTC) (2) [6] 2007 సం. అసంపూర్ణమైన బ్లాగ్ అయినా కొంత పనికి వస్తుంది.[ప్రత్యుత్తరం]

తుర్లపాటి కుటుంబరావు గారి ఆత్మకథ నా కలం-నా గళం వికీసోర్స్ లో యూనికోడ్ రూపం విడుదల

మార్చు

దశాబ్ది ఉత్సవాలలో వికీపీడియా సభ్యుల అభ్యర్ధన మేరకు తుర్లపాటి కుటుంబరావు గారు తన ఆత్మకథను స్వేచ్ఛానకలుహక్కుల క్రింద విడుదల చేసిన సంగతి మీకు తెలిసినదే. దాని మూలకృతి మరియు పిడిఎఫ్ కృతి క్రిందటి ఫిభ్రవరి22 న పొందడం మరియు సహసభ్యుల సహకారంతో యూనికోడ్ రూపం తయారుచేయడం పూర్తయిందని తెలపటానికి సంతోషిస్తున్నాను. ఈ పుస్తకపేజీలలో యూనికోడ్ మార్చడంలో భాగంగా జరిగినఅచ్చుతప్పులు ఏమైనా మిగిలి వుంటే సభ్యులు తనిఖీచేసి పుస్తకాన్ని పూర్తిసిద్ధం చేయడానికి (పేజీ సవరణలో భాగంగా పుటస్థితిని పసుపురంగులోకి లేక ఆకుపచ్చరంగు కనబడితే ఆకుపచ్చరంగులోకి మార్చి భద్రపరచడం)సహకరించవలసినదిగా కోరుతున్నాను. --అర్జున (చర్చ) 10:59, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు, చాలా సంతోషము. JVRKPRASAD (చర్చ) 11:25, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, ఎంచక్కా పుస్తకం చదువుతూ ప్రూఫ్ రీడింగ్ పూర్తి చేశాను.:-) --రవిచంద్ర (చర్చ) 11:19, 1 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణా

