ఆచ్చి వేణుగోపాలాచార్యులు

(ఎ. వేణుగోపాల్ నుండి దారిమార్పు చెందింది)

ఆచ్చి వేణుగోపాలాచార్యులు (1930-2016) ప్రముఖ సినీ గీత రచయిత. తెలుగు సినిమారంగంలో ఎన్టీఆర్ సలహామేరకు వేణుగోపాల్ గా మార్చుకున్నారు.[1]

ఆచ్చి వేణుగోపాలాచార్యులు
జననం (1930-06-12) 1930 జూన్ 12 (వయసు 93)
మరణం2016 ఫిబ్రవరి 15(2016-02-15) (వయసు 85)
ఇతర పేర్లువేణుగోపాల్
వృత్తిసినీ గేయరచయిత
క్రియాశీల సంవత్సరాలు1961-63

విశేషాలు

మార్చు

ఇతడు హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్‌లో 1930, జూన్ 12వ తేదీన జన్మించాడు. తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రవీణుడైన వేణుగోపాలాచార్యులు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తిరీత్యా రచయిత. ఈయనకు భార్య కమలాదేవి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పట్నంలో శాలిబండ, పదవే పోదాము గౌరీ, జయజయజయ శ్రీ వేంకటేశ, నమో వేంకటేశ.. నమో తిరుమలేశా తదితరపాటల ద్వారా వేణుగోపాలాచార్యులు తెలుగువారికి సుపరిచితుడు. సంధ్యాదీపం, పచ్చని సంసారం, భాగ్యవంతుడు, అమరుడు తదితర మంచి చిత్రాల్లో పాటలను రాసి ఎంతో కీర్తి గడించారు వేణుగోపాలాచార్యులు. ఆయన రాసిన పాటలన్నీ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగుతో పాటు హిందీ చిత్రం నాసిక్‌లో కూడా ఆయన పాటలు వ్రాశాడు.

