మీలాదె నబి

(మౌలీద్ నుండి దారిమార్పు చెందింది)

మౌలిద్ (అరబ్బీ :مولد) లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల 'రబీఉల్-అవ్వల్' 12వ తేదీన వస్తుంది.

మౌలిద్, లాహోర్ పాకిస్తాన్

మౌలిద్ అనునది సాధారణంగా జన్మదినోత్సవం కొరకు వాడుతారు. ఈజిప్టు, దక్షిణాసియాలో ఇది సర్వసాధారణపదం. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే.

మౌలిద్ అనేపదం అరబ్బీ మూల పదం' ولد ' ( వల్ద్ ), అనగా 'జన్మనిచ్చు' 'సృష్టించు'. సమకాలీన వ్యవహారంలో 'మౌలిద్' 'మీలాద్-ఉన్-నబి' కు ప్రతిరూపం.[1]

దీనికి ఇతరపేర్లు క్రింది విధంగానూ వున్నాయి :

  • మౌలిద్ అన్-నబి (బహువచనం. అల్-మౌలీద్) - ముహమ్మద్ ప్రవక్త జయంతి. (అరబ్బీ)
  • మీలాద్ అన్-నబి - మహమ్మద్ ప్రవక్త జయంతి (అరబ్బీ / ఉర్దూ)
  • మవ్ లిద్ షరీఫ్ - ఆశీర్వదించ బడ్డ జన్మ (టర్కిష్)
  • మౌలూద్ షరీఫ్ - ఆశీర్వదించ బడ్డ జన్మ (ఉర్దూ)
  • జద్రుజ్-ఎ పయంబర్-ఎ ఆజమ్ / మీలాద్-ఎ నబీ-ఎ అక్రమ్ - మహాప్రవక్త గారి జన్మదినం (పర్షియన్)
  • ఈద్ అల్-మౌలిద్ అన్-నబవి - ముహమ్మద్ జన్మదిన పర్వం (అరబ్బీ)
  • ఈద్-ఎ-మీలాద్-ఉన్-నబీ - ముహమ్మద్ గారి జన్మదిన పండుగ (ఉర్దూ)
  • మౌలిద్ ఎన్-నబౌవి - అల్జీరియన్ (ఉత్తర ఆఫ్రికా)
  • యౌమ్ అన్-నబీ - ప్రవక్త గారి దినం (అరబ్బీ)
  • మౌలీదుర్-రసూల్ - వార్తాహరులవారి (ముహమ్మద్ ప్రవక్త) జన్మదినం (బహాసా మలేషియా / మలయ్)

ఇస్లామీయ కేలండర్ లోని రబీఉల్-అవ్వల్ నెల పన్నెండవతేదీన ఈ పర్వము వస్తుంది. ఇస్లామీయ కేలండరు చాంద్రమాన కేలండర్, దీనికి సరియగు గ్రెగోరియన్ కేలండర్ తేదీలు క్రింది ఇవ్వబడినవి.

2007-2013 లో మీలాద్ ఉన్ నబీ జరుపుకొను తేదీలు[2]
గ్రెగోరియన్ సంవత్సరం 12వ తేదీ, రబీఉల్ అవ్వల్
(సున్నీ ఇస్లాం) !
2007* మార్చి 31
2008 మార్చి 20
2009 మార్చి 9
2010 ఫిబ్రవరి 26
2011 ఫిబ్రవరి 15
2012 ఫిబ్రవరి 4
2013 జనవరి 24
2014 జనవరి 14
* ధృవీకరించడమైనది.
అన్ని భవిష్యత్తు తారీఖులు, గ్రెగోరియన్, ఇస్లామీయ కేలండర్ ననుసరించి ధృవీకరించబడినవి. కాని ఇవన్నియూ క్రొత్తనెల చంద్రవంక చూసినతరువాత మాత్రమే స్థిరీకరించబడుతాయి.

