శ్రీశ్రీ సినిమా పాటల జాబితా
శ్రీరంగం శ్రీనివాసరావు ప్రముఖ కవి. ఇతడు సినిమా రంగంలో మాటల, పాటల రచయితగాకూడా రాణించాడు. ఇతడు తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా రచయిత. ఇతడు వ్రాసిన సినిమా పాటల పాక్షిక జాబితా:
విడుదలైన సంవత్సరం | సినిమా పేరు | పాట పల్లవి | గాయకులు | సంగీత దర్శకుడు |
---|---|---|---|---|
1950 | ఆహుతి | ఓ ప్రియబాలనురా నే మనజాలనురా | రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల | సాలూరు రాజేశ్వరరావు |
1950 | ఆహుతి | జనన మరణ లీల ప్రేమయే మృత్యుపాశమే | రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల | సాలూరు రాజేశ్వరరావు |
1950 | ఆహుతి | హంసవలె ఓ పడవా ఊగుచు రావే అలలమీద | రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల బృందం | సాలూరు రాజేశ్వరరావు |
1950 | ఆహుతి | ప్రేమయే జనన మరణ లీల | రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల | సాలూరు రాజేశ్వరరావు |
1950 | ఆహుతి | పున్నమి వచ్చినదీ పొంగినదీ జలధీ | రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల | సాలూరు రాజేశ్వరరావు |
1953 | కన్నతల్లి | ఇదే ఇదే సరాగం ఇదే కదా అనురాగం | కె.రాణి, ఎ.ఎం.రాజా | పెండ్యాల నాగేశ్వరరావు |
1953 | కన్నతల్లి | ఎంత మంచిదానవోయమ్మ నీదెంత వింత విధాన | ఘంటసాల | పెండ్యాల నాగేశ్వరరావు |
1953 | కన్నతల్లి | ఎందుకు పిలిచావెందుకు ఈలవేసి సైగచేసి | పి.సుశీల, ఎ.ఎం.రాజా | పెండ్యాల నాగేశ్వరరావు |
1953 | కన్నతల్లి | కొమ్మనే ముద్దుగుమ్మనే పరివంపు | పసుమర్తి కృష్ణమూర్తి,లలిత బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1953 | కన్నతల్లి | చూచావా ఆ చివరికదే నోచావా చేసిన త్యాగం తగిలిన | ఘంటసాల | పెండ్యాల నాగేశ్వరరావు |
1953 | కన్నతల్లి | డేగలాగ వస్తా తూరీగ లాగ వస్తా నే ఊగి తూగి వస్తా | కె.రాణి | పెండ్యాల నాగేశ్వరరావు |
1953 | కన్నతల్లి | సాంబసదాశివ సాంబసదాశివ.. సారములేని | మాధవపెద్ది బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1953 | పెంపుడు కొడుకు | అందములన్ని నీవేరా ఆనందములన్ని మావేరా అపురూపంగా | పి.లీల | సాలూరు రాజేశ్వరరావు |
1953 | పెంపుడు కొడుకు | ఇంత దేశం ఇంత సౌఖ్యం కొందరికే సొంతమా ఎక్కడైనా | ఎ.ఎం.రాజా, జిక్కి | సాలూరు రాజేశ్వరరావు |
1953 | పెంపుడు కొడుకు | ఉన్నవారికే అన్ని సుఖాలు రయ్యో రయ్యో లేనివారి గతి ఈ లోకంలో | జిక్కి | సాలూరు రాజేశ్వరరావు |
1953 | పెంపుడు కొడుకు | చిన్నారి చిటిపాపా కన్నారి కనుపాప ఇన్నాళ్ళు పెరిగి ఈనాటితోనే | ఎ.పి.కోమల | సాలూరు రాజేశ్వరరావు |
1953 | పెంపుడు కొడుకు | నమో నమో మాతా నమో నమో మాతా నమో | మాధవపెద్ది బృందం | సాలూరు రాజేశ్వరరావు |
1953 | పెంపుడు కొడుకు | విరోధమేలనే సొగసులాడి ఇటు రావే నా సరైన జోడీ నీవే | ఎ.ఎం.రాజా | సాలూరు రాజేశ్వరరావు |
1953 | పెంపుడు కొడుకు | సన్నజాజి తోటల మల్లెపూల బాటల కోయిలే పాడుకదా కుహూ | జిక్కి | సాలూరు రాజేశ్వరరావు |
1953 | పెంపుడు కొడుకు | సరదాగా జల్సాగా అందరము మనమందరము ప్రతిరోజు | ఎ.ఎం.రాజా బృందం | సాలూరు రాజేశ్వరరావు |
