నా పిలుపే ప్రభంజనం

నా పిలుపే ప్రభంజనం పద్మాలయా ఫిల్మ్స్ బేనర్‌పై కృష్ణ సమర్పణలో జి.ఆదిశేషగిరిరావు నిర్మించిన రాజకీయ ప్రేరేపిత సినిమా. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉండగా అతడి పరిపాలను విమర్శిస్తూ త్రిలింగ రాజ్యాధిపతి అంటూ ఎన్టీయార్‌ను పోలిన కారెక్టరును పెట్టి, కోదండరామయ్య అని పేరుపెట్టి ఈ సినిమాను పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో నిర్మించాడు. ఈ సినిమా 1986 సెప్టెంబర్ 10న విడుదలయ్యింది.

నా పిలుపే ప్రభంజనం
(1986 తెలుగు సినిమా)
Napilupe prabhanjanam.jpg
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ పద్మాలయా ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

టూకీగా కథసవరించు

రిటైర్‌మెంటు వయసు 58 నుంచి 55కు (సినిమాలో 59 నుంచి 56 అని చూపారు) తగ్గించడం వలన ఓ టీచరు గుండె పగిలి చనిపోవడం, ఇద్దరు అల్లుళ్లు పాలనలో జోక్యం చేసుకోవడం, తక్కినవాళ్లందరూ తనకు ఒంగి ఒంగి దణ్ణాలు పెట్టాలని పాలకుడు ఆశించడం, మాటిమాటికి తెలుగు, తెలుగు అంటూండడం - వంటి ఘటనలు పెట్టి, ఎన్టీయార్‌పైనే ఈ సినిమాలో పూర్తిగా అస్త్రాలను సంధించారు. సినిమా చివర్లో కృష్ణ యీ నియంతృత్వంపై తిరగబడి విజయం సాధిస్తాడు. కోదండరామయ్య పారిపోగా, చిన్నల్లుడు జైలుకి వెళతాడు[1].

మూలాలుసవరించు

  1. ఎమ్బీయస్ ప్రసాద్. "ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 08". గ్రేట్ ఆంధ్ర. Archived from the original on 6 జూన్ 2020. Retrieved 6 June 2020.

బయటిలింకులుసవరించు