వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక
తెలుగు వికీపీడియా స్వయం శిక్షణ కొత్త సంచిక కొరకు వికీపీడియన్ ఫోటో ఎంపిక
మార్చువికీపీడియా:రచ్చబండ#తెలుగు వికీపీడియా బ్రోషర్ ముద్రణ లో చర్చించినట్లు, కొత్త సంచిక తయారీలో వికీపీడియన్ ఛాయాచిత్రం వాడబోతున్నారు. ఆంగ్లానికి ఎడ్రియేన్ వాడెవిట్జ్ ఎంపిక చేశారు. ఛాయాచిత్రనిపుణుడు తీసిన ఇంకొన్ని చిత్రాలు సూచించారు కాని వాటిలో తెలుగు వారు లేరు. మన తెలుగు పుస్తకంకొరకు ఏ వికీపీడియన్ ఫొటో ఎంపికచేస్తే బాగుంటుందో ఇప్పటికే వికీలో వున్న ఉదాహరణ ఫోటో లింకును ఒక వారంలోగా (20 నవంబర్ 2013 లోగా)సూచించండి మరియు చర్చించండి. (పూర్తి సందర్భం కొరకు చూడండి. సరియైన నాణ్యత గల ఫోటో లేకపోతే వృత్తి నిపుణుడైన ఛాయచిత్రకారుడుతో తగిన ఫోటో తీయించి పంపవచ్చు కూడా.--అర్జున (చర్చ) 04:53, 13 నవంబర్ 2013 (UTC)
- నా ఫోటో పెట్టడానికి పెద్దలు ప్రయత్నిస్తే నాకు అభ్యంతరము లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:24, 13 నవంబర్ 2013 (UTC)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారి స్పందనకు ధన్యవాదాలు. అనుమతికూడా ముఖ్యమైనదే. కాని ఎంపికకు కొలబద్దగా వుండవలసినవేమిటన్నవికూడా చర్చించి, అలాగే ప్రతిపాదనలు చేసేటప్పుడు స్వంతపేరుని ప్రతిపాదించడంతో పాటు, ఇతరుల పేర్లను కూడా ప్రతిపాదించి, అలా ప్రతిపాదించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా పేర్కొంటే ఈ చర్చను అర్ధవంతంగా చేయటానికి వీలుంటుంది. --అర్జున (చర్చ) 06:25, 13 నవంబర్ 2013 (UTC)
అర్జున గారు, చర్చకు విషయము వస్తుందని ముందుగా వ్రాశాను. తదుపరి,
- ముందు ఫోటోల ప్రదర్శనకు అభ్యంతరము లేని ఆశించే వారి జాబితా తయారు చేసుకోవాలి. వారి వారి అనుమతి తప్పనిసరి.
- తెలుగు పుస్తకం కొరకు మొత్తం తెలుగు వారే ఉండాలి.
- ఫోటోలు యొక్క పరిమాణము, ప్రమాణములు పొందు పరచాలి
- ప్రతి అభ్యంతరము వాడుకరికి వెనువెంటనే తెలియజేస్తూ, తగిన సమయము ఇస్తూ, గడువు తేదీ ప్రకటించాలి.
- ఏ వికీపీడియన్ ఛాయాచిత్రం అయినా ఖాయం అయిన తదుపరి సభ్యులకు తెలియజేస్తే మంచిది.
- ఫోటోల ప్రదర్శన తదుపరి ఆ ఫోటోలను ఏవిధంగా నయిననూ దుర్వినియోగ పరచినట్లయిన వికీపీడియాకు ఎటువంటి బాధ్యత ఉండదు.
- వికీపీడియన్ ఛాయాచిత్రం ఎంపికలో వారివారి కృషి, సేవలు, వరిశ్టులు, ఇలా అనేక అంశలు పరిగణనలోనికి తీసుకోవాలి.
