చాదర్ ఘాట్
చాదర్ ఘాట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. మూసీ నదిని ఆనుకొని ఉన్న ఈ ప్రదేశంలో నదిపై కట్టబడిన వంతెనకి ఒక వైపు కోఠి ఉండగా మరొక వైపు మలక్‌పేట ఉంది.[1]
చాదర్ ఘాట్ | |
---|---|
Inner City | |
Coordinates: 17°22′N 78°30′E / 17.367°N 78.500°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
Population (2011) | |
• Total | 3,00,000 |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500 024 |
Vehicle registration | టి.ఎస్ |
లోకసభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మలక్పేట్ శాసనసభ నియోజకవర్గం |
చరిత్ర సవరించు
చదర్ అనే ఉర్దూ భాష నుండి వచ్చింది. చదర్ అంటే ఉర్దూలో తెల్లటి షీట్ అని అర్థం.[2] 1831లో జేమ్స్ ఓలిఫాంట్ పేరుతో నిర్మించబడిన వంతెనను చాదర్ ఘాట్ వంతెన లేదా ఓలిఫాంట్ వంతెన అని పిలుస్తారు.[3]
1886లో చాదర్ ఘాట్ ను మొదటగా మున్సిపాలిటీగా ప్రకటించారు. 1933లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఏర్పాటుచేసిన తరువాత హైదరాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేయబడింది. దీని చుట్టూ కోఠి, గౌలిగూడ, కాచిగూడ, దార్-ఉల్-షిఫా,, మలక్‌పేట ఉన్నాయి.[4]
వాణిజ్యం సవరించు
ఈ ప్రాంతంలో వివిధ రకాల దుకాణాలు, కిరాణా దుకాణాలు ఉన్నాయి. హైదరాబాద్ రెస్టారెంట్, నయాగర వంటి హోటళ్ళు ఉన్నాయి. కమల్, తిరుమల వంటి సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. చాదర్ ఘాట్ ప్రధాన రహదారికి భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ పేరును పెట్టారు. దీనిని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మార్గ్ అని కూడా పిలుస్తారు.
వైద్య సదుపాయం సవరించు
ఇక్కడ వైద్య సదుపాయం మెరుగ్గా ఉంటుంది. ఈ ప్రాంతానికి సమీపంలో థంబే న్యూ లైఫ్ హాస్పిటల్, యశోదా హాస్పిటల్ ఉన్నాయి.
రవాణా వ్యవస్థ సవరించు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చాదర్ ఘాట్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. ఇక్కడికి సమీపంలో మలక్‌పేట రైల్వే స్టేషను ఉంది. అంతేకాకుండా చాదర్ ఘాట్ కి అర కిలోమీటరు దూరంలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కూడా ఉంది.
మూలాలు సవరించు
- ↑ వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 1 May 2018.
- ↑ Administrator. "A History behind Street Names of Hyderabad & Secunderabad". www.knowap.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 19 జూన్ 2018. Retrieved 19 April 2019.
- ↑ "Yeh Humara Shehar: Chaderghat". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 19 April 2019.
- ↑ http://www.ghmc.gov.in/greaterhyd.asp[permanent dead link]