దుగ్యాల శ్రీనివాస రావు

దుగ్యాల శ్రీనివాస రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు, మాజీ శాసనసభ్యుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా (2004-2009) పనిచేశాడు.[1]

దుగ్యాల శ్రీనివాస రావు
జననం(1964-08-16)1964 ఆగస్టు 16
మరణం2021 జనవరి 11(2021-01-11) (వయసు 56)
మరణ కారణంకోవిడ్-19 జబ్బు
జాతీయతభారతీయుడు
విద్యదుగ్యాల శ్రీనివాస రావు
వృత్తిబిఏఎంఎస్
ఉద్యోగంఆయుర్వేద డాక్టర్
రాజకీయ పార్టీకాంగ్రేస్ పార్టీ
భాగస్వామిసుమన

జీవిత విశేషాలు

మార్చు

ఆయన వరంగల్ గ్రామీణ జిల్లా, వర్ధన్నపేట మండలం, నల్లబెల్లి గ్రామంలో జన్మించాడు. వరంగల్లులో బిఏఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ చదివాడు. ఈయన భార్య సుమన.

కాంట్రాక్టర్‌గా

మార్చు

బిఏఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ వృత్తి అయినా, కాంట్రాక్టర్ గా ప్రభుత్వ లైసెన్స్ పొంది ఆర్&బి పనులు చేస్తూండేవాడు.

శాసనసభ్యునిగా

మార్చు

అప్పటి చెన్నూర్ ఇప్పటి పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం చరిత్రలో నెమురుగోమ్ముల యెతిరాజారావు కుటుంబ సభ్యులు 1962- 2004 వరకు శాసనసభ్యులుగా గెలిచారు. పాలకుర్తి నియోజకవర్గం 2004 వరకు చెన్నూరు నియోజకవర్గంలో ఉండేది. చెన్నూరు సెగ్మెంట్ లో పాలకుర్తి, కొడకండ్ల, తొర్రూరు, నర్సింహులపేట, నెల్లికుదురు మండలాలుండేవి. 2009 డీలిమిటేషన్ లో చెన్నూరు నుంచి విడిపోయి, పాలకుర్తి సెగ్మెంట్ గా ఏర్పడింది. తొర్రూర్, కొడకండ్ల, పాలకుర్తి మండలాలతోపాటు వర్థన్నపేట నియోజకవర్గంలోని రాయపర్తి, జనగామలోని దేవరుప్పల మండలాలు ఇందులో కలిసిపోయాయి. పాలకుర్తిలో ఉన్న నర్సింహులపేటను డోర్నకల్ లో… నెల్లికుదురును మహబూబాబాద్ లో కలిపారు.

పాలకుర్తి నియోజకవర్గంలో ఐదు మండలాలున్నాయి. నెమురుగోమ్ముల సుధాకర్ రావు సొంత తమ్ముడు శ్రీ నెమురుగోమ్ముల ప్రవీణ్ రావు మద్దతుతో శ్రీనివాసరావు 2004లో శాసనసభ్యుడిగా గెలిచాడు.[2]

హైదరాబాదులోని ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాధికి చికిత్స పొందుతూ 2021 జనవరి 11న మరణించాడు.[3][4]

ఇవి కూడా చూడండి

మార్చు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ, హైదరాబాదు (11 January 2021). "మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూత". ntnews. Archived from the original on 11 January 2021. Retrieved 11 January 2021.
  2. తక్కవ మెజారిటీతో గట్టెక్కిన ఎర్రబెల్లి…[permanent dead link]
  3. వి6 వెలుగు, వరంగల్ (11 January 2021). "మాజీ ఎంఎల్ఏ దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూత". V6 Velugu. Archived from the original on 11 January 2021. Retrieved 11 January 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Former TRS-Cong MLA Dugyala Srinivas Rao dies of COVID". The Hindu (in Indian English). Special Correspondent. 2021-01-11. ISSN 0971-751X. Archived from the original on 2021-05-09. Retrieved 2021-05-09.{{cite news}}: CS1 maint: others (link)

ఇతర లింకులు

మార్చు