సరైనోడు
సరైనోడు 2016లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని బోయపాటి శ్రీను అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటీంచాడు. ఈ సినిమాకి తమన్ యస్ సంగీతాన్ని సమకూర్చాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రెసా ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు కాగా కూర్పు కోటగిరి వెంకటేశ్వర రావు.
సరైనోడు | |
---|---|
దర్శకత్వం | బోయపాటి శ్రీను |
స్క్రీన్ ప్లే | బోయపాటి శ్రీన |
కథ | బోయపాటి శ్రీన |
నిర్మాత | అల్లు అరవింద్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | రిషి పంజాబీ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | గీతా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 22 ఏప్రిల్ 2016 | 11 May 2017 (Hindi release date)
సినిమా నిడివి | 160 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹50 crore[1] |
బాక్సాఫీసు | ₹127 crore[2] |
కథ
మార్చుగన (అల్లు అర్జున్) ఎక్స్ మిలిట్రీ. బోర్డర్ లో కన్నా సమాజంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని మిలిట్రీ వదిలేసి వచ్చిన గన, హైదరాబాద్లో తన కుటుంబంతో ఉంటూ, అన్యాయాలను, అక్రమాలను ఎదిరించటమే పనిగా పెట్టుకుంటాడు. గన మీద ప్రేమతో పిల్లలు కూడా వద్దనుకున్న బాబాయ్ శ్రీపతి (శ్రీకాంత్) ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. హర్షితా రెడ్డి (కేథరీన్) ముఖ్యమంత్రి కూతురు. తండ్రి హత్య అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. తనను చూసి ప్రేమలో పడతాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత అంగీకరిస్తుంది. అలా ఎమ్మెల్యే హర్షితా రెడ్డి (క్యాధరిన్ ధ్రిసా)ని ఒప్పించి తన ప్రేమను పెళ్ళి దాకా తీసుకువెళ్తున్న సమయంలో అతన్ని వెతుక్కుంటూ మహాలక్ష్మి (రకుల్ ప్రీతి సింగ్) వస్తుంది. వచ్చి తనను కాపాడమంటుంది. మహాలక్ష్మి పెద్ద ప్రమాదంలో ఉంటుంది. ఆమెను వెంట తరుముతూ వచ్చిన రౌడీలను గన కొట్టి, ఆమెని కాపాడతాడు.
జరిగింది వివరించే క్రమంలో, మహాలక్ష్మి ఓ పల్లెటూరికి చెందిన యువతి అనీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో పనిచేస్తూ, ప్రజల కోసం ఉద్యోగాన్ని వదిలివేసి జనం మధ్య పనిచేస్తున్న జయప్రకాష్ లేక జేపీ (సాయికుమార్) ఆమె తండ్రి అనీ తెలుస్తుంది. ధనుష్ (ఆది పినిశెట్టి) ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన తన తండ్రిని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతూ ఎందరినో హింసిస్తుంటాడు. ఆ క్రమంలో అక్రమంగా రైతుల భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూంటే జేపీ అడ్డుపడతాడు. అతడిని భయపెట్టేందుకు అతని కుమార్తె మహాలక్ష్మిని తన అనుచరులతో కిడ్నాప్ చేయిస్తాడు. గన తండ్రికి, జేపీకి ఉన్న స్నేహం వల్ల వారిద్దరూ వియ్యమందుదామని, గనని పెళ్ళిచూపులకు పంపుతాడు అతని తండ్రి. ఇదే సమయంలో అక్కడ మహాలక్ష్మిని కిడ్నాప్ చేశారని తెలుసుకున్న గన కిడ్నాప్ చేసినవారందరినీ కొట్టి, తప్పు ఒప్పించి ఆమెని తీసుకువస్తాడు. ఆపైన ఆమెని పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదనీ, అమ్మాయికి తాను నచ్చలేదని తన తండ్రికి చెప్పమనీ చెప్పి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసిన ధనుష్ ఆగ్రహోదగ్రుడై ఊరంతటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుని జేపీనీ, ముఖ్యులను చంపి, మిగతా ఊరిని తన కనుసన్నల్లోనే ఉంచుకుని, మహాలక్ష్మినీ, ఆమెను కాపాడిన గననీ చంపించేందుకు మనుషులను పంపుతాడు. తప్పించుకున్న మహాలక్ష్మి గనను కలుసుకోవడానికి రోజుల పాటు పరుగెత్తుకుని హైదరాబాద్‌లో గన ఇంటికి వచ్చి చేరుకుంటుంది.
గన ఆమె సమస్యలను తీర్చడానికి నిశ్చయించుకుంటాడు. ధనుష్ ఇంటికి వెళ్ళి, అతని అనుచరులను కొట్టి, అతన్ని సజీవదహనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ధనుష్ తప్పించుకుంటాడు. గన ఈ దాడి చేశాడా అని ప్రశ్నించినా లేదని, వేరెవరో చేసివుంటారని తప్పించుకుంటాడు. ధనుష్ అనుచరుల్లో ఒకరు ధనుష్ ఊరిలో చేసిన దురాగతాల గురించి చెప్పడంతో మీడియా అతని గురించి వ్యతిరేక కథనాలతో ఆగ్రహం వ్యక్తంచేస్తుంది.
డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫీసుకు లొంగిపోతానని వచ్చిన ధనుష్, అనూహ్యంగా డిజిపి మల్లికార్జున్ (సుమన్)ని కాలుస్తాడు. సాక్షి అయిన ఉమాపతి (జయప్రకాష్ రెడ్డి)ని కూడా చంపడానికి ప్రయత్నిస్తే, అతన్ని కాపాడే క్రమంలో శ్రీపతి కాల్పులకు గురవుతాడు. ముఖ్యమంత్రి ధనుష్ మిగిలినవారిని కాల్చకుండా ఆపి, ఉమాపతి ఫోన్ నుంచి గనతో మాట్లాడి అతను లొంగిపోవాలని అప్పుడే శ్రీపతిని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళనిస్తాడని చెప్తాడు. గన లొంగిపోగా ధనుష్, అతని మనుషులు దారుణంగా కొట్టి హింసిస్తారు. అప్పుడు ముఖ్యమంత్రి ధనుష్‌తో శ్రీపతిని చంపేయమని చెప్తాడు, ఈ చర్య గనను రెచ్చగొడుతుంది, ముఖ్యమంత్రిని, ఇతర అనుచరులను చంపేస్తాడు. గన ధనుష్‌తో పోరాడి, పారిపోవడానికి ప్రయత్నిస్తూండగా గొడ్డలితో చంపుతాడు.
ముఖ్యమంత్రి, ధనుష్‌లు డీజీపీని గుర్తుతెలియని దుండగుల బారి నుంచి కాపాడే ప్రయత్నంలో మరణించారని వార్త వస్తుంది. హన్సిత ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతుంది.
నటీనటులు
మార్చు- అల్లు అర్జున్ - గన
- ఆది పినిశెట్టి - వైరం ధనుష్
- రకుల్ ప్రీత్ సింగ్ - మహాలక్ష్మి
- కేథరిన్ థ్రెసా - హర్షితా రెడ్డి
- శ్రీకాంత్ - శ్రీపతీ
- బ్రహ్మనందం -
- జయప్రకాష్ రెడ్డి -
- అంజలి - ( "బ్లాక్ బాస్టర్" ఐటం సాంగ్‌లో నటించింది )
- ప్రదీప్ రావత్ - ఓబుల్
- విద్యుల్లేఖా రామన్
- జయప్రకాష్ - ఉమాపతి
- సురేఖ వాణి - పద్మ
- వినయ ప్రసాద్
పాటలు
మార్చుఈ సినిమాకు పాటలకు, నేపథ్య సంగీతానికీ తమన్ సారథ్యం వహించాడు. ఈ సినిమా ఆడియో 2016, ఏప్రిల్ 1వ తేదీన విడుదలయ్యింది.
సం. | పాట | పాట రచయిత | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అతిలోక సుందరి" | రామజోగయ్య శాస్త్రి, బన్నీ సురేష్ | విశాల్ దాడ్లని, కార్తీక్ | 4:15 |
2. | "యూ ఆర్ మై ఎమ్మెల్యే" | అనంత్ శ్రీరామ్ | ధనుంజయ్ | 4:34 |
3. | "ప్రయివేట్ పార్టీ" | కృష్ణ చైతన్య | మనాసి, విక్కి | 4:23 |
4. | "బ్లాక్ బస్టర్" | రామజోగయ్య శాస్త్రి | శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్, సిమ, శ్రీ కృష్ణ, దీపూ | 5:05 |
5. | "తెలుసా తెలుసా" | శ్రీ మణి | జుబిన్ నౌటియల్, సమీరా భరద్వాజ్ | 4:25 |
మొత్తం నిడివి: | 22:02 |
పురస్కారాలు
మార్చు- నంది పురస్కారాలు
- నంది ఉత్తమ ఆడియోగ్రాఫర్స్: రాధాకృష్ణ ఎస్కల
- ఉత్తమ నటుడు ( విమర్శకులు ) - అల్లు అర్జున్
- 2016 సైమా అవార్డులు
- ఉత్తమ సహాయనటుడు (శ్రీకాంత్)
విడుదల
మార్చుమొదట ఈ సినిమాను ఏప్రిల్ 8, 2016 న విడుదల చేయాలని అనుకున్నారు. చివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2016, ఏప్రిల్ 22 న థియేటర్లలో విడుదలైంది.
వసూళ్ళు
మార్చుఈ చిత్రం రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా మూడు వారాల్లోనే 101 కోట్లు వసూలు చేసింది . మొత్తంగా 127 కోట్ల వసూలు చేసింది.
మరిన్ని
మార్చుఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి 2017 మే 28 న యూట్యూబ్‌లో ఉంచారు. సినిమా మొత్తం డబ్ చేసినా, టైటిల్‌ను మాత్రం `సరైనోడు`గానే ఉంచేశారు. తెలుగు టైటిల్‌తోనే హిందీ సినిమాను విడుదల చేశారు. అదే విధంగా యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన భారతీయ సినిమాగా `సరైనోడు` నిలిచింది. ఈ సినిమాను రమారమి 14.6 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు మరే భారతీయ సినిమాకు ఇంత స్థాయిలో వ్యూస్ రాలేదు.
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Hooli, Shekhar H (22 April 2016). "'Sarainodu' (Sarrainodu) movie review by audience: Live update". IBTIMES.
- ↑ "Sarainodu 'Sarainodu' (Sarainodu) total worldwide box office collection: Allu Arjun's film grosses Rs. 127 crore in its lifetime". International Business Times. Retrieved on 7 July 2016.