ఉర్దూ ప్రముఖులు
ఉర్దూ ప్రముఖులు : ఉర్దూ భాష సాహిత్యానికి, భాష పురోగతికీ, విశేషంగా కృషి సల్పినవారు.
ఉర్దూ ప్రముఖులు
మార్చు- మౌల్వి అబ్దుల్ హఖ్‌కు బాబా ఎ ఉర్దూ అనే బిరుదు ఉంది.
- అమీర్ ఖుస్రో ఉర్దూ భాషకు గ్రాంధికంగాను, వ్యావహారికంగాను ఖ్యాతిని తెచ్చి పెట్టాడు.
- మహమ్మద్ వలీ దక్కని ప్రథమ ఉర్దూ కవి. దక్షిణ భారత దేశాని (దక్కన్) కి చెందినవాడు.
- మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజులలో ప్రప్రథమంగా ఉర్దూ కవితా గ్రంథము గల్గినవాడు.
- బహాదుర్ షా జఫర్ మొఘల్ పరిపాలకులలో ఆఖరి వాడు. ఉర్దూ భాషా పారంగతుడు.
- ఇబ్రాహీం జౌఖ్ ఉర్దూ కవి. బహాదుర్ షా జఫర్ గురువు.
- ఇక్బాల్‌కు షాయర్ ఎ మష్రిఖ్ అనే బిరుదు గలదు.
- మీర్ తఖి మీర్ గజల్ పితామహుడు.
- గాలిబ్ ఉర్దూ కవితా జగతులో తన ప్రగాఢ ముద్రను వేశాడు.
- అల్తాఫ్ హుసేన్ హాలి ఉర్దూ సాహిత్యకారుడు, కవి, రచయిత.
- మౌలానా హస్రత్ మోహాని
- రఘుపతి సహాయ్ ఫిరాఖ్ గోరఖ్ పూరి ఉర్దూభాషలో జ్ఞానపీఠ్ అవార్డును పొందిన ప్రథముడు.
- ముహమ్మద్ ఇక్బాల్ సారే జహాఁసె అఛ్ఛా హిందూస్తాఁ హమారా గేయ రచయిత.
- మోమిన్ ఖాన్ మోమిన్ భారతీయ గజల్ కవి.
- గోపిచంద్ నారంగ్, పద్మభూషణ్ గ్రహీత
- మౌలానా హస్రత్ మోహాని, ఉర్దూ భాషలో శృంగార కవి.
- మగ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు.
- ఫైజ్ అహ్మద్ ఫైజ్, అభ్యుదయ భావాలు కలిగిన ఉర్దూ కవి.
- బ్రజ్ నారాయణ్ చక్ బస్త్, కాశ్మీర్‌కు చెందిన ఉర్దూ పండితుడు. హోమ్ రూల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.
- గుల్జార్ దెహ్లవి, ఉర్దూ కవి, పాత్రికేయుడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
- బర్ఖ్ కడపవి, అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన ఆంధ్రప్రదేశ్ కడపకు చెందిన ఉర్దూ కవి.
- ఆశారాజు, రాజా హైదరాబాదీ కలం పేరుతో ఉర్దూ కవిత్వం చెప్పాడు.
- కాళోజీ రామేశ్వరరావు, ఉర్దూ కవి, ప్రజా సేవకుడు. ఇతని కలం పేరు షాద్.
- కవి రాజమూర్తి, ఉర్దూ నవలాకారుడు. తెలంగాణ పేరుతో ఉర్దూ పత్రికను నడిపాడు.
- మిర్జా హాది రుస్వా, లక్నోకు చెందిన ఉర్దూ కవి.
- జిలానీ బానో, ఉర్దూ రచయిత్రి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- అజీజ్ బెల్గామీ, దక్షిణభారత ఉర్దూ కవి.
- ప్రేమ్‌చంద్, హిందీ ఉర్దూ రచయిత, కవి.
- షకీల్ బదాయూనీ, సినీ గేయరచయిత.
- రామ్ ప్రసాద్ బిస్మిల్, స్వాతంత్ర్య సమరయోధుడు.
- మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, స్వాతంత్ర్య సమరయోధుడు.
- హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు.
- ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ రచయిత్రి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- సాదత్ హసన్ మంటో, ఉర్దూ కథా రచయిత.