గొల్లనపల్లి

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా గ్రామం

గొల్లనపల్లి కృష్ణా జిల్లా, గన్నవరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 707 ఇళ్లతో, 2707 జనాభాతో 953 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1297, ఆడవారి సంఖ్య 1410. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 489 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 24. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589230[2].పిన్ కోడ్: 521101, ఎస్.టి.డి.కోడ్ = 08676.

గొల్లనపల్లి
పటం
గొల్లనపల్లి is located in ఆంధ్రప్రదేశ్
గొల్లనపల్లి
గొల్లనపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°36′11.232″N 80°46′48.036″E / 16.60312000°N 80.78001000°E / 16.60312000; 80.78001000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మండలంగన్నవరం
విస్తీర్ణం9.53 కి.మీ2 (3.68 చ. మై)
జనాభా
 (2011)
2,707
 • జనసాంద్రత280/కి.మీ2 (740/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,297
 • స్త్రీలు1,410
 • లింగ నిష్పత్తి1,087
 • నివాసాలు707
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521101
2011 జనగణన కోడ్589230

గ్రామ చరిత్ర

మార్చు

ఇది అగ్రహార గ్రామం. బ్రాహ్మణులకు దానం చేయబడిన గ్రామం. గొల్లనపల్లి ఇంటి పేరు గల బ్రాహ్మణులు ఇక్కడ గతంలో ఉన్నారు.గ్రామం నుంచి కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఒక కుటుంబమే ఉంది.1947కు పూర్వం ఇది మొఖాసా గ్రామంగా ఉందేది. బ్రిటీష్ సనదు ప్రకారం వెలమ దొరల రాజ్యంగా ఉండేది.1948ల్లో జమీందారీ విధానం రద్దయ్యాక మొఖాసాదారీ విధానం రద్దయింది. 1958లో మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ గెలిచింది. యనమదల కన్నయ్య గారు తొలి ప్రెసిడెంట్ అయ్యారు.

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

గొల్లనపల్లి ఇంటి పేరుగల బ్రాహ్మణుల వల్లనే ఈ గ్రామానికి గొల్లనపల్లి పేరు వచ్చివుండాలి.

గ్రామ భౌగోళికం

మార్చు

సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు

గొల్లనపల్లి గ్రామం గన్నవరము-ఆగిరిపల్లి మార్గంలో ఉంది.

సమీప గ్రామాలు

మార్చు

చిక్కవరం.. బీబీ గూడెం.. గోపవరపు గూడెం.. కొండపావులూరు., కొత్తగూడెం(గన్నవరం), తోటపల్లి ..

సమీప మండలాలు

మార్చు

గన్నవరం, అగిరిపల్లి, ఉంగుటూరు, పెనమలూరు, కంకిపాడు, విజయవాడ గ్రామీణ

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

గొల్లనపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. ఈ గ్రామానికి 6 కి.మీ.దూరంలో గన్నవరం రైల్వే స్టేషన్ ఉంది. 10 కి.మీ. దూరంలో గన్నవరం ఎయిర్ పోర్టు ఉంది. కానీ ఈ వూరి నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యము లేదు. ఆటోలు తప్పితే మరే రవాణా సదుపాయము లేదు. ఇదొక విచిత్ర పరిస్థితి. గన్నవరం, రామచరప్పాడు, గునదల నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 23 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి గన్నవరంలో ఉంది. సమీప జూనియర్ కళాశాల గన్నవరంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల బుద్ద్దవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్‌ గన్నవరంలోను, మేనేజిమెంటు కళాశాల సూరంపల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