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారి సూచనలకుధన్యవాదాలు. అన్ని తెలుగు వికీప్రాజెక్టులు, కామన్స్ లకు ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్లో ని కృషిని పరిగణించితే బాగుంటుంది. ఇక అనుమతి ముందు తీసుకోవాలా లేక పొట్టిఎంపిక జాబితా చేసిన తరువాత తీసుకోవాల అనికూడా ఆలోచించవచ్చు. ఫోటోలు నాణ్యతగా వుండాలి. అవసరమైతే ప్రత్యేకించి ఛాయాచిత్రనిపుణుడిచే తీయించాలి. వీటికి ఏమైనా ధనం అవసరమైతే తగిన రసీదుతీసుకొని ఆసభ్యునికి చెల్లించవచ్చు. --అర్జున (చర్చ) 07:07, 13 నవంబర్ 2013 (UTC)
- నేనంటున్నది వికీపీడియా స్వయంశిక్షణ పుస్తకం గురించి. కొత్త సంచిక చిత్తుప్రతి పేజీ చూడండి. ఇది 16 పేజీలుమించి వుంటుంది.--అర్జున (చర్చ) 07:43, 13 నవంబర్ 2013 (UTC)
- విధానం
2011లోవిశిష్ట వికీమీడియన్ గుర్తింపు విధానం దీనికి అవలంబించవచ్చేమో పరిశీలించి సూచనలు చేయండి. దేనికైనా కనీసం ముగ్గురు సభ్యుల ఎంపిక మండలిని నిర్ణయిస్తే ఎంపిక సమర్ధవంతంగా చేయటం వీలవుతుంది. --అర్జున (చర్చ) 08:26, 13 నవంబర్ 2013 (UTC)
- బావుంటుంది కాని అందరూ తమ బొమ్మ పెట్టడానికి ఇష్టపడనప్పుడు. ఇష్టపడిన వారి బొమ్మలు పెట్టడం ఉత్తమం. ఎక్కువమంది ముందుకు వస్తే మీరన్న పద్దతిలో ఎక్కువగా కృషి చేస్తున్న వారిలో నుండి ఎన్నుకోవడం చేయవచ్చును...విశ్వనాధ్ (చర్చ) 10:35, 13 నవంబర్ 2013 (UTC)
- మనము దీనిని పదిమందికి విశిష్ట గుర్తింపు కు ఎంపిక చేయడానికి విస్తరించవచ్చు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన ఇప్పటివరకు పనిచేసిన దాదాపు 600 మందిలో 10మందిని గుర్తించలేకపోతే అర్ధ రహితం అనుకుంటాను. అప్పుడు ఆ పది మందిలో ఎవరో ఒకరు తమ ఫోటో వాడుకకు అనుమతి ఇస్తారనుకుంటాను. ఈ న్యాయ నిర్ణేతల మండలిలో సభ్యత్వాని కి ప్రతిపాదనలు కావాలి. ఇప్పటికే గుర్తింపువున్న వారు మరియు /లేక తెవికీలో చాలాకాలం పనిచేసిన వారు ముందుకు వస్తే బాగుంటుంది. (అంటే దీని పర్యవసానం ఈ న్యాయనిర్ణేతల మండలి లోనిముగ్గురు సభ్యులు ఈ కొత్త గుర్తింపుకు అనర్హులవుతారు మరియు గుర్తింపుకి సభ్యులను ప్రతిపాదించడానికి వీలుండదు.) నా వరకు నేను స్వచ్ఛందంగా ఈ మండలి సభ్యత్వానికి ప్రతిపాదన చేస్తున్నాను. అభ్యంతరాలేవైనా తెలపండి. మీరు కూడా దీనిలో వుండవలసిన సభ్యులపేర్లను స్వచ్ఛందంగా స్వంత ప్రతిపాదనను లేక వేరే వాళ్లను ప్రతిపాదించవచ్చు. ఎక్కువ ప్రతిపాదనలుంటే అభ్యంతరాలేవైనా పరిశీలించి ముగ్గురిని ఎంపికచేసుకోవచ్చు. --అర్జున (చర్చ) 23:51, 13 నవంబర్ 2013 (UTC)
విశిష్ఠవికీపీడియన్లు
మార్చు- ఈ భారత దేశంలో అన్ని విభాగాలలో ఉన్నట్ట్లే, మన తెలుగు వికీపీడియాలో కూడా ఆస్థాన వాడుకరులు సంఖ్య బాగానే ఉన్నారు. వారినే ఒక జాబితా తయారు చేస్తే, అందులోనే వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు పొందు పరుచుతారు. ఇది పెద్ద సమస్య కాదు. చాలా తేలిక. తదుపరి, ఆశావహులు మాత్రం బహుస్వల్పం, అవకాశము అంతంత మాత్రము కావచ్చు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:20, 14 నవంబర్ 2013 (UTC)
