జోనితా గాంధీ
జోనితా గాంధీ (జననం 1989 అక్టోబరు 23) భారత సంతతికి చెందిన కెనడియన్ నేపథ్య గాయని.[1][2] ఆమె ప్రధానంగా హిందీ, తమిళ భాషలలో పాటలను రికార్డ్ చేస్తుంది. అయితే పంజాబీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, మలయాళ భాషలలో కూడా కొన్ని పాటలను ఆలపించింది.
జోనితా గాంధీ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | న్యూ ఢిల్లీ, భారతదేశం | 1989 అక్టోబరు 23
మూలం | మిసిసాగా, అంటారియో, కెనడా |
సంగీత శైలి |
|
వృత్తి |
|
వాయిద్యాలు |
|
క్రియాశీల కాలం | 2011 – ప్రస్తుతం |
ఆమె యూట్యూబ్ ద్వారా కూడా మంచి పేరు తెచ్చుకుంది.
సినిమాల్లో ఆమె తొలి పాట 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్ టైటిల్ ట్రాక్ తో ప్రారంభమైంది. కాగా హిందీ చిత్రం ఏ దిల్ హై ముష్కిల్ (2016) లోని ది బ్రేకప్ సాంగ్, ఓ కాదల్ కన్మణి (2015) లోని మెంటల్ మనదిల్, డాక్టర్ (2021) లోని చెల్లామా, బీస్ట్ (2022)లోని అరబిక్ కుతు వంటి అనేక అత్యంత ప్రజాధరణ పొందిన పాటలు ఆమె పాడింది. ఈ మూడు తమిళ చిత్రాలు వరుసగా తెలుగులో ఓకే బంగారం, వరుణ్ డాక్టర్, బీస్ట్ లుగా విడుదలైయ్యాయి.
వ్యక్తిగత జీవితం
మార్చుఆమె ఢిల్లీకి చెందిన పంజాబీ కుటుంబంలో జన్మించింది.[3] ఆమె తొమ్మిది నెలల వయస్సులో ఆమె కుటుంబం బ్రాంప్టన్, కెనడాకు వలసవెళ్లింది.[4][5] ఆ తరువాత ఆమె కుటుంబం మిస్సిసాగాలో స్థిరపడింది.[6]
ఆమె టర్నర్ ఫెంటన్ సెకండరీ స్కూల్‌లో చదువుకుంది. వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయంలోని ఐవీ బిజినెస్ స్కూల్ నుంచి ఆమె 2012లో హెల్త్ సైన్స్, బిజినెస్‌లలో డిగ్రీలు పూర్తి చేసింది.[7] ఆమె పాశ్చాత్య సంగీతం, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో అధికారిక శిక్షణ పొందింది.[8][9]
కెరీర్
మార్చుఆమె తండ్రి, సోదరుడు ఆకాష్ గాంధీ ఇద్దరూ పార్ట్ టైమ్ సంగీతకారులు కావడంతో ఆమెకు సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. లైవ్ కమ్యూనిటీ ఈవెంట్‌లలో వారు తరచుగా కవర్ పాటలను కలిసి ప్రదర్శించేవారు.[10] ఈ నేపథ్యంలో ఆమె యూట్యూబ్ కవర్‌లను తయారు చేయడం ప్రారంభించింది. ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో ఆమెకు అనేక అవకాశాలకు దారితీసింది. యూట్యూబ్‌లో పానీ ద రంగ్, తుజ్కో జో పాయా, తుమ్ హి హో, సుహానీ రాత్, యే హోన్స్లా ఇలా మరెన్నో హిట్‌లు ఆమె అందించింది.[11]
సోనూ నిగమ్‌తో కలిసి పాడే అవకాశం అందిపుచ్చుకున్న ఆమె ప్లేబ్యాక్ సింగర్ గా రష్యా, యూకె, యూఎస్, కరేబియన్‌లతో సహా వివిధ దేశాలకు పరిచయం అయింది. ఆ తరువాత, ఆమె దృష్టి బాలీవుడ్ పై మళ్ళింది. చెన్నై ఎక్స్‌ప్రెస్‌తో ఆమె ప్లేబ్యాక్ సింగింగ్ ప్రారంభించింది. 2014లో వచ్చిన హిందీ చిత్రం హైవేలోనూ పాడింది.[12]
డిస్కోగ్రఫీ
మార్చుఆమె పాడిన తెలుగు పాటలు..
