పాప్‌కార్న్ థియేటర్
పాప్‌కార్న్ థియేటర్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని ఒక నాటక సంస్థ. తెలుగు నాటకరంగంలో కృషి చేస్తున్న యువతలో కొంతమంది కలిసి ఈ పాప్‌కార్న్ థియేటర్ ని ప్రారంభించారు.[1]
స్థాపన | 20 మార్చి 2014 |
---|---|
కేంద్రీకరణ | నాటకరంగం, సామాజిక సేవ |
ప్రధాన కార్యాలయాలు | హైదరాబాదు, తెలంగాణ |
అధికారిక భాష | తెలుగు |
ప్రారంభం
మార్చుతెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళాలశాఖలో ఎంఫిల్ చేస్తున్న ప్రణయ్‌రాజ్ వంగరి, తిరువీర్ లు 2014, ఫిబ్రవరి 17-23 వరకు న్యూఢిల్లీ లో జరిగిన టిఫ్లి అంతర్జాతీయ చిన్నారుల నాటకోత్సవంలో పాల్గొన్నారు. 6 రోజులపాటు జరిగిన ఈ నాటకోత్సవంలో వివిధ దేశాలకు చెందిన 20 మంది నాటక ఔత్సాహికులు హాజరయ్యారు. అక్కడి నాటకాలను చూసి స్ఫూర్తి పొందిన తిరువీర్, హైదరాబాద్ వచ్చి ప్రపంచ బాలల నాటక దినోత్సవం రోజున చిన్నారులకోసం ఒక నాటికను వేయాలనుకుంటున్న విషయం ప్రణయ్ తో చెప్పాడు.
అలా తిరువీర్, ప్రణయ్ మరికొంతమంది యువకళాకారులు నిఖిల్ జాకబ్ తాటిపర్తి, ప్రవీణ్ కుమార్ గొలివాడ, రాజు కోట్ల, రాజ్ కుమార్ చెవుల, వికాస్ చైతన్య, జయశ్రీ లతో కలిసి 2014, మార్చి 20న హైదరాబాద్ అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో అమ్మ చెప్పిన కథ అనే నాటిక ప్రదర్శనతో పాప్‌కార్న్ థియేటర్ ను ప్రారంభించారు.[1]
అమ్మ చెప్పిన కథ (నాటిక)
మార్చు- మొదటి ప్రదర్శన: 2014, మార్చి 20న హైదరాబాద్ అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో తిరువీర్ దర్శకత్వంలో అమ్మ చెప్పిన కథ నాటిక మొదటి ప్రదర్శన జరిగింది. తరచూ అమ్మచేసే అన్నదానాన్ని చూసి, దాని మహిమేంటో ప్రశ్నించి, అది తెలుసుకునే క్రమంలో స్వామిజీ వద్దకు వెళ్లే సమయంలో దారిలో ఎదురైన పరిస్థితులు వివిధ సమస్యలు దాటుకుంటూ స్వామిజీ వల్ల ఆ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమేకాకుండా, అన్నదాన మహిమను తెలుసుకునే దేవదత్తుడనే పిల్లాడి కథ. బమ్మడి జగదీశ్వరరావు రచించిన కథను తిరువీర్ నాటకీకరించి, దర్శకత్వం వహించారు. శ్రీమతి కళ్యాణి, జయశ్రీ, రాజ్ కుమార్, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, ప్రవీణ్ కుమార్ గొలివాడ, వికాస్ చైతన్య, తిరువీర్ నటించగా... ప్రణయ్ రాజ్, రాజు కోట్ల, మల్లేశ్ బలష్టు సాంకేతిక సహకారం అందించారు.[1]
- రెండవ ప్రదర్శన: 2014, మార్చి 22న హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని లోని గురుకుల్ విద్యాపీఠ్ లో అమ్మ చెప్పిన కథ నాటిక రెండవ ప్రదర్శన జరిగింది. తిరువీర్, ప్రణయ్, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, ప్రవీణ్ కుమార్ గొలివాడ, రాజు కోట్ల, రాజ్ కుమార్ చెవుల, వికాస్ చైతన్య, జయశ్రీలు పాల్గొన్నారు.