మార్చు
  1. 1963లో ఏర్ప‌డిన గొల్ల‌న‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్తు హైస్కూలుకు 2013కు 50 సంవ‌త్స‌రాలు నిండాయి. ఈ 50 ఏళ్ల‌లో క‌నీసం 10 వేల మంది చ‌దువుకున్నారు. కానీ ఈ హైస్కూలుకు స్వ‌ర్ణోత్స‌వం జ‌ర‌గ‌లేదు. ఎంతోమందికి విద్యా బిక్ష పెట్టి ఎంద‌రి జీవితాలనో ఉన్న‌త స్థితికి తీసుకువెళ్లిన ఈ హైస్కూలుకు పట్టిన దుర్గ‌తి ఇది. కొంత‌మంది పూర్వ విద్యార్థులు స్వ‌ర్ణోత్స‌వం చేయాల‌ని సంక‌ల్పించినా గ్రామ‌పెద్ద‌ల రాజ‌కీయాల వ‌ల్ల సాధ్యం కాలేదు. స్వ‌ర్ణోత్స‌వం క‌న్నా ముందు హైస్కూల్లో వ‌స‌తులు క‌ల్పిస్తే అది స్వ‌ర్ణోత్స‌వం చేసినంత ఘ‌న‌త అనుకున్నారు ఆ పూర్వ విద్యార్థులు. అనుకున్న‌దే త‌డ‌వుగా పూర్వ విద్వార్థుల స‌మ‌న్వ‌య స‌మ‌తి ఏర్పాటు చేశారు. స‌మితి గ‌త పదేళ్ళుగా   సేవా కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించింది. ఇదే హైస్కూల్లో చ‌దువుకుని పై చ‌దువుల‌కు వెళ్లి.. ఐఎఎస్ ఉత్తీర్ణుడై.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో అత్యున్న‌త అధికారి.. ఎపి ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, టిటిడి ఈవోగా ఉన్నడాక్ట‌ర్ దొండ‌పాటి సాంబ‌శివ‌రావుగారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ స‌మితి సేవా కార్యక్ర‌మాల‌ను ప్రారంభించింది. ఆయ‌న కూడా సుమారు 70 ల‌క్ష‌ల రూపాయ‌లను ప్ర‌భుత్వం నుంచి మంజూరు చేయించి ఐదెక‌రాల స్కూలు ప్రాంగ‌ణానికి ప్ర‌హ‌రీతోపాటు రెండు భ‌వ‌నాలు (ఎనిమిది త‌ర‌గ‌తి గ‌దులు) మంజూరు చేయించారు. వాటికి కావ‌ల‌సిన ఫ‌ర్నీచ‌రు కూడా ప్ర‌భుత్వం ద్వారా మంజూరు చేయించారు. దీంతో స్కూలుకు భ‌వ‌నాలు హంగులు ఏర్ప‌డ్డాయి. కానీ చిన్న‌చిన్నవ‌స‌తులు అవ‌స‌రమ‌య్యాయి. ఇలాంటివాటిని దాత‌ల నుంచి స్వీక‌రించాల‌ని సాంబ‌శివ‌రావుగారు సూచించ‌డంతో స‌మితి ఆ ప‌ద్ధ‌తిలో ప‌య‌నించ‌డం ప్రారంభించింది. దానిలో భాగంగా  విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైనవి అందించి మంచి విద్యాఫ‌లితాలు రాబ‌ట్టేందుకు కృషి చేయ‌డంతోపాటు.. మౌలిక స‌దుపాయాలు తీర్చే ప‌నిచేప‌ట్టింది.  విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం చేయ‌డానికి ప‌ళ్లేలు, గ్లాసులు, పుస్త‌కాలు అందిస్తూ వ‌స్తోంది. అంతేకాదు.. వేస‌వి కాలం చ‌ల్ల‌టి మంచి నీటి కొర‌త తీర్చేందుకు రూ.25 వేల రూపాయ‌ల‌తో కూల‌ర్ కొనిచ్చింది. 10వ త‌ర‌గ‌తిలో అత్యుత్త‌మ ఫ‌లితాలు సాధించిన విద్యార్థుల‌కు న‌గ‌దు ప్రోత్సాహాల‌ను అందిస్తోంది. 1974_75 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 70 వేల రూపాయ‌లు బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్ చేసి దానిపై వ‌చ్చే ఏడున్న‌ర వేల రూపాయ‌ల వ‌డ్డీతో ప‌దో త‌ర‌గ‌తిలో టాప‌ర్‌కు 5 వేల రూపాయ‌లు, సెకండ్ టాప‌ర్‌కు 2,500 రూపాయ‌లు గ‌త నాలుగేళ్లుగా అంద‌జేస్తూ వ‌స్తోంది. స‌మితి అధ్య‌క్షుడు వేమూరి నాగ‌విద్యారావు 3 ల‌క్ష‌ల రూపాయ‌ల ఖ‌ర్చుతో స్కూలులో ర‌క్షిత మంచినీటి ట్యాంకు నిర్మించారు. దీనిని డాక్ట‌ర్ సాంబ‌శివ‌రావుగారే ప్రారంభోత్సవం చేశారు. అలాగే