సర్వోత్తమ గ్రంథాలయం

సర్వోత్తమ గ్రంథాలయం విజయవాడలో కల ఒక పురాతన గ్రంథాలయం. సర్వోత్తమ భవన్ అనే దానిలో కల ఈ గ్రంథాలయం విజయవాడ పట్టణానికి బెంజ్ సర్కిల్ సమీపమున ఈనాడు ఆఫీసు ఎదురుగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, శాఖా గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ భవనం విజయవాడ

విషయ సూచిక

సర్వోత్తమ గ్రంథాలయం (విజయవాడ)
(SARVOTTAMA LIBRARY)
దేశముభారత దేశము
తరహాప్రైవేటు
ప్రదేశమువిజయవాడ
గ్రంధ సంగ్రహం / సేకరణ
గ్రంధాల సంఖ్య1,00,000

ప్రారంభ చరిత్ర

మార్చు

గ్రంథాలయ నిర్మాణ విశేషాలు

మార్చు
  • ఆంధ్ర గ్రంథాలయ ట్రస్టు

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి అనుబంధంగా 1946 వ సంవత్సరంలో ఆంధ్రగ్రంథాలయ ట్రస్టును ఏర్పాటు చేశారు. దీని స్థాపకులు పటమట వాస్తవ్యులు కీ.శే. శ్రీ కొమ్మా సీతారామయ్యగారు. వీరు సంఘమునకు స్థలం సేకరించడమే కాక స్థిర నివాసం ఏర్పాటుకు కూడా తోడ్పడ్డారు.

ట్రస్టు కార్యకలాపాలలో గ్రంథాలయ భవనముల నిర్మాణం, గ్రంథప్రచురణ, గ్రంథాలయ పుస్తకశాల నిర్వహణము ప్రధానమైనవి. ట్రస్టు ప్రచురించిన గ్రంథాలలో ప్రధానమైనవి శ్రీ గోటేటి జోగిరాజు గారి వ్యవసాయ విజ్ఞాన సంపుటములు, గాడిచెర్ల వారి వయోజన విద్యకు సంబంధించినవి. జోగిరాజుగారి గ్రామ సేవాగ్రంథమాలలోని 20 పుస్తకములతో పాటు పండ్ల దినుసుల నిల్వ చేయుట, వ్యవసాయ శాస్త్ర ప్రథమ పాఠములు, పాడిపరిశ్రమ, కోళ్ళ పెంపకంతో కలుపుకుని 19 సంవత్సరానికి 41 పుస్తకాలు ప్రచురించింది ఆంధ్ర గ్రంథాలయ ట్రస్టు. వీటితోపాటు హరిసర్వోత్తమరావుగారి శ్రీరామ చరిత్రము, సర్వోత్తమ అక్షరాభ్యాస పటములను ప్రచురించింది. ట్రస్టు పక్షాన సర్వోత్తమ భవనం, పైన బాపూజీ మందిరంతోపాటు, కార్యకర్తల నివాసానికి జోగిరాజు భవనం, రామినేని అచ్యుతరావు సదనాలను నిర్మించారు.

  • సర్వోత్తమ భవనం :

సంఘం స్థాపించి ఎంతో కాలమైనా, 1938 వ సంవత్సరం నాటికి దీనికి స్వంత భవనంగాని, స్థలంగాని లేవు. పటమటలంక వాస్తవ్యలు శ్రీ కొమ్మా సీతారామయ్యగారు ఈ లోటును పూరించారు.1939లో సంఘం క్రింద ఒక ఎకరం స్థలం ఖరీదు చేశారు. అలాగే గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారి షష్టిపూర్తి ఉత్సవాలను ముందుగా తామే నిర్వహించి వారికి కానుకగా నగదు సమర్పించి, మరికొన్ని తావులలో కూడా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసి ఆ రకంగా లభ్యమయిన మొత్తాన్ని భవన నిర్మాణానికి వినియోగించారు. ఇంకా దాతల నుండి విరాళాలను సేకరించి, చేతి సొమ్ము కొంత వెచ్చించి రూ. 25 వేలతో సర్వోత్తమ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి ఎర్పాటు చేశారు.

స్థాపనలో ప్రముఖులు

మార్చు

గ్రంథాలయం ద్వారా కార్యక్రమాలు

మార్చు

సందర్శించిన ప్రముఖులు, అభిప్రాయాలు

మార్చు

గ్రంథాలయ వార్షికోత్సవ వివారాలు

మార్చు

వసంతోత్సవాలు

మార్చు

స్వర్ణోత్సవాలు

మార్చు

వజ్రోత్సవాలు

మార్చు

అధ్యక్షుల జాబితా

మార్చు
  1. శ్రీ మోచర్ల రామచంద్రరావు 10-04-1914 నుండి 15-11-1919
  2. శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు 16-11-1919 నుండి 2-05-1923
  3. శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణయ్య 3-5-1923 నుండి ......
  4. శ్రీ బుర్రా శేషగిరిరావు 30-6-1931 నుండి 9-08-1933
  5. శ్రీ భూపతిరాజు సీతారామరాజు 10-8-1933 నుండి 19-1-1924
  6. శ్రీ వేమవరపు రామదాసు పంతులు 20-1-1934 నుండి 24-12-1934
  7. శ్రీ దాసు త్రివిక్రమరావు 25-12-1934 నుండి 14-3-1936
  8. శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు 15-3-1936 నుండి 29-2-1960
  9. శ్రీ కోదాటి నారాయణరావు 19-3-1960 నుండి 6-10-1979


ఇతర విశేషాలు

మార్చు
  • ఈ గ్రంథాలయంలో పుస్తకాలు తీసుకువెళ్ళి చదువుకొనే సౌకర్యం ఉంది. జీవిత చందా 300 రూపాయలు.

మూలాలు, వనరులు

మార్చు
వికీ ప్రాజెక్టు - తెలుగు గ్రంథాలయం
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. దీనిలో భాగంగా తెలుగు గ్రంథాలయం అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితాలను చేపట్టి అభివృద్ధి చేస్తున్నాము. ఈ క్రింది గ్రంథాలయాలలో గల పుస్తకాల వివరాలు జాబితా చేస్తూ క్రింది సంఖ్యా క్రమంలో చేర్చుతున్నాము.

అన్నమయ్యగ్రంధాలయంగౌతమీగ్రంధాలయంసూర్యరాయ గ్రంథాలయంవీరేశలింగగ్రంథాలయంసర్వోత్తమగ్రంథాలయం

సర్వోత్తమ గ్రంథాలయ పుస్తకాల జాబితా

01 - 02 - 03 - 04 - 05 - 06 - 07 - 08 - 09 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23 - 24 - 25 - 26 - 27 - 28 - 29 - 30 - 31 - 32 - 33 - 34 - 35 - 36 - 37 - 38 - 39 - 40