1955 | ఆడబిడ్డ | గాలిమేడలేనా నా జీవితాశలు నా నోముల లోపమో | రావు బాలసరస్వతీ దేవి | టి.వి.రాజు |
1955 | ఆడబిడ్డ | రంగులు మార్చే రంగేళి హంగులు చేసే సింగారి | కె. రాణి, పిఠాపురం | టి.వి.రాజు |
1955 | కన్యాదానం | మురళీధరుని ముఖము కంటినే మది మురసిపోయి | పి.లీల | నాగరాజయ్యర్, మాస్టర్ వేణు |
1955 | కన్యాదానం | వివేక మీయవే వినాయకా నవీన భావానంద నాయకా | నాగరాజయ్యర్, మాస్టర్ వేణు | |
1955 | బీదల ఆస్తి | రావో నా రాజా ఇదే ఇదే వేళ నీవు రాకుంటే నే తాళజాల | రోహిణి | టి.ఎ. కల్యాణం, నటరాజన్ |
1957 | అక్కాచెల్లెళ్లు | అనురాగమే నశించి అవమానమే దహించి నవనీత | ఘంటసాల | పెండ్యాల నాగేశ్వరరావు |
1957 | అక్కాచెల్లెళ్లు | చాటేల ఓ చందమామ కనుచాటేల ఓ చందమామ నీ ఆటేల | పి.సుశీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1958 | మాంగల్య బలం | ఆకాశవీధిలో అందాల జాబిలీ - వయ్యారి తారనుచేరి ఉయ్యాల లూగెనే సయ్యాటలాడెనే | ఘంటసాల, పి.సుశీల | మాస్టర్ వేణు |
1958 | మాంగల్య బలం | తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పరవశమై ఆడేనా హృదయం | పి.సుశీల | మాస్టర్ వేణు |
1958 | మాంగల్య బలం | పెను చీకటాయే లోకం చెలరేగే నాలో శోకం విషమాయె మా ప్రేమా విధియే పగాయే | ఘంటసాల, పి.సుశీల | మాస్టర్ వేణు |
1958 | మాంగల్య బలం | వాడిన పూలే వికశించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే | ఘంటసాల, పి.సుశీల | మాస్టర్ వేణు |
1958 | మాంగల్య బలం | హాయిగా ఆలూమగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బతకాలి | పి.సుశీల, ఉడుతా సరోజిని | మాస్టర్ వేణు |
1959 | సౌభాగ్యవతి | ముల్లోకములనేలి కరుణించి జ్ఞాన ధనమిచ్చి బ్రోచుదేవీ | పి.లీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1959 | సౌభాగ్యవతి | జగములనే పోషించి మనుజులను కాపాడే శక్తికిదే నమస్కారం | ఘంటసాల | పెండ్యాల నాగేశ్వరరావు |
1959 | సౌభాగ్యవతి | చేతన్ త్రిశూలమున్ నేత్రాల కరుణయున్ | పి.లీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1959 | సౌభాగ్యవతి | చిన్నారి పొన్నారి ఆడుకోవే చెలువారు నీపాట పాడుకోవే | జమునారాణి బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1959 | సౌభాగ్యవతి | పన్నగ భూషణా సద్యోవర ప్రదాతా | ఘంటసాల | పెండ్యాల నాగేశ్వరరావు |
1959 | సౌభాగ్యవతి | సింగార నేలవనే శివగామి తన్మగనే | టి.వి.రత్నం | పెండ్యాల నాగేశ్వరరావు |
1959 | సౌభాగ్యవతి | మాతా భవానీ మంగళ గౌరీ శంకరీ | పి.లీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1959 | సౌభాగ్యవతి | నిదురలో మెలుకువలో నిశ్చల దీక్షతో నిన్నే నిరతము కొలిచితినమ్మా | పి.లీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1959 | సౌభాగ్యవతి | ఓహో బలేధీరులే ఇలా బోనులేనే పడ్డారులే | జమునారాణి బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1959 | సౌభాగ్యవతి | పోటీకి వచ్చి మీరు మాటవింటారా పోరాటాలాడవచ్చి ఓడిపోతారా | జమునారాణి బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1959 | సౌభాగ్యవతి | చిన్నమామా చూపునేరమా బండ రాతి మనసు వానికే దొంగవేషమా | జమునారాణి | పెండ్యాల నాగేశ్వరరావు |