- t.sujatha , విశ్వనాధ్, జె.వి.ఆర్.కె.ప్రసాద్ గార్ల స్పందనలకు ధన్యవాదాలు. ప్రసాద్ గారి వ్యాఖ్యల్లో భావం పూర్తిగా అర్ధంకాలేదు. విశిష్టవికీమీడీయన్ గుర్తింపుకి స్వంత ప్రతిపాదనలే భేషు అని అనుకుంటే ఆ ప్రతిపాదన ముసాయిదా వికీపీడియా పేరు బరిలో చేర్చి ఇక్కడ లింకు ఇవ్వండి.--అర్జున (చర్చ) 01:26, 15 నవంబర్ 2013 (UTC)
ఎంపిక సభ్యులుగా సమ్మతి
మార్చువిశిష్ఠవికీపీడియన్లుగా గుర్తించలేకపోవడం అన్న నిబంధన నన్ను ఇబ్బంది పెడుతున్నది. --t.sujatha (చర్చ) 13:22, 28 నవంబర్ 2013 (UTC)
- నేను ఎంపిక సంఘ సభ్యుడిగా ఉండటానికి సమ్మతమే. అర్జునరావుగారు ఎంపిక సంఘ సభ్యుడిగా ముందుకు వచ్చినందుకు, ధన్యవాదాలు. కాని, నేను ఇందుకు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాను. ఎందుకంటే, ఎంపిక సంఘ సభ్యులు కొత్త గుర్తింపుకు అనర్హులవుతారు కాబట్టి. మనకున్న ముఖ్యమయిన కృషీలురులలో వీరు ఒకరు కనుక. నా అసమ్మతిని పెద్ద మనసుతో క్షమించగలరు.రాధాక్రిష్ణ (చర్చ) 10:35, 15 నవంబర్ 2013 (UTC)
- ఎంపిక కోసం నిర్ణయించే సంఘంలో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడానికి నేను మనస్పూర్తిగా అంగీకరిస్తున్నాను. మన తెవికీలో పదిమంది కృషీవలుల్ని గుర్తించి సన్మానించడం చాలా మంచిపని. ఇది మిగిలినవారికి ప్రోత్సాహకంగా కూడా వుంటుంది. ప్రైజ్ మనీ రూ. 10,000 వేలకు తక్కువకాకుండా ఉండాలి. అంటే పదిమందికి ఒక లక్ష రూపాయలు అవసరం అవుతాయి. వాటికి దాతల్ని గుర్తించి వారిని సంప్రదించాలి. ఆ ధనాన్ని మనం తేగలం అనుకుంటేనే ముందుకు పోవాలి. లేకపోతే సభ్యుల్ని నిరుత్సాహ పరచినట్లుగా భావించే ప్రమాదం ఉంది. నామినేషన్ ఇవరైనా వికీపీడియను ముగ్గురు సహ సభ్యుల్ని ఈ ప్రోత్సాహకాలకు ప్రతిపాదించవచ్చును. అలా వచ్చిన ప్రతిపాదనల నుండి ఎంపిక సంఘ సభ్యులు పదిమందిని గుర్తించిన పిదప; సమావేశం ద్వారా అందరము అభినందిస్తాము.Rajasekhar1961 (చర్చ) 11:00, 15 నవంబర్ 2013 (UTC)
- రాధాకృష్ణగారి అభిప్రాయమే నా అభిప్రాయం. వైజాసత్యగారికి, అర్జునరావుగారికి విశిష్ఠ వికీపీడీయాన్ అర్హత లేకపోవడం వారిద్దరిని ప్రతిపాదించలేకపోవడం నేను అంగీకరించలేను. జ్యూరీసభ్యులను కూడా ఇతర సభ్యులు ప్రతిపాదించడానికి వీలుపడేలా నియమాలను సవరించాలని కోరుకుంటున్నాను. --t.sujatha (చర్చ) 12:28, 15 నవంబర్ 2013 (UTC)
చాయాచిత్ర ఎన్నిక
మార్చు- చర్చ ప్రారంభమైంది సంచిక కొరకు ఒక్క వాడుకరి ఫోటో ఉపయోగించడానికే కాబట్టి మనం ఆ దిశగా మాత్రమే అడుగులేసి ఒక్క సభ్యుడిని గుర్తిస్తే సరిపోతుందనుకుంటున్నాను. పదేళ్ళ తెవికీ చరిత్రలో ఎనిమిదిన్నర సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి, లక్షకుపైగా విలువైన దిద్దుబాట్లతోనే కాకుండా నిర్వహణలోనూ అందరికీ ఆదర్శంగా నిలిచి, అందరి
