తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2016-2017)
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2016-2017), అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2016 మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 2016 మార్చి 14న ఉదయం 11.35 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు.[1] 1 గంట 4 నిముషాలపాటు బడ్జెట్ ప్రసంగం చదివాడు. 1,30,415.87 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టగా, 62,785 కోట్ల రూపాయలు ప్రణాళికేతర వ్యయం, 67,630 కోట్లు రూపాయలు ప్రణాళిక వ్యయంగా అంచనా వేయబడింది. రెవెన్యూ మిగులు 3,318 కోట్ల రూపాయలు, ద్రవ్యలోటు అంచనా 23,467 కోట్ల రూపాయలుగా ఉంది.[2] స్థూల ఉత్పత్తి 11.47 శాతం నమోదైంది.[3]
Submitted | 2016 మార్చి 14 |
---|---|
Submitted by | ఈటెల రాజేందర్ (తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి) |
Submitted to | తెలంగాణ శాసనసభ |
Presented | 2016 మార్చి 14 |
Parliament | 1వ శాసనసభ |
Party | తెలంగాణ రాష్ట్ర సమితి |
Finance minister | ఈటెల రాజేందర్ |
Total expenditures | 1,30,415.87 కోట్లు |
Tax cuts | None |
‹ 2015 2017 › |
బడ్జెట్ వివరాలు
మార్చు- మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 1,30,415 కోట్లు
- ప్రణాళికా వ్యయం రూ. 67,630 కోట్లు
- ప్రణాళికేతర వ్యయం రూ. 62,785 కోట్లు
- రెవెన్యూ మిగులు రూ. 3,718 కోట్లు
- ద్రవ్యలోటు రూ. 23,467 కోట్లు
- ఈ ఏడాది ఆదాయం అంచనా రూ. 72,412 కోట్లు
కేటాయింపుల వివరాలు
మార్చుతెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2016-2017)లో వివిధ శాఖలకు కేటాయించబడిన నిధుల వివరాలు:[4][5]
- నీటిపారుదల రంగం రూ. 25 వేల కోట్లు
- వ్యవసాయశాఖ రూ. 6,759 కోట్లు
- రుణమాఫీ రూ. 3,718 కోట్లు
- పట్టణాభివృద్ధి శాఖ రూ. 4,815
- పారిశ్రామికాభివృద్ధి రూ. 967 కోట్లు
- ప్రత్యేక అభివృద్ధి రూ. 4,675 కోట్లు
- ఆరోగ్యశాఖ రూ. 5,967 కోట్లు
- విద్యాశాఖ రూ. 10,738 కోట్లు
- బీసీ సంక్షేమశాఖ రూ. 2,538 కోట్లు
- మైనార్టీ సంక్షేమం రూ. 1,204 కోట్లు
- ఎస్సీ సంక్షేమశాఖ రూ. 7,122కోట్లు
- మహిళా శిశు సంక్షేమం రూ. 1,553 కోట్లు
- ఆసరా పింఛన్లు రూ. 4,693 కోట్లు
- సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.1,152 కోట్లు
- కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 6,286 కోట్లు
- పాలమూరు ఎత్తిపోతల పథకం రూ. 7,861కోట్లు
- అగ్నిమాపకశాఖ రూ. 223 కోట్లు
- ఐటీ సమాచార శాఖ రూ. 254 కోట్లు
- సాంస్కృతిక పర్యాటక శాఖ రూ. 50 కోట్లు
- హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు రూ. 1000 కోట్లు
- వరంగల్ కార్పోరేషన్ రూ. 300 కోట్లు
- భవన నిర్మాణం రూ. 557 కోట్లు
- ఫైర్ స్టేషన్ల నిర్మాణం రూ. 64 కోట్లు
- మిషన్ భగీరథ రూ. 36,976 కోట్లు
- వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ రూ. 6,759 కోట్లు
- కళ్యాణ లక్ష్మి పథకం రూ. 738 కోట్లు
- బ్రాహ్మణ సంక్షేమ నిధి రూ. 100 కోట్లు
- రోడ్లు, భవనాల రంగం రూ. 3,333 కోట్లు
- పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 10,731 కోట్లు
- సీసీ టీవీల మానిటరింగ్ రూ. 225 కోట్లు
- మెట్రోరైలు ప్రాజెక్టు రూ. 200 కోట్లు
- క్యాంపు ఆఫీసు, తెలంగాణ కళాభారతికి రూ. 457 కోట్లు
బడ్జెట్ ఆమోదం
మార్చు2016 మార్చి 13న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.
మూలాలు
మార్చు- ↑ IANS (2016-03-14). "Telangana presents Rs 1.30 lakh crore budget for 2016-17". Business Standard India. Archived from the original on 2018-05-14. Retrieved 2022-07-04.
- ↑ "Telangana Budget 2016: K Chandrashekar Rao govt presents tax-free budget". Financialexpress (in ఇంగ్లీష్). 2016-03-14. Archived from the original on 2018-03-20. Retrieved 2022-07-04.
- ↑ "తెలంగాణ బడ్జెట్ 2016-17 హైలైట్స్". Sakshi. 2016-03-14. Archived from the original on 2016-06-22. Retrieved 2022-07-04.
- ↑ "తెలంగాణ బడ్జెట్ : శాఖల వారీ కేటాయింపులు". Samayam Telugu. 2016-03-14. Archived from the original on 2022-07-04. Retrieved 2022-07-04.
- ↑ "Telangana Budget 2016-17 Highlights". Sakshi Post (in ఇంగ్లీష్). 2016-03-14. Archived from the original on 2022-07-04. Retrieved 2022-07-04.
బయటి లింకులు
మార్చు- తెలంగాణ ఆర్థిక శాఖ పోర్టల్ లో బడ్జెట్ వివరాలు Archived 2021-05-16 at the Wayback Machine