చరిత్ర

మార్చు

అబ్బాసీయ ఖలీఫా హారూన్ అల్-రషీద్ తల్లి 'అల్-ఖైజురన్', తన కాలంలో ఇస్లామీయ ప్రవక్త యగు ముహమ్మద్ యొక్క జన్మతిథిని పునస్కరించుకొని, మౌలీద్ షరీఫ్ (ప్రవక్త జయంతి ఉత్సవాలు) ప్రారంభించింది. ముహమ్మద్ ప్రవక్త జన్మించిన ఇంటిని, ఖైజురన్, ఓ ప్రార్థనాలయంగా మార్పు చేసింది.[3] ముహమ్మద్ ప్రవక్త పరమదించిన నాలుగు శతాబ్దాలవరకూ, జన్మదినోత్సవాన్ని ఎవరూ జరుపుకున్నట్లు ఆధారాలు లభించలేదు. తరువాతనే ఇవి ఈజిప్టులో ఆరంభమైనవి.[3][4] ఫాతిమిద్ ఖలీఫాల కాలంలో, వీరు, ముహమ్మద్ ప్రవక్త కుమార్తె యగు ఫాతిమా జహ్రా వంశస్థులు, వీరు మొదట 'మీలాదె నబీ' ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు, సూఫీ తరీఖాలకు అనుగుణంగా వుండేవి.[5][5][6] ఈ ఉత్సవాలు, దిన సమయాన జరుపుకునేవారు.[7] ఈ ఉత్సవాలలో అహలె బైత్ (ముహమ్మద్ ప్రవక్త వంశస్థులు) కు, ప్రధాన ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఖురాన్ను పఠించేవారు, ఇతర సాంప్రదాయక కార్యక్రమాలు నిర్వహించేవారు.[7]

చరిత్రలో సున్నీ ముస్లిం లలో మొదటి ఉత్సవాలు 12వ శతాబ్దం సిరియాలో నూరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగాయి. అదే విధంగా స్పెయిన్, మొరాకో లోనూ జరిగాయి.[8] అయ్యూబీల కాలంలో, తాత్కాలికంగా ఆపబడినవి. ఇవి కుటుంబాల ఉత్సవాలుగా మారాయి.[9] కాని సలాహుద్దీన్ అయ్యూబీ బావయైన ముజఫ్ఫరుద్దీన్ ఆధ్వర్యంలో తిరిగీ అధికారికంగా 1207 ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో 'మౌలీద్' లేదా 'మీలాద్' ఉత్సవాలు ఆరంభమైనవి.[5][6] ఈ ఉత్సవాలు ప్రపంచమంతటా వ్యాపించినవి. ఈజిప్టు లోని కైరో నగరానికీ వ్యాపించినవి. ఉస్మానియా ఖలీఫాయగు మురాద్ 3 కాలంలో ఉస్మానియా సామ్రాజ్యం లోకి ఇవి 1588 లో ప్రవేశించాయి.[3][10] 1910, లో ఉస్మానియా సామ్రాజ్యంలో, జాతీయ పర్వంగా ప్రకటింపబడింది. అనేక దేశాలలో కూడా మీలాద్, అధికారికంగా గుర్తింపబడింది.[3]

ఉత్సవాలు - విధానము

మార్చు
దస్త్రం:Maulidur Rasul - Putrajaya.jpg
మలేషియా లోని ముస్లింలు మీలాదెనబి పర్వదినాన్ని "మౌలీద్-ఎ-రసూల్"గా జరుపుకుంటారు. మలేషియా నగరం పుత్రజయ, లో ఉత్సవ దృశ్యం.

మీలాదె నబి జరుపుకునే సాంప్రదాయం లో, మస్జిద్ లను అలంకరిస్తారు, మీలాద్ లను జరుపుకునే ప్రదేశాలను, మీలాద్ ఘర్ లనూ అలంకరిస్తారు. ముహమ్మద్ ప్రవక్త ప్రాశస్తాన్ని, జీవనగాధను, జీవనశైలి గురించి వర్ణిస్తారు. ఖసీదా బుర్దా (ముహమ్మద్ ప్రవక్త శ్లాఘన) లను పఠిస్తారు. దైవమార్గంలో ధనాన్ని ఇతరవస్తువులను ఖర్చు చేస్తారు. పిండి వంటకాలను తయారుచేసి పంచిపెడతారు. నాత్ క్వానీ (నాత్ లను పఠించడం లేదా రాగయుక్తంగా పాడడం) సర్వసాధారణం.[11][12]ఉల్లేఖన లోపం: <ref> ట్యాగుకు, మూసే </ref> లేదు. [13] [14] [15][16] ప్రపంచ నలుమూలలలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు.[17] సౌదీ అరేబియా దేశంలో మీలాదెనబి పండుగకు జాతీయ శెలవుగా ప్రకటించలేదు.[18]