మన్ననలందుకున్న వైజాసత్య గారి పేరును నేను ప్రతిపాదిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:27, 15 నవంబర్ 2013 (UTC)
- రాధాక్రిష్ణ, t.sujatha , విశ్వనాధ్,Rajasekhar1961 , చంద్రకాంతరావు గారి స్పందనలకు ధన్యవాదాలు. తెవికీలో కృషి చేసిన అనుభవమున్న వారు ఎంపిక మండలి లో వుండడం చాలా ముఖ్యం, దానికి వైజాసత్య గారు, Rajasekhar1961 గారు ముందుకు రావడం హర్షణీయం. నా సేవలకు వికీపీడియా సందర్భంలో ఎంతో కొంత గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ పథకం ద్వారా సహ వికీసభ్యులను గుర్తించడానికి అవకాశమే నాకొక పెద్ద గుర్తింపుగా భావిస్తాను. ఇంకా మీరందరు మరీ మరీ కోరితే పురస్కార సభలో అభినందన మాటలు ఒకటీ రెండుచాలు. ఇంకెవరైనా ఎంపిక మండలిలో వుండదలిస్తే ఆది వారంలోపల తెలియచేయమని మనవి. అప్పుడు త్వరగా నియమాలు రూపొందించుకొని ముందుకు కొనసాగవచ్చు. పురస్కారం లో భాగంగా నగదు వుంటే మంచిదే, ఒక వేళ ఏకారణంచేతనైనా లేకపోయినా గుర్తింపు కి విలువ ఏమీ తగ్గదు. రాజశేఖర్ కు మరియు సుజాత గార్లకు వికీమీడియా భారతదేశ సమావేశంలో ధృవపత్రాలు మాత్రమే అందచేశాము కదా అయినా వారి గుర్తింపు ఏమీ తగ్గలేదుకదా. --అర్జున (చర్చ) 13:33, 15 నవంబర్ 2013 (UTC)
- రాధాకృష్ణ గారు, సుజాత గారు, చంద్రకాంతరావు గారు, అర్జున గారు, విశ్వనాథ్ గార్లతో ఏకీవభవిస్తూ, వైజాసత్య గారి పేరునే నేనూ ప్రతిపాతిస్తున్నాను. అన్ని కోణాలనుండీ వైజా గారిపేరే సరైనదని భావిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 18:47, 15 నవంబర్ 2013 (UTC)
- వైజాసత్య గారి చిత్రపటం ఉంచడం మంచి ఆలోచన. గురువు గారు తెలుగు వికీపీడియాలో ప్రారంభం నుండి అనితర సాధ్యంగా; అందరు సభ్యులతో స్నేహభావంగా సమస్యలను అర్ధం చేసుకుంటూ; తెవికీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. వారిని ఈవిధంగా గౌరవించడం చాలా బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 08:09, 16 నవంబర్ 2013 (UTC)
- అర్జునరావు గారు, రాజశేఖర్ గారు, సుజాతగారు, వైజాసత్యగారు, రహ్మనుద్దీన్ (నాని), కాసుబాబు గార్ల పేర్లను నేను ప్రతిపాదిస్తున్నాను. (మరెందరో మహానుభావులను నేనెరుగక ప్రతిపాదించలేకపోయాను. నా అజ్ఞానాన్ని క్షమించగలరు). రాజశేఖర్ గారు చెప్పినట్లు, కొద్దిగా ప్రైజ్ మనీ కూడా ఉంటే బాగుంటుంది. నిర్ణయించే మొత్తంలొ పదవవంతు (అంటే, లక్ష రూపాయలకు గాను, 10,000/-) నేను స్పాన్సర్ చేయదలచాను.-- రాధాకృష్ణ, 2013-11-16 మరియు 2013-11-19
