వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023

2023 ప్రపంచ కప్ లో ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్ల , మైదానాల జాబితా

మార్చు

వికీప్రాజెక్టు క్రికెట్ కు ప్రారంభించినందుకు ధన్యవాదములు, అయితే ఈ జాబితా పెద్దగా ఉన్నది కావున మొదటగా 2023 ప్రపంచ కప్ లో ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్ల , మైదానాల జాబితా, ఇతర కీలక అంశాలను జాబితా చేస్తే ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేయడానికి, కొత్త వ్యాసాలు రాయటానికి అనువుగా వుంటుదని, ఉన్న వనరులతొ వికీపీడియన్ లతో పూర్తి చెయగలం అని నా సూచన. Kasyap (చర్చ) 08:30, 20 జూలై 2023 (UTC)Reply

@Kasyap గారూ, వివిధ దేశాల్లోని మైదానాల జాబితా, వివిధ దేశాల ఆటగాళ్ళ జాబితాలు తయారు చేసాం. ఈ జాబితాల్లోంచి, మీరు సూచించిన విషయాలకు కూడా పేజీలను సృష్టించవచ్చు. అయితే మీరు సూచించిన వాటికి తొలి ప్రాథమ్యత ఇవ్వాలని అంటున్నారు. అలాగే చేద్దాం. కానీ, అందుకోసం ప్రత్యేకించి ఆయా పేజీలతో జాబితాలు చెయ్యాల్సి ఉంటుంది కదా? మరి, ఆ జాబితాలు ఎలా చెయ్యాలి? పోనీ మీరే ప్రయత్నించకూడదూ..? ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 04:46, 23 జూలై 2023 (UTC)Reply
ఆ జాబితాని 2023 క్రికెట్ ప్రపంచ కప్లో చేరుస్తాను, నెనర్లు . Kasyap (చర్చ) 07:24, 25 జూలై 2023 (UTC)Reply

ప్రాజెక్టులో సృష్టించిన వ్యాసాలకు మూస తయారీ

మార్చు

చదువరి గారూ ఈ ప్రాజెక్టులో సృష్టించిన వ్యాసాలు ఒక వర్గంలోకి చేరటానికి ఏమైనా మూస సృష్టించితేతెలుపగలరు.నేను ఈ రోజు మమతా మాబెన్ అనే భారత మహిళా మాజీ క్రికెటర్ అనే వ్యాసం సృష్టింపుతో ఈ ప్రాజెక్టులో పని మొదలుపెట్టాను యర్రా రామారావు (చర్చ) 07:35, 30 జూలై 2023 (UTC)Reply

@యర్రా రామారావు గారూ, వర్గం ఉంది సార్. వ్యాసాన్ని సృష్టించిన తరువాత, దాని చర్చ పేజీలో {{వికీప్రాజెక్టు క్రికెట్ 2023 లో భాగం}} అనే మూసను చేర్చండి. తద్వారా ఆ పేజీ వర్గం:క్రికెట్ 2023 ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది. __ చదువరి (చర్చరచనలు) 00:44, 31 జూలై 2023 (UTC)Reply

ప్రాజెక్టు రూపురేఖల్లో కొన్ని సవరణలు

మార్చు

ప్రాజెక్టు రూపురేఖల్లో కింది సవరణలు చేసాను.

  1. చర్చ పేజీలో పెట్టాల్సిన మూసలో - విస్తరించిన పేజీల కోసం ఒక పరామితిని చేర్చాను. మూసలో 1=y అనే పరామితిని ఇస్తే ఆ పేజీ వర్గం:క్రికెట్ 2023 ప్రాజెక్టులో భాగంగా విస్తరించిన పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది.
  2. ఈ మూసలను "చర్చ" పేజీలో పెట్టినపుడు మాత్రమే పనిచేసేలా, ఇతర పేజీల్లో పనిచెయ్యకుండా సవరించాను.
  3. ప్రాజెక్టు లక్ష్యాన్ని కొత్త పేజీలు, విస్తరణలను కలిపి 1000 అని మార్చాను. గతంలో ఇది 1000 (కొత్తవి) + 100 (విస్తరణ) గా ఉండేది. ఒరిజినల్‌గా అనుకున్నది రెండూ కలిపి 1000 అనుకున్నప్పటికీ అప్పట్లో పొరపాటున అలా రాసాను. ఇప్పుడు సవరించాను. అది కూడా మొదటి దశకు కాకుండా పూర్తి ప్రాజెక్టు లక్ష్యంగా మార్చాను.
  4. ప్రాజెక్టు లక్ష్యంలో "సుమారుగా" అనేది అస్పష్టంగా ఉన్నందున దాన్ని తీసేసాను.

ప్రాజెక్టు సభ్యులు ఈ మార్పులను గమనించి, ఏమైనా మార్పుచేర్పులు అవసరమైతే సూచించమని, సవరించమనీ కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 06:50, 6 ఆగస్టు 2023 (UTC)Reply

పరక సమయంలో పావు లక్ష్యం సాధించాం

మార్చు

లక్ష్యంలో నాలుగో వంతు సాధించాం. ప్రాజెక్టు సమయం ఎనిమిదో వంతు కావస్తోంది.

ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్న

గార్లందరికీ అభినందనలు. మరింత పూనిక కోసం ఇదే పిలుపు! __ చదువరి (చర్చరచనలు) 15:48, 14 ఆగస్టు 2023 (UTC)Reply

ప్రాజెక్టులో జరుగుతున్న కృషి చాలా స్ఫూర్తి దాయకంగా ఉంది, నా వంతు కృషి అందించడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ఈరోజు జరిగిన తెవికీ యువ సమావేశంలో క్రికెట్ ప్రాజెక్టులో కృషి చేయడానికి ప్రయత్నించమని అందరికి సూచించాను.

