ఎం.ఆర్. రాజాకృష్ణన్

కేరళ రాష్ట్రానికి చెందిన సినిమా సౌండ్ డిజైనర్

మేడయిల్ రాధాకృష్ణన్ రాజాకృష్ణన్ కేరళ రాష్ట్రానికి చెందిన సినిమా సౌండ్ డిజైనర్. తమిళం, హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళ సినిమాలకు పనిచేశాడు. 2018లో వచ్చిన రంగస్థలం సినిమాకు 2019లో ఉత్తమ ఆడియోగ్రఫర్ గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. 2011లో ఉరుమి, చప్పా కురిష్ సినిమాల ఆడియో మిక్సింగ్‌కు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును, 2013లో మంచాడికురు సినిమాకు కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మంచిడికురు, పెరల్ అవార్డును గెలుచుకున్నాడు.

ఎం.ఆర్. రాజాకృష్ణన్
జననం (1977-05-25) 1977 మే 25 (వయసు 46)
వృత్తిసినిమా సౌండ్ డిజైనర్
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమంజు
పిల్లలుగౌరీ పార్వతి
తల్లిదండ్రులు
  • ఎంజి రాధాకృష్ణన్
  • పద్మజ

జననం, విద్య మార్చు

రాజాకృష్ణన్ 1977 మే 25న కేరళలోని త్రివేండ్రంలో జన్మించాడు. తండ్రి ఎంజి రాధాకృష్ణన్ మలయాళ సినిమారంగంలో ప్రసిద్ధ సంగీత దర్శకుడు, కర్ణాటక సంగీత విద్వాంసుడు. తల్లి పద్మజా రాధాకృష్ణన్ కళలు, సాహిత్యరంగంలో కృషి చేసింది. తాతయ్య మలబార్ గోపాలన్ నాయర్, నానమ్మ కమలాక్షి అమ్మ కూడా సంగీత విద్వాంసులు. బాబాయ్ ఎంజి శ్రీకుమార్ మలయాళంలో ప్రసిద్ధ గాయకుడు.[1]

తన మేనత్త, ప్రఖ్యాత కర్నాటక గాయకురాలు డాక్టర్. కె. ఓమనకుట్టి వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చకున్నాడు. మావేలికర కృష్ణంకుట్టి నాయర్, త్రిపుణితుర రాధాకృష్ణన్ మార్గదర్శకత్వంలో మృదంగం కూడా నేర్చుకున్నాడు. అర్థశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత త్రిస్సూర్‌లోని చేతన స్టూడియోలో సౌండ్ డిజైనింగ్‌లో కోర్సు చేశాడు.

వృత్తిరంగం మార్చు

23 సంవత్సరాల వయస్సులో దీపన్ ఛటర్జీ దగ్గర అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశాడు. 2004లో జాతీయ అవార్డు పొందిన బలోతెక్కో (బెంగాలీ)తో సహా దాదాపు 70 సినిమాకు పనిచేశాడు. ఆ తర్వాత చెన్నైలోని ఫోర్ ఫ్రేమ్స్ సౌండ్ కంపెనీలో అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్‌గా చేరాడు. మలయాళంలో చాలామంది దర్శకులతో పనిచేశాడు. మలయాళం, హిందీ, తమిళం, కన్నడం, మరాఠీ, తెలుగు, బెంగాలీ వంటి వివిధ భాషలలో 200 సినిమాలకు పైగా సౌండ్ డిజైనింగ్, మిక్సింగ్ చేసాడు.

అవార్డులు మార్చు

  • రంగస్థలం సినిమాకు 2019 ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డు [2]
  • 2015: చార్లీ (మలయాళం) సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు[3]
  • 2013: చప్పా కురిష్, ఉరుమి[4] సినిమాలకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
  • 2013: మంచాడికురు (మలయాళం) సినిమాకు ఉత్తమ సౌండ్ డిజైన్‌గా పెర్ల్ అవార్డు
  • 2012: మంచాడికురు (మలయాళం) సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు
  • 2012: ఉరుమి సినిమాకు ఉత్తమ సౌండ్ డిజైనర్‌గా సూర్య టివి అవార్డు
  • 2011: ఉరుమి సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం రిపోర్టర్ ఛానల్ అవార్డు
  • 2011: ఉరుమి సినిమాకు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
  • 2006: కీర్తిచక్ర సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు
  • 2006: అనంతబద్రం సినిమాకు ఉత్తమ ఆడియోగ్రఫీకి అమృత ఫెర్టానిటీ అవార్డు

