చెరువు ఆంజనేయశాస్త్రి
చెరువు ఆంజనేయశాస్త్రి ఒక తెలుగు సినీ గేయ రచయిత. ఇతడు 1926, డిసెంబరు 3వ తేదీన జన్మించాడు. గుంటూరు జిల్లా, కొల్లూరు ఇతని స్వగ్రామం. ఇతడు ఉపాధ్యాయునిగా వృత్తిని స్వీకరించాడు. రంగస్థలానికి, ఆకాశవాణికి అనేక నాటికలను, నాటకాలను వ్రాశాడు. "వసంతవీణ", "కన్నె సుభద్ర", "పావన గంగ" అనే సంగీత రూపకాలు రేడియోలో ప్రసారమయ్యాయి. కార్తీక్ అనే కలం పేరుతో రచనలు చేశాడు. 1991, మార్చి 24న ఇతడు తనువు చాలించాడు[1].
సినిమా రంగం
మార్చుఇతడు సతీ సుకన్య చిత్రానికి పద్యాలను వ్రాయడం ద్వారా చిత్రసీమలో ప్రవేశించి ఎక్కువ కాలం సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఇతడు రచించిన కొన్ని సినిమా పాటలు:[2]
క్ర.సం | సినిమా పేరు | విడుదలైన సంవత్సరం | పాట పల్లవి | గాయకుడు/గాయని | సంగీత దర్శకుడు |
---|---|---|---|---|---|
1 | దొరబాబు | 1974 | నీకు నాకు పెళ్ళంటే నేల నింగి మురిసాయి | రామకృష్ణ, పి.సుశీల | |
2 | పెళ్ళి కానుక | 1960 | ఆడేపాడే పసివాడా ఆడేనోయి నీతోడా ఆనందం పొంగేనోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుపు ఎనలేని వేడుకరా | పి.సుశీల | ఏ.ఎం.రాజా |
3 | మాంగల్య భాగ్యం | 1974 | నీలి గగనాలతాకే శిఖరాలపైన వెలసింది | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం | పి.భానుమతి, ఎం.ముత్తు |
4 | మోహన రాగం | 1980 | గలగల పారే సెలయేరా కిలకిల నవ్వే జవరాలా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల | మాస్టర్ వేణు |
5 | సతీ సుకన్య | 1959 | ఘంటసాల వేంకటేశ్వరరావు | ||
6 | మనసే మందిరం | 1966 | అన్నది నీవేనా నా స్వామి ఉన్నది నీవే నాలోన నా స్వామి | పి.సుశీల | ఎం.ఎస్. విశ్వనాధం |
7 | అబ్బాయిగారు - అమ్మాయిగారు | 1972 | సుభద్రార్జునీయం (నాటకం ) | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల | కె.వి. మహదేవన్ |
8 | అందాలరాశి | 1979 | |||
9 | ఆటగాడు | 1980 | |||
10 | పీటలమీద పెళ్ళి | 1980 | ముందడుగు వేసింది అందాల చిన్నది | పి.బి. శ్రీనివాస్, బి.వసంత | అశ్వత్థామ |
11 | ప్రతీకారం | 1969 | స్టాప్,లుక్ అండ్ గో పరువముతో పరుగిడకే | జేసుదాసు, ఎస్.జానకి | సత్యం |
12 | ప్రతీకారం | 1969 | సింతపువ్వంటి సిన్నదిరో | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, టి.ఆర్.జయదేవ్, బెంగళూరు లత | సత్యం |
13 | ప్రతీకారం | 1969 | ఇది నీదేశం ఇది నీకోసం ఇదే మహాత్ముల సందేశం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సత్యం |
14 | ప్రతీకారం | 1969 | నారీ రసమాధురీ లహరీ అనురాగ వల్లరి ఆనందఝరి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సత్యం |
15 | ప్రతీకారం | 1969 | నా చూపే పిలుపురా ఆ పిలుపే కైపురా కాదనక | ఎల్.ఆర్.ఈశ్వరి | సత్యం |
16 | తండ్రులు కొడుకులు | 1961 | నీతలపే నీ వలపే నా హృదయాన నిండెనులే నా మనసే | ఎస్. జానకి | సత్యం |
మూలాలు
మార్చు- ↑ తెలుగు సినీ గేయ కవుల చరిత్ర - పైడిపాల -డిసెంబర్ 2010-స్నేహ ప్రచురణలు, చెన్నై - పేజీ.194
- ↑ కొల్లూరి, భాస్కరరావు. "చెరువు ఆంజనేయశాస్త్రి". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 16 ఏప్రిల్ 2017. Retrieved 18 November 2016.