నువ్వొస్తానంటే నేనొద్దంటానా
2005 సినిమా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రభుదేవా దర్శకత్వంలో 2005 లో విడుదలైన సినిమా. ఎం. ఎస్. రాజు నిర్మాణ సారథ్యంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిష ముఖ్య పాత్రలు పోషించారు. ప్రేమించిన అమ్మాయి కోసం ఒక ధనవంతుల కొడుకైన కథానాయకుడు వ్యవసాయం చేసి ఆమె అన్నయ్యను మెప్పించడం ఈ చిత్ర కథాంశం.[1] ఈ చిత్రం తొమ్మిది భాషల్లోకి పునర్నిర్మితం (రీమేక్) అయింది.[2]
నువ్వొస్తానంటే నేనొద్దంటానా | |
---|---|
దర్శకత్వం | ప్రభు దేవా |
రచన | పరుచూరి సోదరులు, సందీప్ మలాని, ఎం. ఎస్. రాజు |
నిర్మాత | ఎం. ఎస్. రాజు |
తారాగణం | సిద్ధార్థ్, త్రిష కృష్ణన్, ప్రకాష్ రాజ్, వేద, శ్రీహరి |
ఛాయాగ్రహణం | వేణు గోపాల్ |
కూర్పు | కె. వి. కృష్ణా రెడ్డి |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
పంపిణీదార్లు | సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జనవరి 14, 2005 |
సినిమా నిడివి | 165 ని. |
భాష | తెలుగు |
కథ
మార్చుశివరామకృష్ణ, అతని చెల్లెలు సిరి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతారు. శివరామకృష్ణ ఆ ఊరి స్టేషన్ మాస్టర్ సాయంతో అప్పులో ఉన్న పొలాన్ని దక్కించుకుని వ్యవసాయం చేసుకుంటూ చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు. సిరి చిన్నప్పటి నుంచి లలిత అనే స్నేహితురాలు ఉంటుంది.
నటవర్గం
మార్చు- సంతోష్ గా సిద్ధార్థ్ నారాయణ్
- సిరి గా త్రిష కృష్ణన్
- సిరి అన్నయ్య శివరామకృష్ణ గా శ్రీహరి
- లలిత గా వేద
- సంతోష్ తల్లి జానకి గా గీత
- సంతోష్ తండ్రి ప్రకాష్ గా ప్రకాష్ రాజ్
- లలిత తండ్రి గా తనికెళ్ళ భరణి
- స్టేషన్ మాస్టర్ గా పరుచూరి గోపాలకృష్ణ
- సునీల్
- నరసింహ గా నర్సింగ్ యాదవ్
- నందిత జెన్నిఫర్
- జయప్రకాశ్ రెడ్డి
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- నర్రా వెంకటేశ్వర రావు
- అభిషేక్
- పావలా శ్యామల
- జైలర్ గా చంద్రమోహన్
- ప్రత్యేక పాత్రలో ప్రభు దేవా
- ప్రత్యేక పాత్రలో ఎమ్.ఎస్.రాజు
- గౌరీగా సంతోషి[3]
పాటలు
మార్చు- చంద్రుళ్ళో ఉండే కుందేలు , శంకర మహదేవన్
- సంథింగ్ సంథింగ్ , టీప్పు
- ఆకాశం తాకేలా , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- పారిపోకే పిట్టా , మల్లికార్జున్, సాగర్
- పాదం కదల నంటుందా , సాగర్
- ప్రేమ కోసమై వలలో , ఘంటసాల
- అదిరే అదిరే , జెస్సీ, కల్పన .
- నిలువద్దo , కార్తీక్ , సుమంగళి.
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఒక బస్తా ఎక్కువే పండిస్తా". sakshi.com. సాక్షి. Archived from the original on 13 November 2017. Retrieved 13 November 2017.
- ↑ "అత్యధిక భాషల్లో రీమేకైన ఏకైక చిత్రం! - nnn created history in remake". www.eenadu.net. Retrieved 2021-04-15.
- ↑ "నంది అవార్డు విజేతల పరంపర (1964 - 2008)" [A series of Nandi Award Winners (1964 - 2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 31 December 2020.(in Telugu)