ఆగిరిపల్లి

ఆంధ్ర ప్రదేశ్, ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండల గ్రామం
(అగిరిపల్లి నుండి దారిమార్పు చెందింది)

ఆగిరిపల్లి ఏలూరు జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3657 ఇళ్లతో, 13283 జనాభాతో 1534 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6751, ఆడవారి సంఖ్య 6532. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1708 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 267. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589111.[2]

ఆగిరిపల్లి
పటం
ఆగిరిపల్లి is located in ఆంధ్రప్రదేశ్
ఆగిరిపల్లి
ఆగిరిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°40′54″N 80°47′2″E / 16.68167°N 80.78389°E / 16.68167; 80.78389
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
మండలంఆగిరిపల్లి
విస్తీర్ణం15.34 కి.మీ2 (5.92 చ. మై)
జనాభా
 (2011)
13,283
 • జనసాంద్రత870/కి.మీ2 (2,200/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు6,751
 • స్త్రీలు6,532
 • లింగ నిష్పత్తి968
 • నివాసాలు3,657
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521211
2011 జనగణన కోడ్589111

గ్రామ భౌగోళికం

మార్చు

ఇది సముద్రమట్టానికి 24 మీ.ఎత్తులో ఉంది. ఈ ఊరు నూజివీడు నుండి 14 కిలోమీటర్లు, విజయవాడ నుండి 30 కిలోమీటర్లు, గన్నవరం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వూరి అక్షాంశ రేఖాంశాలు 16°40'47"N 80°46'58"E[3]

దస్త్రం:APvillage Akiripalli.JPG
ఆగిరిపల్లి కొండపై గుడి

ఆగిరిపల్లి ఒక ప్లాన్ ప్రకారం నిర్మించబడిన గ్రామం. శోభనగిరి లేదా శోభనాచలం అనే కొండను ఆనుకొని ఉన్న గ్రామం మధ్యలో నలుచదరంగా రోడ్డు ఉంది. ఆ రోడ్డు నాలుగు మూలలా నాలుగు మంటపాలు ఉన్నాయి. వాటిలో పెద్దదైన మంటపాన్ని 'కొటాయి' అంటారు. యీ కొటాయి లోనే దేవుని ఉత్సవాలు జరుగుతాయి.

గ్రామానికి పడమర వైపు మెట్ల కోనేరు ఉంది. నూజివీడు రోడ్డులో ఎర్ర చెరువు ఉంది.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

ఆగిరిపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. నూజివీడు, గన్నవరం, హనుమాన్ జంక్షన్ నుండే రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 29 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.

సమీప ప్రభుత్వ ఆర్ట్స్/సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నూజివీడులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ విజయవాడలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

బ్యాంకులు

మార్చు

భారతీయ స్టేట్ బ్యాంక్.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( గతంలో ఆంధ్రా బ్యాంక్ )

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

ఆగిరిపల్లిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

వైద్యసదుపాయo

మార్చు
  1. ప్రభుత్వ హోమియో వైద్యశాల.
  2. ఈ గ్రామములో 25 ఎకరాల విస్తీర్ణంలో, కేంద్ర ప్రభుత్వ నిధులతో, 100 పడకల ప్రకృతి వైద్యశాల (నేచురోపతి వైద్య ఆసుపత్రి) నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. స్థలసేకరణ పూర్తికాగానే దీని నిర్మాణం చేపట్టెదరు. [6]

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఉలాస బుజ్జి సర్పంచిగా ఎన్నికైనాడు.

 
ఆగిరిపల్లి బస్ స్టాండు

గ్రామములోని దర్శనీయ ప్రదేశాలు/ప్రార్ధనా స్థలాలు

మార్చు
  • శ్రీ శోభనాచలపతి స్వామివారు:- ఈ గ్రామంలో వున్న కొండపై శ్రీ శోభనాచలపతి స్వామివారు అనబడే వ్యాఘ్రనరసింహస్వామి. ఈ ఆలయం నూజివీడు జమీందార్లచే నిర్మించబడింది. వూళ్ళో ప్రతి రథసప్తమికి ఈ గ్రామములో విశేషరీతిలో తిరునాళ్ళు, రథోత్సవం జరుపుతారు. ఒక లక్షకు పైచిలుకు జనం ప్రతి ఏటా వస్తారు అని అంచనా. ప్రతి కార్తీక పౌర్ణమికి ఈ ఊరి కొండ మెట్ల మీద దీపాలంకరణ (నెయ్యీ) చేస్తారు.
  • శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.
  • శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ముక్తేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక మెట్లకోనేరు వద్దగల ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో, వసంత నవరాత్రుల కార్యక్రమం, వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.
  • శ్రీ కోదండరామాలయం.
  • శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2017,ఫిబ్రవరి-15వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వివిధ పూజాధికాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు భారీగా అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.
  • అగిరిపల్లి గ్రామంలో దుగ్గిరాల రావమ్మ తల్లి తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, మాఘ మాసంలో జరుగును.
  • శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- అగిరిపల్లి గ్రామ సమీపంలోని ఎస్.ఎఫ్.ఎస్. పాఠశాల వద్ద, నూతనంగా నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి, 2014, ఆగష్టు-15, శుక్రవారం ఉదయం, శ్రీ రమాసత్యనారాయణస్వామి, గాయత్రి, విశ్వకర్మ, సరస్వతి, విఘ్నేశ్వర, అష్టలక్ష్మి సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయ శంకుస్థాపన, శాస్త్రబద్ధంగా నిర్వహించారు. అనంతరం మూర్తి, రుద్ర, అష్టదిక్పాల, వాస్తు, నవగ్రహ హోమాలు నిర్వహించారు. మద్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
  • సర్వకార్యసిద్ధి శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం:- ఈ ఆలయ పదవ వార్షికోత్సవం సందర్భంగా, 2017,జులై-5వతేదీ బుధవారంనాడు, ఆలయంలోని స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. సాయిసప్తాహం, కాకర హారతి, అభిషేకాలు, పలు అలంకారాల అర్చనలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకున్నారు.
  • చర్చి.

సమీప దేవాలయాలు

మార్చు

పురాతన శ్రీ శోభనాద్రి లక్ష్మీనృసింహస్వామి వేదశాస్త్ర పాఠశాల:

మార్చు
  1. ఈ పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం, 2016, ఫిబ్రవరి-13న జరిగింది.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాదు, 2016, ఏప్రిల్-8వ తేదీ శుక్రవారం, ఉగాది పర్వదినం నాడు, ఈ పాఠశాలను సందర్శించారు

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

ఆగిరిపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 267 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 228 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 125 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 76 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 113 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 725 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 591 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 247 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

ఆగిరిపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 127 హెక్టార్లు
  • చెరువులు: 120 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

ఆగిరిపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు

మార్చు

బియ్యం

ప్రముఖులు

మార్చు

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "ఆగిరిపల్లి". Retrieved 20 June 2016.

వెలుపలి లంకెలు

మార్చు