అల్వాల్ (అల్వాల్ మండలం)

(అల్వాల్ (మల్కాజ్‌గిరి) నుండి దారిమార్పు చెందింది)

అల్వాల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలంలోని గ్రామం.[1]

అల్వాల్
—  రెవెన్యూ గ్రామం  —
పాత అల్వాల్ సరస్సు దృశ్యం.
పాత అల్వాల్ సరస్సు దృశ్యం.
పాత అల్వాల్ సరస్సు దృశ్యం.
అల్వాల్ is located in తెలంగాణ
అల్వాల్
అల్వాల్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°29′52″N 78°30′31″E / 17.497697°N 78.508580°E / 17.497697; 78.508580
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
మండలం అల్వాల్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది హైదరాబాదు పొరుగు ప్రాంతం.రాష్ట్రంలోని జిల్లాల పునర్య్వస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉంది.గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో విలీనం కావడానికి మున్సిపాలిటీగా ఉంది.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు మార్చు

లోగడ అల్వాల్  గ్రామం/పట్టణ ప్రాంతం లోగడ రంగారెడ్డి జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలోని మల్కాజ్‌గిరి మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా అల్వాల్ పట్టణ ప్రాంతాన్ని (1+09) పది పట్టణ ప్రాంతాలతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

దేవాలయాలు మార్చు

  • అల్వాల్ లో ప్రసిద్ధిచెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.

టిమ్స్ ఆసుపత్రి మార్చు

అల్వాల్ పరిధిలో 28.41 ఎక‌రాల్లో జీ ప్ల‌స్ 5 అంత‌స్తుల్లో వెయ్యి ప‌డ‌క‌ల మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి 2022 ఏప్రిల్ 26న మధ్యాహ్నం 1 గంటకు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు భూమిపూజ చేశాడు. 897 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌లో వెయ్యి ప‌డ‌క‌లను (300 ఐసీయూ బెడ్స్), 26 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు టి. హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనేమతరావు, వివేకానంద గౌడ్, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, ఇతర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.[2][3]

గ్రామ ప్రముఖులు మార్చు

  1. చింతల వెంకట్ రెడ్డి: సేంద్రియ వ్యవసాయదారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత.[4]
  2. చల్లా శ్రీనివాస్, సినీ విమర్శకుడు, నందీ అవార్డు విజేత
  3. రోహిత్ వక్రాల,సామాజిక-రాజకీయ కార్యకర్త, విశ్లేషకుడు, విధాన ఔత్సాహికుడు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "CM KCR: హైదరాబాద్‌లో టిమ్స్‌ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్‌ భూమి పూజ". EENADU. 2022-04-26. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
  3. telugu, NT News (2022-04-26). "అల్వాల్ టిమ్స్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ‌". Namasthe Telangana. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
  4. సాక్షి, తెలంగాణ (27 January 2020). "మట్టి మనిషి.. మహాకృషి". Sakshi. Archived from the original on 27 జనవరి 2020. Retrieved 25 April 2020.

వెలుపలి లంకెలు మార్చు