సాంబ‌శివ‌రావుగారి రాక సంద‌ర్భంగా దొండ‌పాటి స‌త్య‌నారాయ‌ణ‌, సుబ్బారావు సోద‌రులు ల‌క్ష రూపాయ‌లు, కంభంపాటి ల‌క్ష్మీనారాయ‌ణ 25 వేల రూపాయ‌లు మొత్తం ల‌క్షా 25 వేల విరాళం ప్ర‌క‌టించారు. ఈ విరాళంతో  సైకిల్ షెడ్ నిర్మించారు. ప్ర‌వాస భార‌తీయుడు చిట్నేని పూర్ణ‌చంద్ర‌రావు కూడా ఎంతో తోడ్ప‌డుతున్నారు. ఇలా గ‌త నాలుగేళ్లుగా నిరంతరం స్కూల్లో సేవా కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే ఈ కార్యక్ర‌మాల్లో ఎవ‌రైనా భాగ‌స్వాములు కావ‌చ్చు. ఇక్క‌డ చ‌దువుకున్న ప్ర‌తి బ్యాచ్ కూడా ఆ బ్యాచ్ పేరుతో సంఘం పెట్టుకుని సేవా కార్యక్ర‌మాలు కొన‌సాగించవ‌చ్చు. స‌మితి ప్రోత్సాహం మేర‌కు ఏర్ప‌డిన‌దే 1974_75 ప‌దో త‌ర‌గ‌తి పూర్వ‌విద్యార్థుల అసోసియేష‌న్‌. దీని మాదిరిగానే ఇక్క‌డ చ‌దువుకున్న వారంతా అనేక బ్యాచ్‌ల‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సేవా కార్యక్ర‌మాలు నిర్వ‌హించ‌వొచ్చు. మా విజ్ఞ‌ప్తి ఏమిటంటే.. మ‌న‌కు స్కూలు ఎంతో ఇచ్చింది. అంటే జ్ఞానం.. మంచి జీవితం..ఇచ్చింది.  మ‌న త‌ల్లిలాంటి స్కూలుకు ఏమీ ఇవ్వొద్దా?. ఆలోచించండి!. స్కూలు రుణం తీర్చుకోవ‌డం మ‌న బాధ్య‌త. జీవితంలో స్థిర‌ప‌డి ఎక్క‌డెక్క‌డో నివ‌సిస్తున్న మీరు ఒక‌సారి స్కూలును సంద‌ర్శించండి. చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను నెవ‌రువేసుకోండి. స్కూలుకు అవ‌స‌ర‌మైన ఒక చిన్న స‌దుపాయం తీర్చండి. మీ రుణం తీరిపోయిన‌ట్లే!. ఇలాంటి వారితో స‌మ‌న్వ‌యం చేయ‌డానికే ఈ పూర్వ విద్యార్థుల స‌మ‌న్వ‌య స‌మితిని ఏర్పాటు చేశాం. మీకు మంచి జీవితం ప్ర‌సాధించిన మీ స్కూలుకు మీరైమైనా చేస్తే అది మీ క‌న్న త‌ల్లికి సేవ చేసిన‌ట్లే! ఆలోచించండి
  2. ఈ పాఠశాలలో చదివిన Dr.D.Sambasivarao IAS (డి.సాంబశివరావు సీనియర్ ఐఏఎస్) ఆఫీసర్ అయ్యారు. సచివాలయంలో గొప్ప పదవులు అలంకరించారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో పూర్వ విద్యార్థులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేమూరి భానుమతి, డేనియల్, వేమూరి నాగవిద్యారావు, ఉడతా రామకృష్ణ, తమ్మిశెట్తి రఘుబాబు తదితరులు జెద్పీహెచ్ పాఠశాల ప్రగతికి పాటుపడుతున్నారు.
  3. ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి, నల్లూరి మోహనకృష్ణ, ఇటీవల పెడనలో జరిగిన ఇన్స్ పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రథమ స్థానం పొందినాడు.
  4. ఈ పాఠశాలలో చదువుచున్న జి.నాగజ్యోతి అను విద్యార్థిని, జిల్లాస్థాయిలో నిర్వహించిన బేస్ బాల్ క్రీడా పోటీలలో తన ప్రతిభతో రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల బేస్ బాల్ పోటీలకు ఎంపికైనది. అనంతరం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో ఈమె తన ప్రతిభతో జాతీయస్థాయిలో నిర్వహించు బేస్ బాల్ పోటీలకు ఎంపికైనది. ఈమె 2016,ఫిబ్రవరి-15న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ పట్టణంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [11]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాలలు 2