- నా ఫోటో ఉంచాలని అభిలషించిన తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ అభిమానమే నాకు పది లక్షలు. నేను పూర్వపరంలో చేసిన కృషికి చాలానే గుర్తింపబడ్డాను, నా చిత్రం ఈనాడు పత్రికలో ఐదేళ్ళ క్రితమే వచ్చింది. కాబట్టి దయచేసి నన్ను మన్నించి ఈ గుర్తింపును ఇప్పటివరకు సరైన విధంగా గుర్తించబడని తెవికీ సభ్యులకు చెందనివ్వండి. తెవికీలో విశేషకృషి చేసి బయటి ప్రపంచంలో గుర్తింపబడిన వాళ్ళు చాలానే ఉన్నారు. వారిపై స్పాట్‌లైటు పెట్టి వాళ్ళ కృషిని అందరికి తెలియజేసి, వారి కృషికి జోహార్లు అర్పించవలసిన సమయమిది. కాబట్టి నేను, అర్జున గారు, రాజశేఖర్ గారు నిర్ణయసంఘంగా అభ్యర్ధనలు పరిశీలించి నిర్ణయించగలము. నిర్ణాయకసంఘపు సభ్యుల ఫోటోలు పరిగణించబడవు. --వైజాసత్య (చర్చ) 23:14, 16 నవంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారు సున్నితంగా తిరస్కరిస్తున్నారు, నిర్ణాయకసంఘపు సభ్యుల ఫోటోలు వుండరాదు. అయితే, కాసుబాబు, చంద్రకాంతరావు, విశ్వనాథ్ గార్ల పేర్లు ప్రతిపాదనకొరకు పరిశీలించవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 03:47, 19 నవంబర్ 2013 (UTC)
శాన్ ఫ్రాన్సిస్కో నుండి తాజాసమాచారము
మార్చునేను ఇక్కడ ఈ కొత్త పుస్తకం తయారీలో క్రియాశీలంగా వున్న ఫౌండేషన్ ఉద్యోగులు లియన్నా మరియు సేజ్ తో మాట్లాడాను. సంతోషకరమైన సంగతి ఏమిటంటే ఛాయాచిత్రాలు ఒకటి కంటే ఎక్కువ వాడుకోవచ్చు. పుస్తకం రూపలావణ్యం మొదలైంది. మొదటి చిత్తు ప్రతి నాకు చూపించారు. పాఠ్యం చాలా వరకు ఖరారైనట్లే కాని ఆంగ్ల సంచిక జనవరిలో మాత్రమే పూర్తవవచ్చు అని చెెప్పారు. అడోబీ ఇన్ డిజైన్ తీరు దస్త్రం డిసెంబరు నెలలో అందుబాటులోకి రావొచ్చు. కామన్స్ లో బొమ్మల ఎక్కింపు గురించి కొత్త పుస్తకం ప్రతి ఇచ్చారు. ఇంతకముందల వాడిన ఒక పేజీ కరపత్రము కంటే ఇది మెరుగైనదని చెప్పారు. దీనిని కూడా తెలుగు అనువాదం చేయటానికి ఔత్సాహికులు ముందుకు రావాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 22:12, 19 నవంబర్ 2013 (UTC)
వికీపీడియా స్వయం శిక్షణ రూపలావణ్య చిత్తుప్రతి మరియు ఇల్లస్ట్రేటింగ్ వికీపీడియా పై బ్లాగ్ పోస్టు చూడండి.--అర్జున (చర్చ) 01:11, 20 నవంబర్ 2013 (UTC)
- ఇతర గుర్తింపుల సమాచారం
వికీమీడియా జర్మనీ గుర్తింపు విధానం గురించి ఆంగ్లానువాదము (గూగుల్) చూడండి.--అర్జున (చర్చ) 15:47, 20 నవంబర్ 2013 (UTC)
ఎంపిక మండలి మొదటి స్కైప్ సమావేశం
మార్చుఈరోజుమొదటి స్కైప్ సమావేశం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 నుండి 2 గంటలకు జరగునున్నది. ఇప్పటివరకు ఎంపిక మండలి లో పాల్గొనటానికి సమ్మతి తెలిపిన అర్జున, Rajasekhar1961, వైజాసత్య , రాధాకృష్ణ,t.sujatha వారందరికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:48, 30 నవంబర్ 2013 (UTC)
- అర్జున స్కైప్ పేరు:Arjunaraoc . సమావేశంలో చేరేవారుఅర్జున స్కైప్ పేరుని వారి పరిచయాల జాబితాలో (ఇప్పటికే లేకపోతే) చేర్చండి. లేక తమ స్కైప్ వాడుకరి పేరులు ఇక్కడే తెలియచేస్తే అర్జున సమావేశానికి అందరిని కాలయాపన లేకుండా ఆహ్వనించటానికి వీలవుతుంది.
