బ్రహ్మచారి
బ్రహ్మచర్యం పాటించే వ్యక్తిని బ్రహ్మచారి అంటారు. మనస్సూ, శరీరం ఆరోగ్యంగా ఉంచి ఉన్నత శిఖరాలకు అధిరోహింపజేసేది బ్రహ్మచర్యం. కనుకనే మానవులు ఆచరింపవలసిన చతుర్విధ కర్మలలో బ్రహ్మచర్యాన్ని మొదట చెబుతారు. బ్రహ్మచర్యం స్త్రీ పురుష సంబంధానికి మాత్రమే చెందినది కాదు. బ్రహ్మచర్యమనేది ఒక జీవన విధానం. తమ ఎనిమిదో ఏట ఆచార్యుని ఉపదేశం పొందినప్పటి నుంచి బాలకుల్ని బ్రహ్మచారులుగా, బాలికలని బ్రహ్మచారిణులుగా పిలుస్తారు. వారు గురుకులంలో ఉన్న మొదటి మూడు రోజులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. బ్రహ్మచర్యాశ్రమంలో అమ్మాయి బాగా చదువుకొని యువావస్థను పొందిన తర్వాతే యువకుణ్ణి వివాహమాడాలి. అబ్బాయి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి, సుశీల అయిన యువతిని వివాహమాడాలి.
బ్రహ్మచారి దినచర్య కఠినమైనది. అతడు సూర్యోదయానికి తర్వాతగానీ, సూర్యాస్తమయానికి ముందుగానీ నిద్రించరాదు. బ్రహ్మచర్యం ఎనిమిదో ఏట మొదలై వివాహం వరకు ఉంటుంది. ఈ కాలంలో విద్యాబోధన ప్రధాన కార్యక్రమంగా ఉంటుంది. విద్యలో గొప్పవాడై సమాజానికి ఉపయోగపడే విధంగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యం సమయంలో ఇంద్రియ నిగ్రహం కావాలి. అందుకు తగ్గటు ఆహారాది నియమాలను పాటించాల్సి ఉంటుంది. బ్రహ్మచర్య సమయంలో ఆరోగ్యవంతంగా, శక్తివంతంగాను, పుష్టిగానూ ఉండాలి. తల్లి, తండ్రి, ఆచార్యుడు ఎంత కష్ట స్థితిలో ఉన్నా వారిని ఆదుకోవాలిగానీ వారిని నిందించరాదు. ఆచార్యుడు బ్రహ్మకు ప్రతిరూపం. బ్రహ్మ ఏవిధంగా తన శిష్యులకు వేదాన్ని బోధించాడో, అదే విధంగా ఆచార్యుడు వేదోపదేశం చేస్తాడు కాబట్టి అతడిని బ్రహ్మలాగా గౌరవించాలి. తల్లి తనను నవమాసాలు గర్భంలో ధరించి రక్షిస్తుంది కనుక ఆమెను పృథ్విలాగా గౌరవించాలి. ఆచార్యునితో పాటు తల్లితండ్రులకు బ్రహ్మచారులెప్పుడూ ప్రియమే ఆచరించాలి. వారు ముగ్గురూ సంతోషిస్తే బ్రహ్మచారి దీక్ష ఫలించినట్లే.
కొన్ని విశేషాలు
మార్చు- డాక్టర్ అబ్దుల్ కలాం తాను పెళ్ళి చేసుకోకపోటానికి చెప్పిన కారణం : ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు.
- శాస్త్రములో నిషేధము లేదు కాబట్టి, ఆడవాళ్లు సన్యాసము తీసుకోవడం తప్పు కాదు - రమణ గీత 13:8
- ముక్తి, జ్ఞానములో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి తేడాలేదు కాబట్టి, సన్యాసిని చనిపోయిన తరువాత శవాన్ని బూడిద చెయ్యకూడదు - అది పవిత్రమయిన గుడితో సమానం. - రమణ గీత 13:9
- హిందూ క్రైస్తవ స్త్రీలకు నన్స్, బ్రహ్మకుమారీ పద్ధతులున్నాయి గానీ ముస్లిం స్త్రీలకు ఇలాంటి ఏర్పాట్లు లేవు. ముస్లిం స్త్రీ కచ్చితంగా పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి.
- అవివాహిత మహిళకు ఆమె కుటుంబానికి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిలో సమాన వాటాహక్కు ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
కార్తికేయుని కథ
మార్చుకార్తికేయుడు శివ పార్వతుల కుమారుడు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లితో ఆడుకుంటున్నాడు. ఆటలో అతడు దాని ముఖము మీద గిల్లాడు. ఆట అవగానే అతడు తన తల్లి పార్వతి దగ్గరకు వెళ్ళాడు. అతనికి తన తల్లి బుగ్గ మీద గిల్లిన గాయం కనిపించింది. అప్పుడతడు "అమ్మా నీ బుగ్గ మీద ఆ గాయమేమిటి, ఎంత పెద్ద దెబ్బతగిలిందమ్మా, అసలెలా తగిలింది " అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, "నువ్వే కదా నాయనా గిల్లావు" అని సమాధానము చెప్పింది. కార్తికేయుడు నివ్వెరపోయి "అమ్మా, నిన్ను నేనెప్పుడు గిల్లాను?నాకేమి గుర్తులేదే" అని అన్నాడు. అప్పుడు పార్వతి "నాయనా ఈ రోజు వుదయము నువ్వు ఆ పిల్లిని గిల్లావు మరచిపోయావా" అని అడిగింది. కార్తికేయుడు, "అది నిజమే!మరి నేను ఆ పిల్లిని గిల్లితే నీ బుగ్గ మీద ఎందుకు గాయమయ్యింది?" అని అడిగాడు. అప్పుడు ఆ జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో తానెప్పటికి పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించినపుడు తను ఎవరిని పెళ్ళాడగలడు, అందువలన కార్తికేయుడు బ్రహ్మచారిగా జీవితాంతము వుండి పోయాడు.
