నేను లోకల్

త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

నేను లోకల్ 2017, ఫిబ్రవరి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.[2] ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా, సినిమాటోగ్రఫీ నిజార్ షఫీ, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2018లో యష్ దాసుగుప్తా హీరోగా టోటల్ దాదాగిరి పేరుతో బెంగాలీ భాష లోకి రీమేక్ చేయబడింది.

నేను లోకల్
నేను లోకల్ సినిమా పోస్టర్
దర్శకత్వంత్రినాధరావు నక్కిన
రచనప్రసన్న కుమార్ బెజవాడ
స్క్రీన్ ప్లేప్రసన్న కుమార్ బెజవాడ
త్రినాధరావు నక్కిన
కథప్రసన్న కుమార్ బెజవాడ
నిర్మాతదిల్ రాజు
శిరీష్
తారాగణంనాని
కీర్తి సురేష్
నవీన్ చంద్ర
ఛాయాగ్రహణంనిజార్ షఫీ
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతందేవి శ్రీ ప్రసాద్
పంపిణీదార్లుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ
3 ఫిబ్రవరి 2017 (2017-02-03)
సినిమా నిడివి
137 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్18 కోట్లు
బాక్సాఫీసు51 కోట్లు

కథా నేపథ్యం

మార్చు

ఇంజనీరింగ్ పాస్ కావడానికి కష్టాలు పడుతున్న బాబు (నాని)ని ఇన్విజిలేటర్ (సచిన్ ఖేడ్కర్) స్వయంగా స్లిప్ ఇచ్చి పాస్ చేయిస్తాడు. కొంతకాలం తరువాత ఒక సంఘటనలో కీర్తి (కీర్తీ సురేష్)ని కలుసిన బాబు, ఆమెని ఇంప్రెస్ చేయటానికి ఎంబీఏలో చేరుతాడు. కీర్తి ఇన్విజిలేటర్ కూతురు అని తెలుసుకున్న బాబు, కీర్తిని కూడా తన అల్లరితో లవ్ లో పడేస్తాడు. అయితే, ఆమె తండ్రి వాళ్ల ప్రేమను నిరాకరిస్తాడు. అప్పుడు బాబు ఆయనకి ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ ఏమిటి, చివరికి ఏం జరిగిందనేది మిగతా కథ.[3]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

బాక్సాఫీస్

మార్చు

ఈ చిత్రం తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 26 కోట్లు వసూలు చేసింది. భలే భలే మగాడివోయ్ సినిమా రికార్డును దాటి, నాని కెరీర్ లో అతిపెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది. యునైటెడ్ స్టేట్స్లో ఈగ, భలే భలే మగాడివోయ్ సినిమాల తరువాత 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన నాని 3వ చిత్రమిది.[5][6]

పాటలు

మార్చు
నేను లోకల్
పాటలు by
Released14 జనవరి 2017
Recorded2016
Genreసినిమా పాటలు
Length17:21
Languageతెలుగు
Labelఅదిత్యా మ్యూజిక్
Producerదేవి శ్రీ ప్రసాద్
దేవి శ్రీ ప్రసాద్ chronology
ఖైదీ నెంబర్ 150
(2017)
నేను లోకల్
(2017)
దువ్వాడ జగన్నాథం
(2017)

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు 2017 జనవరి 14న అదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి. కాకినాడలో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, నాని, కీర్తిసురేష్, శిరీష్, దేవిశ్రీప్రసాద్, నవీన్‌చంద్ర, అరుణ్‌కుమార్, శ్రీదేవి, బెక్కం వేణుగోపాల్, త్రినాథరావు నక్కిన, అలీంబాషా, దొరబాబు, సాయికృష్ణ, ప్రసన్‌కుమార్ పాల్గొన్నారు.[7][8]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నెక్స్ట్ ఏంటి (రచన:చంద్రబోస్)"  సాగర్ 3:46
2. "అరెరె ఎక్కడ (రచన:శ్రీమణి)"  నరేష్ అయ్యర్, మనీషా ఎర్రబత్తిని 3:57
3. "డిస్ట్రబ్ చేస్త నిన్ను (రచన:శ్రీమణి)"  పృథ్వి చంద్ర 3:04
4. "చంపేసావే నన్ను (రచన:శ్రీమణి)"  కపిల్, సమీరా భరద్వాజ్ 3:20
5. "సైడ్ ప్లీజ్ (రచన:శ్రీమణి)"  జావేద్ ఆలీ 3:14
17:21

మూలాలు

మార్చు
  1. "Nenu Local first look: Nani moves from romcoms to action title". Indian Express.
  2. "Nenu Local Cast & Crew, Nenu Local Telugu Movie Cast, Actor, Actress, Director". FilmiBeat. Retrieved 14 May 2020.
  3. సాక్షి, సినిమా (3 February 2017). "'నేనులోకల్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 3 ఫిబ్రవరి 2017. Retrieved 14 May 2020.
  4. ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 13 May 2020.
  5. Hooli, Shekhar H. "Nenu Local 3-day worldwide box office collection: Nani's movie crosses Rs 25 crore mark in 1st weekend".
  6. "'Nenu Local' total collections box office at the Ap/Tg and overseas". 21 February 2017.
  7. ఆంధ్రభూమి, చిత్రజ్యోతి (15 January 2017). "నేను లోకల్ హిట్ ఖాయం". Archived from the original on 14 మే 2020. Retrieved 14 May 2020.
  8. ఆంధ్రజ్యోతి, సినిమా (15 January 2017). "హైదరాబాద్‌లో ఉంటే 'నేను లోకల్‌'.. కానీ..: నాని". andhrajyothy.com. Archived from the original on 14 మే 2020. Retrieved 14 May 2020.

ఇతర లంకెలు

మార్చు