ఈ ప్రాజెక్టు ఒక హై స్పీడ్ రాకెట్లా దూసుకెళ్తుంది, చదువరి గారు మీ దిశా నిర్దేశం ఉన్న ప్రాజెక్టుల్లో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది, నాకు ఇంకా గుర్తు 2021 WPWP ప్రాజెక్టులో మీరు అందించిన సూచనలతో ప్రాజెక్టు చాలా చక్కగా సాగింది. ఈ ప్రాజెక్టు కూడా అలాంటి ఒక ఉద్యమ వాతావరణం గుర్తు చేస్తుంది, ఇటువంటి కార్యానికి శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు. NskJnv 15:56, 14 ఆగస్టు 2023 (UTC)Reply

@Nskjnv గారూ, ఇందులో పాలుపంచుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 15:59, 14 ఆగస్టు 2023 (UTC)Reply

మెటా వాడుకరి పేజీ లో ఈ టెంప్లేట్ పని చేయదా

మార్చు

ఈ ప్రాజెక్టులో పాల్గొనే వాడుకరులు అనే టాప్‌ఐకన్ను తమ వాడుకరి పేజీలో పెట్టుకోవచ్చు. దీన్ని పేజీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది, సదరు వాడుకరి పేజీని వర్గం:క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసిన వాడుకరులు అనే వర్గం లోకి చేరుస్తుంది. నేను ప్రయత్నించాను. రాలేదు. మెటా వాడుకరి పేజీ లో ఈ టెంప్లేట్ పని చేయదా? ఇంతకూ ముందు కూడా కొన్ని విషయాలలో నాకు సందేహం వచ్చింది. వీటికి వేరే పరిష్కారం ఉందా? సహాయం చేయగలరు. VJS (చర్చ) 09:46, 16 ఆగస్టు 2023 (UTC)Reply

అది తెలుగు వికీపీడియా లోని మూస కాబట్టి మెటాలో పనిచెయ్యదండి. కానీ ఆ మూసలోని పాఠ్యాన్ని కాపీ చేసుకుని నేరుగా మీ వాడుకరి పేజీలో పెట్టుకోవచ్చు, బహుశా. కింది పాఠ్యాన్ని కాపీ చేసి అక్కడ పెట్టి చూడండి, పనిచెయ్యవచ్చు.
{{Top icon
| imagename = Cricket - The Noun Project.svg
| wikilink = వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023
| description = ఈ వాడుకరి క్రికెట్ 2023 ప్రాజెక్టులో భాగంగా వ్యాసాల సృష్టికి తోడ్పడ్డారు.
| id = crkt-icon
| sortkey =
| width =
| height =
| usercat =
| nocat =
}}
__ చదువరి (చర్చరచనలు) 12:04, 16 ఆగస్టు 2023 (UTC)Reply
ఈ సూచన VJS గారి పరిశీలనార్థం. __ చదువరి (చర్చరచనలు) 12:04, 16 ఆగస్టు 2023 (UTC)Reply
వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు. ఈ పాత్యాన్ని నా మెటా వాడుకరి పేజీ లో పేస్ట్ చేశాను. పని చేయలేదండి. ఇంకా script అక్కడే ఉంచాను. VJS (చర్చ) 13:09, 16 ఆగస్టు 2023 (UTC)Reply
@Vjsuseela గారూ, పని చేస్తోంది చూడండి. మీ వాడుకరి పేజీని రీలోడు చెయ్యండి. అప్పుడూ కనబడకపోతే, పేజీకి పైన కుడి మూలన ఉండే డ్రాప్ డౌనులో టైము చూపిస్తుంది చూడండీ.. దాన్ని నొక్కండి. పేజీ కాషెను తీసేస్తుంది. అప్పుడు కనిపిస్తుంది. __ చదువరి (చర్చరచనలు) 14:15, 16 ఆగస్టు 2023 (UTC)Reply

కనపడింది

మార్చు

మీ సహాయానికి, సమయానికి ధన్యవాదాలు. VJS (చర్చ) 14:51, 16 ఆగస్టు 2023 (UTC)Reply

ప్రాజెక్టులో బ్యాటర్ల ఇష్టారాజ్యం

మార్చు

స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రాజెక్టు పరుగులెత్తింది. ఏకంగా 37 వ్యాసాలు సృష్టించాం. ఆ ఆశ్చర్యానందాల నుండి ఇంకా తేరుకోకుండానే ఇవ్వాళ ఇప్పటికే 38 అయ్యాయ్. ప్రాజెక్టులో బ్యాటర్లది ఇష్టారాజ్యమై పోయింది. ఫోర్లూ సిక్సర్ల వాన కురుస్తోంది. ఇవ్వాళ వెంకటరమణ గారు 19! ప్రణయ్‌రాజ్ గారు 15! ప్రాజెక్టు తొలిరోజున 32 చేసాం. అందులో నేను ప్రచురించినవి 24 -అయితే అవన్నీ అంతకు ముందు పది రోజుల్లో చేసిపెట్టుకున్నవి, విశేషమేమీ లేదు. కానీ, నిన్నా (37) ఇవ్వాళా (38) వివిధ వాడుకరులు సృష్టించిన పేజీలు అలాక్కాదు. అప్పటికప్పుడు అనువదించి ప్రచురించినవే.

ముఖ్యంగా ఇవ్వాళ ప్రచురించిన వ్యాసాల్లో పదిహేనింటిని ఎప్పుడు మొదలుపెట్టారో, ఎప్పుడు ప్రచురించారో పరిశీలించాను. రెణ్ణిమిషాలకో వ్యాసం, 7 నిమిషాలకొకటి, 10..11.. 15 నిమిషాలకొకటి -ఇలా అనువాదాలు చేసారు. సుమారుగా నిమిషానికో వెయ్యి బైట్ల లెక్కన అనువదించారు. వెంకటరమణ గారు గాని ప్రణయ్ రాజ్ గారు గానీ, దివ్య గారు గానీ.. అందరూ అంతే. అనువాద పరికరం ఇవ్వాళ చేసినంత పని బహుశా తెవికీలో ఇంతకు ముందు ఎప్పుడూ చేసి ఉండదేమో. దాదాపు 9 లక్షల బైట్లను ఈ రెండ్రోజుల్లో అనువదించాం. జయహో అనువాద పరికరం! __ చదువరి (చర్చరచనలు) 15:32, 16 ఆగస్టు 2023 (UTC)Reply

క్రికెట్ క్రీడాకారుల పేజీల్లో సమాచారపెట్టెలు

మార్చు

తోటి ప్రాజెక్టు సభ్యులైన

గార్లకు గమనిక:

క్రికెట్ క్రీడాకారుల పేజీల్లో, సమాచారపెట్టెలలో బోలెడంత సమాచారాన్ని అనువదించాల్సి వస్తోంది. వీటిలో చాలావరకు నేను ఆటోవికీబ్రౌజరు ద్వారా చేసేలా ఆటోమేషను చేసాను. తద్వారా ఈ సపెల్లోని సమాచారపు అనువాదాన్ని చాలావరకు దాని అప్పజెప్పవచ్చు. కొంత సమయం ఆదా అవుతుంది. పరిశీలించండి.

