రామ్ లక్ష్మణ్ (స్టంట్ కొరియోగ్రాఫర్స్)

రామ్ లక్ష్మణ్ అని పిలువబడేది చెల్లా రామ్, చెల్లా లక్ష్మణ్ అనే అన్నదమ్ములను(కవలలు). వీరు భారతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ద్వయం. వీరు ప్రధానంగా తెలుగు సినిమాలో పని చేస్తున్నారు. ఉత్తమ ఫైట్ మాస్టర్స్ గా వారికి ఆరు రాష్ట్ర నంది అవార్డులు వచ్చాయి. వారు విక్రమ్ ధర్మ, కనల్ కన్నన్, పీటర్ హెయిన్, స్టన్ శివ, విజయన్, విజయ్, అనల్ అరసు, స్టంట్ సిల్వా, దిలీప్ సుబ్బరాయన్, రవి వర్మ, అన్బరీవ్‌.. మరెందరో స్టంట్ మాస్టర్లతో కలిసి పనిచేశారు.

రామ్ లక్ష్మణ్
జననం1968
వృత్తి
  • స్టంట్ కొరియోగ్రాఫర్
  • స్టంట్ డబుల్
క్రియాశీల సంవత్సరాలు1990 — ప్రస్తుతం

కెరీర్

మార్చు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన రామ్, లక్ష్మణ్ కవల సోదరులు. వీరిరువురు ఫైట్ మాస్టర్స్ గానే కాకుండా నటులుగా కూడా గుర్తింపుపొందారు. 2002లో వచ్చిన యాక్షన్ నెం.1, 2005లో వచ్చిన ఒక్కడే (కాని ఇద్దరు) చిత్రాలలో వీరు నటించారు.

ఫిల్మోగ్రఫీ

మార్చు
Year Film Language
1993 మేలెపరంబిల్ అన్వీడు మలయాళం
1993 ఉజైప్పాలి తమిళం
1997 ఎట్టుపట్టి రస తమిళం
1997 పాసముల్లా పాండియారే తమిళం
1997 ఓరు యాత్రమొళి మలయాళం
2004 ఆర్య తెలుగు
2005 రిలాక్స్ తెలుగు
2005 మజా తమిళం
2005 ఆంధ్రుడు తెలుగు
2006 గోదావరి తెలుగు
2007 ఢీ తెలుగు
2008 నేనింతే తెలుగు
2008 ఏగన్ తమిళం
2009 రైడ్ తెలుగు
2011 ఒస్తే తమిళం
2013 కదూ థామా మలయాళం
2014 లెజెండ్ తెలుగు
2016 సరైనోడు తెలుగు
2017 ఖైదీ నం. 150 తెలుగు
2017 కాటమరాయుడు తెలుగు
2017 దువ్వాడ జగన్నాధం తెలుగు
2018 భరత్ అనే నేను తెలుగు
2018 రంగస్థలం తెలుగు
2018 సర్కార్ తమిళం
2019 కోడతి సమక్షం బాలన్ వకీల్ మలయాళం
2019 మహర్షి తెలుగు
2019 రూలర్ తెలుగు
2019 అయోగ్య తమిళం
2020 దర్బార్ తమిళం
2020 సరిలేరు నీకెవ్వరు తెలుగు
2020 అలా వైకుంఠపురములో తెలుగు
2021 అఖండ తెలుగు
2021 యువరత్న కన్నడ
2021 క్రాక్ తెలుగు
2021 పుష్ప: ది రైజ్ తెలుగు
2022 ఖిలాడీ తెలుగు
2022 జేమ్స్ కన్నడ
2022 ఈతర్క్కుమ్ తునింధవన్ తమిళం
2022 ఆచార్య తెలుగు
2022 సర్కారు వారి పాట తెలుగు
2022 గాడ్ ఫాదర్ తెలుగు
2023 వరిసు తమిళం
2023 వీర సింహ రెడ్డి తెలుగు
2023 వాల్తేరు వీరయ్య తెలుగు
2023 ఒట్టకోంబన్ మలయాళం
2023 బ్రూస్ లీ మలయాళం

అవార్డులు

మార్చు

నంది అవార్డులు

మార్చు
  • 2004: ఉత్తమ ఫైట్ మాస్టర్‌గా నంది అవార్డు - ఆర్య[1]
  • 2005: ఉత్తమ ఫైట్ మాస్టర్‌గా నంది అవార్డు - ఆంధ్రుడు[1]
  • 2007: ఉత్తమ ఫైట్ మాస్టర్‌కి నంది అవార్డు - ఢీ[1]
  • 2008: ఉత్తమ ఫైట్ మాస్టర్‌కి నంది అవార్డు - నేనింతే[1]
  • 2009: ఉత్తమ ఫైట్ మాస్టర్‌గా నంది అవార్డు - రైడ్
  • 2014: ఉత్తమ ఫైట్ మాస్టర్‌గా నంది అవార్డు - లెజెండ్[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(in Telugu)
  2. Hooli, Shekhar H. (2017-11-14). "Nandi Awards 2014, 15 and 16 winners list: Mahesh Babu, Jr NTR, Balakrishna bag best actor awards". IB Times.{{cite web}}: CS1 maint: url-status (link)