మార్చు

మిషనరీ పాఠశాల

మార్చు

ప్రాధమిక పాఠశాల

మార్చు

లైట్ హోం అనే సంస్థ ఈ పాఠశాల నడుపుతున్నది.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

గొల్లనపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం సబ్ సెంటర్ ఉన్నా డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు
  1. ఊర చెరువు:- ఈ చెరువు 10.8 ఎకరాలలో విస్తరించియున్నది. అయితే ఆక్రమణల పాలయినది. ఇప్పుడు చెరువు 3 ఎకరములు మాత్రమే కనిపిస్తున్నది.
  2. కుమ్మరికుంట చెరువు:- ఈ చెరువు 44 ఎకరాలలో యున్నది. అయితే ఆక్రమణల పాలయినది. చిన్నదయి పోయింది
  3. కొంపెల్ల చెరువు:- కొంతభాగం ఆక్రమణల పాలయినది. నీరు-చెట్టు పథకంలో భాగంగా, 2017,జూన్-22న, పది లక్షల రూపాయల అంచనా వ్యయంతొ, ఈ చెరువులో పూడిలతీత కార్యక్రమం ప్రారంభించారు. [11]
  4. దంటకుంట్ల చెరువులు ఉన్నాయి
  5. పోలవరం కుడి కాలువ:- గ్రామానికి పర్లాంగు దూరంలో పోలవరం కాలువ ఉంది. పట్టిసీమ పేరుతో గోదావరి నీరు ఈ కాలువ ద్వారా వదులుతున్నారు. కాలువపై మోటార్లు పెట్టి నీరు తోడి కొన్ని పంటలు పండిస్తున్నారు.

గ్రామ పంచాయతీ

మార్చు

గ్రామానికి ఇప్పటివరకూ ప్రెసిడెంట్లు:-

మార్చు
  1. యనమదల కన్నయ్య (సీపీఐ)
  2. కోటగిరి రంగమన్నారు. (కాంగ్రెస్)
  3. కోటగిరి వెంకటరామారావు. (కాంగ్రెస్)
  4. బొబ్బా వెంకటేశ్వరరావు. (సీపీఐ)
  5. కోటగిరి వేణుగోపాలరావు. (కాంగ్రెస్)
  6. పటమట రాణి (తెలుగుదేశం)
  7. కోటగిరి రామచంద్రరావు.. (కాంగ్రెస్)
  8. జయకాంతమ్మ (కాంగ్రెస్)

ఇప్పటివరకూ పనిచేసిన ఉపసర్పంచులు

మార్చు
  1. యనమదల కన్నయ్య (సీపీఐ)
  2. కటివరపు సులేమాను (సీపీఐ)
  3. కోలవెంటి వెంకటేశ్వరరావు (సీపీఎం)
  4. వెంగల వెంకటప్పయ్య అనే రామస్వామి (సీపీఎం)
  5. పులపాక జోసెఫ్ (కాంగ్రెస్)

ఎంపీటీసీ సభ్యులు

మార్చు
  1. దొండపాటి సత్యనారాయణ (కాంగ్రెస్)
  2. పులపాక ప్రసాదు (తెలుగుదేశం)
  3. సామల ఆంజనేయులు (కాంగ్రెస్)
  4. బర్రె పాప (తెలుగుదేశం)

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  1. పాత రామాలయం
  2. కొత్త రామాలయం
  3. వేణుగోపాల స్వామి ఆలయం
  4. పాత నాగేంద్రస్వామివారి ఆలయం.
  5. కొత్త నాగేంద్రస్వామి ఆలయం

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

ఈ గ్రామం మెట్ట గ్రామం. మామిడి తోటలకు ప్రసిద్ధి.

