అదా శర్మ
అదా శర్మ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
అదా శర్మ, ప్రముఖ భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది ఆమె. తన స్కూలు చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతే కాక, ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. ఆ తరువాత ఆమె హిందీలోనే హసే తో పసే (2014) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆమె తెలుగులో ఐదు సినిమాలు చేసింది. ఆమె తెలుగులో నటించిన హార్ట్ అటాక్ (2014), సన్నాఫ్ సత్యమూర్తి (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), గరం (2016), క్షణం (సినిమా) సినిమాలు విజయం సాధించాయి. ఆమె 2015లో రాణా విక్రమ అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి హిట్ అవడమే కాక, ఆమె నటనకు ప్రశంసలు కూడా లభించడం విశేషం.
ఈ సినిమాలు విజయవంతం కావడం, ఆమె నటన ప్రేక్షకులకు నచ్చడంతో ఆమె తెలుగులో హీరోయిన్ గా నిలదొక్కుకుంటోంది.[1]
తొలినాళ్ళ జీవితం, చదువు
మార్చుఅదా కేరళలోని పాలక్కాడ్ లోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. కానీ మహారాష్ట్రలోని ముంబైలో పెరిగింది. ఆమె తండ్రి తమిళనాడులోని మధురైకి చెందినవారు. వర్తక నావికాదళంలో కెప్టెన్ గా పనిచేశారు. ఆమె తల్లి పాలక్కాడ్ కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారిణి. ముంబై బాంద్రాలోని పాలీ హిల్ లో ఉన్న ఆగ్జిలియం కాన్వెంట్ హై స్కూలులో చదువుకుంది అదా శర్మ.[2] ఆమె పదవ తరగతి చదువుకునేటప్పుడే తాను నటి కావాలని అనుకునేది. ఆమె చదువు మానేసి, సినిమాల్లోకి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ కనీసం స్కూలు చదువు అయినా పూర్తి చేయమని తల్లిదండ్రులు చెప్పడంతో[3] ఇంటర్ వరకూ చదువుకుని అపేసింది.[4] 2023లో, శర్మ తీసిన వివాదాస్పద చిత్రం ''ది కేరళ స్టోరీ'' బాక్సాఫీసు వద్ద హిట్ అయింది, అయితే సోషల్ మీడియా శర్మ యాస పేలవంగా ఉందని వైరల్ చేసింది
Filmography
మార్చుసంవత్సరం | చలన చిత్రం | పాత్ర | సహ నటులు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
2008 | 1920 | లిసా సింగ్ రాతొడ్ | రాజ్నీష్ దుగ్గల్ | హిందీ | ఫిలిం ఫేర్ ఉత్తమ తొలి చిత్ర నటి-ప్రతిపాదించబడ్దారు |
2011 | ఫిర్ | దిషా | హిందీ | ||
2013 | హమ్ హై రాహి కార్ కి | సంజనా మెహ్రా | దేవ్ గొయల్ | హిందీ | |
2014 | హార్ట్ అటాక్ | హయాతి | నితిన్ | తెలుగు | |
హసి తో ఫసి | కరిష్మా సొలంకి | సిద్దార్థ్ మల్హొత్రా | హిందీ | ||
2015 | సన్నాఫ్ సత్యమూర్తి | పల్లవి కొలసాని | అల్లు అర్జున్ | తెలుగు | |
రాణా విక్రమ | పారు | పునీత్ రాజ్‌కుమార్ | కన్నడ | ||
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ | దుర్గా | సాయి ధరమ్ తేజ్ | తెలుగు | ||
2016 | గరం | సమీరా | ఆది | తెలుగు | |
క్షణం | స్వేతా | అడివి శేష్ | తెలుగు | ||
ఇధు నమ్మ ఆలు \ తెలుగులో సరసుడు | శింబు | తమిళం | అతిథి పాత్ర | ||
2017 | కమాండొ 2 | భవనా రెడ్డి | విద్యుత్ జమ్వాల్ | హిందీ | |
2022 | మీట్ క్యూట్ | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ M. Srinivas. "'I am luckier than my contemporaries'". The Hindu. Retrieved 12 మే 2015.
- ↑ "Adah Sharma Biography". One India. Archived from the original on 27 ఏప్రిల్ 2014. Retrieved 23 మార్చి 2014.
- ↑ "The success of Hasee toh phasee has put 1920 girl Adah Sharma firmly in the spotlight". The Telegraph. Retrieved 12 మే 2015.
- ↑ "I have roots in Kerala: Adah Sharma". The Times of India. Retrieved 12 మే 2015.