నాగై మురళీధరన్ కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు. ఆకాశవాణిలో ఎ గ్రేడు కళాకారుడిగా పనిచేసాడు. అనేకమంది విద్వాంసులు చేసిన గాత్ర కచేరీల్లో వయొలిన్ వాద్య సహకారం అందించడమే కాకుండా, తానే స్వయంగా సోలో కచేరీలు కూడా చేసాడు. శ్రీరంగం దేవస్థానంలో ఒకరోజంతా ఏకధాటిగా వయోలిన్ వాయించాడు,

నాగై ఆర్.మురళీధరన్
వ్యక్తిగత సమాచారం
జననం (1958-12-04) 1958 డిసెంబరు 4 (వయసు 65)
మూలంచెన్నై, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
క్రియాశీల కాలం1969 – ప్రస్తుతం

విశేషాలు మార్చు

మురళీధరన్ 1958 డిసెంబరు 4వ తేదీన చెన్నై నగరంలో జన్మించాడు. తల్లి ఆర్.కోమలవల్లి వద్ద మొదట సంగీతం నేర్చుకున్నాడు. తరువాత ఆర్.ఎస్.గోపాలకృష్ణన్ వద్ద తన సంగీతాన్ని మెరుగుపరచుకున్నాడు.

ఇతడు తన 10వ యేట తొలి కచేరీని ఇచ్చాడు. ఏ గ్రేడు కళాకారుడిగా తిరుచ్చి ఆకాశవాణి కేంద్రంలో 1978 నుండి 2004 వరకు అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. దూరదర్శన్ జాతీయ సంగీత సమ్మేళనాలలో ఇతడు విరివిగా పాల్గొన్నాడు. సహవాద్యకారుడిగా ఇతడు అనేక సి.డి.లు, కేసెట్లు రికార్డు చేశాడు.

ఇతడు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా, సింగపూర్, మలేసియా, దుబాయి, మస్కట్, దోహా, బెహ్రయిన్, జపాన్, కువైట్ మొదలైన ప్రపంచ దేశాలన్నీ తిరిగి తన వాయులీన ప్రదర్శనలు ఇచ్చాడు.

ఇతడు వాద్య సహకారం అందించిన వారిలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, అలత్తూర్ శ్రీనివాస అయ్యర్, ఎం.డి.రామనాథన్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వోలేటి వెంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి, ఆర్.కె.శ్రీకంఠన్, మహారాజపురం సంతానం, ఎస్.సోమసుందరం, కె.వి.నారాయణస్వామి, టి.ఎం.త్యాగరాజన్, డి.కె.జయరామన్, టి.కె.గోవిందరావు, ఎస్.రామనాథన్, బి.రాజం అయ్యర్, తంజావూరు ఎస్.కళ్యాణరామన్, శీర్కాళి గోవిందరాజన్, చిదంబరం సి.ఎస్.జయరామన్, కె. జె. ఏసుదాసు, టి.వి.శంకరనారాయణన్, టి.ఎన్.శేషగోపాలన్, నైవేలి సంతానగోపాలన్, సంజయ్ సుబ్రహ్మణ్యన్, పి.ఉన్నికృష్ణన్, సుందరం బాలచందర్, టి.ఆర్.మహాలింగం, ఎన్.రమణి, నామగిరిపేట్టై కృష్ణన్, ఎ.కె.సి.నటరాజన్, కద్రి గోపాల్‌నాథ్ మొదలైన వారున్నారు.

ఇతడి సోలో కచేరీలకు సహవాద్యం అందించిన వారిలో టి.కె.మూర్తి, వెల్లూర్ జి.రామభద్రన్, ఉమయల్పురం కె.శివరామన్, త్రిచ్చి శంకరన్, గురువాయూర్ దొరై, తంజావూర్ ఉపేంద్రన్, కారైక్కుడి ఆర్.మణి, మన్నార్గుడి ఈశ్వరన్, శ్రీముష్ణం వి.రాజారావు, తిరువారూర్ భక్తవత్సలం, తేతకూడి హరిహర వినాయకరం, త్రిపునితుర రాధాకృష్ణన్, కోయంబత్తూర్ మోహన్‌రాం, వి.సురేష్ మొదలైన వారెందరో ఉన్నారు.

1985లో ఇతడు శ్రీరంగం దేవస్థానంలో 26 గంటలసేపు నిర్విరామంగా వయోలిన్ వాద్య కచేరీ నిర్వహించాడు. 1997లో భారతదేశపు 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దుబాయిలో కె. జె. ఏసుదాసు నిర్వహించిన సంగీత కచేరీలో పాల్గొన్నాడు.

అవార్డులు, బిరుదులు మార్చు

 
Mohd. Hamid Ansari presenting the Sangeet Natak Akademi Award-2010 to Shri Nagai R. Murlidharan, Chennai, for his outstanding contribution to Carnatic Instrumental Music (Violin)

కళైమామణి – "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ – (2003)

ఆర్ష కళాభూషణం– ఆర్ష కళా గురుకులం – (2007)

మహారాజపురం సంతానం మెమోరియల్ అవార్డు - మహారాజపురం సంతానం ట్రస్ట్ - (2009)

సుమధుర సేవా రత్న – షి బ సంగీతసభ, చెన్నై- (2009)

వాణీ కళాసుధాకర – శ్రీత్యాగబ్రహ్మ గానసభ - (2010)

సంగీత నాటక అకాడమీ అవార్డు - కేంద్ర సంగీత నాటక అకాడమీ – (2010)

గాన పద్మం – బ్రహ్మ గానసభ, చెన్నై – (2011)

ఆస్థాన విద్వాన్ - కంచి కామకోటి పీఠం, కాంచీపురం - (2014).

సంగీత రత్నాకర - భైరవి ఫైన్ ఆర్ట్స్, క్లీవ్‌లాండ్, ఓహియో, యు.ఎస్.ఎ. - (2015)

డిస్కోగ్రఫీ మార్చు

  • "యంగ్ మేస్ట్రోస్" - 1988
  • "నా జీవధార" - 2014

మూలాలు మార్చు

https://www.thehindu.com/news/cities/Delhi/sangeet-natak-akademi-fellowships-for-four-eminent-artistes/article2284394.ece https://www.thehindu.com/news/cities/chennai/ldquoNo-language-barrier-for-music/article15586542.ece https://www.thehindu.com/features/friday-review/music/Award-for-violinist/article16893098.ece