- సమావేశ చర్చాంశాలు
- ప్రస్తుత గుర్తింపు విధానాలు-పరిమితులు
- మార్పుల సంఖ్యను బట్టి వాడుకరికి శుభాకాంక్ష బొమ్మ ద్వారా గుర్తింపు
- మార్పుల విషయం ఆధారంగా శుభాకాంక్ష బొమ్మ ద్వారా గుర్తింపు
- వార్షికోత్సవాలలో భాగంగా ఇ-పుస్తక కూపన్
- వికీసమావేశానికి ప్రయాణ, వసతి ఖర్చులు
- విద్యార్ధులకు వ్యాసరచనపోటీ-నగదు బహుమతులు
- పరిమితులు
- ఇప్పటికే పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకంగా నగదు బహుమతులు లేవు
- ప్రస్తుత గుర్తింపు విధానం ఏ ఒక్కరిపైనే ఆధారపడివున్నది. కేవలం మార్పుల సంఖ్య ఆధారంగానే గుర్తింపు వస్తుందన్న భావన బలపడడానికి కారణమవుతున్నది. దీనివలన సరైన సమయానికి సభ్యుల కృషిని గుర్తించడం కొన్ని సార్లు జరగటంలేదు. పక్షపాత ఆరోపణలకు అవకాశముంటున్నది. సమగ్ర విశ్లేషణ ఆధారంగా గుర్తింపు లేదు.
- పోటీలో బహుమతులు కొత్త వారిని ఆకర్షించటానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. అలా ఖర్చుపెట్టినా ఎంతమంది వికీలో మరింత క్రియాశీలమవుతారన్నది సంశయమే
- చాలా కొద్దిమంది మాత్రమే వికీమేనియా లేకభారత వికీసమావేశాలకి ఎంపిక కాగలుగుతున్నారు.
పురస్కార విధి విధానాలు
మార్చు- ఎంపిక మండలి పదాధికారులు
- అధ్యక్షులు
- కార్యదర్శి
- పురస్కారం పేరు
- ప్రతిపాదన విధానం
- మూస:2013 వికీ పురస్కార ప్రతిపాదన
- ఎంతమందిని విశిష్ట వికీపీడియనుగా గుర్తించాలి.
- బహమతికి కేటాయించిన మొత్తం
- ఈ పురస్కారం ప్రతి సంవత్సరం ఇవ్వటానికి అవకాశం
- ప్రతిపాదన వర్గాలు
- విశిష్ట వికీ సభ్యుడు(రాలు)
- విశేష వ్యాసం
- విశేష ప్రాజెక్టు
- కాలరేఖ
- బహుమతి రూపం
- పురస్కార కార్డు(ఎలెక్ట్రానిక్)
- పురస్కార నగదు
- వికీ ప్రచార సామాగ్రిలో ఛాయాచిత్రాలు వాడుక
- సమావేశాలలో బహుమతి ప్రదానం మరియు పురస్కార గ్రహీతలు తమ అనుభవాలను సమావేశంలో పంచుకొనటానికి అవకాశం
- సమావేశం హాజరవటానికి భారతదేశంలోని సాధారణంగా నివసించే/శాశ్వతనివాసం లేక సమావేశ స్థలానికి దగ్గరిలో నున్న విమానాశ్రయం గల స్థలంనుండి సమావేశ కేంద్రానికి మూడవటియర్ ఎసి కు మించని ప్రయాణ, వసతి సౌకర్యాలు.