మార్చు

తెలంగాణా ఇంకా అధికారికంగా ఎర్పడలేదు, కావున దయచేసి సంయమనం పాటించి రాష్ట్రం అధికారంగా జన్మించేదాకా ఆయా మార్పులు చేయవద్దు. ఆధికారికంగా రాష్ట్రం ఏర్పడగానే క్రమబధ్దంగా చేయవలసిన మార్పులన్నీ చేద్దాము. --వైజాసత్య (చర్చ) 09:29, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న సందేహం. అసలు రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అనేదానికి ప్రమాణికం ఏమిటి. గెజెట్ నోటిఫికేషన్, పార్లమెంటు బిల్లు మరేదైనా అయితే విజ్నులైనవారు తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 10:15, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రము కొత్త రాష్ట్రం మనదేశ భూభాగములో ఇంకా విడగొట్టలేదు, అందుకు చిత్రము కూడా లేదు. ప్రభుత్వ కార్యాలయాలలో కదలికలు మనకు తెలుస్తాయి. మనకు తొందరెందుకండి. ప్రభుత్వ తెలియజేస్తుంది. మనకు అంతర్జాలంలో ప్రభుత్వ ఆధారము వస్తుంది. JVRKPRASAD (చర్చ) 10:32, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోవడం వలన చాలామందికి బాధ కలిగింది, అందులో నేనూ ఒకడిని. కానీ ఈ విషయాన్ని జీర్ణం చేసుకోక తప్పదు. థూథూ అంటే జీజీ అని మనమెందుకు వెళ్ళాలి? అలాగే, హిందీ మాట్లాడే రాష్ట్రాలు అనేకంగా వున్నాయి, ఉదా. హర్యానా, యు.పి., ఉత్తరాఖండ్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్, హిమాచల్ ప్రదేశ్, మొదలగునవి. ఇన్ని రాష్ట్రాలున్నా హిందీ భాష మరణించిందా ? అలాగే, రాష్ట్రాలు వేరైనా భాష మరణిస్తుందా ? కొందరు సభ్యులు ఉత్సాహంగా విభజనకు పూర్వమే తెలంగాణా రాష్ట్రం గురించి వ్యాసాలు వ్రాస్తుండవచ్చు. విభజన పరిపూర్ణమైన తరువాత ఈ వ్యాసాలు పనికి రావచ్చు గదా! కొన్ని మార్పుల అవసరాలు ఉండవచ్చునేమో. అలాగే నేనూ ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) గురించి వ్రాద్దామనుకున్నాను. కాని సమయం రానీ వ్రాద్దాంలే అని ఊరకున్నాను. పౌరుషమున్న తెలుగు జాతి మనది, సీమాంధ్రనూ అభివృద్ధి పరచుకుందాం. క్రితం వరకూ వచ్చిన ముఖ్యమంత్రులు మహానుభావులు, రాష్ట్రపు సొమ్మంతా ఎక్కడ పోసారో తెలుసు గదా! మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పరచి వుంటే నేటికి ఈ దుస్థితి వచ్చివుండేది కాదేమో! హైదరాబాద్ ను సైబరాబాద్, సిలికాన్ వేలీ గా రూపొందించిన వారు రాయలసీమనూ సిలికా వేలీ (ఎడారి ప్రాంతం) చేసారు. పోనివ్వండి. వీరిని భరోసా చేసుకుని మేము భూమిపై వచ్చామా???? లేదు గదా..... బహుశా నేను వ్రాసిన వాక్యాలు సరికావేమో, అన్-పార్లమెంటరీ పదాలేమో.... బహుశా ఇలాంటి విషయాలకు ఇది సరైన వేదిక కాదేమో! అలా అయితే సభ్యులు మన్నించి ఈ వాక్యాలు చర్చాపేజీనుండి తొలగించేది. అహ్మద్ నిసార్ (చర్చ) 11:06, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అహ్మద్ నిసార్ గారు, ముందుగా మీకు ధన్యవాదములు. మీకు ప్రతి వాక్యమునకు దాదాపు వీలయినంత వరకు జవాబులు ఇస్తాను. దయచేసి మంచి మనసుతో మీరు అర్థం చేసుకోగలరు అని నాకు నమ్మకము ఖచ్చితముగా ఉన్నది. రాజ్యంగ పరంగా, ఆంధ్రప్రదేశ్ అనేది సంతోషముతో 300 సం.