అ ఆ ఇ ఈ (అతను ఆమె ఇంతలో ఈమెకు సంక్షిప్తం) శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో 2009లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో శ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా ప్రముఖ పాత్రలను పోషించగా అలీ, కోవై సరళ, కృష్ణ భగవాన్, కవిత, హేమ మొదలైన వారు ఇతర పాత్రలలో నటించారు. 2011లో ఈ సినిమా హిందీ భాషలో దిల్‌జలె ది బర్నింగ్ హార్ట్ పేరుతో పునర్మించబడింది.[1][2][3]

అ ఆ ఇ ఈ
దర్శకత్వంశ్రీనివాసరెడ్డి
నిర్మాతబొద్దం అశోక్ యాదవ్
తారాగణంశ్రీకాంత్
మీరా జాస్మిన్
సదా
ఛాయాగ్రహణంవిజయ్ సి కుమార్
కూర్పుగౌతంరాజు
సంగీతంఎం.ఎం.శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
శ్రీ కల్పన ఆర్ట్స్
విడుదల తేదీ
6 నవంబర్ 2009
దేశంభారతదేశం
భాషతెలుగు

చంద్రం, కళ్యాణి అన్యోన్యమైన దంపతులు. గర్భవతి ఐన కళ్యాణికి ఒక అరుదైన వ్యాధి ఉందని తెలిసి దాని చికిత్స కోసం 8 లక్షల రూపాయలు అవసరమౌతుంది. ఆ డబ్బులకోసం చనిపోయిన రమ్యకు భర్తగా నటిస్తాడు. కానీ చనిపోయిందని భావించిన రమ్య బ్రతికి వస్తుంది. చంద్రం కళ్యాణి, రమ్యల మధ్య చిక్కుకుపోతాడు. తరువాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరుగాయకుడు(లు) నిడివి
1. "కాశీకి పోయాను"  సునిధి చౌహాన్  
2. "మిలమిల"  మనో, ఎస్.జానకి  
3. "పుప్పొడికన్నా"  ఉదిత్ నారాయణ్, ప్రణవి  
4. "ఎంత నరకం"  కార్తీక్, ఎం.ఎం.శ్రీలేఖ  
5. "అచ్చట ముచ్చట"  కార్తీక్, ఎం.ఎం.శ్రీలేఖ  

మూలాలు

మార్చు
  1. "A Aa E Ee (2009)". 123telugu.com. Retrieved 3 May 2015.
  2. "A aa e ee (Anthalo aame inthalo eeme) film review - Telugu cinema Review - Srikanth, Meera Jasmin, Sada".
  3. https://movies.fullhyderabad.com/a-aa-e-ee/telugu/a-aa-e-ee-movie-reviews-3269-2.html

బయట లింకులు

మార్చు