- ఎంపిక మండలి పదాధికారులు
- ప్రోత్సాహకాలు ధనరూపంగా ఇవ్వడానికి గల ఇబ్బందులు.
- విదేశాలలోని వికీ సభ్యులకు నగదు బదీలీలో ఇబ్బంది
- ప్రతిపాదిత సభ్యుని ఇటీవలిఈమెయిల్ సంపర్క స్థితి
- ప్రతిపాదిత సభ్యుని అంగీకారం
- గుర్తించడానికి ఉపయొగించే ప్రమాణికాలు.
- తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి
- తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి (బొమ్మలు, చర్చలు, మూసలు, వికీపీడియాపేరుబరి..)
- తెలుగు వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి చొరవలు
- సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం
- భౌతిక ప్రచారంలో కృషి
- వికీ విధానాలపై అవగాహన
- ఇప్పటికే వున్న గుర్తింపులు
- <పై వరుసలలో ప్రతిపాదనలు లేక సవరణలు చేయండి>
స్కైపు సమావేశం హాజరయ్యేవారు
మార్చు- --t.sujatha (చర్చ) 06:33, 30 నవంబర్ 2013 (UTC)
- --అర్జున (చర్చ) 06:39, 30 నవంబర్ 2013 (UTC)
- --రాధాక్రిష్ణ (చర్చ) 06:55, 30 నవంబర్ 2013 (UTC) (skype:radhakrishna.arvapally)
- --వైజాసత్య (చర్చ) 07:38, 30 నవంబర్ 2013 (UTC)
- --Rajasekhar1961 (చర్చ) 08:48, 30 నవంబర్ 2013 (UTC)
నివేదిక
మార్చురెండవసమావేశం
మార్చుడిసెంబర్ 2,2013, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 నుండి 2 గంటలకు
- సమావేశ చర్చాంశాలు
- క్రితం సమావేశం నివేదిక సమీక్ష,సవరణలు, ఖరారు
- ప్రక్రియకు సంబంధించిన పేజీలు, పనుల సమీక్ష, సవరణలు, ఖరారు
- ప్రతిపాదన పరీక్షతరువాత వచ్చిన స్పందనలు
- రచనల విభాగాలకు ఒకే విలువకాక వేరు వేరు విలువఇవ్వాలా?
- ప్రక్రియకు అవరోధాల విశ్లేషణ, అధిగమించుటకు సూచనలు
- తరువాతి సమావేశం తేది నిర్ణయం
- <పై వరుసలో చేర్చండి>
స్కైపు సమావేశం హాజరయ్యేవారు
మార్చునివేదిక
మార్చుమూడవ సమావేశం
మార్చుడిసెంబర్ 6 5,2013, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 నుండి 2 గంటలకు
- సమావేశ చర్చాంశాలు
- క్రితం సమావేశం నివేదిక సమీక్ష,సవరణలు, ఖరారు
- పురస్కార విధానంపై సభ్యుల సందేహాలు
- /కొలబద్ద
- ప్రక్రియకు సంబంధించిన పేజీలు, పనుల సమీక్ష, సవరణలు, ఖరారు
- ప్రస్తుత ప్రతిపాదనల సమీక్ష
- తరువాతి సమావేశం తేది నిర్ణయం
- <పై వరుసలో చేర్చండి>
నివేదిక
మార్చుస్కైపు సమావేశం హాజరయ్యేవారు
మార్చునాలుగవ సమావేశం
మార్చుడిసెంబర్ 9,2013, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 నుండి 2 గంటలకు
