పూర్వం వాగ్గేయకారులు ఆయా మేళకర్త రాగములకు ఆయా వరుస సంఖ్యను బట్టి సరియగునటుల పేర్లిడి యున్నారు. మేళకర్త రాగముల సంఖ్యను కనుగొను సూత్రమునకు "క, ట, ప, యా" ది సంఖ్య అని పేరు.

భారతీయ సంగీతం
వ్యాసముల క్రమము
సాంప్రదాయక సంగీతం

కర్ణాటక సంగీతము  · హిందుస్థానీ సంగీతము
భారత ఫోక్ సంగీతం  · తుమ్రి · దాద్రా · గజల్ · ఖవ్వాలీ
చైతీ · కజ్రీ · సూఫీ

ఆధునిక సంగీతము

భాంగ్రా · చలన చిత్ర సంగీతము
పాప్ సంగీతం · రాక్ సంగీతం · బ్లూస్ సంగీతం
 · జజ్ సంగీతం · ట్రాన్స్ సంగీతం

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

హిందుస్థానీ సంగీత విద్వాంసులు
కర్ణాటక సంగీత విద్వాంసులు

గాయకులు

హిందుస్థానీ సంగీత గాయకులు
హిందుస్థానీ సంగీత గాయకులు

సంగీత వాద్యాలు

సంగీత వాద్యపరికరాల జాబితా
సంగీత వాయిద్యాలు

భావనలు

రాగము · తాళము · పల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన
మేళకర్త రాగాలు · కటపయాది సంఖ్య
జానపదము

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము
గ్రామఫోను · రేడియో

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము
కర్ణాటక సంగీతము

క ట ప యా ది సంఖ్య

మార్చు
క ట ప యా ది సంఖ్య
క్రమ సంఖ్య పేర్లు 1 2 3 4 5 6 7 8 9 0
1 కా ది న వ
("క" మొదలు "ఞ" వరకు)
2 టా ది న వ
( "ట" మొదలు "న" వరకు)
3 పా ది పం చ
("ప" నుండి "మ" వరకు)
4 యా ద్య ష్ట
("య" మొదలు "హ" వరకు)

"నవ" అనగా తొమ్మిది; "పంచ" అనగా ఐదు; "అష్ట" అనగా ఎనిమిది. కనుక "కాదినవ" అనగా "క" మొదలుకొని తొమ్మిది అక్షరములు, "టాదినవ" అనగా "ట" మొదలుకొని తొమ్మిది అక్షరముల వరకు, "పాదిపంచ" అనగా "ప" మొదలుకొని ఐదు అక్షరముల వరకు, "యాద్యష్ట" అనగా "య" మొదలుకొని ఎనిమిది అక్షరముల వరకు తొమ్మిది సంఖ్యల క్రింద విభజింపబడినవి. పదియవ అక్షరము సున్న (0) క్రింద వ్రాయబడింది.

మేళకర్త రాగము సంఖ్యను కనుగొను పద్ధతి

మార్చు

ఏదైనా మేళకర్త రాగము తీసికొనుము.

ఉదాహరణకు "మాయమాళవగౌళ" తీసికొనుము. ఈ రాగము లోని మొదటి, రెండు అక్షరములు తీసికొనుము. అవి "మ", "య" ఈ అక్షరములు పై పట్టికలో ఏయే సంఖ్యల క్రింద వ్రాయబడ్డాయో తెలిసికొనవలిను. "మ" అక్షరము "పాదిపంచ"లో ఐదవ అక్షరము. "య" అక్షరము "యాధ్యష్ట"లో మొదటి అక్షరము. కనుక ఈ రెండు అక్షరముల సంఖ్యలను కలిపి వ్రాసినపుడు అది "51" వచ్చును. దానిని త్రిప్పి వ్రాసిన "15" వచ్చును.ఈ సంఖ్య మాయామాళవగౌళ రాగం యొక్క వరుస సంఖ్య అవుతుంది.

ఈ సూత్రము జన్య రాగములకు అన్వయించదు.

కొన్ని ఉదాహరణలు:

  • ధీర శంకరాభరణంలో మొదటి రెండు అక్షరాలు "ధీ", "ర" వీటి సంఖ్య 92 అనగా ఈ రాగం యొక్క సీరియల్ నంబరు 29.
  • మేచ కళ్యాణిలో మొదటి రెండు అక్షరాలు "మే", "చ" వీటి సంఖ్య 56 అనగా ఈ రాగం సీరియల్ నంబరు 65
  • నఠ భైరవి రాగంలో మొదటి రెండు అక్షరాలు "న", "ఠ" వీటి సంఖ్య 25 అనగా ఈ రాగం సీరియల్ నంబరు 52.
  • రామప్రియ రాగంలో మొదటి రెండు అక్షరాలు "ర", "మ" వీటి సంఖ్య 25 అనగా ఈ రాగం సీరియల్ నంబరు 52.

ఏ మేళకర్త రాగమును తీసికొనినను ఈ పద్ధతి ఆ మేళ కర్త రాగము యొక్క వరుస సంఖ్య కనుగొనవచ్చును.

సంయుక్తాక్షరముల మేళకర్త రాగములు

మార్చు

కొన్ని రాగముల మొదటి అక్షరములు సంయుక్తాక్షరములున్నను, రాగము యొక్క పేరు సంయుక్తాక్షరము ఐతే ఆ సంయుక్త అక్షరము యొక్క రెండవ అక్షరము గణింపవలయును.

సంయుక్తాక్షరములు గల మేళకర్త రాగములు
క్రమ సంఖ్య రాగము పేరు మొదటి అక్షరము రెండవ అక్షరము (సంయుక్త) తీసికోవలసిన అక్షరాలు సంఖ్య మేళకర్త రాగము సంఖ్య
1 రత్నాంగి త్న ర, న 20 2
2 చక్రవాకము క్ర చ, క 61 16
3 షడ్విధమార్గిణి డ్వి ష, వి 64 46
4 దివ్యమణి ది వ్య ది, వ 84 48
5 విశ్వంభరి వి శ్వ వి, శ 45 54
6 సింహేంద్రమధ్యమం సిం హేమ్‌ స, మ 75 57
7 చిత్రాంబరి చి త్రా చి, త 66 66
8 సూర్యకాంతము సూ ర్య స, య 71 17