సినిమాలు మార్చు

సంవత్సరం భాష సినిమా పేరు అవార్డులు
2019

హిందీ కబీర్ సింగ్
కన్నడం అతడే శ్రీమన్నారాయణ
మలయాళం చిల్డ్రన్ పార్కు
ఎవరికి చెప్పొద్దు
కల్కి
కెత్తియోలను ఎంత మాలాఖా
మరక్కార్: అరేబియా సముద్ర సింహం
మార్గంకాళి
గ్యాంగ్స్ ఆఫ్ 18
ప్రతి పూవంకోజి
సత్యం పరంజ విశ్వసిక్కువో
తమిళం ఆదిత్య వర్మ
దేవి 2
కనులు కనులను దోచాయంటే
మెయి
నేర్కొండ పార్వై
తెలుగు డియర్ కామ్రేడ్
జార్జ్ రెడ్డి
ప్రెజర్ కుక్కర్
2018 మలయాళం బ్యాక్‌స్టేజర్
తమిళం అసురగురువు
తెలుగు రంగస్థలం నేషనల్ ఫిల్మ్ అవార్డ్ బెస్ట్ సౌండ్ మిక్స్
2017 మలయాళం ఎజ్రా
గోధా
జోమోంటే సువిశేషాంగల్
ఓరు మెక్సికన్ అపరత
టేకాఫ్
తమిళం విక్రమ్ వేద
2016 కన్నడం కిరిక్ పార్టీ
మలయాళం యాక్షన్ హీరో బిజు
గుప్పీ
హేయ్ పిల్లగాడ
తమిళం 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్
మో
ఓట్టతూధువన్-1854
సమ్ టైమ్స్
తరై తప్పట్టై
2015 మలయాళం అమర్ అక్బర్ ఆంటోనీ
చార్లీ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు
జో అండ్ ది బాయ్
కుంజీరామాయణం
మిలి
లార్డ్ లివింగ్‌స్టోన్ 7000 కండి
ప్రేమమ్
తమిళం 144
36 వయసులో
ఇదు ఎన్న మాయం
కాక ముట్టై
మయూరి
ఒరు నాల్ ఇరవిల్
2014 మలయాళం బెంగుళూరు డేస్
మిస్టర్ ఫ్రాడ్
ఓం శాంతి ఓషాణ
ఉన్నిమూలం
తమిళం కుకూ
జిగర్తాండ
ముండాసుపట్టి
శైవం
2013 మలయాళం 1983
ఎస్కేప్ ఫ్రమ్ ఉగాండా
ఎజు సుందర రాత్రికల్
గీతాంజలి
ఇమ్మానుయేల్
కలిమన్ను
ముంబై పోలీస్
నాడోడిమన్నన్
నేరం
పాపిలియో బుద్ధుడు
పుల్లిపులికలుమ్ అట్టింకుట్టియుమ్
రెడ్ వైన్
రోమన్స్
తీరా
తమిళం చెన్నైయిల్ ఒరు నాల్
ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమారా
పరదేశి
సూదు కవ్వుం
తలైవా
2012 మలయాళం 101 వెడ్డింగ్స్
అయలుమ్ నింజనుమ్ తమ్మిళ్
డైమండ్ నెక్లెస్
గ్రాండ్ మాస్టర్
మాస్టర్స్
పుతియా తీరంగల్
షట్టర్
స్పానిష్ మసాలా
తట్టతిన్ మరయతు
తీవ్రం
జనతా హోటల్
తమిళం మలై పోఝుతిన్ మాయకతిలాయ్
పిజ్జా
తాండవం
వేలాయుతం
2011 మలయాళం అరబియం ఒట్టకవుం పి మాధవన్ నైరుం
చప్పకురుష్ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు
కుంజలియన్
ట్రాఫిక్
ఉరుమి ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు
ఉత్తమ సౌండ్ డిజైనర్‌గా సూర్య టీవీ అవార్డు
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం రిపోర్టర్ ఛానల్ అవార్డు
తమిళం దైవతిరుమకల్
మయక్కమ్ ఎన్నా
2010 హిందీ ఆక్రోష్
మలయాళం కాక్టెయిల్
ఎల్సమ్మ ఏనా ఆనకుట్టి
మద్రాసు పట్టినం
2009 హిందీ దే ధనా ధన్
మరాఠీ సుఖంత్
మలయాళం నీలతామర
వింటర్ సంగీత స్వరకర్త
2008 హిందీ తహాన్
మలయాళం కలకత్తా న్యూస్
మంచాడికూరు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు
బెస్ట్ సౌండ్ డిజైన్‌కి పెరల్ అవార్డు
మిన్నమిన్నికొట్టం
ముల్లా
తమిళం కాంచీవరం
2007 హిందీ భూల్ భూలయ్య
కన్నడం ప్రారంభ
2006 మలయాళం అచ్చన్ ఉరంగత వీడు
క్లాస్‌మేట్స్
కీర్తిచక్ర ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు
తమిళం
మలయాళం అనంతభద్రం ఉత్తమ ఆడియోగ్రఫీకి అమృత ఫెర్టానిటీ అవార్డు
తమిళం నవరస

మూలాలు మార్చు

  1. "Early Life, Career". The Hindu.
  2. "National Awards 2019: Raja Krishnan on winning Best Audiography for Rangasthalam, and working on Nerkonda Paarvai-Entertainment News, Firstpost". 12 August 2019.
  3. "Charlie, Moideen bag top honours". The Hindu. 2 March 2016.
  4. "Raja of Sounds".