వివరాలు

  • ఏ పేజీల్లో: క్రికెట్ ఆటగాళ్ళ పేజీల్లో (ఆడ, మగ ఇద్దరి పేజీల్లోనూ)
  • ఏ సమాచారం: సమాచారపెట్టెలో
  • మొత్తం అంతా చేస్తుందా? - లేదు, క్రీడాకారుని పేరు, పుట్టిన ఊరు, ఏ చేతి వాటం బౌలరు ఈ మూడూ మానవికంగా చెయ్యాలి.
  • మిగతా సమాచారం అంతా అనువదిస్తుందా? కొన్నిటిని చెయ్యలేదు. కాకపోతే అవి ఎక్కువగా ఉండకపోవచ్చు.
  • ఫలానా పేజీలో AWG నడపమని మీరు ప్రత్యేకంగా నాకు చెప్పనక్కర్లేదు. కొత్తగా సృష్టించిన పేజీల్లో నేనే నడుపుతూంటాను - ఒకరోజు అటూ ఇటూగా.

__ చదువరి (చర్చరచనలు) 15:40, 19 ఆగస్టు 2023 (UTC)Reply

@Chaduvari గారూ, ఇందుకు ధన్యవాదాలు. ఈ పనిలో మీకు సాయంగా మేమేం చెయ్యాలి. ఏమైనా మూస వంటివి పెట్టాలా? పవన్ సంతోష్ (చర్చ) 16:33, 19 ఆగస్టు 2023 (UTC)Reply
@Chaduvari గారూ, నిజానికి ఒక వ్యాసం అనువాదానికి పట్టిన సమయంకంటే దానికి రెట్టింపు సమయం సమాచారపెట్టె అనువాదానికి పడుతోంది. ఆటోవికీబ్రౌజరు ద్వారా సమాచారపెట్టె అనువాదాన్ని ఆటోమేషను చేస్తున్నందుకు ధన్యవాదాలు. అందుకోసం మేమేం చేయాలో తెలుపగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:24, 19 ఆగస్టు 2023 (UTC)Reply
అవును యర్రా రామారావు (చర్చ) 01:58, 20 ఆగస్టు 2023 (UTC)Reply
@యర్రా రామారావు గారూ ఏంచెయ్యాలో కింద రాసాను చూడండి. __ చదువరి (చర్చరచనలు) 02:33, 20 ఆగస్టు 2023 (UTC)Reply
@Pavan santhosh.s,@Pranayraj1985
ప్రత్యేకంగా ఏమీ చెయ్యనక్కరలేదండి.
  • క్రికెట్ క్రీడాకారుల పేజీల్లో, సమాచారపెట్టెల్లో
  • క్రీడాకారుని పేరు, పుట్టిన ఊరు, ఏ చేతి వాటం బౌలరు - వీటి వరకు అనువదించి మిగతావాటిని వదిలేసి పేజీని ప్రచురించెయ్యండి.
  • నేను ఆ సమాచార పెట్టెల అనువాదాన్ని AWB తో చేస్తాను.
__ చదువరి (చర్చరచనలు) 02:32, 20 ఆగస్టు 2023 (UTC)Reply
మంచిది.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 02:42, 20 ఆగస్టు 2023 (UTC)Reply
@Pranayraj1985 గారూ, పేజీల్లో సమాచారపెట్టెను మీరే చేర్చాలి. దానిలో క్రికెటరు పేరు, పుట్టిన ఊరు వగైరాల తెలుగీకరణం కూడా మీరే చెయ్యాలి. పెట్టెలో మిగతా తెలుగీకరణం పని నేను చేస్తాను. __ చదువరి (చర్చరచనలు) 08:14, 20 ఆగస్టు 2023 (UTC)Reply
అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:19, 20 ఆగస్టు 2023 (UTC)Reply

తేదీ ఆకృతి సవరణల ఆటోమేషన్

మార్చు

మనం ప్రస్తుతం అనువాదం చేస్తున్న పేజీల్లో తేదీ ఆకృతి, నెల పేర్లు - వీటిని మార్చడం చాలా ఎక్కువగా చేస్తున్నం. నేను దీన్ని కొంత ఆటోమేషను చేసాను. మీలో కొందరు దాన్ని ఆటోమేషను చేసే ఉండవచ్చు. మిగతావారి కోసం ఇది రాస్తున్నాను. అనువాదం పరికరంలో ఫైండ్-రీప్లేస్ అంశాన్ని వాడి కింది పనులు చెయ్యాలి:

  1. "బర్ " (చివర స్పేసు ఉంది గమనించండి) ను "బరు " (దీనిక్కూడా చివర స్పేసు ఉంది గమనించండి)గా మార్చండి.

కిందివాటిని రెగెక్స్ మోడ్‌లో చెయ్యాలి - అంటే ఫైండ్/రీప్లేస్‌ పెట్టెలో ఉన్న (.*) అనే బటన్ను నొక్కాలి.

  • మొదటిది
    • ఫైండ్: (\d{1,2})\s*([\u0C00-\u0C7F]+)\s*(\d{4})
    • రీప్లేస్: "$3 $2 $1 " (చివర్లో స్పేసు ఉంది గమనించండి)
  • రెండోది
    • ఫైండ్: ([\u0C00-\u0C7F]+)\s*(\d{4})\s?లో
    • రీప్లేస్: "$2 $1 లో"

పై ఆపరేషన్లు చేస్తే పేజీలో తేదీ ఆకృతులపై పెట్టే సమయం తగ్గుతుంది. యాంత్రికానువాదం చేసి, మానవికంగా దిద్దుబాట్లు చేసేముందు పై పనులు చెయ్యాలి. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 14:10, 22 ఆగస్టు 2023 (UTC)Reply

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:14, 22 ఆగస్టు 2023 (UTC)Reply
@Chaduvari గారు మీరు కలుగ చేసే సాంకేతిక సౌకర్యాలకు ధన్యవాదాలు. నేను AWB వాడటం లేదండి. నాకు రాదు కూడా. యాంత్రికానువాదం చేసి, మానవికంగా దిద్దుబాట్లు చేస్తున్నాను. నాకు సందేహంగా ఉంది. పై విధానం తప్పనిసరి కాదు కదా. --VJS (చర్చ) 14:35, 22 ఆగస్టు 2023 (UTC)Reply
@Vjsuseela గారూ,
  1. ఇది AWB లో వాడేందుకు చెప్పినది కాదు. అనువాద పరికరం లోనే ఫైండ్/రీప్లేస్ పరికరం ఉందండి. దానిలో వాడవచ్చు.
  2. ఇది వాడడం తప్పనిసరేమీ కాదు. కేవలం పని తొందరగా, సులువుగా చేసేందుకు వాడుకోదగ్గ సౌకర్యం, అంతేనండి.
ఇది అంత వీలుగా అనిపించకపోతే మామూలు పద్ధతిలోనే చేయవచ్చండి. __చదువరి (చర్చరచనలు) 14:41, 22 ఆగస్టు 2023 (UTC)Reply
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పై మూడింటినీ ఇదే వరుసలో వాడితే మంచి ఫలితాలుంటాయి. __ చదువరి (చర్చరచనలు) 14:42, 22 ఆగస్టు 2023 (UTC)Reply
మంచిదండి.ధన్యవాదాలు. VJS (చర్చ) 14:47, 22 ఆగస్టు 2023 (UTC)Reply