సంవత్సరం | పాట | ఫిల్మ్/సౌండ్‌ట్రాక్/ఆల్బమ్ | స్వరకర్త | నోట్స్ |
---|---|---|---|---|
2015 | నువ్వే నువ్వే | కిక్ 2 | ఎస్.ఎస్. తమన్ | |
యే కదా | కేరింత | మిక్కీ జె. మేయర్ | ||
మెంటల్ మదిలో | ఓకే బంగారం | ఎ. ఆర్. రెహమాన్ | ||
2016 | దైవం రాసిన కవిత | 24 (తెలుగు వెర్షన్) | ||
మనసుకే | ||||
2017 | హంసరో | చెలియా | ||
ఎలా తేల్చాలి | కాదలి | ప్రసన్ ప్రవీణ్ శ్యామ్ | ||
2018 | నిన్నే విడవనులే | అనగనగా ఓ ప్రేమకథ | కెసి అంజన్ | |
OMG పిల్లా | సర్కార్ | ఎ. ఆర్. రెహమాన్ | ||
లవ్'ఉత్సవం | నెక్ట్స్ ఏంటి | రామజోగయ్య శాస్త్రి | ||
అంతే కదా మరి | లవర్ | అంకిత్ తివారీ | ||
2019 | హే అమిగో | బందోబస్త్ | హారిస్ జయరాజ్ | |
2021 | ఏవో ఏవో కలలే | లవ్ స్టోరీ | పవన్ సీఎచ్ | |
చిట్టెమ్మ | వరుణ్ డాక్టర్ | అనిరుధ్ రవిచందర్ | ||
2022 | హలమతి హబీబో | బీస్ట్ | ||
మ మ మహేశా | సర్కారు వారి పాట | ఎస్.ఎస్. తమన్ | ||
ఏంటో ఏంటో | థ్యాంక్యూ | |||
దేవ దేవ | బ్రహ్మాస్త్రం | ప్రీతమ్ |
మూలాలు
మార్చు- ↑ ""Singing for a Bollywood number is a big deal", says Jonita Gandhi". Free Press Journal. 30 May 2019.
- ↑ Jetelina, Margaret (18 July 2017). "Jonita Gandhi highlights Canada's #BollywoodMonster Mashup this weekend". Canadian Immigrant. Archived from the original on 16 July 2018. Retrieved 24 March 2022.
- ↑ "People confuse my surname with Gujarati, but I am a Punjabi: Jonita Gandhi". The Times of India. 15 July 2021. Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
- ↑ "A voice that touched Big B's heart". The Hindu.com. 21 October 2012. Archived from the original on 16 January 2017. Retrieved 13 July 2014.
- ↑ Panjwani, Radhika (16 April 2014). "Bollywood crooner from Brampton en route to stardom | BramptonGuardian.com". BramptonGuardian.com (in కెనడియన్ ఇంగ్లీష్). Archived from the original on 17 February 2017. Retrieved 26 September 2017.
- ↑ Khalil, Nouman. "Bollywood is a roller-coaster ride, says Mississauga's Jonita Gandhi". The Mississauga News. Retrieved July 26, 2018.
- ↑ "Winter 2015". Ivey. Retrieved 4 August 2022.
- ↑ "Jonita Gandhi: Lucky my first Bollywood song for Shah Rukh Khan-starrer". NDTV.com. 8 July 2013. Archived from the original on 12 July 2013. Retrieved 13 July 2014.
- ↑ "A voice that touched Big B's heart". The Hindu.com. 21 October 2012. Archived from the original on 16 January 2017. Retrieved 13 July 2014.
- ↑ Exclusive JONITA GANDHI Interview | In Conversation with Amin Dhillon (Ep. 5) (in ఇంగ్లీష్), archived from the original on 4 April 2022, retrieved 9 April 2021
- ↑ "Jonita Gandhi: Lucky my first Bollywood song for Shah Rukh Khan-starrer". NDTV.com. 8 July 2013. Archived from the original on 12 July 2013. Retrieved 13 July 2014.
- ↑ "My efforts have paid off with 'Highway', says singer Jonita Gandhi". IBN Live.in.com. 5 February 2014. Archived from the original on 7 March 2014. Retrieved 13 July 2014.