దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ

తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ.[2] ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని 15 దక్షిణ జిల్లాలకు విద్యుత్‌ పంపిణీ చేస్తుంది.[3][4]

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ
రకం
రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ
పరిశ్రమవిద్యుత్‌ పంపిణీ
స్థాపించబడిందిజూన్ 2, 2014
ప్రధాన కార్యాలయంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులు
జి. రఘుమారెడ్డి, చైర్మన్ & మేనేసింగ్ డైరెక్టర్[1]
ఉత్పత్తులువిద్యుత్తు
జాలస్థలిhttps://www.tssouthernpower.com/

చరిత్ర సవరించు

సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టిఎస్ఎస్పిడిసిఎల్) కంపెనీల చట్టం, 1956 కింద 02.06-2014 న పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా విలీనం చేయబడింది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టిఎస్ఎస్పిడిసిఎల్) కంపెనీల చట్టం, 1956 కింద 02.06-2014 న పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా విలీనం చేయబడింది, హైదరాబాద్ ప్రధాన కార్యాలయంతో విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని కొనసాగించింది. ప్రస్తుతం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా రఘుమారెడ్డి ఉన్నారు.[5]

పంపిణీ ప్రాంతాలు సవరించు

 
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పంపిణీ చేసే జిల్లాల పటం (పసుపు ఆకుపచ్చరంగు)

మహబూబ్ నగర్, నారాయణపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సిద్ధిపేట, మేడ్చెల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, మెదక్, హైదరాబాదు, వికారాబాదు, రంగారెడ్డి మొదలైన 15 జిల్లాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయి. సుమారు 2 కోట్ల మందికి ఈ సంస్థనుండి విద్యుత్తు పంపిణీ చేయబడుతుంది.

నిర్వహణ సవరించు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాదు నగరంలో 2022లో వేసవికాంలో ఎలాంటి కోతలు లేకుండా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంకోసం సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ వర్క్స్‌ లో భాగంగా 273.07 కోట్ల రూపాయలతో 213.92 కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్లను వేసి, అదనంగా 65 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేయడంతోపాటు, 72 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను మెరుగుపర్చారు.

వర్షాకాలంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థకు అంతరాయం కలగకుండా ముఖ్యంగా ఈదురుగాలులతో విద్యుత్తు లైన్లు దెబ్బతినకుండా సర్కిళ్ళవారీగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేయడంతోపాటు సర్కిల్‌ పరిధిలో డివిజన్లవారీగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేలా ప్రత్యేక బృందాలను 15 మందితో ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షించింది.[6]

వసతులు సవరించు

ఈ సంస్థ పరిధిలో 1,33800 33/11 కెవి సబ్‌స్టేషన్లు, 2,03900 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 72000 33 కెవి ఫీడర్లు, 5,25700 11 కెవి ఫీడర్లు, వివిధ సామర్థ్యాలు గల 2,46,426 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లతో విస్తారమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించడానికి సౌర విద్యుత్తును కూడా వాడుతున్నారు.[7]

ఇతర వివరాలు సవరించు

 1. వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఈ సేవా కేంద్రాలు, బిల్‌కౌంటర్లలో గంటలకొద్ది క్యూలైన్లలో నిలబడకుండా ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.[8]
 2. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సౌభాగ్య పథకం ఇంటింటికీ విద్యుత్తును వందకు వంద శాతం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అమలు చేయడంతో సంస్థ అధికారులకు ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ అవార్డులను అందించారు.[9]
 3. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ డిస్కమ్‌ పరిధిలో 2023 మార్చి 2న ఆల్‌టైం రికార్డు నమోదైంది. గరిష్ఠ డిమాండ్‌ 9,359 మెగావాట్లకు చేరుకోగా విద్యుత్తు వినియోగం 183.63 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది.[10]

