గోపరాజు విజయ్ తెలుగు రంగస్థల నటుడు, దర్శకుడు. ఇతడు కొన్ని చలనచిత్రాలలో, టెలివిజన్ సీరియళ్ళలో కూడా నటించాడు. ఇతడు అనేక నాటకాలలో బహుమతులు గెలుచుకున్నాడు.

గోపరాజు విజయ్
జననంజి.వి.హెచ్.ఎస్.విజయకుమార్
1977, నవంబర్ 7
కొలకలూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధిరంగస్థల, టివీ, రేడియో నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు
భార్య / భర్తవిజయలక్ష్మి
పిల్లలువెంకట సాయిశ్రీ త్రిపుర (కుమార్తె), కార్తికేయశర్మ (కుమారుడు)
తండ్రిగోపరాజు యజ్ఞేశ్వర వెంకట రమణమూర్తి
తల్లిలీలా అన్నపూర్ణ విశాలాక్షి

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు గుంటూరు జిల్లా, తెనాలి మండలం, కొలకలూరు గ్రామానికి చెందిన యజ్ఞేశ్వర వెంకట రమణమూర్తి, లీలా అన్నపూర్ణ విశాలక్ష్మి దంపతులకు, 1977, నవంబరు 7వ తేదీన జన్మించాడు.[1] ఇతని విద్యాభ్యాసం పాఠశాల నుంచి కళాశాల వరకూ అంతా కొలకలూరులోనే సాగింది. ఇతనికి భార్య విజయలక్ష్మి, కుమార్తె వెంకట సాయిశ్రీ త్రిపుర, కుమారుడు కార్తికేయశర్మ ఉన్నారు.

నాటకరంగ ప్రస్థానం

మార్చు

ఇతడు 1990 నుంచి 1996 వరకు ‘శ్రీ సాయి ఆర్ట్స్‌’ సంస్థ ప్రదర్శించిన నాటకాల్లో తండ్రి గోపరాజు రమణ దర్శకత్వంలో నటుడిగా నటించాడు. 1997 నుంచి 1998 వరకూ నుసుకు కోటి శివ దర్శకత్వంలో నటునిగా రాణించాడు. 1996 నుంచి 1998 వరకూ కాట్రగడ్డ రవితేజ, కె.వాసు, ఎం.జి. ప్రసాద్‌ల వద్ద టెలివిజన్ రంగంలో సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 1999 నుంచి 2001 వరకూ రసరంజని నిర్వహణలో దుగ్గిరాల సోమేశ్వరరావు దర్శకత్వంలో ‘నిజం’, ‘క్రాస్‌రోడ్స్‌’ నాటకాల్లో నటుడిగా, 2002 నుంచి 2006 వరకూ కళాలయ, రంగయాత్ర వంటి నాటకసమాజాలలో కరణం సురేష్, నాయుడు గోపిల దర్శకత్వంలో నటుడిగా, సహాయ దర్శకుడిగా అనేక నాటకాలకు నంది నాటకోత్సవాల్లో పాల్గొన్నాడు. 2005 నుంచి ‘శ్రీ సాయి ఆర్ట్స్‌’ సంస్థ ద్వారా తండ్రి గోపరాజు రమణ అండతో దర్శకుడిగా అనేక నాటక ప్రదర్శనలిచ్చాడు. 2008లో సినీనటుడు జయప్రకాశ్ రెడ్డి నిర్వహణలో బి.ఎం.రెడ్డి దర్శకత్వంలో ‘కొత్తసైన్యం’ నాటికలో నటించాడు. 2009 నుంచి 2013 వరకూ ‘విజయాదిత్య ఆర్ట్స్‌-నిజామాబాద్‌’ సంస్థలో శ్రీపాద కుమారశర్మ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. నటుడిగా, రచయితగా, కార్యదర్శి పనిచేస్తూ ‘శ్రీ సాయి ఆర్ట్స్‌-కొలకలూరు’ పేరుతో 2010లో నంద్యాలలో జరిగిన నంది నాటకోత్సవాల్లో ‘నెంబరు లేని ఖైదీ’ నాటికకు దర్శకుడిగా, ‘మనసులు కలిస్తే’ నాటకానికి నటునిగా, సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 2011లో గుంటూరులో జరిగిన నంది నాటకోత్సవాల్లో ‘ఆరోజు కోసం’ నాటకానికి రచయితగా, నటునిగా, సహాయ దర్శకుడిగా, 2012లో విజయనగరంలో జరిగిన నంది నాటకోత్సవాల్లో ‘ఒక్క మాటే చాలు’ నాటికకు దర్శకుడిగా, నటుడిగా బాధ్యతలు నిర్వహించాడు. ఇతడు ఇంతవరకూ 1500కు పైగా నాటకాలు, నాటికలలో భాగం వహించాడు.

