శ్యామశాస్త్రి

భారతీయ సంగీత పాండిత్యడు

సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన శ్యామశాస్త్రి (ఏప్రిల్ 26, 1763 - ఫిబ్రవరి 6, 1827) ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు. ప్రకాశం జిల్లాలో ని కంభంలో శ్యామశాస్త్రి తల్లిదండ్రులు ఉండెడివారు.మహమ్మదీయుల దండయాత్రలకు బెదరి వీరు కంచిక్షేత్రం చేరుకొనిరి. ఆదిశంకరులకు ఆరాధ్యమగు కంచి కామాక్షి విగ్రహం వీరికి అక్కడ లభించింది. అటుపై కాంచీపురంబున ఆకాలమున (సా.శ.16వ) శ్రీ బంగారు కామాక్షి దుష్ట తురకల కలహమువలన పూజారులను, ఔత్తరులైన కొన్ని సాంస్థానీకులతో శ్యామశాస్త్రి తల్లి దండ్రులు వెడలి, శ్రీపురమను తిరువారూరి క్షేత్రమునకువచ్చి, రమారమి 35సం.లవరకు తంజపురిరాజుల వలన నేర్పరుపబడిన పూజోపచారాదుల అంగీకరించుకొనిరి. వీరు అత్యంత శ్రీమంతులు. శ్రీ శ్యామశాస్త్రి తల్లిదండ్రులు శ్రీ కామాక్షిని అత్యంతభక్తితో పూజించుకొని యుండుటయుకాక, తమకు అప్పటికి పుత్రుడు లేనందున ప్రతిమాసమునందును, కడపటి స్థిరవారములో వేంకటాచలపతికి ప్రీతిగా బ్రాహ్మణ సంతర్పణలు చేసుకొనిఉండెడినప్పుడు, ఒక స్థిరవారమున ఒక బ్రాహ్మణుని మీద వేంకటాచలపతి యావేశించి "ఓ దంపతులారా! మీకు ఒక సం.లోపల యశోవంతుడైన ఒక పుత్రుడు కలుగునని" చెప్పినట్లే ఇతని తల్లి గర్భవతిఅయి సా.శ.1763లో చిత్రభానుసం. మేష రవి కృత్తికా నక్షత్రమునందు శ్రీనగరమను తిరువారూరిలో శ్యామశాస్త్రి జన్మించిరి అని ఒక కథ ప్రాచుర్యములో ఉంది. శ్యామశాస్త్రిగారికి పేదరికము ఏమిటో తెలియదు. మంచిభోక్త. ఆత్మకింపైన భోజనము, తాంబూలాది రసాస్వాదన వీరికి ఇష్టము. తమ కష్టసుఖములను తెలుపు కీర్తనలు, లేక దైన్యరస ప్రధానములగు భక్తి పిలుపులు వీరియందు కానరావు. ఇతనికి నాదము ఆత్నానందముకొరకు ఉపాసించి సాధించిన వస్తువు. ఇతని కీర్తనలందు ఉల్లాసము, ఉత్సాహము, తాళ ప్రదర్శనవలన చేకూరు చురుకుదనము గమనించి తీరవలసిన గుణములు. శ్యామశాస్త్రి గారి కీర్తనలు సుమారు 20 బాగా వాడుకలో నున్నవి. ప్రసిద్ధ రాగములందు వీరి కీర్తనలు ఎక్కువ. కాని, అపూర్వరాగములందు కూడా కీర్తనలు ఉన్నాయి.

శ్యామశాస్త్రి

బాల్యం

మార్చు

ఈయన అసలు పేరు "వేంకట సుబ్రహ్మణ్యము". ఈయన తంజావూరు జిల్లాలోని తిరువారూరు గ్రామంలో ఏప్రిల్ 26, 1763 న కృత్తికా నక్షత్రమున విశ్వనాధ అయ్యరు గారికి జన్మించిరి. వీరిని తల్లిదండ్రులు "శ్యామకృష్ణా" యని ముద్దుగా పిలిచేవారు. అదే ఈయన కృతులలో ఈయన ముద్ర అయినది. ఈయన బంగారు కామాక్షి ఉపాసకుడు. అమ్మపై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు. ఈయన కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించాడు. త్యాగరాజాదులచే కొనియాడబడిన ఈయన లయజ్ఞానము శ్లాఘనీయమైనది. ఆనంద భైరవి రాగమన్న ఈయనకు చాల యిష్టమని చెప్తారు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదుడై ఈయన కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించు కామాక్షి, కామాక్షీ (స్వరజతి), కనకశైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి. ప్రఖ్యాత వాగ్గేయకారుడైన సుబ్బరాయశాస్త్రి ఈయన కుమారుడే. ఇతడు బాల్యమునందే సంస్కృతాంధ్ర భాషలలో మహాప్రౌఢుడయి, బంగారు కామాక్షితో తంజావూరికి వచ్చి, తమబంధువలలో (మేనమామ) ఒకరివద్ద సరళి మొదలు స్వరజ్ఞానమువరకు నేర్చుకొనెను. అంతలో శ్రీవిద్యాపరమానుగ్రహమునొందెను. ఇతని భాగ్య విశేషమువలన ఉత్తరదేశమునుండి సంగీతస్వాములని ఒకయతీంద్రుడు అక్కడకు వచ్చెనట, ఆతను శ్యామశాస్త్రిని అంతేవాసిగా గైకొని 3సం.పర్యంతము ఆతని విద్యా కౌశులతకు ఆశ్చర్యమొంది వీరిని గొప్ప యశోవంతుడువగునని ఆశీర్వదించి ఆది అప్పయ్య పాటలను కొన్ని దినములు వినమని చెప్పి ఆయన కాశీయాత్ర గాంచెనట.