అవార్డులు సవరించు

 1. విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలతో నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నందుకుగాను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థకు ఆరు పతకాలు లభించాయి. 2022, జనవరి 11న విద్యుత్ పంపిణీ – సంస్కరణలు, సమర్ధత అంశంపై వివిధ రాష్ట్రాల డిస్కం యాజమాన్యాల, ప్రభుత్వ అధికారులతో ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) ఆధ్వర్యంలో 15వ ఇంధన సదస్సును వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. వివిధ కేటగిరీలలో విశిష్ట అభివృద్ధి కనబరిచిన విద్యుత్ పంపిణి సంస్థలకు అవార్డులు ప్రధానం చేసారు. సామర్ధ్య నిర్వహణలో మొదటి ర్యాంకు, వినియోగదారుల సేవలో మొదటి ర్యాంక్, నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలులో మొదటి ర్యాంక్, పనితీరు సామర్ధ్యంలో మొదటి ర్యాంక్, గ్రీన్ ఎనర్జీ విభాగంలో మూడో ర్యాంకులో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ఈ ఘనత సాధించి అవార్డులు అందుకుంది.[11]
 2. టెక్నాలజీ అడాప్షన్‌ విభాగంలో క్యాటగిరీ-డీ లో మొదటి ర్యాంకు అవార్డు, క్యాటగిరీ- ఈ (ప్రతిభ మెరుగుపర్చుకోవడం)లో మూడో ర్యాంకులతో రెండు ఇండియన్‌ చాంబర్‌ అఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) అవార్డులు వచ్చాయి. 2022 నవంబరు 17, 18న న్యూఢిల్లీలో ఇండియన్‌ చాంబర్‌ అఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ ఇండియా ఎనర్జీ సమ్మిట్‌, పదో ఇన్నోవేషన్‌ విత్‌ ఇం పాక్ట్‌ అవార్డ్స్‌ ఫర్‌ డిస్కమ్స్‌ – 2022 కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఐటీ) టీ శ్రీనివాస్‌ అందుకున్నాడు.[12]
 3. ప్రతిష్ఠాత్మక ఇండిపెండెంట్‌ పవర్‌ పర్చేజ్‌ అసోసియేషన్‌ (ఐపీపీఏ) అవార్డులలో భాగంగా బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ క్యాటగిరీలో అత్యుత్తమ అవార్డును కైవసం చేసుకున్న ఎస్పీడీసీఎల్‌.. బెస్ట్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ టు ప్రమోట్‌ కన్స్యూమర్‌ అవేర్నెస్‌ క్యాటగిరీలో మరో అవార్డును గెలుచుకున్నది. కర్ణాటకలోని బెల్గాంలో 2023 ఏప్రిల్ 7 నుంచి 9 వరకు జరిగిన విద్యుత్తు రెగ్యులేటరీ, పాలసీ మేకర్స్‌ రిట్రీట్‌ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.[13]

ఇవికూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

 1. "Board of Directors". Archived from the original on 2019-08-21. Retrieved 2019-08-21.
 2. https://www.tssouthernpower.com/ShowProperty/CP_CM_REPO/WhatsNew/Telugu%20TSSPDCL_ARR_SUMMARY%20(IPC) Archived 2020-05-13 at the Wayback Machine దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ 2015-16 నివేదిక
 3. TSSPDCL invites bids for short-term procurement
 4. "About Us". Archived from the original on 2019-08-21. Retrieved 2019-08-21.
 5. సాక్షి, తెలంగాణ (30 May 2019). "'విద్యుత్‌' సీఎండీల పదవీకాలం పొడిగింపు". Sakshi. Archived from the original on 29 మే 2019. Retrieved 30 August 2019.
 6. telugu, NT News (2022-06-14). "నాణ్యమైన విద్యుత్తు సరఫరాయే లక్ష్యం". www.ntnews.com. Archived from the original on 2022-06-14. Retrieved 2023-03-27.
 7. "Telangana announces RfS for 500 MW solar power". Archived from the original on 2019-08-30. Retrieved 2019-08-30.
 8. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (23 October 2017). "ఆన్‌లైన్‌లో బిల్లుల వసూళ్లపై విద్యుత్ శాఖ దృష్టి". www.andhrajyothy.com. Archived from the original on 30 ఆగస్టు 2019. Retrieved 30 August 2019.
 9. ఆంధ్రభూమి, తెలంగాణ (27 February 2019). "సత్ఫలితాలిచ్చిన 'సౌభాగ్య'". www.andhrabhoomi.net. Archived from the original on 27 ఫిబ్రవరి 2019. Retrieved 30 August 2019.
 10. telugu, NT News (2023-03-04). "విద్యుత్తు వినియోగంలో ఆల్‌టైం రికార్డు". www.ntnews.com. Archived from the original on 2023-03-04. Retrieved 2023-03-04.
 11. "కరెంట్‌లో ఫస్ట్‌". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-11. Archived from the original on 2022-01-12. Retrieved 2022-01-12.
 12. telugu, NT News (2022-11-23). "టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు రెండు ఐసీసీ అవార్డులు". www.ntnews.com. Archived from the original on 2022-11-23. Retrieved 2022-11-23.
 13. telugu, NT News (2023-04-11). "తెలంగాణ డిస్కంలకు అవార్డుల పంట". www.ntnews.com. Archived from the original on 2023-04-11. Retrieved 2023-04-13.