మౌలిద్ పఠనాలు

మార్చు

జన్మదినోత్సవాన్ని మౌలీద్ అంటారు, అలాగే ముహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా, వీరి ప్రాశస్తాన్ని గాన రూపంలోనూ పాడతారు. ఈ పాటలనీ "మౌలీద్" అని అంటారు.[19] ఈ మౌలీద్ లలో ప్రవక్తగారి జీవనం గూర్చి విపులంగా వివరిస్తారు. అందులో క్రింది విషయాలు వుంటాయి:[19]

  1. ముహమ్మద్ ప్రవక్త పూర్వీకులు
  2. ముహమ్మద్ ప్రవక్త
  3. ముహమ్మద్ ప్రవక్త గారి జననం
  4. హలీమా (దాయి) గురించి
  5. బెదూయిన్ తెగల మధ్య ముహమ్మద్ ప్రవక్త గారి బాల్యం
  6. అనాథగా ముహమ్మద్ ప్రవక్త
  7. అబూతాలిబ్ యొక్క కారవాన్ లతో ముహమ్మద్
  8. ఖదీజాతో వివాహం
  9. ఇస్రా మేరాజ్
  10. హిరా గుహ, ప్రథమ సందేశం
  11. ఇస్లాంలో ప్రథమ ప్రవేశాలు
  12. హిజ్రత్ లేదా మదీనాకు వలస
  13. ప్రవక్త గారి మరణం

అలాగే అనేక రకాలుగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో ఈ ఉత్సవాలు పలు రకాలుగా జరుపుకుంటారు. ఆయా ప్రాంతాలలోని సభ్యతా సంస్కృతుల రీతులు కానవస్తాయి.

ఇవీ చూడండి

మార్చు

నోట్స్

మార్చు
  1. Mawlid. Reference.com
  2. Islamic Holy Days Archived 2008-02-19 at the Wayback Machine. Moonsighting.com
  3. 3.0 3.1 3.2 3.3 "Mawlid (a.), or Mawlud", Encyclopedia of Islam
  4. Kaptein (1993), p.29
  5. 5.0 5.1 5.2 "Mawlid", Encyclopedia Britannica
  6. 6.0 6.1 Schussman (1998), p.216
  7. 7.0 7.1 Kaptein (1993), p.30
  8. "Festivals and Commemorative Days", Encyclopedia of the Qur'an
  9. Celebrating the Prophet's Birthday Archived 2011-02-11 at the Wayback Machine. Fatwa by former head of Al-Azhar Fatwa Committee.
  10. Schussman (1998), p.217
  11. Festivals in India
  12. Pakistan Celebrate Eid Milad-un-Nabi (SAW) with Religious Zeal, Fervor Archived 2007-12-14 at the Wayback Machine. Pakistan Times. 2007-04-02.
  13. Buildings of London
  14. "Js Board". Archived from the original on 2007-12-17. Retrieved 2008-02-23.
  15. "Sunni society U.K". Archived from the original on 2001-02-25. Retrieved 2008-02-23.
  16. "Canadian Mawlid". Archived from the original on 2007-10-09. Retrieved 2008-02-23.
  17. BBC - Religion & Ethics - Milad un Nabi
  18. "Moon Sighting". Archived from the original on 2018-12-25. Retrieved 2008-02-23.
  19. 19.0 19.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Knappert అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

మూలాలు

మార్చు
  • Schussman, Aviva (1998). "The Legitimacy and Nature of Mawid al-Nabi: (Analysis of a Fatwa)". Islamic Law and Society. 5 (No. 2): 214–234. {{cite journal}}: |issue= has extra text (help)
  • Kaptein, N.J.G. (1993). Muhammad's Birthday Festival: Early history in the Central Muslim Lands and Development in the Muslim West until the 10th/16th Century. Leiden: Brill.
  • "Mawlid". Encyclopædia Britannica. Encyclopaedia Britannica, Inc. 2007.
  • Fuchs, H; Knappert J (2007). "Mawlid (a.), or Mawlud". In P. Bearman; Th. Bianquis; C.E. Bosworth (eds.). Encyclopedia of Islam. Brill. ISSN 1573-3912.
  • Kaptein, N.J.G (2007). "Mawlid". In P. Bearman; Th. Bianquis; C.E. Bosworth; E. van Donzel; W.P. Heinrichs (eds.). Encyclopedia of Islam. Brill.

ఇతర పఠనాలు

మార్చు
  • Malik, Aftab Ahmed (2001). The Broken Chain: Reflections Upon the Neglect of a Tradition. Amal Press. ISBN 0954054407.

బయటి లింకులు

మార్చు