- మూడవ ప్రదర్శన: 2014, నవంబరు 15న హైదరాబాద్ అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ జరిగిన ‘థియేటర్ ఫెస్టివల్ ఫర్ యంగ్ ఆడియన్స్’ నాటకోత్సవంలో అమ్మ చెప్పిన కథ నాటిక మూవడ ప్రదర్శన జరిగింది. తిరువీర్, ప్రణయ్, ప్రవీణ్ కుమార్ గొలివాడ, రాజ్ కుమార్ చెవుల, సుధాకర్ తేళ్ల, శ్రీనివాస్ రేణిగుంట్ల జయశ్రీలు పాల్గొన్నారు.[2]
నావల్ల కాదు (నాటిక)
మార్చుమొదటి ప్రదర్శన: 2014, నవంబరు 14న హైదరాబాద్ అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ జరిగిన ‘థియేటర్ ఫెస్టివల్ ఫర్ యంగ్ ఆడియన్స్’ నాటకోత్సవంలో నావల్ల కాదు నాటిక ప్రదర్శన జరిగింది.[2]
సమ్మర్ థియేటర్ వర్క్‌షాప్
మార్చుపాప్కార్న్ థియేటర్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జంట నగరాల్లోని వివిధ పాఠశాలల పిల్లల కోసం ప్రత్యేకంగా సమ్మర్ థియేటర్ వర్క్‌షాప్ ఏర్పాటు చేసింది. 2016 మే 1 నుండి 20 వరకు ఈ వర్క్‌షాప్ జరిగిన ఈ వర్క్‌షాప్ లో అంజిబాబు, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, తిరువీర్, రాజ్‌కుమార్ చెవుల, క్రాంతికుమార్, వికాస్ చైతన్య, పవన్ రమేష్ లు విద్యార్థులకు రంగస్థల కళల్లో శిక్షణ ఇచ్చారు.[3]
దావత్ (నాటిక)
మార్చుతెలంగాణ రాష్ట్ర చలనచిత్ర టివి నాటకరంగ అభివృద్ధి సంస్థ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ల సౌజన్యంతో పాప్‌కార్న్ థియేటర్ తిరువీర్ దర్శకత్వంలో దావత్ నాటికను రూపొందించింది. రవీంద్రనాధ్ టాగోర్ రచించిన కథను తిరువీర్ నాటకీకరించి, దర్శకత్వం వహించారు.
- మొదటి ప్రదర్శన: 2016, జూన్ 14న హైదరాబాద్ అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో దావత్ నాటిక మొదటి ప్రదర్శన జరిగింది. ఇందులో లక్ష్మణ్ మీసాల, శ్రీనివాస్ రేణిగుంట్ల, తిరువీర్, వికాస్ చైతన్య, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, సుధాకర్ తేళ్ల, క్రాంతి కుమార్, మనోజ్ ముత్యం, ఉపేందర్ రెడ్డి నటించగా ప్రణయ్ రాజ్, ప్రవీణ్ కుమార్ గొలివాడ సాంకేతిక సహకారం అందించారు.[4]
- రెండవ ప్రదర్శన: 2016, జూన్ 29న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లామకాన్ లో దావత్ నాటిక రెండవ ప్రదర్శన జరిగింది. ఇందులో లక్ష్మణ్ మీసాల, శ్రీనివాస్ రేణిగుంట్ల, తిరువీర్, వికాస్ చైతన్య, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, సుధాకర్ తేళ్ల, క్రాంతి కుమార్, మనోజ్ ముత్యం, ఉపేందర్ రెడ్డి నటించగా ప్రణయ్ రాజ్, ప్రవీణ్ కుమార్ గొలివాడ, పవన్ రమేష్, క్రాంతి కుమార్ సాంకేతిక సహకారం అందించారు.
- మూడవ ప్రదర్శన: 2016, జూలై 14న హైదరాబాద్ అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో దావత్ నాటిక మూడవ ప్రదర్శన జరిగింది. ఇందులో లక్ష్మణ్ మీసాల, శ్రీనివాస్ రేణిగుంట్ల, తిరువీర్, వికాస్ చైతన్య, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, సుధాకర్ తేళ్ల, క్రాంతి కుమార్, మనోజ్ ముత్యం, ఉపేందర్ రెడ్డి నటించగా ప్రణయ్ రాజ్, ప్రవీణ్ కుమార్ గొలివాడ సాంకేతిక సహకారం అందించారు.
