తెలంగాణ తేజోమూర్తులు


తెలంగాణ తేజోమూర్తులు పుస్తకం ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడింది.[1] తెలంగాణ జాతిని జాగృతంచేసిన మహనీయులు, కవులు, పండితులు, కళాకారులు, సాహితీ సాంస్కృతిక మిత్రులు మొదలైన 153మంది జీవిత పరిచయ వ్యాసాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకాన్ని 2017, డిసెంబరు 17న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు వేడుకలలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సి. లక్ష్మా రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణలు ఆవిష్కరించారు.[2]

తెలంగాణ తేజోమూర్తులు
తెలంగాణ తేజోమూర్తులు పుస్తక ముఖచిత్రం
కృతికర్త: సంకలనం
సంపాదకులు: మామిడి హరికృష్ణ, విష్ణుభట్ల ఉదయ్ శంకర్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): జీవిత చరిత్ర
ప్రచురణ: సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
విడుదల: డిసెంబర్ 17, 2017
పేజీలు: 608
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-936345-7-8

సంపాదకవర్గం మార్చు

రూపకల్పన మార్చు

రవీంద్రభారతి ప్రాంగణం కళాభవన్‌ లోని సమావేశ మందిరంలో అహౌబిళం ప్రభాకర్‌ వేసిన తైలవర్ణ చిత్రపటాలతో తెలంగాణ తేజోమూర్తులు పేరిట ఏర్పాటుచేసిన ప్రదర్శనను 2017, ఏప్రిల్ 4న పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన గావించి, చిత్రపటాలను ఆవిష్కరించి ప్రారంభించారు. 'తెలంగాణ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' గా రూపొందిన ఈ గదిలో 34 మంది తెలంగాణ తేజోమూర్తుల తైలవర్ణ చిత్రాలను ఏర్పాటు చేశారు.[3][4][5] ఆ సందర్భంగా చిత్రపటాలలో ఉన్న తెలంగాణ ప్రముఖులతోపాటు మరింతమంది గురించిన జీవిత చరిత్రలను ప్రపంచానికి తెలియజేయడంకోసం వాటన్నింటిని పుస్తకరూపంలో తీసుకురావాలన్న పలువురి సూచనమేరకు ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. దాదాపు 18నెలల నిరంతర కృషిచేసి మొదటి సంపుటంగా ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. మునుముందు మరిన్ని సంపుటాలు తీసుకురాబోతున్నారు.

రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాహిత్య, కళారంగాల్లో తెలంగాణ ప్రముఖుల ఘనతను ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఆకాశవాణిలో ప్రసారమైన తెలంగాణ ప్రముఖుల జీవిత విశేషాలను తెలంగాణ తేజోమూర్తులు పేరుతో పుస్తక సంకలనంగా ప్రచురించారు.[6]

విషయసూచిక మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ తేజోమూర్తులు, సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ప్రథమ ముద్రణ, డిసెంబర్ 2017.
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (18 December 2017). "రాష్ట్ర సాధనకు బాటలు వేసిన పాట". Archived from the original on 27 February 2019. Retrieved 27 February 2019.
  3. ప్రజాశక్తి, తెలంగాణా (5 April 2017). "'తెలంగాణ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' ప్రారంభం". Retrieved 20 December 2017.[permanent dead link]
  4. వీ6 న్యూస్, రాష్ట్రీయ వార్తలు (4 April 2017). "తేజోమూర్తుల చిత్రాలు ఆవిష్కరించిన ఎంపీ కవిత". Archived from the original on 5 ఏప్రిల్ 2017. Retrieved 20 December 2017.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. ఆంధ్రప్రభ, ముఖ్యాంశాలు (4 April 2017). "హైదరాబాద్‌: తెలంగాణ తేజోమూర్తుల గౌరవానికి తైలవర్ణ చిత్రాలు చిహ్నం: ఎంపీ కవిత". Retrieved 20 December 2017.[permanent dead link]
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (29 March 2018). "రేపటి తరాలకు తెలంగాణ ఘనకీర్తి". Retrieved 30 March 2018.[permanent dead link]