ఇతడు నటించిన నాటకాలు/నాటికల పాక్షిక జాబితా:

  • క్రాస్‌రోడ్స్‌
  • నిజం
  • ఎక్కడ ఉన్నా ఏమైనా
  • వలయం
  • ఆదిలక్ష్మి కళ్యాణం
  • కోరిక
  • ప్రసన్నకు ప్రేమతో
  • మనసులు కలిస్తే
  • ఆరోజు కోసం
  • సంధ్యాఛాయ
  • నాలుగు గోడల మధ్య
  • ఇంటింటి కథ
  • ప్రొహిబిట్‌
  • సుఖీభవ
  • హుఆర్‌యు
  • నవ్వండి ఇది విషాదం
  • నీతిరేఖలు
  • గోడ కుర్చీ
  • పెన్‌స్ట్రోక్‌
  • ఇచ్చుటలో ఉన్న హాయి
  • ఎంతో చిన్న జీవితం
  • బంధుమిత్రుల అభినందనలతో
  • కొత్త సైన్యం
  • చల్‌చల్‌ గుర్రం
  • పుటుక్కు జరజర డుబుక్కుమే
  • నెంబరు లేని ఖైదీ
  • శ్రీకారం
  • ఒక్క మాటే చాలు
  • పెళ్లి చేసి చూడు
  • బైపాస్‌
  • చాలు ఇక చాలు
  • మధురం
  • కుక్కపిల్ల
  • తలుపులు తెరిచే ఉన్నాయి
  • మనసుతో ఆలోచిస్తే
  • గమ్యస్థానాల వైపు
  • ప్రేమతో నాన్న
  • కౌసల్యా సుప్రజా రామా….


టెలివిజన్

మార్చు

టెలివిజన్ రంగంలో సహాయ దర్శకుడిగా 1996 నుంచి 1998 వరకూ ఎం. జి. ప్రసాద్‌, కాట్రగడ్డ రవితేజ, కె.వాసుల దగ్గర పనిచేశాడు. 2003లో కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో ఈటీవీ 2 లో ప్రసారమైన ‘మాయాబజార్‌’ ధారావాహికతో నటుడుగా బుల్లితెరపై ప్రవేశించాడు. సుమారు 25 సీరియళ్లలో నటించాడు. పుత్తడిబొమ్మ, స్వాతి చినుకులు, ముద్దమందారం మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 2007 నుంచి నాటక, నాటిక పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు.

సినిమా రంగం

మార్చు

ఇతడు 2007లో విడుదలైన శ్రీ సత్యనారాయణస్వామి సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు.

నటించిన సినిమాల జాబితా

మార్చు

ఇతడు నటించిన సినిమాల పాక్షిక జాబితా:

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2009 బాణం
2010 బెట్టింగ్ బంగార్రాజు
2012 ఓనమాలు
2021 ఇష్క్
శ్రీదేవి సోడా సెంట‌ర్
మిడిల్ క్లాస్ మెలోడీస్
2022 ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
భీమ్లా నాయక్‌
వినరో భాగ్యము విష్ణుకథ
ఎఫ్ 3
2023 సామజవరగమన ప్రభాకర్
ఆదికేశవ
సెల్ఫిష్‌
2024 గుంటూరు కారం
ధూమ్ ధామ్,
ఆరంభం గిరి
యాత్ర 2
కేస్‌ 99 విడుదల కాలేదు
అరి విడుదల కాలేదు

వెబ్ సీరీస్

మార్చు

పురస్కారాలు, బహుమతులు

మార్చు

మూలాలు

మార్చు
  1. యడవల్లి శ్రీనివాసరావు (20 August 2024). "నాలుగు దశాబ్దాల నట విజయం". ప్రజాశక్తి దినపత్రిక. Retrieved 6 November 2024.

బయటి లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గోపరాజు విజయ్ పేజీ