1996 వేసవి ఒలింపిక్ క్రీడలు

1996లో అట్లాంటాలో జరిగిన క్రీడలు

1996లో 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని అట్లాంటాలో జరిగాయి. ఇవి ఒలింపిక్ క్రీడల యొక్క శత ఉత్సవాలు కావడం గమనార్హం. 1896లో తొలి ఒలింపిక్ క్రీడలను నిర్వహించిన ఎథెన్స్ మళ్ళీ 1996లో కూడా శతవార్షిక క్రీడలను నిర్వహించాలను పట్టుపట్టిననూ ఆ కోరిక నెరవేరలేదు. 1990 సెప్టెంబర్లో జరిగిన ఓటింగ్‌లో అట్లాంటా నగరం ఎథెన్స్, బెల్‌గ్రేడ్, మాంచెస్టర్, మెల్బోర్న్, టొరంటో నగరాలను ఓడించి ఈ క్రీడల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 2000, జూలై 19న ప్రారంభమైన ఈ క్రీడలు ఆగష్టు 9 వరకు వైభవోపేతంగా జరిగాయి. మొత్తం 197 దేశాల నుంచి 10,320 క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకున్నారు. నిర్వహణ దేశమైన అమెరికా 44 స్వర్ణాలతో పాటు మొత్తం 101 పతకాలను సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ప్రథమ స్థానంలో నిలిచింది.

అట్లాంటా ఒలింపిక్ స్టేడియంలో మహిళల 100మీ. హార్డిల్స్ పోటీ దృశ్యం

అత్యధిక పతకాలను సాధించిన దేశాలు

మార్చు

26 క్రీడలు, 271 క్రీడాంశాలలో పోటీలు జరుగగా అమెరికా క్రీడాకారులు 44 క్రీడాంశాలలో ప్రథమ స్థానం పొంది బంగారు పతకాలను సాధించిపెట్టారు. ఆ తరువాతి స్థానం రష్యాకు దక్కింది. ఆసియా ఖండం తరఫున చైనా ప్రథమస్థానంలో ఉంది. మొత్తంపై 16 స్వర్ణాలతో నాలుగవ స్థానం పొందింది. అమెరికా ప్రక్కన్ ఉన్న చిన్న దేశం క్యూబా 9 స్వర్ణాలతో 8వ స్థానం పొందినది.

స్థానం దేశం స్వర్ణ పతకాలు రజత పతకాలు కాంస్య పతకాలు మొత్తం
1 అమెరికా 44 32 25 101
2 రష్యా 26 21 16 63
3 జర్మనీ 20 18 27 65
4 చైనా 16 22 12 50
5 ఫ్రాన్స్ 15 7 15 37
6 ఇటలీ 13 10 12 35
7 ఆస్ట్రేలియా 9 9 23 41
8 క్యూబా 9 8 8 25
9 ఉక్రేయిన్ 9 2 12 23
10 దక్షిణ కొరియా 7 15 5 27

క్రీడలు

మార్చు

అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్ స్థానం

మార్చు

టెన్నిస్కు చెందిన యువకిశోరం లియాండర్ పేస్ ఒక్కడే కాంస్యపతకం సాధించి భారత్కు పతకాల పట్టికలో స్థానం కల్పించాడు. పర్గత్ సింగ్ నాయకత్వంలోని హాకీజట్టు పూర్తిగా చివరన 8వ స్థానం పొందినది. మిగితా క్రీడాకారులు పతకాలకు అందనంత దూరంలో నిలిచారు. పతకాలు సాధించిన 79 దేశాలలో ఒకే ఒక్క కాంస్య పతకం సాధించిన 9 దేశాలతో పాటు భారత్ కూడా సంయుక్తంగా చిట్టచివరి 71వ స్థానాన్ని పొందినది.

ఇవి కూడా చూడండి

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు

మార్చు