1961 | ఇంటికి దీపం ఇల్లాలే | వినుము చెలి తెలిపెదనే పరమరహస్యం అది మరి ఎవరు | పి.సుశీల | ఎమ్మెస్ విశ్వనాథన్, రామమూర్తి |
1961 | పెండ్లి పిలుపు | తెలుసుకో ఓ ఓ జవరాలా అలుకతో నో నో అనుటేల | పి.బి.శ్రీనివాస్ | కె. ప్రసాదరావు |
1961 | భార్యాభర్తలు | జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయిహాయిగా తీయతీయగా | ఘంటసాల | సాలూరు రాజేశ్వరరావు |
1961 | భార్యాభర్తలు | మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం | ఘంటసాల, పి.సుశీల | సాలూరు రాజేశ్వరరావు |
1961 | భార్యాభర్తలు | ఏమని పాడెదనో ఈ వేళ, మానసవీణ మౌనముగా నిదురించిన వేళా | పి.సుశీల | సాలూరు రాజేశ్వరరావు |
1961 | వెలుగునీడలు | ఓ రంగయో పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | ఘంటసాల, పి.సుశీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1961 | వెలుగునీడలు | కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు | ఘంటసాల | పెండ్యాల నాగేశ్వరరావు |
1961 | వెలుగునీడలు | పాడవోయి భారతీయుడా, ఆడిపాడవోయి విజయగీతికా నేడే స్వాతంత్ర్యదినం, వీరుల త్యాగఫలం | ఘంటసాల, పి.సుశీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1961 | వెలుగునీడలు | హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందుజల్లి నవ్వసాగే ఎందుకో | ఘంటసాల, పి.సుశీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1961 | వెలుగునీడలు | చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు, చేరి మనం ఆడేపాడే పండుగరోజు | పి.సుశీల, స్వర్ణలత | పెండ్యాల నాగేశ్వరరావు |
1961 | వెలుగునీడలు | చల్లని వెన్నెల సోనలు, తెల్లని మల్లెల మాలలు, మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు | పి.సుశీల, జిక్కి | పెండ్యాల నాగేశ్వరరావు |
1966 | శ్రీమతి | తమాషాలకే కోపాలా బావా కులాసాల వేళా రోషాలు | ఎస్.జానకి | శ్రీ నిత్యానంద్ |
1967 | భువనసుందరి కథ | ఎవరికైనా ఎన్నడైన తెలియరానిది దైవము ఏది ఎందుకు ఎటుల | ఘంటసాల | ఘంటసాల |
1968 | పంతాలు పట్టింపులు | ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా | ఘంటసాల | పెండ్యాల నాగేశ్వరరావు |
1968 | పంతాలు పట్టింపులు | ఆటా పాటల కృష్ణు డెంతవాడే యశోదా నీకొడుకు | ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి | పెండ్యాల నాగేశ్వరరావు |
1968 | పంతాలు పట్టింపులు | తైయ్యతై తైయ్యతై ..నమో నమో నటరాజా | బి.గోపాలం | పెండ్యాల నాగేశ్వరరావు |
1968 | పంతాలు పట్టింపులు | నాగరికత లేనిదానా నాజూకే లేనిదాన | పి.సుశీల, ఎస్.జానకి బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1968 | పంతాలు పట్టింపులు | నేటిదా ఒక నాటిదా సిరులకొరకు సాగేటి పోటి దేవ దానవుల | పి.సుశీల, బి.గోపాలం బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1968 | పంతాలు పట్టింపులు | పరువపు సొగసరి పిలిచే (అగజానన పద్మార్కం పద్యం తో ) | పి.సుశీల, బి.గోపాలం | పెండ్యాల నాగేశ్వరరావు |