ఒక గమనిక

మార్చు

తోటి ప్రాజెక్టు సభ్యులైన

గార్లందరికీ ఆగస్టులో సృష్టించిన క్రికెట్ పేజీల వెల్లువకు గాను అభినందనలు. వానాకాలం లాగా సెప్టెంబరు అక్టోబరుల్లో ఆగేది కాదు. నవంబరు 20 దాకా కురుస్తూనే ఉండే క్రికెట్ కాలమిది. ప్రాజెక్టు మొదలవడానికి ముందు క్రికెట్ వ్యాసాలు మొత్తం తెవికీలో 0.45 శాతం. ఇవ్వాళ అవి 1.38 శాతం. దీన్ని 2% కి తీసుకుపోదాం. ఇంకో ఆరేడొందల వ్యాసాలు చేరిస్తే అది సాధ్యమే.

పోతే, మనం సృష్టించిన వాటిలో 346 వ్యాసాలు అనాథలుగా ఉన్నాయి. ఆ జాబితా ఇక్కడ ఉంది. వీటికి తగు ఇన్‌కమింగు లింకులు ఇచ్చే పనిని దృష్టిలో ఉంచుకోవాలని మనవి.__ చదువరి (చర్చరచనలు) 12:52, 5 సెప్టెంబరు 2023 (UTC)Reply

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:56, 5 సెప్టెంబరు 2023 (UTC)Reply
గమనించి తగిన చర్యలు చేపట్టగలను. యర్రా రామారావు (చర్చ) 13:05, 5 సెప్టెంబరు 2023 (UTC)Reply
@Pravallika16 గారూ ప్రాజెక్టు పేజీలో మీ సంతకం తప్పుగా పడింది. బహుశా మీరు సంతకం చెయ్యకుండా నేరుగా పేరు, లింకు రాసినట్లున్నారు.., అవి పొరపాటుగా పడ్డాయి. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 12:58, 5 సెప్టెంబరు 2023 (UTC)Reply

తొలి లక్ష్యం సాధించేసాం

మార్చు

110 రోజుల్లో చెయ్యాలనుకున్న పనిని 40 రోజుల్లో చేసేసాం. ఇకపై చేసేదంతా బోనసే! ప్రాజెక్టు సభ్యులందరికీ అభినందనలు.

ఇప్పుడేం చేద్దాం..?
ఏముందీ.. పేజీలు సృష్టించుకుంటూ పోవడమే!

అవును, ఇక్కడితో ఆగకూడదు. ముగింపు తేదీ దాకా కొత్త పేజీలు వస్తూనే ఉండాలి. వెయ్యిని రెండువేలు చెయ్యాలి. మరిన్ని వ్యాసాలు రావాలి. వికీ విస్తృతినీ, వైవిధ్యాన్నీ పెంచాలి. 2023 ప్రపంచ కప్‌లో పాల్గొనే.. 10 జట్లు, 150 మంది ఆటగాళ్ళు, మరో యాభై మంది దాకా అంపైర్లు, కోచ్‌లు, మేనేజర్లు, స్టేడియాలు,.. వగైరాల్లో కొన్నిటికి ఇంకా పేజీలు ఉండి ఉండవు. వాటిని సృష్టించేందుకు ప్రాథమ్యత ఇవ్వాలి. దాంతోపాటు, ఇంకా ఏమేం చెయ్యాలో చెయ్యొచ్చో.., మీ అభిప్రాయాలు చెప్పవలసినది.

నాకు తోచినవివి:

  • ఈ పాటికే సృష్టించిన పేజీల నాణ్యతను పరిశీలించాలి. అవసరమైన సవరణలు చేసి నాణ్యత పెంచాలి.
  • వర్గాలను కొంత క్రమబద్ధీకరించాల్సిన అవసరం కనిపించింది. వర్గాలు ఎలా ఉండాలో చర్చించుకోవాలి.
  • మొత్తం క్రికెట్ వ్యాసాలన్నిటినీ క్రోడీకరిస్తూ, ఒక బ్రౌజింగు పేజీని చేద్దాం. వ్యాసాలన్నీ వికీలో ఎలా పేర్చి,అమర్చి ఉన్నాయో ఈ పేజీలో చూపించాలి. ఆ పేజీలో ఉండేవన్నీ లింకులే. ఆటగాళ్ళ వ్యాసాలు కావాలా, ఈ లింకుకు వెళ్ళండి, క్రికెట్ నియమాలు కావాలా, ఇది చూడండి అంటూ మొత్తం లింకులే ఇస్తాం. ఒక సైట్ మ్యాపు లాంటిదన్నమాట. ఒక స్థూల దృష్టి పేజీ లాంటిది.

