ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ

తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ
(తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ నుండి దారిమార్పు చెందింది)

ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని 17 ఉత్తర జిల్లాలకు విద్యుత్‌ పంపిణీ చేస్తుంది.

ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ
రకంరాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ
పరిశ్రమవిద్యుత్‌ పంపిణీ
స్థాపనజూన్ 2, 2014
ప్రధాన కార్యాలయంవరంగల్, తెలంగాణ, భారతదేశం
కీలక వ్యక్తులు
ఏ. గోపాలరావు,చైర్మన్ & మేనేసింగ్ డైరెక్టర్[1]
ఉత్పత్తులువిద్యుత్తు
వెబ్‌సైట్http://www.tsnpdcl.in/

చరిత్ర

మార్చు

నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టిఎస్ఎన్పిడిసిఎల్) కంపెనీల చట్టం 1956 కింద విలీనం చేయబడింది. కార్యకలాపాలకోసం 2014, జూన్ 2 వరంగల్లో ప్రధాన కార్యాలయం ప్రారంభించబడింది. ఈ సంస్థకు తొలి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కాథికేయ మిశ్ర, ఆయన తరువాత వెంకటనారాయ నారాయణ బాధ్యతలు నిర్వర్తించగా ప్రస్తుతం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అన్నమనేని గోపాలరావు ఉన్నారు.[2]

పంపిణీ ప్రాంతాలు

మార్చు
 
ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పంపిణీ చేసే జిల్లాల పటం (ఆకుపచ్చరంగు)

మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, కామారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్ , మహబూబాబాదు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాదు, కరీంనగర్ మొదలైన 17 జిల్లాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయి.[3] 66,860 కిలోమీటర్ల విస్తీర్ణంలోని గ్రామాలు, పట్టణాల్లో సుమారు 1.55 కోట్ల మందికి ఈ సంస్థనుండి విద్యుత్తు పంపిణీ చేయబడుతుంది. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించడానికి సౌర విద్యుత్తు వాడుతున్నారు.[4]

అవార్డులు

మార్చు
  • మెరుగైన విద్యుత్ సరఫరాలో సూపర్‌వైజరింగ్ కంట్రోల్ ఆండ్ డేటా అక్విసేషన్ డిస్ట్రిబ్యూషన్ మేనెజ్‌మెంట్ సిస్టం (స్కాడా డీసీఎం) ప్రవేశపెట్టి మెరుగైన ఫలితాలను సాధించినందుకుగాను ఈ సంస్థకు ప్రతిష్ఠాత్మకమైన 2019 స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది.[5]
  • ప్రతిష్ఠాత్మక ఇండిపెండెంట్‌ పవర్‌ పర్చేజ్‌ అసోసియేషన్‌ (ఐపీపీఏ) అవార్డులలో భాగంగా డిస్కంను అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్న ఎన్పీడీసీఎల్‌కు ఔట్‌ స్టాండింగ్‌ పెర్ఫార్మెన్‌ క్యాటగిరీ అవార్డుతోపాటు 2/1 ఎంవీఎఆర్‌ కెపాసిటర్‌ బ్యాంక్స్‌, 600 కేవీఎఆర్‌ లైన్‌ కెపాసిటర్లను భారీ సంఖ్యలో ఎత్తున అమర్చి విద్యుత్తును ఆదా చేసినందుకు.. సౌరశక్తిని అందిపుచ్చుకోవడం ద్వారా ఉత్పత్తి ఖర్చును తగ్గించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నందుకు.. ఇటు సంస్థకు, అటు వినియోగదారునికి నష్టం వాటిల్లకుండా ఐఆర్‌డీఏ జీపీఆర్‌ఎస్‌ ఎనేబుల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్పాట్‌ బిల్లింగ్‌ను అమలు చేస్తున్నందుకు మొత్తం 4 అవార్డులు వచ్చాయి. కర్ణాటకలోని బెల్గాంలో 2023 ఏప్రిల్ 7 నుంచి 9 వరకు జరిగిన విద్యుత్తు రెగ్యులేటరీ, పాలసీ మేకర్స్‌ రిట్రీట్‌ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.[6]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Board of Directors". Archived from the original on 2019-09-10. Retrieved 2019-08-30.
  2. సాక్షి, తెలంగాణ (30 May 2019). "'విద్యుత్‌' సీఎండీల పదవీకాలం పొడిగింపు". Sakshi. Archived from the original on 29 మే 2019. Retrieved 30 August 2019.
  3. Northern Discom continues to get raw deal
  4. Telangana turns to solar power
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (29 June 2019). "ఎన్పీడీసీఎల్‌కు స్కాచ్ అవార్డు". ntnews.com. Archived from the original on 19 జూలై 2019. Retrieved 30 August 2019.
  6. telugu, NT News (2023-04-11). "తెలంగాణ డిస్కంలకు అవార్డుల పంట". www.ntnews.com. Archived from the original on 2023-04-11. Retrieved 2023-04-13.