పేకేటి రంగా సినీ పరిశ్రమలో కళా దర్శకుడు. వీరు తెలుగు చలనచిత్ర నటుడు పేకేటి శివరాం కుమారుడు. అతను సుమారు 300 సినిమాలకు పైగా ఆర్ట్ డైరక్టరుగా పనిచేసాడు. అతను తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలలోని గుర్తింపు పొందిన హీరోలతో కూడా పనిచేసాడు.

పేకేటి రంగా

జీవిత విశేషాలు

మార్చు

పేకేటి రంగారావు చెన్నైలో పేకేటి శివరాం, ప్రభావతి[1] దంపతులకు జన్మించాడు. అతని తండ్రి పేకేటి శివరాం మొదటి భార్య ప్రభావతి కాగా నటి జయంతిని రెండవ భార్యగా స్వీకరించాడు. ఇద్దరికీ ఐదుగురు మగ సంతానం. ప్రభావతికి కలిగిన పిల్లలలో రంగా మూడవవాడు. అతని సోదరులు కృష్ణమోహన్, వేణు, గోపాల్ లు.[2] రంగా బి.ఎ పూర్తిచేసాడు. ఆ తరువాత అలహాబాదు దూరదర్శన్ లో కొన్నేళ్ళపాటు ఉద్యోగం చేసాడు. అయితే రంగా ప్రతిభను గుర్తించిన అతని తండ్రి శివరాం శ్రీచలం అనే కళా దర్శకుని దగ్గర సహాయకునిగా చేర్పించాడు. సహాయకునిగా 3 చిత్రాలలో పనిచేసాడు. అలా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన పేకేటి రంగారావును దర్శకుడు ఎన్.వి.సుబ్బారెడ్డి మొదటి సారి నిప్పుతో చెలగాటం అనే సినిమాతో ఆర్ట్ డైరక్టరుగా పరిచయం చేసాడు. అలా ఆర్ట్ డైరక్టరుగా మొదలైన అతని కెరీర్ కన్నడ రాజ్ కుమార్ పరిచయంతో మంచి మలుపు తీసుకుంది. రాజ్ కుమార్ ప్రోత్సాహంతో రంగా కన్నడ సినీ పరిశ్రమలో సుమారు 60 సినిమాలకు ఆర్ట్ డైరక్టరుగా పనిచేసాడు. అంతే కాగ తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోల సినిమాలకు ఆర్ట్ డైరక్టరుగా చేసి మంచి గుర్తింపు పొందాడు. అదే విధంగా ఖడ్గం, నువ్వునాకు నచ్చావ్, నువ్వే నువ్వే లాంటి హిట్ సినిమాలలో కూడా పనిచేసాడు. అతను దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో కలసి పనిచేసిన సినిమాలకు అనేక ప్రసంశలతో పాటు పురస్కారాలు కూడా వచ్చాయి. ఆదిత్య 369,[3] భైరవధ్వీపం, ఖడ్గం సినిమాలకు ఉత్తమ ఆర్టు డైరక్టరుగా నంది పురస్కారాలను అందుకున్నాడు.

అతను నందమూరి తారక రామారావు నటించిన కులగౌరవం చిత్రానికి సహ కళా దర్శకునిగా పనిచేసాడు. చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు నటించిన మెకానిక్ అల్లుడు సినిమాకు కూడా పనిచేసాడు.

చిత్ర సమాహారం

మార్చు

వ్యక్తిగత జీవితం

మార్చు

పేకేటి రంగారావు తండ్రి పేకేటి శివరాం తెలుగు సినిమా నటుడు. తెలుగు, తమిళ భాషల్లో కథానాయకుడు ప్రశాంత్ (జీన్స్, చామంతి నటుడు) పేకేటి శివరాంకు స్వయాన మేనల్లుడు.

మూలాలు

మార్చు
  1. DV. "మాతృమూర్తి ప్రభావతి 90వ జన్మదినోత్సవాన్ని నిర్వహిస్తున్న కళా దర్శకుడు "పేకేటి రంగా"". telugu.webdunia.com. Archived from the original on 2020-06-11. Retrieved 2020-06-11.
  2. "తెలుగు సినిమా విజ్ఞానకోశం ... పేకేటి శివరాం". సితార. Archived from the original on 2020-06-11. Retrieved 2020-06-11.
  3. "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-06-11. Retrieved 2020-06-11.

బయటి లింకులు

మార్చు