__ చదువరి (చర్చరచనలు) 02:33, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply

మరొక ఆలోచన:
మనం సృష్టించిన వ్యాసాల్లోంచి ఆసక్తి కలిగించే విశేషాలేమైనా ఉంటే మొదటిపేజీలో "మీకు తెలుసా" శీర్షికలో చేరుద్దాం. అయితే వీటింబి నేరుగా చేర్చకుండా ప్రాజెక్టు కిందనే ఒక పేజీ పెట్టి అందులో చేరుద్దాం. మీకు తెలుసా శీర్షిక నిర్వహించే రవిచంద్ర, వెంకటరమణ గార్లకు వాటిని పరిశీలించి, అనువైన వాటిని ఎంచుకుని మొదటిపేఝీలో ప్రదర్శిస్తారు. __ చదువరి (చర్చరచనలు) 03:13, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply
ప్రాజెక్ట్ విజయవంతముగా నడిపిస్తున్నందుకు మీకు అభినందనలు. క్రికెట్ కు సంబంధించిన సాంకేతిక పదాలకు అకారాది క్రమంలో అర్ధము/వివరణ(2-4 వరుసల)తో "క్రికెట్ పదకోశం" పేజీ ఉంటే బావుంటుందేమో పరిశీలించండి. ప్రతి సాంకేతిక పదానికి ప్రత్యేక పేజీ కంటే కూడా. కొన్ని సాంకేతికపదాలకు చాలా వివరంగా తెవికీలో పేజీలున్నాయి. వాటికి లింకులివ్వవచ్చు. VJS (చర్చ) 17:38, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply
@Vjsuseela గారూ, మంచి సూచన. పదకోశం పేజీ ఇంగ్లీషులో ఈసరికే ఉందండి. దాన్ని అనువాదం చెయ్యడంలో పెద్ద తల్నెప్పులొచ్చి ఆపేసానండి. పరికరం ద్వారా కాకుండా నేరుగా అనువదించాలంటే చాలా సమయం పడుతుంది. __ చదువరి (చర్చరచనలు) 02:03, 12 సెప్టెంబరు 2023 (UTC)Reply
మీరు అన్నది ఈ పేజీ కదా Glossary of cricket terms. ప్రతి అక్షరక్రమానికి పదాలు మూస లో ఉండడము వలన యాంత్రిక అనువాదం కావడం లేదు అనుకుంటున్నాను. బయట పరికరంలో ఎన్వికీ పేజీ నుంచి నేరుగా చేయవచ్చు. కొంచెం సమయం ఎక్కువపడుతుంది. ఈ పేజీ అవసరం అనుకుంటే నేను చేస్తాను. VJS (చర్చ) 06:14, 12 సెప్టెంబరు 2023 (UTC)Reply
అవునండీ @Vjsuseela గారు, అదే.
చేసెయ్యొచ్చు. కానీ బాగా పెద్దపేజీ -బోల్డంత సమయం తినేస్తుందేమో చూడండి. __ చదువరి (చర్చరచనలు) 10:58, 12 సెప్టెంబరు 2023 (UTC)Reply
నిజమేనండి. కానీ క్రికెట్ వ్యాసాలు రాస్తుంటే అనిపించింది, Glossary కూడా ఉంటే బావుంటుందని. వీలుచూసి మొదలుపెడతాను. మీ సానుకూల అభిప్రాయానికి ధన్యవాదాలు. VJS (చర్చ) 12:13, 12 సెప్టెంబరు 2023 (UTC)Reply
110 రోజుల్లో చెయ్యాలనుకున్న పనిని 40 రోజుల్లో చేసినందుకు ఈ ప్రాజెక్టులో పొల్గొన్న అందరికీ, ప్రాజెక్టు నిర్వహకులు చదువరి గార్కి, మహిళా క్రెకెట్ క్రీడాకారిణుల వ్యాసాలపై ప్రత్వేక శ్రద్దవహించిన సుశీల గార్కి అభినందనలు తెలుపుతూ, మరో 40 రోజులుకు 2 వ (2000 వ్యాసాల చేరువకు) మైలురాయికి చేరుకోవటానికి అందరం మరింత శ్రద్ద వహించాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 11:17, 12 సెప్టెంబరు 2023 (UTC)Reply
మీ సదభిప్రాయానికి ధన్యవాదాలు రామారావు గారు. ఈ పని కొనసాగిస్తాను. VJS (చర్చ) 12:26, 12 సెప్టెంబరు 2023 (UTC)Reply

మీకు తెలుసా పేజీ

మార్చు

క్రికెట్ వ్యాసాలకు సంబంధించి ఒక మీకు తెలుసా పేజీని పెట్టాను. ఇక్కడ మనం రాస్తున్న, ఇదివరకే ఉన్న పేజీల్లోని ముఖ్యమైన, మీకుతెలుసా-యోగ్యతున్న విశేషాలను ఆ పేజీలో చేరుద్దాం. వాటిలో మొదటిపేజీ యోగ్యత ఉందని భావించినవాటిని ఆ పేజీ నిర్వాహకులు అక్కడ చేరుస్తారు. రవిచంద్ర, వెంకటరమణ, మురళీకృష్ణ గార్లు ఈ పేజీని పరిశీలించవలసినదిగా విజ్ఞప్తి. ఒకవేళ వేటినైనా మొదటిపేజీ కోసం ఎంచుకుంటే.., వాటిని ప్రపంచకప్ జరిగే రోజుల్లో - అక్టోబరు 1 నుండి నవంబరు 30 వరకు - ప్రదర్శించేలా చూడవలసినది. __ చదువరి (చర్చరచనలు) 13:49, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply

చదువరి గారూ, ధన్యవాదాలు. మీరు సృష్టించిన క్రికెట్ జాబితా నుంచి ఒక్కోటి ఒక్కోవారంలో వాడుకుంటాను. (ఇదివరకే కొన్ని వాడుకున్నాను కూడా). వారానికి ఒక్కోటి అని ఎందుకన్నానంటే వైవిధ్యం కోసమే. సాధ్యమైనంత వరకు అయిదు వాక్యాలు అయిదు వేర్వేరు అంశాలకు సంబంధించినవి అయ్యేటట్లు చేస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 14:17, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply
మంచి ప్రయత్నం. మంచి ఆలోచనతో పేజీని సృష్టించిన చదువరి గారికి, మొదటి పేజీ నిర్వహణలో నిరంతరం కృషిచేస్తున్న రవిచంద్ర, వెంకటరమణ, మురళీకృష్ణ గార్లకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 15:41, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply
చదువరిగారు, యర్రా రామారావుగారు... మీకు ధన్యవాదాలు... ఇంతకీ ఈ మురళీకృష్ణ నేనేనా...! Muralikrishna m (చర్చ) 16:59, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply
మీరే యర్రా రామారావు (చర్చ) 17:02, 11 సెప్టెంబరు 2023 (UTC)Reply
@Muralikrishna m గారూ, ఈమధ్య మీరు "మీకుతెలుసా" పనులు చేస్తున్నట్లు ఇటీవలి మార్పుల్లో చూసిన గుర్తు. పైగా మీ వాడుకరిపేజీ నిండా అవే గదా. అంచేత మీకు కూడా రాసాను. __ చదువరి (చర్చరచనలు) 02:11, 12 సెప్టెంబరు 2023 (UTC)Reply
@రవిచంద్ర గారూ ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 02:05, 12 సెప్టెంబరు 2023 (UTC)Reply
అలాగేనండీ చదువరి గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:27, 12 సెప్టెంబరు 2023 (UTC)Reply