సినిమా పాటల జాబితా

మార్చు
క్రమసంఖ్య సినిమా పేరు పాట పల్లవి గాయకుడు సంగీత దర్శకుడు సినిమా విడుదలైన సంవత్సరం
1 అమూల్య కానుక[2] ఏల మరచావో ఈశా నన్నేల మరచావో ఈశా జి.కె.వెంకటేష్ టి. జానకిరామ్ 1961
2 అమూల్య కానుక కాలం మారిపోయే అబ్బీ గరిటి చేతికొచ్చె రాఘవులు టి. జానకిరామ్ 1961
3 అమూల్య కానుక చక్కని వీణయిదే మట్టి కలసిన ఏమౌనో అమ్మా వి.ఆర్.గజలక్ష్మి టి. జానకిరామ్ 1961
4 అమూల్య కానుక నిదురించు నా నాన్న నిదురించు జోజోజో వి.ఆర్.గజలక్ష్మి టి. జానకిరామ్ 1961
5 అమూల్య కానుక మహేశ్వరీ త్రిభువన పాలనీ అమూల్యకానుకను పి.బి.శ్రీనివాస్, వైదేహి టి. జానకిరామ్ 1961
6 అమూల్య కానుక విధియో నీ శోధనయో అయ్యో కనుచూపు శూలమంగళం రాజ్యలక్ష్మి టి. జానకిరామ్ 1961
7 పచ్చని సంసారం[3] ఆశలు మురిపించు ఈయనెవ్వరే నన్ను ఏకాంతమున సునంద ఆకుల అప్పలరాజు 1961
8 పచ్చని సంసారం తలచుకుంటే ఆహా చిలికె నాలో ముదమే రవికుమార్,సునంద ఆకుల అప్పలరాజు 1961
9 పచ్చని సంసారం నను చేరవోయి రాజా మధుమాసమోయి రాజా ఎస్.జానకి ఆకుల అప్పలరాజు 1961
10 పచ్చని సంసారం మదిని ఉదయించు ఆశలు కలలో నిజమో కననే ఎస్.జానకి ఆకుల అప్పలరాజు 1961
11 పచ్చని సంసారం మోహనా నీ మాయలు మనసున ఎస్.జానకి,సునంద, రవికుమార్ ఆకుల అప్పలరాజు 1961
12 పచ్చని సంసారం సఖుడా ఇకనైన తెలుపుమా ఏకాంత వేళలోన ఎస్.జానకి ఆకుల అప్పలరాజు 1961
13 సోమవార వ్రత మహాత్మ్యం[4] నేనాడుదును యిక పాడుదును నవరాగముల ఎల్.ఆర్.ఈశ్వరి మాస్టర్ వేణు 1963
14 సోమవార వ్రత మహాత్మ్యం వయ్యారి నేనోయ్ వలపింతు నిన్నోయి సయ్యాటలాడి ఎల్.ఆర్.ఈశ్వరి మాస్టర్ వేణు 1963
15 తల్లీబిడ్డలు[5] ఆడించరె జోల లాడించరె అందాల బాబును దీవించి కె. రాణి బృందం బి. శంకరరావు 1963
16 తల్లీబిడ్డలు కన్నతల్లి లేమి అని మరలి చూడుమా మరచి పోదువా ఎస్.జానకి బి. శంకరరావు 1963
17 పతివ్రత ఆటకు భావం అవసరం ఓరబ్బీ చెప్పనేల పిఠాపురం, అప్పారావు బి. శంకరరావు 1963
18 సౌభాగ్యవతి[6] ఎందుకింత కంగారు ఓ సింగరయ్యా ఇన్నాళ్ళుగా ఎస్.జానకి, పిఠాపురం నాగేశ్వరరావు సత్యం 1975
19 సౌభాగ్యవతి కలదని లోపము కలవరపడకు చీకటిలోనే దీపం బ్రతుకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యం 1975
20 సౌభాగ్యవతి కసీ ఉసీ, ఉసీ కసీ ఉన్నదాన్నిరా మనసైన మగాడికి ఎస్.జానకి సత్యం 1975
21 సౌభాగ్యవతి గోలుకొండ దిబ్బ భలే గుండ్రమైన దబ్బాగుట్టు తెలుసుకో ఎల్.ఆర్.ఈశ్వరి సత్యం 1975
22 సౌభాగ్యవతి మదిలో తలచుకున్న శ్రీవారే దొరికినారు మరచిపోని వాణీ జయరామ్ సత్యం 1975
23 వీరాధివీరుడు[7] ఆశలూరెను కనులలో అలలు లేచెను మనసులో జిక్కి బృందం టి.ఆర్.పాప, ఎ.ఎ.రాజ్ 1961
24 వీరాధివీరుడు కాంతల మజాలు కానరాని సుఖాలు కళ్ళు తెరచి చూడరా జిక్కి బృందం టి.ఆర్.పాప, ఎ.ఎ.రాజ్ 1961
25 వీరాధివీరుడు నట్టనడి సంద్రాన నావపై పోయే వో రాజా రారా జిక్కి, బాబురావు బృందం టి.ఆర్.పాప, ఎ.ఎ.రాజ్ 1961
26 వీరాధివీరుడు నన్ను పాలింపరా వన్నెకాడా ఇంత అలుకేల నాపైన వెన్నేలరేడా పి.లీల టి.ఆర్.పాప, ఎ.ఎ.రాజ్ 1961
27 వీరాధివీరుడు నీకు తెలిసినా నాకు తెలిసినా ప్రజలకు ఏమి తెలుసే సింగి పి.లీల, పిఠాపురం నాగేశ్వరరావు టి.ఆర్.పాప, ఎ.ఎ.రాజ్ 1961
28 అమాయకుడు[8] పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ ఎల్.ఆర్.ఈశ్వరి బి.శంకర్ 1968
29 కష్టసుఖాలు[9] అహా సౌభాగ్యమే అందాల చంద్రుడే ఏవేవో బాసలాడి పి.సుశీల ఏ.యం.రాజా 1968
30 కష్టసుఖాలు అనురాగము నీ వలనే అనుమానము నీ వలనే ఏ.యం.రాజా 1968
31 కష్టసుఖాలు కలసి పో పో పో వనమున ఎ.ఎం.రాజా,పిఠాపురం నాగేశ్వరరావు,జిక్కి,పి.సుశీల ఏ.యం.రాజా 1961
32 కష్టసుఖాలు కారు షికారే జోరు హారన్ని ఒత్తుకుంటు పెంచవోయి స్పీడు ఏ.యం.రాజా 1961
33 కష్టసుఖాలు నేడే వచ్చెను శుభదినం అది కనుగొని పొంగెను నా మనం జిక్కి ఏ.యం.రాజా 1961
34 కష్టసుఖాలు ప్రేమించు పతి ఎంతో అందం పతి ప్రేమాను రాగానుబంధం ఏ.యం.రాజా 1961
35 కష్టసుఖాలు సయ్యాటలాడు నడుము సయ్యంటు పిలుచు కనులు ఏ.యం.రాజా 1961
36 మమకారం[10] ఓటు వేయండి... కాకాలుపట్టలేము గ్యాసేది కొట్టలేము రాఘవులు,కె. రాణి బృందం ఘంటసాల వెంకటేశ్వరరావు 1963
37 మమకారం కన్నుల కలవరం కంటినే చిన్నారి కారణం ఏమిటో పిఠాపురం నాగేశ్వరరావు,జిక్కి ఘంటసాల వెంకటేశ్వరరావు 1963
38 మమకారం కన్నతండ్రి హృదిలో నేడు కోపమేలరా తనయా పి.లీల ఘంటసాల వెంకటేశ్వరరావు 1963
39 మమకారం కలతలు మరచి కష్టం చేద్దాం కపటము కల్లలు వదలండి ఘంటసాల వెంకటేశ్వరరావు బృందం ఘంటసాల వెంకటేశ్వరరావు 1963
40 మమకారం ఘల్లున గజ్జల గంతులువేసే కన్నియ ఆటలు సుందరమే పి.సుశీల ఘంటసాల వెంకటేశ్వరరావు 1963
41 మమకారం నేడు మనకానందమైన పర్వము మెట్టినింట మెరిసె జిక్కి, ఎస్.జానకి బృందం ఘంటసాల వెంకటేశ్వరరావు 1963
42 మమకారం మధురం మధురం మన ప్రణయం మదిలో రేగెను ఘంటసాల వెంకటేశ్వరరావు,పి.సుశీల ఘంటసాల వెంకటేశ్వరరావు 1963
43 మమకారం మదిలో మెదిలే పెళ్ళికొడుకు నెన్నుకో వలచి పెళ్ళాడి జిక్కి, ఎస్.జానకి బృందం ఘంటసాల వెంకటేశ్వరరావు 1963
44 పాపాల భైరవుడు[11] మరితూపులనే ఆపుమురా నేడు మురిపాలే పి.లీల పామర్తి 1961
45 మహారథి కర్ణ[12] ఓహోహో హోహో తమ కోపమదేలా ఈ మౌనము జిక్కి డి. బాబూరావు 1960
46 శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం పదవే పోదాము గౌరి పరమాత్ముని చూడు పదవే బంగారు పిఠాపురం నాగేశ్వరరావు బృందం పెండ్యాల నాగేశ్వరరావు 1960
47 శ్రీ తిరుపతమ్మ కథ శ్రీ వెంకటేశా దయాసాగరా శ్రీవెంకటేశా పి.లీల పామర్తి 1963

