పి.నర్సారెడ్డి

పార్లమెంట్ సభ్యుడు
(పి.నరసారెడ్డి నుండి దారిమార్పు చెందింది)

పొద్దుటూరి నర్సారెడ్డి (1931 సెప్టెంబరు 22 - 2024 జనవరి 29) భారత జాతీయ స్వాంతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంనుండి 9వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.[1][2]

పి.నర్సారెడ్డి
పొద్దుటూరి నర్సారెడ్డి
పార్లమెంట్ సభ్యుడు, 9వ లోక్‌సభ
In office
డిసెంబర్ 1989 – మార్చి 1991
అంతకు ముందు వారుసి.మాధవరెడ్డి
తరువాత వారుఅల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నియోజకవర్గంఆదిలాబాదు
శాసనసభ సభ్యుడు, 5వ అసెంబ్లీ
In office
మార్చి 1972 – మార్చి 1978
అంతకు ముందు వారుపి.నర్సారెడ్డి
తరువాత వారుపి.గంగారెడ్డి
నియోజకవర్గంనిర్మల్
శాసనసభ సభ్యుడు, 4వ అసెంబ్లీ
In office
మార్చి 1967 – మార్చి 1972
అంతకు ముందు వారుపి.నర్సారెడ్డి
తరువాత వారుపి.నర్సారెడ్డి
నియోజకవర్గంనిర్మల్
శాసనసభ సభ్యుడు, 3వ అసెంబ్లీ
In office
మార్చి 1962 – మార్చి 1967
అంతకు ముందు వారుకోరిపల్లి ముత్యంరెడ్డి
తరువాత వారుపి.నర్సారెడ్డి
నియోజకవర్గంనిర్మల్
వ్యక్తిగత వివరాలు
జననం1931 సెప్టెంబరు 22
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా (తెలంగాణా)
మరణం2024 జనవరి 29(2024-01-29) (వయసు 92)
హైదరాబాదు, తెలంగాణ
జాతీయత India
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామికౌసల్యాదేవి
సంతానం3 కుమారులు & 1 కుమారె.
తల్లిదండ్రులుపి.గంగారెడ్డి (తండ్రి)
నివాసంఆదిలాబాద్ & న్యూ ఢిల్లీ
కళాశాలఉస్మానియా విశ్వవిద్యాలయం
నైపుణ్యంవ్యవసాయవేత్త, న్యాయవాది & రాజకీయవేత్త
సభలుఅనేక కమిటీలలో సభ్యుడు

ప్రారంభ జీవితం, విద్యాభ్యాసం మార్చు

ఇతడు ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ పట్టణంలో 1931, సెప్టెంబర్ 22వ తేదీన జన్మించాడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివి బి.ఎ., ఎల్.ఎల్.బి. పట్టాలు పొందాడు. వృత్తి రీత్యా ఇతడు వ్యవసాయదారుడు, న్యాయవాది.[1]

రాజకీయ జీవితం మార్చు

స్వాతంత్ర్యానికి ముందు మార్చు

ఇతడు నిజాం నిరంకుశ పరిపాలన నుండి హైదరాబాదు విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర్య సమర యోధుడు.

స్వాతంత్ర్యం తర్వాత మార్చు

ఇతడు 1940వ దశకం ప్రారంభం నుండి క్రియాశీల రాజకీయాలలో పాల్గొన్నాడు. ఇతడు మూడు పర్యాయాలు నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ సభ్యుడిగా[3], ఒక పర్యాయం శాసన మండలి సభ్యునిగా, ఒక పర్యాయం ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు[1][4][5][6]

పదవులు మార్చు

# నుండి వరకు హోదా వ్యాఖ్య
01 1962 1967 సభ్యుడు, 3వ అసెంబ్లీ
02 1962 1964 చైర్మన్, తెలంగాణ అభివృద్ధి కమిటీ
03 1967 1972 సభ్యుడు, 4వ అసెంబ్లీ
04 1968 1968 సభ్యుడు, నిబంధనల కమిటీ
05 1972 1978 సభ్యుడు, 5వ అసెంబ్లీ
06 1973 1978 కేబినెట్ మంత్రి, నీటి పారుదల శాఖ (రాష్ట్ర ప్రభుత్వం)
07 1974 1978 కేబినెట్ మంత్రి, రెవెన్యూ & శాసన సభా వ్యవహారాలు (రాష్ట్ర ప్రభుత్వం)
08 1981 1985 సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
09 1982 1985 సభ్యుడు, ప్రభుత్వ హామీల కమిటీ
10 1989 1991 సభ్యుడు, 9వ లోక్‌సభ
11 1990 1991 సభ్యుడు, విజ్ఞాపనల కమిటీ
12 1990 1991 సంప్రదింపుల కమిటీ, కార్మిక మంత్రిత్వశాఖ
14 1990 1991 సంప్రదింపుల కమిటీ, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ

మరణం మార్చు

అనారోగ్య సమస్యలతో బాధ‌ప‌డుతున్న 92 ఏళ్ల పి. న‌ర్సారెడ్డి 2024 జనవరి 29న హైదరాబాదులో తుదిశ్వాస విడిచాడు.[7]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "Member Profile". Lok Sabha website. Archived from the original on 24 సెప్టెంబరు 2014. Retrieved 17 January 2014.
  2. "Election Results 1989" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 జూలై 2014. Retrieved 17 January 2014.
  3. Sakshi (14 October 2023). "నిర్మల్‌ నుంచి 'పొద్దుటూరి, 'సముద్రాల'." Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  4. "Third Andhra Pradesh Legislative Assembly". Andhra Pradesh Legislature. Archived from the original on 7 డిసెంబరు 2013. Retrieved 17 January 2014.
  5. "Fourth Andhra Pradesh Legislative Assembly". Andhra Pradesh Legislature. Archived from the original on 3 August 2012. Retrieved 17 January 2014.
  6. "Fifth Andhra Pradesh Legislative Assembly". Andhra Pradesh Legislature. Archived from the original on 13 మార్చి 2013. Retrieved 17 January 2014.
  7. "కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.నర్సారెడ్డి కన్నుమూత |". web.archive.org. 2024-01-29. Archived from the original on 2024-01-29. Retrieved 2024-01-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)