లలో మరో మూడు ముక్కలయినా దాని వలన అందరము అంగీకరిస్తాము. మదరాసు (చెన్నై), కర్నూలు, హైదరాబాదు చూశాము. మరో ప్రాంతము కూడా చూస్తాము మన జీవితములోనే. అదృష్ట వంతులము ఒక విధముగా. తెలంగాణా రాష్ట్రం గురించి వ్యాసాలు వ్రాయడంలో తప్పులేదు. కాని కొంతమంది అహంభావం, అహంకార ధోరణీ, దాష్టీకం, డాబు, దర్పం, (వారి వారి ఇళ్ళలో, కార్యాలయాలలో, ప్రజలతో ఎలా ఉంటారో విచారణ చేయాలి) ఇలా ఎన్నో వింతలుగా వారి ప్రవర్తన ఉన్నది. దేశ విభజన జరిగినప్పుడు (కాశ్మీరు సంగతి చెప్పండి, చూడండి ఇప్పుడు, ఎప్పుడూ), దేశంలో విభజనలు జరిగినప్పుడు అధికారికంగా భూభాగ పటములు విడుదల అవుతాయి. అప్పటి వరకు కూడా ఆగలేక పోతున్నారు. JVRKPRASAD (చర్చ) 11:22, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అహ్మద్ నిసార్ గారు, ఒక కుటుంబంలోని మనిషి అనగా; తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కొడుకు, అమ్ముమ్మ, నాన్నమ్మ, తాతయ్య, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు - ఏ ఒక్కరు చచ్చిపోతేనే - ఎవరి స్వానుభవం వారే చెప్పాలి. మరి ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఒక్కొక్కర్లో అలాంటి భావనలు అంతులేనివి ఉన్నాయి. మరో విషయం - కొంత మందికి పెళ్ళి అంటే ఆనందం మరికొంతమందికి కుటుంబము లోని మనిషి దూరంగా వెళ్ళి పోతున్నారని బాధ. మదరాసు (చెన్నై), కర్నూలు ప్రాంతములలో ఎవరూ అయిన బంధువుల వాళ్ళు లేరని పెద్దలు అన్నీ వదలుకున్నారు. ఇప్పుడు మనకు రెండు రాష్ట్రాలు కూడా మనవే. కాని 100-200 సం.లలో మన కుటుంబాలు ఇంకా ఇతర ప్రాంతముల వలనే, "ఇది" మన ప్రాంతము కాదని వీలయినంత త్వరలోనే ఎలాగూ వదలు కుంటారు. కేవలము ప్రజలు మాత్రమే బాధలు అన్ని విషయాలలో అనుభవిస్తున్నారు, సంతోషముగా మాత్రము చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్ల ఓర్పుగా ఉండాల్సింది ఎవరో అర్థం చేసుకుంటే మంచిది కదండీ ! మీకు మాత్రము మీ మనసుకు నచ్చినట్లు ఎంతయినా తెలియజేస్తాను. మీరు కూడా అందరికీ అందుబాటులో ఉండండి. JVRKPRASAD (చర్చ) 11:33, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
టీవీల ద్వారా తెలుసుకున్నది ఇది: రాష్ట్రపతి ఆమోదముద్ర పడే తేదీ "నోటిఫికేషన్ డేట్". ఆ తరవాత రాష్ట్రం ఏర్పడే అధికారిక తేదీని ప్రకటిస్తారు. దాన్ని "అపాయింటెడ్ డేట్" అంటారు. నోటిఫికేషన్ తేదీకి సుమారో మూణ్ణెల్ల తరవాత ఈ తేదీ ఉంటదంట. అదే రెండు రాష్ట్రాలు అధికారింగా ఏర్పడే తేదీ! --చదువరి (చర్చరచనలు) 15:20, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియాలోనే అత్యుత్తమ వ్యాసంగా రూపుదిద్దుకుంటున్న తెలంగాణ వ్యాసాన్ని మరియు తెలంగాణకు చెందిన వ్యాసాల అభివృద్ధిని చూసి సహించని కొందరు చేసిన ఆవేశపూరిత వ్యాఖ్యలే తప్ప ఇది మరేమి కాదు. తెలంగాణ వ్యాసాలనేవి రాజ్యాంగబద్దం కావని, అలాంటివి తెవికీలో చేర్చడం తగవని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తెవికీలో ఏదేని