సంగీత జ్ఞానం

మార్చు
కర్ణాటక సంగీతం
విషయాలు

శృతిస్వరంరాగంతాళంమేళకర్త

కూర్పులు

వర్ణంకృతిగీతంస్వరజతిరాగం తానం పల్లవితిల్లానా

వాయిద్యాలు

వీణతంబురమృదంగంఘటంమోర్‌సింగ్కంజీరవయోలిన్

సంగీతకారులు

కర్నాటక సంగీతకారుల జాబితా

వీరు తెలుగు నందును, సంస్కృతమునందును పండితులు. తమ మేనమామ వద్ద సంగీత ఆరంభ పాఠములు అభ్యసించిరి. వీరు 18 వ యేట తలిదండ్రులతో తంజావూరు చేరుకొనిరి. అచట ఆంధ్ర పండితులైన సంగీత స్వామి అను సన్యాసి కాశీ నుండి దక్షిణ హిందూ యాత్రకు వచ్చి, అది చాతుర్మాసము గాన తంజావూరి లోనే ఆ నాలుగు నెలలు ఉండిపోయిరి. ఒక దినము శ్యామ శాస్త్రి గారి యింటిలో వారికి భిక్ష జరిగెను. భిక్ష జరిగిన వెనుక శాస్త్రి గారి తండ్రి తన కుమారుని ఆ సన్యాసి గారికి చూపి ఆశీర్వదింపగోరిరి. శ్యామశాస్త్రిని చూచిన వెంటనే అతడు గొప్ప పండితుడు కాగలడని సంగీతస్వామి తెలుసుకొనెను. అప్పటి నుండి సంగీత విద్య అభ్యసించిరి. తాళశాస్త్రము లోను, రాగ శాస్త్రములో అఖండ పండితుడైన సంగీతస్వామి వద్ద బాగుగా విద్యనభ్యసించిరి. చాతుర్మాసము కాగానే సంగీతస్వామి కాశీకి వెళ్ళునప్పుడు గాంధర్వ విద్యాగ్రంథముల నిచ్చి "నీవు సంగీత శాస్త్రమును సమగ్రంగా అభ్యసించితివి. తంజావూరు ఆస్థాన విధ్వాంసుడైన పచ్చి మిరియము ఆది అప్పయ్య గారి సంగీతమును తరచు విను చుండుము" అని చెప్పి వెడలిపోయిరి.

గురువాజ్ఞ ప్రకారమే శాస్త్రి గారు ఆది అప్పయ్య గారితో స్నేహము చేసికొని వారి గానమును తరచు వినుచుండిరి. అది అప్పయ్య గారికి శాస్త్రిగారనిన అపరిమిత ప్రేమ, భక్తియు నుండెడివి. ప్రేమతో "కామాక్షి" అని పిలుచుటయు కలదట.

రచనలు

మార్చు

వీరు మదురైకు వెళ్లినపుడు మీనాక్షి దేవిని స్తుతించుచూ తొమ్మిది కృతులు పాడిరి. ("నవరత్నమాలిక") . శాస్త్రి గారి రచనలు కదళీపాకములు. వీరికి ఆనందభైవరీ రాగంపై అనురాగమెక్కువ యున్నట్లు కనిపించును. ఆనందభైరవిలో చాలా కృతులను రచించిరి. సాధారణంగా చాపుతాళములో నెక్కువ కృతులు, స్వరజతులు రచించినట్లు తెలియుచున్నది.

ఇంకా చూడండి

మార్చు
  1. త్యాగరాజు
  2. ముత్తుస్వామి దీక్షితులు

సూచికలు

మార్చు

యితర లింకులు

మార్చు