ఇతడు తన 91వయేట సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016, ఫిబ్రవరి 25వ తేదీన మరణించాడు.[13]

మూలాలు

మార్చు
 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-02-28. Retrieved 2016-02-27.
 2. http://ghantasalagalamrutamu.blogspot.in/2011/01/1961_20.html[permanent dead link]
 3. http://ghantasalagalamrutamu.blogspot.in/2009/06/1961_9941.html[permanent dead link]
 4. http://ghantasalagalamrutamu.blogspot.in/2012/09/1963.html[permanent dead link]
 5. http://ghantasalagalamrutamu.blogspot.in/2011/01/1962_13.html[permanent dead link]
 6. http://ghantasalagalamrutamu.blogspot.in/2013/10/1975.html[permanent dead link]
 7. http://ghantasalagalamrutamu.blogspot.in/2012/08/1961.html[permanent dead link]
 8. http://ghantasalagalamrutamu.blogspot.in/2009/04/1968_20.html[permanent dead link]
 9. http://ghantasalagalamrutamu.blogspot.in/2012/01/1961.html[permanent dead link]
 10. http://ghantasalagalamrutamu.blogspot.in/2009/07/1963_5827.html[permanent dead link]
 11. http://ghantasalagalamrutamu.blogspot.in/2009/06/1961.html[permanent dead link]
 12. http://ghantasalagalamrutamu.blogspot.in/2009/07/1960_5355.html[permanent dead link]
 13. ప్రముఖ సినీ రచయిత వేణుగోపాలాచార్యులు కన్నుమూత