బొమ్మల్లేని వ్యాసాలు

మార్చు

ప్రాజెక్టులో సృష్టించిన పేజీల్లో బొమ్మల్లేనివి చాలానే ఉన్నాయి. వీటిలో బొమ్మలు లేకపోవడానికి 99% కారణం - ఎన్వికీలో కూడా లేకపోవడం లేదా అక్కడ ఉన్న బొమ్మ కామన్సు లోది కాక స్థానికంగా ఎక్కించినది కావడం. ఎన్వికీలో బొమ్మ ఉన్నట్లైతే మనం ఆ బొమ్మను దించుకుని తెవికీ లోకి ఎక్కించుకుని, పేజీలో చేర్చవచ్చు. ప్రాజెక్టు సభ్యులు గమనించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 16:23, 17 సెప్టెంబరు 2023 (UTC)Reply

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:23, 19 సెప్టెంబరు 2023 (UTC)Reply

వివిధ దేశాల మహిళా క్రికెట్ జట్లు

మార్చు

కొన్ని దేశాల మహిళా క్రికెట్ జట్లకు ఇంకా పేజీలు తయారు చెయ్యాల్సి ఉంది. వేరెవరూ చేయకపోతే నేను చేద్దామనుకుంటున్నాను. అనువాద పరికరంలో ఎవరూ చెయ్యడం లేదని తేలింది. అంచేత నేను మొదలుపెడుతున్నాను. ముందుగా ఇంగ్లాండ్ జట్టు పేజీ అనువాదం మొదలుపెడతాను. ఆ తరువాత వరుసగా మిగతావి.__ చదువరి (చర్చరచనలు) 01:16, 18 సెప్టెంబరు 2023 (UTC)Reply

నేను కొంచెం చేసానండి. న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు,ఇద్దరు న్యూజిలాండ్ మహిళా క్రీడాకారులను - మాడీ గ్రీన్, సోఫీ డివైన్ (కెప్టెన్), ఇంకా పాకిస్తాన్ కెప్టెన్ నిదా దార్ చేర్చాను. ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్ హీథర్ నైట్ రాస్తున్నాను.VJS (చర్చ) 18:21, 18 సెప్టెంబరు 2023 (UTC)Reply
నేను ఆస్ట్రేలియా మహిళా జట్టును అనువాదం చేస్తున్నానండి. ఇవి పెద్ద వ్యాసాలు. నేను ఎక్కువ వేగంగా రాయలేను కాబట్టి మీరు అనుకున్నట్లు మీరు రాయండి. నేను జాబితా చివర నుండి రాస్తాను.
VJS గారూ, అలాగేనండి. ప్రశాంతంగా నిదానంగా రాయండి. నేను ఇంగ్లాండ్ జట్టు మాత్రమే రాస్తాను. మిగతావి మీ వీలును బట్టి మీరే రాయండి. రాయాల్సినవి ఇంకా బోలెడు ఉన్నాయి కాబట్టి నేను వేరే వాటి సంగతి చూస్తాను. __చదువరి (చర్చరచనలు) 13:59, 21 సెప్టెంబరు 2023 (UTC)Reply

అనువాదాలు చేసేటపుడు నేను పాటిస్తున్నవి

మార్చు

అనువాదాలు చేసేటపుడు నేను పాటిస్తున్న కొన్ని విషయాలను ఇక్కడ రాస్తున్నాను. మిగతావాళ్ళు కూడా తాము పాటిస్తున్నవాటిని రాస్తే వాటిని అందరం పాటించవచ్చు. తద్వారా ఒక ఏకరీతి ఏర్పడుతుంది. ఇది ఎప్పుడో మొదలెట్టాల్సింది.. ఆల్సెమైంది.

  • అరంగేట్రం: మనకు రంగప్రవేశం అనే చక్కటి మాట ఉంది. గూగుల్ ఈ అరవ మాట ఎక్కడ నేర్చుకొచ్చిందో తెలీదు. నేను అరంగేట్రం అనే మాట తీసేసి రంగప్రవేశం పెడుతున్నాను. రంగప్రవేశం కూడా ఎక్కువగా వాడను - పునరుక్తి బాగుండడం లేదు. అంచేత రంగప్రవేశం చేసాడు అని కొన్నిచోట్ల వాడుతూనే, తొలి మ్యాచ్ ఆడాడు, అడుగుపెట్టాడు, ప్రవేశించాడు అని కూడా వాడుతున్నాను.
  • "named in the squad" అని ఇంగ్లీషులో ఉంటే దాన్ని "పేరు పొందాడు" అని వాడుతోంది. పేరు పొందాడు అనే వాడుక మనకు ఫేమస్ అయ్యాడు అనే అర్థంలో వాడతాం. కాబట్టి ఈ సందర్భంలో అలా వాడడం పొసగదు. అంచేత దాన్ని "చోటు సంపాదించాడు" "స్థానం పొందాడు" "చోటు దక్కింది" వగైరాలు వాడుతున్నాను.
  • సర్వనామాన్ని చాల ఎక్కువగా వాడడం ఇంగ్లీషు భాషకు ఆనవాయితీ. దాదాపు ప్రతివాక్యం లోనూ he గానీ she గానీ ఉంటుంది. ఉన్నా అక్కడ బానే ఉంటుంది. ఉంటేనే వాక్యం కుదురుగా ఉంటుంది. కానీ మనకు అలాక్కాదు. అతను అనేది ప్రతీ వాక్యంలోనూ వాడక్కర్లేదు. వాడితే ఎబ్బెట్టు గానూ ఉంటది. "అతను" అనే మాట వాడకుండా "ఆ తరువాత మ్యాచ్‌లో మరో శతకం చేసాడు" అనే అర్థవంతమైన వాక్యాన్ని తెలుగులో రాయొచ్చు. 1999 మార్చిలో వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌లో అతను, 11 వికెట్లు తీసాడు. తరువాతి మ్యాచ్‌లో అతను, 4 వికెట్లు తీసాడు. మళ్ళీ లార్డ్స్‌లో అతను, రెండు ఇన్నింగ్సుల్లోనూ నాలుగేసి వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు. ఆ తరువాతి మ్యాచ్‌లో అతను 2 వికెట్లు తీసుకున్నాడు." ఇలా వెంటవెంటనే రాసే వాక్యాల్లో - ఇంగ్లీషులో రాసినట్టు - సర్వనామాన్ని రాయనక్కర్లేదు. రాయకపోతేనే బాగుంటుంది. అందుకే నేను రాయట్లేదు. అసలే రాయక్కర్లేదని కాదు. వరసగా ప్రతి వాక్యంలోనూ రాయనక్కర్లేదని భావించి అదే పాటిస్తున్నాను.
  • 5-wicket haul ను ఐదు వికెట్ల పంట అని రాస్తున్నాను
  • four, boundary లను ఫోరు, బౌండరీ అనే రాస్తున్నాను. sixer ను సిక్సరనే రాస్తున్నాను నాలుగు ఆరు అని రాయడం లేదు.
  • century ని గూగుల్ సెంచరీ అనే అంటోంది. నేనూ అలాగే ఉండనిస్తున్నాను. కొన్ని సార్లు శతకం అని మారుస్తున్నాను కూడా. ఖచ్చితంగా ఇదే వాడాలని రూలేమీ పెట్టుకోలేదు.
  • టెస్ట్ ను టెస్టు అని రాస్తున్నాను
  • ODI ను వన్‌డే అని రాస్తున్నాను
  • సంతకం చేయబడ్డాడు, కొనబడ్డాడు.. ఇలాంటి "బడు"లను - దాదాపుగా అన్నిటినీ - కర్తరి రూపం లోకి మారుస్తున్నాను.
  • తేదీ ఆకృతిని తెవికీకి అనుగుణంగా ఖచ్చితంగా మారుస్తున్నాను.