1968 | పంతాలు పట్టింపులు | రామ రామ శ్రీరామ దయామయ రాక్షస భంజన | పట్టాభి బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1969 | మనుషులు మారాలి | చీకటిలో కారుచీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏదరికో ఏదెసకో | ఘంటసాల | కె.వి.మహదేవన్ |
1969 | మనుషులు మారాలి | తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయరాగం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | కె.వి.మహదేవన్ |
1969 | మనుషులు మారాలి | పాపాయి నవ్వాలి పండుగే రావాలి మా యింట కురవాలి పన్నీరు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | కె.వి.మహదేవన్ |
1969 | మనుషులు మారాలి | అమ్మా అమ్మా కనుమూశావా .. మోసం ద్వేషం నిండిన లోకం | ఘంటసాల | కె.వి.మహదేవన్ |
1969 | మనుషులు మారాలి | చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో | ఘంటసాల | కె.వి.మహదేవన్ |
1969 | మనుషులు మారాలి | మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి తరతరాలుగా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | కె.వి.మహదేవన్ |
1969 | మనుషులు మారాలి | సత్యమే దైవమని అహింసయే పవిత్ర ధర్మమని (పద్యం) | ఘంటసాల | కె.వి.మహదేవన్ |
1970 | శ్రీదేవి | గుండుమల్లె చెండుచూసి గుండెలోనే పొంగురేపి | జి.కె.వెంకటేష్, రమోలా | జి.కె.వెంకటేష్ |
1976 | కొల్లేటి కాపురం | ఇద్దరమే మనమిద్దరమే ఇద్దరమే | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | కొల్లేటి కాపురం | అంబా పరాకు దేవి పరాకు | గోపాలం, ఎస్.కె.రవి, సి.విజయలక్ష్మి బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | కొల్లేటి కాపురం | ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం ముప్పేటల తెలుగువారి | గోపాలం, ఎస్.జానకి | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | కొల్లేటి కాపురం | ఎల్లారే నల్లమాను హైలెస్సా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, అనుపమ, విల్సన్ బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | కొల్లేటి కాపురం | ఎవ్వారే యవ్వా ఎవ్వరే యవ్వా ఇనుకోవే గువ్వా | ఎస్.కె.రవి, సి.విజయలక్ష్మి బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | కొల్లేటి కాపురం | ఏలేమాలి ఏటిమీన ఓరుగాలి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, విల్సన్, సి.విజయలక్ష్మి బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | కొల్లేటి కాపురం | చీలిపోయెను మనసులు చెదరి పోయెను ( పద్యం ) | పూర్ణచంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | కొల్లేటి కాపురం | తప్పు తప్పు తప్పు అదిగో అదే తప్పు | ఎస్.జానకి, ఎస్.కె.రవి | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | కొల్లేటి కాపురం | నాచు కప్పియు రామ్యమే నళిన ( పద్యం ) | పూర్ణచంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | కొల్లేటి కాపురం | సత్యమే నిత్యమూ సిద్దన్నా సర్వమూ తెలిసెను | ఎస్.కె.రవి | పెండ్యాల నాగేశ్వరరావు |
డాక్టర్ చక్రవర్తి | మనసున మనసై | |||
ఇద్దరు మిత్రులు | హలో హలో ఓ అమ్మాయి | |||
ఆరాధన | నా హృదయంలో నిదురించే చెలి | |||
అల్లూరి సీతారామరాజు | తెలుగువీర లేవరా |