- సమావేశ చర్చాంశాలు
- క్రితం సమావేశం నివేదిక సమీక్ష,సవరణలు, ఖరారు
- పురస్కార ప్రక్రియపై సందేహాలకి స్పందన
- /కొలబద్ద
- ప్రక్రియకు సంబంధించిన పేజీలు, పనుల సమీక్ష, సవరణలు, ఖరారు
- ప్రస్తుత ప్రతిపాదనల సమీక్ష
- తరువాతి సమావేశం తేది నిర్ణయం
- <పై వరుసలో చేర్చండి>
స్కైపు సమావేశం హాజరయ్యేవారు
మార్చునివేదిక
మార్చుఐదవ సమావేశం
మార్చుడిసెంబర్ 13,2013, భారత కాలమానం ప్రకారం ఉదయం 08;30 నుండి 09:30
- సమావేశ చర్చాంశాలు
- క్రితం సమావేశం నివేదిక సమీక్ష,సవరణలు, ఖరారు
- /కొలబద్ద స్పందనలపై సమీక్ష
- ప్రస్తుత ప్రతిపాదనల సమీక్ష
- ప్రక్రియకు సంబంధించిన పేజీలు, పనుల సమీక్ష, సవరణలు, ఖరారు
- తరువాతి సమావేశం తేది నిర్ణయం
- <పై వరుసలో చేర్చండి>
స్కైపు సమావేశం హాజరయ్యేవారు
మార్చు--అర్జున (చర్చ) 13:02, 9 డిసెంబర్ 2013 (UTC)
నివేదిక
మార్చుఆరవ సమావేశం
మార్చుడిసెంబర్ 18,2013, భారత కాలమానం ప్రకారం ఉదయం 08;30 నుండి 09:30
- సమావేశ చర్చాంశాలు
- క్రితం సమావేశం నివేదిక సమీక్ష,సవరణలు, ఖరారు
- /కొలబద్ద స్పందనలపై సమీక్ష
- ప్రతిపాదనల సమీక్ష
- ప్రక్రియకు సంబంధించిన పేజీలు, పనుల సమీక్ష, సవరణలు, ఖరారు
- తరువాతి సమావేశం తేది నిర్ణయం
- <పై వరుసలో చేర్చండి>
స్కైపు సమావేశం హాజరయ్యేవారు
మార్చునివేదిక
మార్చు7,8,9 వ సమావేశాలు
మార్చు- డిసెంబర్ 20,2013, భారత కాలమానం ప్రకారం ఉదయం 08;30 నుండి 10:30
- డిసెంబర్ 23,2013, భారత కాలమానం ప్రకారం ఉదయం 13:00 నుండి 15:30
- డిసెంబర్ 23,2013, భారత కాలమానం ప్రకారం ఉదయం 07;30 నుండి 10:30
- సమావేశ చర్చాంశాలు
- క్రితం సమావేశం నివేదిక సమీక్ష,సవరణలు, ఖరారు
- /కొలబద్ద స్పందనలపై సమీక్ష
- ప్రతిపాదనల సమీక్ష
- ప్రశంసాపత్రం అర్హత మరియు విధానం
- ప్రక్రియకు సంబంధించిన పేజీలు, పనుల సమీక్ష, సవరణలు, ఖరారు
- తరువాతి సమావేశం తేది నిర్ణయం
- <పై వరుసలో చేర్చండి>
స్కైపు సమావేశం హాజరయ్యేవారు
మార్చు--అర్జున (చర్చ) 02:36, 20 డిసెంబర్ 2013 (UTC)
నివేదిక
మార్చుచెయ్యవలసిన పనులు
మార్చు- పురస్కారానికి, ప్రశంసాపత్రానికి ఎంపిక నిర్ణయ ప్రకటన.. వైజాసత్య, 28-12-2013
- కొమర్రాజు లక్ష్మణరావు వికీ పురస్కార కార్డు, సర్టిఫికేట్ రూపకల్పన.. చిత్తుప్రతి డిసెంబర్ 7, 2013, ఖరారు ప్రతి, డిసెంబర్ 9 2013, వాడుకరి:వైజాసత్య, <ఆసక్తికలిగిన వారి పేర్లను చేర్చండి>
- <మరేదైనా చేర్చండి>