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు
  1. ఒకనాడు ఈ గ్రామం చేనేతకు ప్రసిద్ధి చెందినది. ఒకప్పుడు ఈ వూరిలో 30 మగ్గాలు పని చేసేవి. వస్థ్ర ఉత్పత్తి దెబ్బతిన్నది. అందువల్ల ఇప్పుడు ఒక్కరు కూడా చేనేత పని చేయడము లేదు. ఈ వూరిలో ఉడతా వెంకటేశ్వరరావు గొప్ప చేనేత కార్మికుడుగా ప్రసిద్ధి చెందారు.
  2. కుండల తయారీ పని కూడా ఇక్కడ ఉంది. 10 కుటుంబాలు ఈ పని చేసేవి.
  3. గీత పని ఉంది. 20 మంది కల్లు గీత చేసేవారు.
  4. మేకల పెంపకం ఉంది. 10 కుటుంబాలు ఈ పని చేసేవి.
  5. ఇంకా చిన్న చిన్న వృత్తులు ఉందేవి.
  6. గొల్లనపల్లిలో MINING క్వారీలు ఉన్నాయి. 50 మంది కార్మికులు ఉండేవారు. ఇప్పుడు యంత్రాలు వచ్చి వారి పొట్టలు కొట్టాయి. ఈ కార్మికులు వేరే పనుల్లోకి వెళ్ళిపోయారు.
  7. ఇక్కడ నుంచి జిల్లా మొత్తంగా రబ్బీషు, గ్రావెలు రవాణా అవుతుంది. అధికారికంగా 480 కోట్ల రూపాయల మెటీరియల్ తరలించబడింది. గ్రామానికి ఒక్క రూపాయి లాభం జరగలేదు.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)

మార్చు
  1. ఇదే గ్రామానికి చెందిన డాక్టరు దొండపాటి సాంబశివరావు IAS ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా  AP govt special chief secretary and ttd eo గా ఉన్నారు. ప్రసిద్ధి చెందిన టిటిడి దేవస్థానం ఈవోగా పనిచేసి గొప్ప పరిపాలనా దక్షుడుగా పేరు సంపాదించుకున్నారు. ఈయన ఐఏఎస్ ఆఫీసరుగా 30 సంవస్తరాలు పూర్తిచేసుకున్నారు. ఆయనపై ఒక పుస్తకం రాయబడింది. దాని పేరు  'నిత్య స్పూర్తీ.
  2. ఇదే గ్రామానికి చెందిన చెన్నోజు మోహనాచారి APPSC ఉన్నతాధికారిగా హైదరాబాదులో ఉన్నారు
  3. ఇదే గ్రామానికి చెందిన ఉడతా రామకృష్ణ ప్రజాశక్తి దినపత్రిక ఎడిటోరిఎల్ బోర్డు సభ్యుడిగా, మఫిషిఎల్ స్టేట్ ఇంచార్జీ గా, మానిటరింగ్ ఇంచార్జీగా పనిచేసారు. కొద్దికాలం ప్రజాశక్తి జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేశారు.
  4. ఇదే గ్రామానికి చెందిన దుర్భా కౌండిన్య శాయి భడ్రాచలం గురుకుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.
  5. ఇదే గ్రామానికి చెందిన దగ్గు రామారావు రాజమండ్రిలో excise సీఐగా పనిచేస్తున్నారు.
  6. కమ్యునిస్టు నాయకుడు కోలవెంటి వెంకటేశ్వరరావు ఈవూరి బాగు కోసం ఎన్నో పోరాటాలు చేశారు. పోలీసులతో దెబ్బలు తిన్నారు. మలబారు పోలీసుల చిత్రహింసలకు గురయ్యారు. చనిపోయాడని వదిలేసి వెళ్ళారు. 96 ఏళ్ళ ఈ కురు వృద్ధుడు 70 ఏళ్ళుగా కమ్యునిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. ఉప సర్పంచిగా పనిచేసారు.
  7. మరో కమ్యునిస్టు నాయకుడు కటివరపు సులేమాను (90) కూడా జీవితాంతం పేద ప్రజల కోసం పనిచేసారు.
  8. ఈ వూరి నుంచి గన్నవరం తాలూకా ఎ.ఎం.సి ఛైర్మనుగా కోటగిరి వెంకట రామారావు (పొట్టియ్య),  కోటగిరి వరప్రసాదరావు పదేళ్ళు పనిచేశారు. ఇంకా కోటగిరి జగన్నాధరావు కూడా ఎ.ఎం.సి డైరెక్టరుగా పనిచేశారు.
  9. మంచి కళాకారులున్న గ్రామం. దుర్భా సుబ్రహ్మణ్యశాస్త్రి.. వెంగల సుబ్బయ్య. పటమట ముత్తయ్య. అంకెం పంగిడియ్య. ఉడతా రామకృష్ణ. మెండే సొల్లు. అవిరేని శాస్త్రి. మొదలగు కళాకారులు ఉన్నారు.