- నాలుగవ ప్రదర్శన: 2016, జూలై 24న విజయవాడ మొగల్రాజపురంలోని ముమ్మనేని సిద్ధార్థ ఆడిటోరియంలో దావత్ నాటిక మూడవ ప్రదర్శన జరిగింది. సుమధుర కళానికేతన్ 43వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 29 నుండి 31 వరకు నిర్వహించిన '21వ తెలుగు హాస్యనాటికల పోటీలు-2016' లలో ప్రదర్శించిన ఈ నాటికకు ఉత్తమ నటుడు, ఉత్తమ తృతీయ ప్రదర్శన బహుమతులు లభించాయి. ఇందులో లక్ష్మణ్ మీసాల, శ్రీనివాస్ రేణిగుంట్ల, తిరువీర్, వికాస్ చైతన్య, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, సుధాకర్ తేళ్ల, క్రాంతి కుమార్, మనోజ్ ముత్యం, ఉపేందర్ రెడ్డి నటించగా మల్లేష్ బలష్టు, ప్రణయ్ రాజ్, ప్రవీణ్ కుమార్ గొలివాడ, పవన్ రమేష్ సాంకేతిక సహకారం అందించారు.[5]
- ఐదవ ప్రదర్శన: 2016, అక్టోబరు 28న విశాఖపట్టణం లోని కళాభారతి ఆడిటోరియంలో దావత్ నాటిక నాలుగవ ప్రదర్శన జరిగింది. రసజ్ఞ 2వ అంతరాష్ట్రీయ నాటకోత్సవం (అక్టోబరు 25 నుండి 28 వరకు)లో భాగంగా ప్రదర్శించిన ఈ నాటికలో లక్ష్మణ్ మీసాల, శ్రీనివాస్ రేణిగుంట్ల, తిరువీర్, పవన్ రమేష్, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, సుధాకర్ తేళ్ల, క్రాంతి కుమార్, మనోజ్ ముత్యం నటించగా ప్రణయ్ రాజ్, ప్రవీణ్ కుమార్ గొలివాడ సాంకేతిక సహకారం అందించారు.[6]
- ఆరవ ప్రదర్శన: 2017, జనవరి 27న హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో దావత్ నాటిక ఆరవ ప్రదర్శన జరిగింది. తెలంగాణ రంగస్థల సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ యువ నాటకోత్సవం (జనవరి 27 నుండి 29 వరకు)లో భాగంగా ప్రదర్శించిన ఈ నాటికలో లక్ష్మణ్ మీసాల, శ్రీనివాస్ రేణిగుంట్ల, తిరువీర్, పవన్ రమేష్, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, సుధాకర్ తేళ్ల, క్రాంతి కుమార్, మనోజ్ ముత్యం నటించగా ప్రణయ్ రాజ్, ప్రవీణ్ కుమార్ గొలివాడ సాంకేతిక సహకారం అందించారు.[7]
- ఏడవ ప్రదర్శన: 2017, మార్చి 17న ఖమ్మం లోని వర్తక సంఘ భవనం ప్రాంగణంలో దావత్ నాటిక ఏడవ ప్రదర్శన జరిగింది. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, క్రియేటీవ్ థియేటర్ (ఖమ్మం) ల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ యువ నాటకోత్సవం (మార్చి 16 నుండి 18 వరకు)లో భాగంగా ప్రదర్శించిన ఈ నాటికలో లక్ష్మణ్ మీసాల, శ్రీనివాస్ రేణిగుంట్ల, తిరువీర్, పవన్ రమేష్, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, సుధాకర్ తేళ్ల, క్రాంతి కుమార్, మనోజ్ ముత్యం నటించగా ప్రణయ్ రాజ్, ప్రవీణ్ కుమార్ గొలివాడ సాంకేతిక సహకారం అందించారు.
