1945 భారత సార్వత్రిక ఎన్నికలు

బ్రిటిషు భారతదేశంలో డిసెంబరు 1945లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యులను ఎన్నుకోవడానికి సాధారణ ఎన్నికలు జరిగాయి. [2] ఎన్నికైన 102 సీట్లలో 57 గెలుచుకుని భారత జాతీయ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. [3] ముస్లిం లీగ్ అన్ని ముస్లిం నియోజకవర్గాలను గెలుచుకుంది, కానీ ఇతర స్థానాలను గెలుచుకోలేకపోయింది. మిగిలిన 13 స్థానాల్లో పంజాబ్‌లోని సిక్కు నియోజకవర్గాల్లో 8 యూరోపియన్లకు, 3 స్వతంత్ర అభ్యర్థులకు, 2 అకాలీ అభ్యర్థులకు దక్కాయి. [4] 1946లో జరిగిన ప్రాంతీయ ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలు జిన్నాకు, విభజనవాదులకూ వ్యూహాత్మక విజయంగా నిరూపితమయ్యాయి. కాంగ్రెస్ గెలిచినప్పటికీ, లీగ్ ముస్లిం ఓట్లను ఏకం చేసింది. అఖండ భారతదేశం అత్యంత అస్థిరంగా ఉంటుందని ఈ ఎన్నికలతో స్పష్టంగా తెలియడంతో ప్రత్యేక ముస్లిం మాతృభూమిని మరింత బలంగా కోరుకునే శక్తిని లీగ్ పొందింది.

1945 భారత సార్వత్రిక ఎన్నికలు
← 1934 1945 డిసెంబరు 1951 (భారత్)
1970 (పాకిస్తాన్) →

102 ఎన్నుకునే స్థానాలు
52 seats needed for a majority
  First party Second party
 
Leader అబుల్ కలామ్ ఆజాద్[1] ముహమ్మద్ అలీ జిన్నా
Party కాంగ్రెస్ ఆలిండియా ముస్లిం లీగ్
Seats won 57 30
Seat change Increase 15 Increase 30


తదుపరి ప్రభుత్వం

తాత్కాలిక భారత ప్రభుత్వం
సంకీర్ణ ప్రభుత్వం

ఎన్నికైన సభ్యులు తరువాత భారత రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు.

బ్రిటిషు భారతదేశంలో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికలు ఇవి. తరువాతి ఎన్నికలు భారతదేశంలో 1951-52 లోను, పాకిస్థాన్‌లో 1970 లోనూ జరిగాయి.

నేపథ్యం

మార్చు

1945 సెప్టెంబరు 19న, వైస్రాయ్ లార్డ్ వేవెల్ కేంద్ర, ప్రాంతీయ శాసనసభలకు 1945 డిసెంబరు నుండి 1946 జనవరి వరకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించాడు. ఈ ఎన్నికల తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని, రాజ్యాంగ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తామని కూడా అతను ప్రకటించాడు.[2][5]

భారత ప్రభుత్వ చట్టం 1935 అఖిల భారత సమాఖ్యను ప్రతిపాదించినప్పటికీ, రాజరిక సంస్థానాలు దానిలో చేరడానికి సుముఖంగా లేవని ప్రభుత్వం భావించినందున అది జరగలేదు. పర్యవసానంగా, 375 మంది సభ్యులను ఎన్నుకోకుండా, 102 సీట్లను మాత్రమే భర్తీ చేయాల్సి వచ్చింది. అందువల్ల కేంద్ర శాసనసభ ఎన్నికలు భారత ప్రభుత్వ చట్టం 1919 నిబంధనల ప్రకారం జరిగాయి.

ఫలితాలు

మార్చు

సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ

మార్చు
PartySeats
Congress57
Muslim League30
Akali Dal2
Europeans8
Independents5
Total102
మూలం: Schwartzberg Atlas

ప్రావిన్స్ వారీగా సభ్యత్వం

మార్చు
ప్రావిన్స్ యూరోపియన్లు స్వతంత్ర చిన్న పార్టీలు కాంగ్రెస్ (జనరల్
కాంగ్రెస్ (జనరల్ కానిది)
ముస్లిం లీగ్ మొత్తం
అస్సాం ? ? 1? 4
అజ్మీర్-మెర్వారా 1 1
బెంగాల్ 3 ? ? 5? 17
బీహార్, ఒరిస్సా ? ? 12
బొంబాయి 2 ? ? 2? 16
మధ్య ప్రాంతాలు ? ? ? 1? 6
ఢిల్లీ 1 1
మద్రాసు 1 ? ? ? 3? 16
నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ 1[6] 0 1
పంజాబ్ ? 2 (అకాలి దల్) ? 6 12
సింధ్ ? 3?
యునైటెడ్ ప్రావిన్సులు 1 ? 0 ? ? 4? 16
మొత్తం 8 3 2 49[4] 10 30 102?

సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు

మార్చు

నామినేటెడ్ సభ్యులు

మార్చు

ఎన్నికైన సభ్యులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు
  • భారత తాత్కాలిక ప్రభుత్వం

మూలాలు

మార్చు
  1. "Indian National Congress: From 1885 till 2017, a brief history of past presidents". indianexpress.com. Archived from the original on 14 May 2021. Retrieved 6 June 2022.
  2. 2.0 2.1 Vohra, Ranbir (19 December 2012). The Making of India: A Political History. M.E. Sharpe. p. 176. ISBN 9780765629852.
  3. "-- Schwartzberg Atlas -- Digital South Asia Library". dsal.uchicago.edu.
  4. 4.0 4.1 "-- Schwartzberg Atlas -- Digital South Asia Library". dsal.uchicago.edu.
  5. Sen, S. N. (1997). History of the Freedom Movement in India (1857-1947). New Age International. p. 317. ISBN 9788122410495.
  6. History Modern India, S. N. Sen ISBN 8122417744