పులివెందుల శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

పులివెందుల శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లాలో గలదు. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భాగం.

పులివెందుల
—  శాసనసభ నియోజకవర్గం  —
పులివెందుల is located in Andhra Pradesh
పులివెందుల
పులివెందుల
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కడప
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు వై.యస్. రాజశేఖరరెడ్డి

చరిత్ర

మార్చు

జిల్లా పశ్చిమాన అనంతపురంజిల్లా సరిద్దులో ఉన్న ఈ నియోజకవర్గం ప్రారంభంనుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన ఘనతను పొందినది. 2009 ఎన్నికలలోనూ ముఖ్యమంత్రిగా ఉంటూ రాజశేఖరరెడ్డి విజయం సాధించి ఈ నియోజకవర్గంలో 6వ విజయం నమోదుచేశాడు .1978 నుంచి ఇక్కడ ప్రతిసారి వై.ఎస్. కుటుంబ సభ్యులే గెలుపొందుతుండటం విశేషం.

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు
 
పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

వివిధ రాజకీయపార్టీల బలాబలాలు

మార్చు

పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో ప్రారంభంనుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. ఇంతరవకు జరిగిన శాసనసభల ఎన్నికలలో 1962లో ఒక్కసారి మినహా ప్రతిసారి కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 1962లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచాడు. 1955, 1967 ఎన్నికలలో కమ్యూనిష్ఠు పార్టీలు రెండో స్థానంలో నిలిచి కొద్దిగా ప్రభావితం చేయగా, 1978లో దేశవ్యాప్తంగా ప్రబలిన జనతా పార్టీ ప్రభంజనంలో ఈ స్థానంలో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన తరువాత జరిగిన అన్ని ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థులే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రధాన ప్రత్యర్థులుగా మారుతున్నారు.

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరము ఎన్నికైన అభ్యర్థి పార్టీ సమీప ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1955 పెంచికల బసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ గజ్జల మల్లారెడ్డి సి.పి.ఐ
1962 చవ్వా బాలిరెడ్డి స్వతంత్ర అభ్యర్థి పెంచికల బసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1967 పెంచికల బసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.వెంకటరెడ్డి సి.పి.ఎం
1972 పెంచికల బసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.ఎ.ఆర్ దేవిరెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1978 వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ డి.నారాయణరెడ్డి జనతా పార్టీ
1983 వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ (ఐ) యెద్దుల బాలిరెడ్డి తెలుగుదేశం పార్టీ
1985 వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ డి.సదాశివరెడ్డి తెలుగుదేశం పార్టీ
1989 వై.ఎస్.వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ జ్యోతి దేవిరెడ్డి తెలుగుదేశం పార్టీ
1991 (ఉప ఎన్నికలు) వై.ఎస్.పురుషోత్తంరెడ్డి కాంగ్రెస్ పార్టీ బాలస్వామిరెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 వై.ఎస్.వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ సిరిగిరెడ్డి రామమునిరెడ్డి తెలుగుదేశం పార్టీ
1999 వై.యస్. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 వై.యస్. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 వై.యస్. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2011-ఉప ఎన్నిక వై. ఎస్. విజయమ్మ వై.యెస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ వై.యెస్.వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014-2019 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వై.యెస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2019 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వై.యెస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు

మార్చు

2004 ఎన్నికలలో పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ వ్యక్తి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్.వి.సతీష్ కుమార్ రెడ్డిపై 40777 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. రాజశేఖరరెడ్డికి 74432 ఓట్లు రాగా, సతీష్ కుమార్ రెడ్డి 33655 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సతీశ్ కుమార్ రెడ్డి మళ్ళీ పోటీ చేయగా [1] కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పోటీచేసి విజయం సాధించాడు.వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి ఆకస్మిక మరణంతో అయన సతీమణి వై.యెస్.విజయమ్మ 2010లో పులివెందుల నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2011 ఉపఎన్నిక

మార్చు

2011లో వై.యెస్.జగన్ మోహన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్నుండి వెలుపలికి వచ్చి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ స్థాపించి తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వై.యెస్.విజయమ్మ కూడా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వై.యెస్.ఆర్.సి.పి. తరపున 90,000పైచిలుకు భారీ మెజారిటీతో గెలుపొందారు.

2014 ఎన్నికలు

మార్చు

2014 సాధారన ఎన్నికలలో వై.యెస్.జగన్ మోహన్ రెడ్డి వై.యెస్.ఆర్.సి.పి. పార్టీ తరపున 70,000పైచిలుకు ఓట్ల మెజారిటీతో సీమాంధ్రలోనే అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యరు.

సంవత్సరం శాసనసభ నియో. క్రమ సంఖ్య శాసనసభ నియో. పేరు శాసనసభ నియో. వర్గము గెలిచిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు ఓడిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు
2014 248 పులివెందుల జనరల్ వై.యెస్.జగన్ మోహన్ రెడ్డి పు వై.యెస్.ఆర్.సి.పి. 124576 యెస్.సతీశ్ కుమార్ రెడ్డి పు తె.దే.పా 49333