ఇవి కొన్ని. ఇంకా గుర్తొచ్చినపుడు రాస్తాను. మిగతావారు కూడా ఇలాంటివి రాయవలసినదిగా మనవి. __ చదువరి (చర్చరచనలు) 01:48, 18 సెప్టెంబరు 2023 (UTC)Reply

అలాగే ఈమధ్య బ్యాట్స్‌మన్ ను బ్యాటరు అని మార్చడం మొదలుపెట్టాను. మహిళలకు, పురుషులకూ ఒకేలా ఉండేందుకు అంతర్జాతీయంగా ఇలా మార్చారు కాబట్టి, ఇలా చేస్తున్నాను.__ చదువరి (చర్చరచనలు) 05:53, 18 సెప్టెంబరు 2023 (UTC)Reply

సగం సమయం గడిచింది

మార్చు

ప్రాజెక్టు వ్యవధి సగం గడిచింది. పేజీల సృష్టి లక్ష్యాన్ని దాటి 25% ఎక్కువ చేసాం. రాబోయే 55 రోజుల్లో మన కృషి ఎలా ఉండాలనేదాని గురించి చర్చ చేద్దాం.

  1. 2023 క్రికెట్ ప్రపంచ కప్, 2023 క్రికెట్ ప్రపంచ కప్ జట్లు - ఈ రెండు పేజీలను చూసి, వాటిలో ఎర్రలింకులేమైనా ఉంటే ఆ పేజీలు సృష్టించాలి.
  2. మరో పది రోజుల్లో ప్రపంచ కప్ మొదలవబోతోంది. ఈ పది రోజుల్లో ప్రస్తుతం చేస్తున్న పని కాకుండా ప్రత్యేకంగా ఏదైనా పని చేద్దామా? ఉదాహరణకు,
    • సృష్టించిన పేజీల్లో భాషా దోషాల సవరణ
    • ఆ పేజీల్లో బొమ్మల చేర్పు
    • ఆ పేజీల్లోంచి "మీకు తెలుసా"లను సంగ్రహించడం
  3. క్రికెట్‌పై తెవికీలో ఉన్న పేజీలను స్థూలంగా పరిచయం చేసే ఒక అవలోకనం పేజీ
  4. ప్రపంచ కప్ మొదలయ్యాక, ఒక్కో మ్యాచ్‌కూ ఒక్కో పేజీ పెడదామా లేక మ్యాచ్ సారాంశాన్ని 2023 క్రికెట్ ప్రపంచ కప్ పేజీలో రాద్దామా? ఎన్వికీలో రెండో పద్ధతిని అనుసరిస్తారు.

మీమీ అభిప్రాయాలు, సూచనలు, కొత్త ఆలోచనలూ రాయండి. __ చదువరి (చర్చరచనలు) 01:32, 25 సెప్టెంబరు 2023 (UTC)Reply

ప్రణయ్ గారూ......

మార్చు

@Pranayraj1985 గారూ, దూసుకెళ్ళిపోతున్నారుగా! యాడ దాక పోతారో చూస్తా.., ఈ ఆదివారం నాటికి మిమ్మల్ని దాటేస్తా, చూస్తూండండి. __ చదువరి (చర్చరచనలు) 14:58, 4 అక్టోబరు 2023 (UTC)Reply

@Chaduvari గారూ... లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి. చూచుకుందాం మీ పతాపమూ, నా పతాపమూ. హహహ-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:21, 6 అక్టోబరు 2023 (UTC)Reply

వెయ్యి మీద చూపు

మార్చు

@ప్రణయ్ రాజ్ గారూ, మీరు ఇప్పటికి 765 వ్యాసాలు రాసారు. వెయ్యికి 235 మాత్రమే తక్కువ. ఇంకా 22 రోజుల సమయం ఉంది. రోజుకు సుమారు 11 -12 వ్యాసాలు. ఇది పెద్ద లెక్కలోది కాదు మీకు. ఇప్పుడు మీరు రాస్తున్న వేగంతోనైతే వెయ్యి చేరడానికి వారం చాలు. ఆ వెయ్యి గీత దగ్గర గజమాల పట్టుకుని చూస్తూంటాం, వచ్చెయ్యండి. __ చదువరి (చర్చరచనలు) 00:48, 30 అక్టోబరు 2023 (UTC)Reply

ధన్యవాదాలు @Chaduvari గారు. వెయ్యి వ్యాసాలు రాయడానికి ప్రయత్నం చేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:31, 31 అక్టోబరు 2023 (UTC)Reply
@Chaduvari గారూ, నవంబరు 14న వెయ్యి గీతను దాటేశాను. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:54, 15 నవంబరు 2023 (UTC)Reply
యర్రా రామారావు, చదువరి, VJS గార్లకు ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:33, 20 నవంబరు 2023 (UTC)Reply
@ప్రణయ్ రాజ్ గారూ వికీప్రాజెక్టు/క్రికెట్ 2023 లో వెయ్యి వ్యాసాలు దాటినందుకు మీకు నా అభినందనలు. V Bhavya (చర్చ) 05:55, 22 నవంబరు 2023 (UTC)Reply

చివరి రోజు

మార్చు

- అందరికీ నమస్కారం. ప్రపంచ కప్ ముగిసింది. కప్పు గెలిచిన ఆస్ట్రేలియాను అభినందించాల్సిన సమయం. పదకొండు మ్యాచ్‌లలో పది గెలిచి, చివరి దానిలో రెండో స్థానంలో నిలిచిన భారత జట్టును కూడా అభినందించాల్సిందే.

