కలవపాముల

భారతదేశంలోని గ్రామం

కలవపాముల, కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 164., ఎస్.టి.డి.కోడ్ = 08676.

  ?KALAVAPAMULA
Andhra Pradesh • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°16′N 80°31′E / 16.26°N 80.52°E / 16.26; 80.52Coordinates: 16°16′N 80°31′E / 16.26°N 80.52°E / 16.26; 80.52
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 125 మీ (410 అడుగులు)
జిల్లా (లు) Krishna జిల్లా
జనాభా
జనసాంద్రత
3,646 (2011 నాటికి)
• 3,663/కి.మీ² (9,487/చ.మై)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 521 166
• +91 8676 283XXX
• AP16


గ్రామ చరిత్రసవరించు

సుందరమైన గ్రామంలలో ఇది ఒకటి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు కలవపాముల గ్రామం విజయవాడ-గుడివాడ రహదారి మధ్యన ఉంది.

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో వెంట్రప్రగడ, ఇందుపల్లి, లక్ష్మిపురం, వానపాముల, బొల్లపాడు గ్రామాలు ఉన్నాయి. ఈవూరు చుట్టు ప్రక్కల గ్రామాలు కాటూరు (వుయ్యూరు వైపు), వెంట్రప్రగడ (గుడివాడ వైపు), మానికొండ (విజయవాడ వైపు), ఇందుపల్లి (తేలప్రోలు వైపు).

సమీప మండలాలుసవరించు

నందివాడ, గుడివాడ, వుయ్యూరు, పెదపారుపూడి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

జ్యోతి పాలిటెక్నిక్సవరించు

ఈ కళాశాల 3వ వార్షికోత్సవం, 2016, జనవరి-29న నిర్వహించారు. [4]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

దీని తరగతి గదుల సమస్య తీరుటకు రాజీవిద్యామిషన్ నిధులు 16 లక్షలతో పాఠశాల అదనపు గదులు నిర్మించారు. అలాగే శ్ధిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని ఆర్‌ఎమ్‌ఎస్‌ఎ నిధులు సుమారు 2.25 లక్షలతో మరమ్మత్తులు చేశారు. దాతలు, పూర్వవిద్యార్థులు, గ్రామస్థులు సహకారముతో పాఠశాలకు వీరందరి తరపున వివిధ (రూపములలో) మార్గములలో, అనేక వసతులు, మౌలిక సదుపాయములు, నగదు పురస్కారములు, ప్రతిభగల విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ప్రతియేటా ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సొమ్ము యొక్క వడ్డీతో నగదు బహుమతులు, పేదవారికి సమయ సందర్భానుసారం వారికి చేయూతనివ్వడం, క్రీడల మీద ఆసక్తి ఉన్న వారికి క్రీడాపరికరాలు, దుస్తులు అందివ్వడం, ఇలా అనేక కార్యక్రమములు దాతలు తమ తోడ్పాటును అందిస్తున్నారు.[2]

భూరివిరాళ దాతలుసవరించు

 • పాఠశాలకు అదనపు గదుల నిర్మాణము కొరకు, ఇదే గ్రామానికి చెందిన కొడాలి సుబ్బారావు తల్లిదండ్రులు అయిన కొడాలి నారాయణరావు, అన్నపూర్ణమ్మ వారి జ్ఞాపకార్థం 11 సెంట్ల స్థలమును విరాళంగా అందజేశారు.
 • పూర్వ విద్యార్థి అయిన యలమంచిలి ఇందిరాదేవి రూ.13 వేలుతో పాఠశాల మూడు తరగతి గదులకు విద్యుద్దీకరణ, మరొక రూ.12 వేలుతో పంచాయితీ వారి నీటి పైపు మార్గము నుండి పాఠశాల వరకు మంచినీళ్ళ ఏర్పాటు, అలాగే రూ.25 వేలు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సొమ్ము యొక్క వడ్డీతో ప్రతియేటా విద్యార్థులకు నోటుపుస్తకములు అందించే ఏర్పాట్లు చేశారు.
 • పూర్వ విద్యార్థి అయిన డాక్టర్. అనగాని శ్రీరాజ్యం విద్యార్థులకు రూ.40 వేలు విలువైన బెంచీలు ఏర్పాటు చేశారు.
 • వెల్లంకి సీతారామదాసు రూ.40 వేలతో పాఠశాలలో బోరు పంపు వేయించారు.
 • డాక్టర్.వెల్లంకి రవీంద్రనాథ్ ఠాగూర్ తల్లిదండ్రులు అయిన వెల్లంకి రామజోగి, పుష్పావతమ్మ వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఉచితంగా విద్యార్థులందరికీ నోటుపుస్తకాలు అందిస్తున్నారు.
 • 2015 సంవత్సరము నుండి ప్రస్తుత (2015) ఎంపిడివో అయిన వెంకటరమణ (వీరు స్త్రీ) వారి తండ్రి అనగాని వెంకటేశ్వర రావు జ్ఞాపకార్థం విద్యార్థులకు వివిధ రకములయిన బహుమతులు అందజేస్తారు.

కొంతమంది దాతలు వివరాలుసవరించు

 • దుగ్గిరాల నాగేశ్వరరావు, సుబ్బమ్మ దంపతులు: రూ.10 వేలు.
 • సోమూరి విజయ్‌కుమార్: రూ.10 వేలు.
 • దేవరకొండ సురేష్: రూ.10 వేలు.
 • చలసాని లక్ష్మీనారాయణ తులశమ్మలు : రూ.10 వేలు.
 • వెల్లంకి కృష్ణయ్య, నరసమ్మ : రూ.35 వేలు.
 • చలసాని వ్యాపారు, సీతామహలక్ష్మీ: రూ.20 వేలు.
 • కొడాలి గంగాధర రావు: రూ.20 వేలు.
 • వెల్లంకి రామదాసు చౌదరి రామానుజమ్మ జ్ఞాపకార్థం` : రూ.25 వేలు.
 • పెనమలూరు మండలం, పోరంకి గ్రామంనకు చెందిన యలమంచిలి జోషి పాఠశాల మరుగుదొడ్లు, మంచినీటి గొట్టాలను బాగు చేయించారు.

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలసవరించు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

ఒక కళ్యాణమండపం.

బ్యాంకులుసవరించు

కార్పొరేషన్ బాంక్.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ యార్లగడ్డ సదాశివరావు సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ కొడాలి నాగభూషణం ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రామాలయం.

శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

వెల్లంకి నాగినీడు, ఒక తెలుగు సినిమా నటుడు.

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3663, [3] ఇందులో పురుషుల సంఖ్య 1794, స్త్రీల సంఖ్య 1869, గ్రామంలో నివాసగృహాలు 993 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 784 హెక్టారులు.

మూలాలుసవరించు

 1. "కలవపాముల". Archived from the original on 21 ఏప్రిల్ 2017. Retrieved 23 June 2016. Check date values in: |archive-date= (help)
 2. ఈనాడు విజయవాడ:- 1,జనవరి-2015.4వ పేజీ.
 3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-07.

వెలుపలి లింకులుసవరించు

[3] ఈనాడు విజయవాడ; 2014, జూలై-25; 6వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2016, జనవరి-30; 32వపేజీ.

బాహ్య లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కలవపాముల&oldid=2993071" నుండి వెలికితీశారు