గ్రామ విశేషాలు

మార్చు

ఈ వూరిలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. దీనికి మాన్యపు భూమి ఉంది. దేవుడి ఊరేగింపు సందర్భంగా కాగడా పట్టుకునేవారు. మేళం వాయించేవారు. డ్యాన్సులు చెసేవారు. ఇందుకుగాను వారికి ఆలయ మాన్యం భూమి ఇచ్చారు. 1946 కాలంలో ఇక్కడ శ్రీరంజని (జూనియర్) నాట్యం చేసేవారు. తరువాత ఆమె తెలుగు చలనచిత్ర నటీమణి అయ్యారు. గొప్ప పేరు తెచ్చుకున్నారు. దాదాపు 25 సినిమాలలో నటించారు. ఎన్.టి.ఆర్ సరసన హీరొయిన్ గా నటించారు. ఉమాసుందరి కథ. చంద్రహారం. మొదలయినవి ఉన్నాయి. వీరి స్వగ్రామం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామం. వీరు 1972 లో చనిపోయారు.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

గ్రామ జనాభా

మార్చు

గొల్లనపల్లిలో 2011 జనాభా లెక్కల ప్రకారం కుటుంబాలు676. జనాభా=2,753., పురుషుల సంఖ్య =1,339., మహిళలు=1,414.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2753.[3] ఇందులో పురుషుల సంఖ్య 1339, స్త్రీల సంఖ్య 1414, గ్రామంలో నివాసగృహాలు 676 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 953 హెక్టారులు.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

గొల్లనపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 85 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 171 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 228 హెక్టార్లు
  • బంజరు భూమి: 63 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 404 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 232 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 235 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

గొల్లనపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 205 హెక్టార్లు
  • చెరువులు: 24 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 6 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

గొల్లనపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

మామిడి, జామ, వరి

మూలాలు

మార్చు
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-04.

వెలుపలి లింకులు

మార్చు

[2] ఈనాడు విజయవాడ; 2013,జులై-26; 5వపేజీ. ఈనాడు కృష్ణా/గన్నవరం; 2013,ఆగస్టు-15; 3వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2013,డిసెంబరు-6; 5వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014,ఫిబ్రవరి-24; 3వపేజీ. [4] ఈనాడు విజయవాడ/గన్నవరం; 2014,జూన్-19; 2వపేజీ. [5] ఈనాడు విజయవాడ; 2014,ఆగస్టు-21; 5వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2014,సెప్టెంబరు-28; 16వపేజీ. [7] ఈనాడు విజయవాడ; 2015,మార్చి-11; 4వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,జూన్-12; 4వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-4; 3వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-8; 5వపేజీ. [11] ఈనాడు అమరావతి/గన్నవరం; 2017,జూన్-23; 6వపేజీ.