ప్రముఖ భారతీయ బ్రహ్మచారులు
మార్చు- డాక్టర్ అబ్దుల్ కలాం (మాజీ రాష్ట్రపతి) :
- అటల్ బిహారి వాజపేయి (మాజీ ప్రధాని) :
- స్వామి వివేకానంద
- అరబిందో
- మాయావతి (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి)
- ఉమాభారతి (మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి)
- రతన్ టాటా లక్షరూపాయల నానో కారు నిర్మాత
- మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు
- సాధ్వి రితంబర
- లతా మంగేష్కర్
- నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి
- జస్టిస్ ధరమ్వీర్ శర్మ అయోధ్య వివాదంలో తీర్పునిచ్చిన జడ్జి
- ఎస్.ఆర్.శంకరన్ ఐ.ఏ.యస్.అధికారి
- అన్నా హజారే
- న్రిపేన్ చక్రవర్తి Nripen Chakraborty త్రిపుర ముఖ్యమంత్రి
- నవీన్ పట్నాయక్ ఒడిషా ముఖ్యమంత్రి
- జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి
- రాహుల్ గాంధీ
ప్రముఖ తెలుగు బ్రహ్మచారులు
మార్చు- జిడ్డు క్రిష్ణమూర్తి , భారతీయ తత్వవేత్త
- పింగళి నాగేంద్రరావు (తెలుగు సినిమా పాటల రచయిత)
- కట్టమంచి రామలింగారెడ్డి, బహుముఖ ప్రజ్ఞాశాలి
- నటరాజ రామకృష్ణ నాట్యాచార్యుడు
- కొత్తపల్లి జయశంకర్ తెలంగాణా సిద్ధాంతకర్త
- వావిలాల గోపాలకృష్ణయ్య
- మైలవరపు గోపి
- తీపలపూడి ఏసన్న
- భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి
- ఫాదర్ లూయిజీ ఫెజ్జోనీ
- షేక్ అబ్దుల్లా రవూఫ్
పెళ్ళిచేసుకోని నటీమణులు,గాయనీమణులు
మార్చు- శ్రీరంగం గోపాలరత్నం
- పర్వీన్ బాబీ హిందీ నటి
- ఆషా పరేక్ హిందీ నటి
- నదీరా హిందీ నటి
- సురయ్యా హిందీ నటి, గాయని
- జయలలిత (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)
- కోవై సరళ
- కాంచన
- సుస్మితా సేన్
- శోభన
- పువ్వుల లక్ష్మీకాంతం
- కె.జమునారాణి
- రజిత (తెలుగు సినీ నటి, ఈశ్వరీయ బ్రహ్మకుమారి)
- సిల్క్ స్మిత
- షకీలా
పెళ్ళిచేసుకోని నటులు
మార్చుఉన్నత అధికారులు ,సంఘ సేవకులు
మార్చు- కె.సుజాతారావు ఐ.ఏ.ఎస్.
- నీలిమా మిశ్రా మెగసెసే అవార్డు గ్రహీత
కొందరు ప్రపంచ ప్రసిద్ధ ఆజన్మ-బ్రహ్మచారులు
మార్చు- అటల్ బిహారి వాజ్ పాయ్ భారత మాజీ ప్రధాని
- ఆడంస్మిత్ ఆర్థికశాస్త్రవేత్త
- ఆండ్రి ది జైంట్, మల్లయోధుడు
- ఆంటోనియో పోర్చుగీసు నియంత
- వివాల్డి సంగీతకారుడు
- బాల్ఫోర్ బ్రిటీష్ ప్రధాని
- ఎడ్ కోచ్ న్యూయార్క్ మేయర్
- ఎడ్వర్డ్ హీత్ బ్రిటీష్ ప్రధాని
- జార్జ్ ఈస్ట్ మన్ కోడాక్ ఫిల్మ్ కంపనీ నిర్మాత.
- స్పెన్సర్ ఇంగ్లీష్ తత్వవేత్త
- న్యూటన్ శాస్త్రవేత్త
- హూవర్ ఎఫ్.బి.ఐ.డైరెక్టర్
- బుచానన్ పెళ్ళిచేసుకోని ఏకైక అమెరికా అధ్యక్షుడు
- ఏసుక్రీస్తు క్రైస్తవమతస్తుల ఆరాధ్యుడు
- పౌలు క్రైస్తవమత స్థాపకుడు
- ఉలమనిస్ లాట్వియా మొదటి ప్రధాని
- ప్లేటో గ్రీకు తత్వవేత్త
- బెన్నెట్ కెనడా ప్రధాని
- జాన్ సన్ అమెరికా ఉపాధ్యక్షుడు
- రాబర్ట్ షుమాన్ ఐరోపా యూనియన్ స్థాపకుడు
- విలియం మెకంజీ కెనడా ప్రధాని
మూలాలు
మార్చుఇతర లింకులు
మార్చు- Cole, David. "Note on Analyticity and the Definability of 'Bachelor'." Philosophy Department of the University of Minnesota Duluth. 1 February 1999.