వ్యాసం చేర్చుటకు, ఎలాంటి వ్యాసమైనా వ్రాయుటకు ఎవరికైనా హక్కుంది, దానికి తగిన ఆధారాలు మరియు మూలాలే ముఖ్యమనే విషయం గమనిస్తే చాలు. ఒక ప్రాంతానికి చెందిన వ్యాసం వ్రాయడం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలా అవుతుంది? తెలంగాణ అనేది ఊహా వ్యాసమని ముద్రవేయడం దారుణమైన విషయం. అయిననూ తెవికీకి కావలసింది ఊహనా, వాస్తవమా అనేది ముఖ్యం కాదు, అలా అయితే అక్షాంశం, రేఖాంశం వ్యాసాల సంగంతేంటీ? (ఇవి ఊహా రేఖలే మరి!) స్వర్గం, నరకం లాంటి వ్యాసాలు ఎందుకున్నాయి! అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకఉండకపోయిననూ తెలంగాణ వ్యాసం గురించి అభ్యంతరపరిచే హక్కు ఎవరికీ లేదు. ఇది ఒక ప్రాంతంగా అందరికీ సుపరిచితమే కాకుండా బలమైన మూలాలున్నాయి. తెవికీ వ్యాసానికి కాలవసింది బలమైన మూలాలే, అవి లేనప్పుడు మాత్రమే వ్యాసాన్ని ఊహాజనిత వ్యాసంగా పరిగణించి తొలగింపునకు ప్రతిపాదించవచ్చు. రాష్ట్రం అవతరణ తర్వాతే తెలంగాణ వ్యాసం అనడం విడ్డూరంగా ఉంది. చరిత్రలో కృష్ణా, తుంగభద్రల మధ్య ఉన్న ప్రాంతం రాయచూరు డోబ్‌గా ప్రసిద్ధి చెందింది, ఇది ఒక ప్రాంతమే తప్ప దీనికి అధికారికంగా ఎలాంటి గుర్తింపులు లేవు. ఇలాంటి వ్యాసాలు బోలెడన్నీ ఉన్నాయి. ఒక ప్రాంతానికి, ఒక వీధికి, చివరికి ఒక గుట్టపై కూడా వ్యాసం చేర్చవచ్చనే విషయాన్ని సభ్యులు విస్మరిస్తున్నారు. కేవలం వర్గం:నమ్మకాలు పైనే మనకొక వర్గం ఉంది. దేవతలకు సంబంధించిన రూపాలు ఆ విధంగా ఉన్నాయని ఎవరు చూశారు? (అయిననూ దేవతల బొమ్మలు తెవికీలో లేవా?) ఇలా చెప్పాలంటే ఇదో పెద్ద జాబితా అవుతుంది. చెట్టు, పుట్ట, గుట్టలపైనే అభ్యంతరం లేనప్పుడు మూడున్నర కోట్ల ప్రజలు నివశిస్తున్న ఒక ప్రాంతానికి చెందిన వ్యాసంపై అభ్యంతరమా? దాదాపు తొమ్మిదేళ్ల క్రితమే వైజాసత్య గారు ప్రారంభించి, చదువరి గారు కొంత అభివృద్ధి పర్చిన ఈ వ్యాసాన్ని తగిన ఆధారాలతో నేను మరింత అభివృద్ధిపరుస్తున్నాను. ఈ వ్యాసాన్ని నేను అభివృద్ధిపర్చడానికి ముందు తెలంగాణ ఉద్యమాలతో, వాదనలతో ఉన్న సమాచారంతో కూడుకొని ఉండి, తరుచుగా దుశ్చర్యలకు గురికావడంతో చివరికి వ్యాసంపై సంరక్షణ కూడా విధించబడింది. అలాంటి వాదనలతో కూడిన వ్యాసాన్ని తరలించి సంరక్షణ తొలగించి కేవలం వివాదాలకు తావులేని విషయ సమాచారమే చేరుస్తున్నాను. వ్యతిరేకంగా ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు లేకున్ననూ కొందరికి నచ్చనంత మాత్రానా ఉండదగిన ఇలాంటి వ్యాసాలు కూడా తెవికీలో ఉండరాదని అనడంలో ఎలాంటి సమంజసమైన కారణం కనిపించడంలేదు. ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టినట్టు అదే పని నా బ్లాగుల్లో చేయలేదని అనడం కంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ వ్యాసాన్ని నేను తెవికీలో ఎప్పుడు విడగొట్టానో తెలుసుకుంటే మంచిది. కావాలంటే వ్యాస చరితం చూడండి. ఇటీవలి కాలంలో నాది ఒక్క దిద్దుబాటు కూడా ఆ వ్యాసంలో లేదు. తెలంగాణ వ్యాసాన్ని అభివృద్ధి పరుస్తున్నానే తప్ప ఇతర వ్యాసాల జోలికి నేను