ఇవ్వాళ్టితో మన ప్రాజెక్టు గడువు ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు ముగిద్దాం. రాస్తూ ఉన్న వ్యాసాలేమైనా ఉంటే, ముగించి ప్రచురించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 02:49, 20 నవంబరు 2023 (UTC)Reply

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:37, 20 నవంబరు 2023 (UTC)Reply
అలాగే అండీ చదువరి గారు V Bhavya (చర్చ) 04:54, 20 నవంబరు 2023 (UTC)Reply
అలాగేనండీ @Chaduvari గారు. ధన్యవాదాలు Divya4232 (చర్చ) 08:27, 20 నవంబరు 2023 (UTC)Reply
@Chaduvari గారూ, మొత్తానికి మన ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేస్తున్నట్టేనా? నేను ఆఖరి ఓవర్లలో కొద్దిగా హిట్టింగ్ చేశాను. :-) పవన్ సంతోష్ (చర్చ) 12:39, 20 నవంబరు 2023 (UTC)Reply
మనల్ని ఆలౌట్ చెయ్యడం కష్టం అయ్యేట్టు ఉంది. అందుకే ఇక ఇన్నింగ్స్ డిక్లేరు చెయ్యక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. చేసేసాను సార్. __చదువరి (చర్చరచనలు) 13:47, 20 నవంబరు 2023 (UTC)Reply
Chaduvari గారూ, ప్రాజెక్ట్ లో పాల్గొనగలిగినందుకు నాకు సంతృప్తి గా ఉంది. చాలామంది క్రికెటర్ల గురించి తెలుసుకోగలిగాను. --VJS (చర్చ) 13:39, 20 నవంబరు 2023 (UTC)Reply
మీరే కాదు VJS గారూ.., నేనూ ఎన్నో సంగతులు తెలుసుకున్నాను. మీరు ఆ విశేషాలను పంచుకోవాలి. అందుకోసం ఒక పేజీ సృష్టిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 13:49, 20 నవంబరు 2023 (UTC)Reply
ఇది వరకు క్రికెట్ లో నాకు ఆ ఆలు కూడా రావు.ఈ ప్రాజెక్టులో నేను పూర్తిగా స్వదేశీ మహిళలు జట్లుకు చెందిన 100 వ్యాసాలు రాయటం వలన కాస్తో కూస్తో క్రికెటును గురించి నామమాత్రంగా తెలుసుకున్నాను.ఈ ప్రాజెక్టులో పాల్గొన్నవారికి ఏప్పటికప్పుడు సూచనలు ఇస్తూ, ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లిన @చదువరి గార్కి, అలాగే ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న సహవాడుకరుందరికి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:14, 20 నవంబరు 2023 (UTC)Reply
నేను రాసిన రెండు పరకల వ్యాసాలకే నాకు చాలా విశేషాలు తెలిశాయి. మచ్చుక్కి కొన్ని:
  • దక్షిణాఫ్రికా జట్టును 1990కి ముందు నిషేధించారని ఇంతకుముందూ తెలుసు - ఎందుకో ఇప్పుడు తెలిసింది. అప్పట్లో అయ్యో పాపం అనుకునేవాడిని, ఇప్పుడు ఆ నిషేధం ఊరికే జరగలేదనీ, జాతివివక్ష కారణంగా చేశారని అర్థమైంది.
  • క్రికెట్టుకి పుట్టినిల్లు ఇంగ్లండ్ అంటారు. మరి అలాంటిది ఒక్క ప్రపంచ కప్పూ గెలవలేదేమిటో అనుకునేవాణ్ణి. ఇంగ్లండ్ పీక్ అంతా 1960లకు ముందే అయిపోయిందనీ, బ్రహ్మాండమైన ఆటగాళ్ళు ఉండేవారనీ ఇప్పుడు అర్థమైంది.
  • మొదటి రెండు వరల్డ్ కప్పులూ వెస్టిండీసే పట్టుకుపోయిందని తెలుసు. అందుకు వాళ్ళ భయంకరమైన పేస్ బౌలింగ్ అటాక్ ప్రధాన కారణమనీ తెలుసు. కానీ, దానివెనుక ఉన్న కారణాలేమిటో ఇప్పుడు తెలిసింది.
  • తొలి భారత మహిళా వ్యాఖ్యాత తెలుగావిడ అనీ, వెస్టిండీస్ అన్నది కరేబియా దీవుల్లో పూర్వం బ్రిటిష్ పాలిత దేశాలుగా ఉన్న దేశాల ఉమ్మడి జట్టు అనీ.
ఇలాంటి వివరాలతో పాటు మంచి టిట్ బిట్స్ కూడా తెలిశాయి. ఇవన్నీ మనలో మనం ఏ వీడియో కాల్లోనో పంచుకుని ఆనందించాలని నా ఆశ. పవన్ సంతోష్ (చర్చ) 18:24, 20 నవంబరు 2023 (UTC)Reply

గణ గణ గణ..

మార్చు

గంట మోగింది. ఆట ఆగింది. ప్రపంచ కప్ ముగిసింది. మూణ్ణెల్ల వ్యాసాల సంరంభం విజయవంతంగా ముగిసింది. 1000 వ్యాసాల కోసం మొదలుపెట్టిన ప్రాజెక్టు 2272 వ్యాసాలతో దిగ్విజయం సాధించింది. పాల్గొన్న వాడుకరులందరికీ అభినందనలు.__ చదువరి (చర్చరచనలు) 13:40, 20 నవంబరు 2023 (UTC)Reply

అందరికీ మనవి..

మార్చు

ఈ ప్రాజెక్టును దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ పేరుపేరునా అభినందనలు. ఒక మైలురాయి లాంటి ప్రాజెక్టులో మనమంతా భాగమయ్యాం.

  • ప్రాజెక్టు గణాంకాలు కొన్నిటిని ప్రాజెక్టు పేజీలో చేర్చాను, పరిశీలించండి
  • సమీక్ష అనే ఒక పేజీ పెట్టాను. అక్కడ మీమీ అనుభవాలు, అభిప్రాయాలూ, సూచనలూ నిర్మొహమాటంగా రాయండి
  • మనం సృష్టించిన పేజీల్లో కొన్ని పనులు చెయ్యాల్సి ఉంది. వాటిని చెయ్యాల్సిన పనులు అనే పేజీలో పెట్టాను. అక్కడ ఇంకా చేర్చాల్సినవి ఏమైనా ఉంటే చేర్చండి.

ప్రాజెక్టు దిగ్విజయం చేసినందుకు మరోసరి అభినందనలతో..__చదువరి (చర్చరచనలు) 14:36, 20 నవంబరు 2023 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/క్రికెట్ 2023".