- ఎనమిదవ ప్రదర్శన: 2017, ఏప్రిల్ 8న సిరిసిల్ల లోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ లో దావత్ నాటిక ఎనమిదవ ప్రదర్శన జరిగింది. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య ల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ యువ నాటకోత్సవం (ఏప్రిల్ 7 నుండి 9 వరకు)లో భాగంగా ప్రదర్శించిన ఈ నాటికలో లక్ష్మణ్ మీసాల, శ్రీనివాస్ రేణిగుంట్ల, తిరువీర్, పవన్ రమేష్, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, సుధాకర్ తేళ్ల, క్రాంతి కుమార్, సాయి నటించగా ప్రణయ్ రాజ్, ప్రవీణ్ కుమార్ గొలివాడ సాంకేతిక సహకారం అందించారు.
- తొమ్మిదవ ప్రదర్శన: 2017, జూన్ 11న హైదరాబాద్ లోని ఫోనిక్స్ ఎరీనా లో దావత్ నాటిక తొమ్మిదవ ప్రదర్శన జరిగింది. కాస్మిక్ సినీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటికలో లక్ష్మణ్ మీసాల, శ్రీనివాస్ రేణిగుంట్ల, తిరువీర్, పవన్ రమేష్, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, సుధాకర్ తేళ్ల, క్రాంతి కుమార్, మనోజ్ ముత్యం నటించగా ప్రణయ్ రాజ్, ప్రవీణ్ కుమార్ గొలివాడ సాంకేతిక సహకారం అందించారు.
పుష్పలత నవ్వింది (నాటిక)
మార్చు2019, జూలై 6న హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో పుష్పలత నవ్వింది నాటిక మొదటి ప్రదర్శన జరిగింది. తెలంగాణ రంగస్థల సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ యువ నాటకోత్సవం - 5 (జూలై 4 నుండి 7 వరకు)లో భాగంగా ప్రదర్శించడం జరిగింది.[8]
చిత్రమాలిక
మార్చు-
టిఫ్లి అంతర్జాతీయ చిన్నారుల నాటకోత్సవానికి హాజరైన నాటక ఔత్సాహికులు
-
టిఫ్లి అంతర్జాతీయ చిన్నారుల నాటకోత్సవం
-
విజయవాడలో జరిగిన దావత్ నాటిక ప్రదర్శన అనంతరం పాప్‌కార్న్ థియేటర్ గ్రూప్ కు బహుమతులు అంజేస్తున్న నిర్వాహకులు
-
విజయవాడలో జరిగిన దావత్ నాటిక ప్రదర్శన అనంతరం పాప్‌కార్న్ థియేటర్ సభ్యులు
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 deccanchronicle, LIFESTYLE, BOOKS AND ART (Mar 24, 2014). "Promoting children's theatre in Hyderabad". Retrieved 16 December 2016.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ 2.0 2.1 సాక్షి, హోం ఫీచర్స్ కథ (November 13, 2014). "బాల ప్రేక్షకుల కోసం నాటకోత్సవం." Retrieved 16 December 2016.
- ↑ నమస్తే తెలంగాణ (17 May 2016). "పాప్‌కార్న్ వర్క్‌షాప్.. అదుర్స్". Retrieved 16 December 2016.
- ↑ తెలుగు వన్ ఇండియా. "గోల్డెన్ త్రెషోల్డ్ లో "దావత్"". telugu.oneindia.com. Archived from the original on 15 June 2016. Retrieved 25 March 2017.
- ↑ ప్రజాశక్తి, జిల్లాలు » విజయవాడ (28 July 2016). "రేపటి నుంచి హాస్యనాటిక పోటీలు". Retrieved 16 December 2016.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (29 October 2016). "విశాఖలో ఘనంగా ముగిసిన నాటకోత్సవాలు". Retrieved 16 December 2016.
- ↑ తెలుగు ఫిల్మీబీట్, నరేష్కుమార్ సూఫీ (2017-03-28). "రవీంధ్ర భారతిని నవ్వులలో ముంచెత్తిన "దావత్" : ఆకట్టుకున్న [[పాప్ కార్న్]] థియేటర్ టీమ్". telugu.filmibeat.com. Retrieved 2017-03-28.
{{cite web}}
: URL–wikilink conflict (help) - ↑ నవతెలంగాణ, జాతర-స్టోరి (16 July 2019). "ప్రయోగాత్మక నాటికలు". Archived from the original on 16 July 2019. Retrieved 7 September 2019.