వెళ్ళడం లేదు, అలాంటి వ్యాసాలను నేనేమి కుంచించడం లేదు. తెలంగాణ వ్యాసాన్ని రాష్ట్రంగా కాకుండా ఒక ప్రాంతంగానే అభివృద్ధి పరిచాను. ఇది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడం శుభపరిణామమే, ఒకవేళ అలా కాకుండకపోయిఉండిననూ వ్యాసం వ్యాసమే అవుతుంది కాని రాజ్యాంగహోదాతో ఇలాంటి వ్యాసాలకు సంబంధమే లేదు (రాజ్యాంగపరంగా తెలంగాణ వ్యాసాలపై నిషేధం ఉంటేతప్ప). రాజ్యాంగ వ్యతిరేకులు, దేశద్రోహులు, తీవ్రవాదుల వ్యాసాలు కూడా తెవికీలో ఉన్న సంగతిని గుర్తించుకోవాలి. ఎప్పటినుంచో తెలంగాణ భౌగోళిక పటానికి ఎంతో స్పష్టత ఉంది. ఇలాంటి వాటికి అభ్యంతరపరిచే అవకాశం ఎవరికీ లేదు. దీనికీ రాజ్యాంగ గుర్తింపు అవసరం లేదు. ఒక ప్రాంతంగా గుర్తించడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేవా అనేదే ముఖ్యం. ప్రతి అంశానికి, ప్రతి పటానికి రాజ్యాంగ గుర్తింపు ఉండదు, మనకు గ్రంథాలే ముఖ్యం. అసలు తెవికీలో భారతదేశ భౌగోళిక పటమే భారత ప్రభుత్వం విడుదల చేసే అధికారిక పటానికి భిన్నంగా ఉంది! అలాంటివన్నా సరిచేసి దేశభక్తి చాటుకోవడం మంచిది. తెలంగాణ ఏర్పాటువల్ల ఏర్పడిన కోపాన్ని తెవికీలో తెలంగాణ వ్యాసం అభివృద్ధిపరుస్తున్న సభ్యులపై చూపడం అన్యాయమైన విషయం. ఉభయ సభలు తెలంగాణ బిల్లును ఆమోదించేంతవరకు నేను తెలంగాణను రాష్ట్రంగా ఎక్కడా పేర్కొనలేను. రాజ్యసభ ఆమోదం అనంతరం మరునాడు అన్ని వార్తాపత్రికలలో "29వ రాష్ట్రంగా తెలంగాణ" శీర్షికతో మొదటి పేజీలలో తాటికాయంత అక్షరాలతో వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. విద్యార్థులను, ఉద్యోగులను తప్పుదారి పట్టించే అంశాలేమీ తెలంగాణ వ్యాసంలో లేవు కాని అనేక వ్యాసాలలో తాజాకరణ చేయకుండా ఉంచిన పాత సమాచారమే విద్యార్థులకు తప్పుదారి పట్టిస్తుంది! అలాగే ఐపి అడ్రస్ 106... గారూ, మీరు సభ్యనామంతో వ్రాయమని కోరుచున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ

Call for project ideas: funding is available for community experiments

మార్చు
 

I apologize if this message is not in your language. Please help translate it.

Do you have an idea for a project that could improve your community? Individual Engagement Grants from the Wikimedia Foundation help support individuals and small teams to organize experiments for 6 months. You can get funding to try out your idea for online community organizing, outreach, tool-building, or research to help make వికీపీడియా better. In March, we’re looking for new project proposals.

Examples of past Individual Engagement Grant projects:

Proposals are due by 31 March 2014. There are a number of ways to get involved!

Hope to have your participation,

--Siko Bouterse, Head of Individual Engagement Grants, Wikimedia Foundation 19:44, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]