నియోజకవర్గ ప్రముఖులు

మార్చు
వై.ఎస్.రాజశేఖరరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌గా చిరపరిచితుడు. 1949లో[2] పులివెందులలో జన్మించిన వైఎస్సార్ తండ్రి వై.ఎస్.రాజారెడ్డి వలె అనతికాలంలోనే ప్రసిద్ధిచెందినాడు. 1978లో క్రియాశీల రాజకీయాలలో చేరిన వైఎస్సార్ మొత్తం 4 సార్లు రాష్ట్ర శాసనసభలో ఆడుగుపెట్టాడు. అన్నే సార్లు లోక్‌సభకు కూడా ఎన్నికైనాడు. పోటీచేసిన అన్ని ఎన్నికలలో గెలుపొందడం అతని ప్రత్యేకత. రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగాను, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించాడు. గత శాసనసభ కాలంలో ప్రతిపక్షనేతగా కూడా వ్యవహరించి, తదుపరి ఎన్నికలలో విజయానికి అనేక చర్యలు చేపట్టినాడు. అందులో ముఖ్యమైనది పాదయాత్ర. అతని విశేషకృషి మూలంగా 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో సహజంగానే ముఖ్యమంత్రి పీఠం కూడా అతనికే దక్కింది. సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు.
వై.ఎస్.వివేకానందరెడ్డి
1989లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వై.ఎస్.వివేకానందరెడ్డి 1950, ఏప్రిల్ 1న జన్మించాడు. 1999లో 13వ లోక్‌సభకు, 2004 మరోసారి 14వ లోక్‌సభకు ఎన్నికైనాడు.[3]
వై.యెస్.జగన్ మోహన్ రెడ్డి

వై.యెస్.ఆర్.సి.పి అధ్యక్షులు, శాసన సభలో విపక్ష నేత.

వై.యెస్.విజయమ్మ

వై.యెస్.ఆర్.సి.పి గౌరవ అధ్యక్షురాలు

ప్రస్తుత పూర్వ శాసనసభ అభ్యర్థుల జాబితా

మార్చు

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేల వారి పార్టీ పేరుతో సంవత్సరం వారీ జాబితా క్రింద ఉంది:

సంవత్సరం శాసనసభ నియో. క్రమ సంఖ్య శాసనసభ నియో. పేరు శాసనసభ నియో. వర్గము గెలిచిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు ఓడిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు
2014 248 పులివెందుల జనరల్ వై.యెస్.జగన్ మోహన్ రెడ్డి పు వై.యెస్.ఆర్.సి.పి. 124576 యెస్.సతీశ్ కుమార్ రెడ్డి పు తె.దే.పా 49333
2011 ఉప ఎన్నికలు పులివెందుల జనరల్ వై.యెస్.విజయమ్మ స్త్రీ వై.యెస్.ఆర్.సి.పి. 110098 వై.యెస్.వివేకానంద రెడ్డి పు కాంగ్రెస్ 28725
2009 248 పులివెందుల జనరల్ వై.యెస్.రాజశేఖర రెడ్డి పు కాంగ్రెస్ 103556 యెస్.సతీశ్ కుమార్ రెడ్డి పు తె.దే.పా 34875
2004 160 పులివెందుల జనరల్ వై.యెస్.రాజశేఖర రెడ్డి పు కాంగ్రెస్ 74432 యెస్.సతీశ్ కుమార్ రెడ్డి పు తె.దే.పా 33655
1999 160 పులివెందుల జనరల్ వై.యెస్.రాజశేఖర రెడ్డి పు కాంగ్రెస్ 62019 యెస్.సతీశ్ కుమార్ రెడ్డి పు తె.దే.పా 32010
1994 160 పులివెందుల జనరల్ వై.యెస్.వివేకానంద రెడ్డి పు కాంగ్రెస్ 90673 సిరిగిరెడ్డి రామముని రెడ్డి పు తె.దే.పా 19093
1991 ఉప ఎన్నికలు పులివెందుల జనరల్ వై.యెస్.పురుషోత్తమ రెడ్డి పు కాంగ్రెస్ 109318 బి.ఆర్.అన్నారెడ్డి పు తె.దే.పా 11870
1989 160 పులివెందుల జనరల్ వై.యెస్.వివేకానంద రెడ్డి పు కాంగ్రెస్ 77183 దేవిరెడ్డి జ్యోతి పు తె.దే.పా 29437
1985 160 పులివెందుల జనరల్ వై.యెస్.రాజశేఖర రెడ్డి పు కాంగ్రెస్ 61048 దేవిరెడ్డి సదాశివ రెడ్డి పు తె.దే.పా 30206
1983 160 పులివెందుల జనరల్ వై.యెస్.రాజశేఖర రెడ్డి పు కాంగ్రెస్ 47256 యెద్దుల బాలిరెడ్డి పు ఇండిపెండెంట్ 33889
1978 160 పులివెందుల జనరల్ వై.యెస్.రాజశేఖర రెడ్డి పు కాంగ్రెస్ 47874 డి.నారాయణ రెడ్డి పు జనతా 27378
1972 160 పులివెందుల జనరల్ పెంచికల బసిరెడ్డి పు కాంగ్రెస్ 37742 దేవిరెడ్డి నారాయణ రెడ్డి పు ఇండిపెండెంట్ 22237
1967 157 పులివెందుల జనరల్ పెంచికల బసిరెడ్డి పు కాంగ్రెస్ 43421 పొన్నతోట వి.ఆర్ పు సి.పి.ఎం. 9775
1962 164 పులివెందుల జనరల్ చవ్వా బాలిరెడ్డి పు ఇండిపెండెంట్ 25451 పెంచికల బసిరెడ్డి పు కాంగ్రెస్ 20443
1955 142 పులివెందుల జనరల్ పెంచికల బసిరెడ్డి పు కాంగ్రెస్ 27820 గజ్జల మల్లారెడ్డి పు సి.పి.ఐ. 13903


ఇవి కూడా చూడండి

మార్చు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-18. Retrieved 2008-07-12.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-08-28. Retrieved 2008-07-12.