ఇంట్లో దెయ్యం నాకేం భయం

జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 2016లో తెలుగు భయానక చలనచిత్రం

ఇంట్లో దెయ్యం నాకేం భయం 2016, డిసెంబరు 30న విడుదలైన తెలుగు భయానక చలనచిత్రం.[3] శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి[4] పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో జి. నాగేశ్వరరెడ్డి[5][6] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, కృతిక జయకుమార్, మౌర్యాని, రాజేంద్ర ప్రసాద్[7] ప్రధాన పాత్రల్లో నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[8]

ఇంట్లో దెయ్యం నాకేం భయం
ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా పోస్టర్
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
రచనడైమండ్ రత్నబాబు (మాటలు)
స్క్రీన్ ప్లేజి. నాగేశ్వరరెడ్డి
కథజి. నాగేశ్వరరెడ్డి
నిర్మాతబివిఎస్ఎన్ ప్రసాద్
తారాగణంఅల్లరి నరేష్
కృతిక జయకుమార్
మౌర్యాని
రాజేంద్ర ప్రసాద్
ఛాయాగ్రహణందాశరథి సివేంద్ర
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
30 డిసెంబరు 2016 (2016-12-30)[1]
సినిమా నిడివి
130 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశం

మార్చు

నరేష్ (అల్లరి నరేష్) బ్యాండ్ మేళం ట్రూపుకి యజమాని. మొదటి చూపులోనే ఇందుమతి (కృతిక జయకుమార్)ను ఇష్టపడిన నరేష్, ఆమె కష్టాల్లో ఉన్నదని తెలిసి ఆమెకు సహాయంచేసి అప్పుల్లో ఇరుక్కుంటాడు. ఇదే సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోవున్న దెయ్యం, ఆ ఇంట్లో జరగాల్సిన పెళ్లిని ఆపేస్తుంటుంది. ఆ విషయం తెలుసుకున్న నరేష్ ఆ దెయ్యాన్ని తరిమేయడంకోసం 10 లక్షల రూపాయల కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి స్నేహితులతో సహా ఇరుక్కుపోతాడు. తన మరదలు స్వప్న దెయ్యంగా మారిందని నరేష్ తెలుసుకుంటాడు. ఆ దెయ్యం వల్ల తన ప్రేమనే వదులుకోవాల్సి పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నరేష్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అసలు స్వప్న దెయ్యంగా ఎందుకు మారింది, తన ప్రేమ ఫలించిందా లేదా అన్నది మిగతా కథ.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
ఇంట్లో దెయ్యం నాకేం భయం
సినిమా by
Released28 అక్టోబరు 2016 (2016-10-28)
Recorded2016
Genreపాటలు
Length14:08
Labelజంగ్లీ ఆడియో
Producerసాయి కార్తీక్
సాయి కార్తీక్ chronology
ద్వారక
(2016)
ఇంట్లో దెయ్యం నాకేం భయం
(2016)
అప్పట్లో ఒకడుండేవాడు
(2016)

సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు జంగ్లీ ఆడియో ద్వారా విడుదలయ్యాయి.[9]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."పడ్డాను ఇందుమతి (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్ధనుంజయ్3:06
2."శతమానం భవతి (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్రేవంత్, హరిణి ఇవటూరి2:55
3."అయ్యాను నేనే ఫిదా (రచన: రవి ములకలపల్లి)"రవి ములకలపల్లిసాయి చరణ్, సాయా శిల్ప3:00
4."డబ్బాయి డబ్బాయి (రచన: చిలక రెక్క గణేష్)"చిలక రెక్క గణేష్సింహ, దివిజ కార్తీక్3:13
5."జో అచ్యుతానంద (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్సాయి గీతిక1:44
మొత్తం నిడివి:14:08

మూలాలు

మార్చు
  1. "Intlo Deyyam Nakem Bhayam (Release Date)". 123 Telugu.com.
  2. "Intlo Deyyam Nakem Bhayam (Overview)". Now Running.com. Archived from the original on 2019-12-07. Retrieved 2020-01-28.
  3. The Hindu, Entertainment (30 December 2016). "Intlo Deyyam Nakem Bhayam: Runs out of fuel soon". Srivathsan Nadadhur. Archived from the original on 27 November 2017. Retrieved 31 January 2020.
  4. "Intlo Deyyam Nakem Bhayam (Banner)". greatandhra.com.
  5. "Intlo Deyyam Nakem Bhayam (Direction)". Mirchi-9.
  6. సాక్షి, సినిమా (4 November 2016). "నరేశ్ కథల ఏటీఎం - దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి". Retrieved 31 January 2020.
  7. "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-30.
  8. "Intlo Deyyam Nakem Bhayam (Music)". FullNFinal. Archived from the original on 2017-01-01. Retrieved 2020-01-30.
  9. "Intlo Deyyam Nakem Bhayam (Songs)". Saavn.com.

ఇతర లంకెలు

మార్చు